పత్రికలకైతే, టి.వి.చేనళ్ళకైతే ఆర్థిక అవసరాలుంటాయి కాబట్టి అవి నిజాన్ని చూపడంలో కొన్ని అవరోధాలు ఉంటాయి. మరి హే ! బ్లాగ్లోకమా నీకేమైంది .. ఇలా చప్పగా సాగుతున్నావ్ ? నేను వై.ఎస్. జలయజ్ఞాన్ని, సి.కె. విశిష్ట వ్యక్తిత్వాన్ని 4 మాట్లు పొగిడితే నేనేదో పెద్ద అపరాధం చేసానని నా పై విరుచుకు పడేరు. ఇక్కడ మీరు చేస్తున్నదేమి.. రాశిఫలాలు, అష్టకాలు, జీవితం నుండి జారిపోయే జారుడు కవిత్వాలు
అసలు ఈ మాధ్యమం యొక్క ప్రభావం ఏమిటో తెలిసే ఇలా వ్రాస్తున్నారా ? లేక తాచాంతో నేటి నిజం తెలియక ఇలా డీలా పడుతున్నారా ? మీరెంతా జారుకుని జారుడు జీవితం గడిపినా కేవలం మీరు పట్టించుకోని పాలితీన్ సంచులు చాలు మీ జీవితాలకు మంగళం పాడటానికి.
అమెరికా తాలిబాన్ల నెపంతో తన పై ఎక్కడ దాడికి దిగుతుందేమో నని పాక్ తాలిబన్ల పై యుద్దం చేస్తుంటే పాక్ చైనా నుండి సంపాదించిందట అణ్వాస్త్రాల పరిజ్ఞానం , ఆ పై దక్షిణ కొరియాకు ఇచ్చిందట. నాడు ఇరాక్ దేశానికి పట్టిన గతే నేడు పాకిస్తానుకూ పట్టనుందా ? మార్పు సిద్దాంతంతో అధికారం చేపట్టిన ఒబామా బాగానే తినిపించాడు చల్లని గుల్ఫి .. (ఇక్కడ ఆంథ్రులం సేఫ్ అయ్యాం చిరుకు పట్టం కట్టక) . ఒసామా బిన్లాడన్ భారత్ లో దాగున్నాడని అమెరికా మన పై యుద్దం ప్రకటించటానికి ఎంత సేపు పడుతుందంటారు నాడు శ్రీలంక.. నేడు ఆస్త్రేలియా. ఇంతేనా భారతీయుని బ్రతుకు. ఇక్కడ పంతుల్లేక, ఉద్యోగుల్లేక, నిఫుణులు లేక దేశం అల్లాడుతుంటే, విద్యార్థుల్లేక కళాశాలలు విల విల పోతుంటే అక్కడేమన్న సరస్వతీ దేవి వచ్చి బంగారు పుల్లతో నాలిక పై వ్రాసి అక్షరాభ్యాసం చేస్తుందా ?
ఇంకెంత కాలం ఈ విదేశీ మోహం ? అమెరికాలో తొలుత కుటుంబానికో కారన్నారు, ఆపై బార్యా భర్తలకు చెరో కారన్నారు. ఆ పై ఉద్యోగాలకు వెళ్ళేందుకు ఒక కారు, షికారుకు మరో కారన్నారు. అప్పుల్లో పుట్టి అప్పులతోనే చచ్చేలా చేసారు. నక్కలవారి మనస్తత్వాన్ని రుద్దారు. మళ్లీ ఇల్లు కట్టి చూడు అని రెచ్చకొట్టారు. హవుసింగ్ లోన్లు ఎగ్గొట్టడంతో మొదలైన మాంద్యం ఇప్పుడు జెనరల్ మోటార్స్ దివాళా తీయడం దాకా వచ్చింది.
ఇదేదో అమెరికాలో మాత్రం జరుగుతుందనుకోకండి .. ఈ రోజు చాలా వ్యాపార సంస్థలు (సత్యంలా) రాని లాభాలను వచ్చిన లాభాలుగా చూపి డాబు చూపుతున్నాయి. రాని బాకీల క్రింద చూపవలసిన మొత్తాలను ఆస్తులుగా చూపి, నిరర్థక ఆస్తులను తెరమీద చూపి దోచుకుంటున్నాయి. మన్మోహన్ సింగ్ బాత్ రూంలో జారిపడ్డా షేర్ మార్కెట్ గోవిందా ? అటువంటిది భీమా కంపెనీలు ప్రజల దనాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి జూదాలాడుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారా ? మెటాష్ అయిపోతారు. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు జీవితాలు కావు సుమా ! మూన్నెలకు ఉందు కూడ కాల్ సెంటరన్నారు, సాఫ్ట్ వేర్, హార్డ్ వేరని విర్రవీగేరు. నేడు అడుక్కు తింటున్నారు. అసలు బంగారు పండే పొలాలను వీడి ఇలా దేశ దిమ్మరులు కావడానికి సిగ్గు లేదు.
కేవలం ముడిసరుకులను వస్తువులుగా కన్వెర్ట్ చేసి 1000 శాతం ఎక్కువ దరలకు వాటిని అమ్మి జనాన్ని దోచుకున్నారు. ఇప్పుడేమో పోటీలు పెరిగి పోయి నష్టాలకు వ్యాపారం చేస్తూ షేడ్ అయిపోతున్నారు. ఎన్నికల కోసం ఒక్కో ఎం.ఎల్.ఏ కోటి రూపాయలు వెచ్చించాడు; ఒక్కో ఎం.పి. 5 కోట్లు వెచ్చించాడు. వీటిని రాబట్టే ప్రయత్నంలో కేవలం పది శాతం కమీషన్ల కు కక్కుర్తి పడి లక్షల కోట్ల ప్రజా ధనం దోపిడీకి గురైతే చూస్తూ ఉంటాడు. మీరు వాయిదాల్లో చస్తూ ఉంటారు.
ఇప్పటికన్నా కళ్లు తెరిచి చూడండి. ప్రశ్నించడం (questioning) తరువాత సంగతి. కనీసం నిజాలను తెలుసుకోండి. మొదట చర్చించండి. ఆపై ప్రశ్నిద్దాం….
ఆపరేషన్ ఇండియా 2000 యాక్షన్ ప్లానులోని ముఖ్యాంశాలు : అధ్యక్ష తరహా పాలన అమలు, దేశంలోని పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు, సైన్యం చేత నదుల అనుసంధానం, జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి – దేశంలోని వ్యవసాయ పొలాలన్నింటిని సదరు సంఘానికి లీజు ప్రాతిపదికన ఇచ్చి సమిష్టి వ్యవసాయం జరిగేలా చూడటం, ప్రస్తుత కరెన్సి రద్దు చేసి కొత్త కరెన్సి అమలు చెయ్యడం. పాత కరెన్సి ఉన్నవారు వాటియొక్క చట్టబద్దతను నిరూపించి కొత్త కరెన్సి పొందేలా చూడటం. అందుకు పూర్వం భారత దేశంలోనే స్విస్ బ్యాంకు తరహా బ్యాంకు ఒకటి నెల కొలపడం – ఇవే నా ప్రణాళికలోని ముఖ్యాంశాలు.
ప్రణాళిక ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్లాన్ అమలుకు కావల్సిన నిథుల సమీకరణకు కూడ ఎకానమి ప్యేకేజి పేరిట సలహాలిచ్చాను. ప్రజల పై ఎట్టి భారం పడనీయక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇందులో ఉన్నాయి.
అలాగే తపాలా శాఖ, రైల్వే శాఖ, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, తి.తి.దే. వంటి ప్రముఖ దేవస్థానాల్లో సంస్కరణలు తెచ్చి నిర్వహణ వ్యయాన్ని తగ్గించి మిగులు పాటు అయ్యే సొమ్మును బ్యాంకుల్లో ఎఫ్.డి.లుగా ఉంచేలా చేసి బ్యాంకులనుండి రుణం పొందే వీలు కల్పించే సలహాలు కూడ పై ఎకానమి ప్యేకేజిలో ఇచ్చాను
అసలు ఇటీలవల ప్రతి నేత నోట నదుల అనుసందానం మాట రావటానికి మూల కారణం నేనే ; ప్రతి నేతకు రిజిస్టర్డు పోస్టు ద్వారా నా ప్లాన్ పంపాను. పంపిన 10 రోజులకో, 15 రోజులకో ఈ నినాదాన్ని వారందుకుంటారు. అంటే నా ప్లాన్ అలానే ఉంచేసి ప్రకటించినా మన దేశానికి కొంత లాభం జరిగేది. కాని వారు ఉత్తుత్తే నదుల అనుసందానం గురించి మాత్రం ప్రస్తావిస్తున్నారు. ఉదా|| చంద్రబాబు పి.ఎ. అఫిషియల్గా సి.ఎం. గారికి నివేదించుటకు మీ ప్రతిపాదనలను పంపండి అని నోట్ రాసి పంపితే నేను ఆగస్ట్ 3 న పంపడం, సెప్టెంబర్ 1 న చంద్రబాబు “నదుల అనుసందానంతోనే దేశం సస్య శ్యామలం” అని ప్రకటించటం జరిగింది.
వీరు సాంప్రదాయిక పద్దతుల్లో నదుల అనుసందానం మొదలు పెడితే అనుసందానం జరిగే లోపు గంగే ఇంకి పోతుంది, లేదా భూమి పై ఉన్న నీరంతా కలుషితమై విషతుల్యం అయిపోయి చస్తాం.
అందుకని యుద్ద ప్రాతిపదికన దీనిని చేపట్టాలి. దేశం యొక్క సర్వ శక్తులు ఈ ప్రోజెక్టు పై కేంద్రీకరించబడి కనీసం 5 సం.ల్లో పూర్తి చేస్తే గాని ఇది ఫలప్రదం కాదు.
మా హ్యాట్రిక్ ఎం.ఎల్.ఏ సి.కె.బాబుగారికి ఉడతా పాటి సాయంగా రేపటినుండి ప్రచారం ప్రారంభిస్తున్నాను. ఆయన మంచి వక్తే అయినప్పటికి వై.ఎస్.గురించి మాట్లాడటమే ఆయనకు మహదానందంగా ఉంది.తన గురించి గాని,తాను పురపాలక పరిదిలో చేయించిన అభివ్రుద్ది గురించి కాని మాట్లాడటం లేదు. ఈ లోతు ఎంతో కొంత పూడ్చాలని ఇలా నిశ్చయించాను.
సి.కె.బాబు అంటే ఏమిటో మీ మైండ్స్లో ఉన్న ఇమేజ్ నిజమైంది కాదు. అది కేవలం దినపత్రికలు,తి.వి.లు స్రుష్ఠించిన ఇమెజ్. కేవలం ఎక్కడో విన్నదానిని ,ఏ టీవిలోనో పది నిమిషాలు చూసినదానిని నమ్ముతారు.
స్వయంగా చూసిన నేను ఏదన్న చెబితే మాత్రం అది కల్పితమంటారు. ఒక టి.వి.చేనల్ సి.కె.ను కించపరుస్తూ సారి..మానవత్వాన్నే కించ పరుస్తూ ఒక క్లిప్పింగ్ ప్రసారం చేసింది. అందులోని ఉపోద్ఘాతం ఇలా ఉంది ” ఇతను 3 సార్లు చచ్చి బ్రతికాడు ,కాని మనిషి ప్రాణం విలువేమిటో ఇతనికి ఇంకా తెలిసి రాలేదు”
ఉపోద్ఘాతమే ఇలా ఉంటే ఇక ఆ న్యూస్ ఎలా కొనసాగి ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. దానిని చూసిన సి.కె.అభిమానులు ఆయన కార్యాలయం వద్ద గుమి కూడారు. అది చేస్తాం ఇదిచేస్తామంటూ తమ ఆవేదన వెళ్ళకక్కారు. సి.కె.ఏమన్నారో తెలుసా?
సావదానంగా ఇలా అన్నారు.”రేయి పని చూడండిరా, ఈ మాదిరి 36 చేస్తారు. ప్రతిసారి గాంథి బొమ్మ కాడికి పరుగులు తీస్తారా. ఎవరు ఏమిటో ప్రజలకు తెలుసు.పదండి”
ఇంకోటి చిత్తూరు ప్రజా రాజ్యం అభ్యర్ది శ్రీనివాసులు 6 నెలలకు పూర్వం చిరంజీవి అభిమానులను పిలిపించాడు. మీ ఫోటో ఇచ్చి పొండి చిరంజీవి సంతకంతో మీకు ఐ.ది.కార్డులు ఇప్పిస్తానన్నారు .పిల్లలు ముచ్చటపడి ఫోటోస్ ఇచ్చారు శ్రీనివాసులు ఏంచేసాడంటే వారి ఫోటోస్ పెట్టి చిరంజీవితో తన బొమ్మ పెట్టి కోర్టు వద్ద మెగా డిజిటల్ బ్యానర్ పెట్టించుకున్నాడు. వారికి స్వంత డబ్బుతో పెట్టుకునే బ్యానర్స్లో పెట్టుకోవడానికి ఫోటోస్ కరువు.
ఇక సి.కె.విషయానికొస్తాం. మార్చ్ 24 ఆయన బిర్త్ డే. అతని అభిమానులు ముందు రోజు అతని దగ్గరకు వెళ్ళి “అన్నా బ్యానర్లు ..” అని మొదలు పట్టారు. వెంటనే సి.కె “ఏరా డబ్బులు ఎక్కువైపోయిందా.. మరి ఎక్కువ డబ్బులుంటే కొంత ఇచ్చేసి పొండిరా ఎన్నికలొస్తున్నాయి ఖర్చులకు కావాలి” అని వారించాడు.
చిత్తూరు న్యూట్రిన్ ఫ్యాక్టరి గురించి వినే ఉంటారు. అక్కడ ఏ.ఎన్.తి.యు.సి దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చేది. అందుకు సి.కె.రాష్ఠ్ర అద్యక్షులనుకుంటా. గత సం. అక్కడ టి.ఎన్.తి.యు.సి నెగ్గింది. తమాషా ఏమంటే మొత్తం కార్మికులు 685 అంటే వారిలో సి.కె.హాయంలో పెర్మెనెంట్ అయిన వారు 605 మంది. అయినా అప్పతి డి.కె.ఆదికేశవులు దనబలంతో టి.ఎన్.టి.యు.సి నెగ్గింది. ఇక్కడికి షాట్ కట్ చేద్దాం.
ఇది సి.కె.బాబుకు ఇతర నాయకులకు ఉన్న తేడా. మార్చ్ 24 సి.కె.పుట్టిన రోజు. న్యూట్రిన్ కార్మికులు
300 మంది దాకా వచ్చారు. ఏదో కార్యక్రమానికి పిలుస్తున్నారు. అక్కడ జరిగిన సంభాషణ ఇలా ఉంది.
సి.కె: నేను రాను
కార్మికులు: అలా చెప్పొద్ద్దన్నా మాకు మంచి చెడ్డ అంతా నువ్వేగా
సి.కె: రేయి నేను మంచే చేసాన్రా. కీడు మీరు చేసారు
కార్మికులు: లేదన్నా నువ్వు రావల్సిందే
సి.కె.: నేను రానంతే
కార్మికులు:మేము నినాదాలు చేస్తామన్నా.గట్టిగా అరుస్తాం
సి.కె: అరవండ్రా మీకంటే గట్టిగా నేనరుస్తా
కార్మికులు:నువ్వు వస్తానని చెప్పేంత వరకు తిండి తిప్పల్లేక మేము ఇక్కడే ఉండిపోతాం
సి.కె: ఉండండి. ఎన్ని రోజులు ఉంటారు? నేను 14 రోజులు ఉన్నాను
సంభాషణ ఇలాగే గంట సేపు సాగింది. చివరికి వస్తానని సి.కె.ఒక్క మాటన్నారంతే
ఆ ప్రదేశమే కంపించేలా నినాదాలు ద్వనించాయి.
ఇదే శ్రీనివాసులు విషయానికొస్తే ఏ లెట్టర్ ప్యేడ్ సంఘానికో 10 వేలిచ్చేసుంటాడు. వారు వస్తామని ఫోన్ చేసేస్తే చాలు వచ్చారా వచ్చారా అని 36 సార్లు అడుగుతుంటాడు.
ఇంతకీ సి.కె.తన జేబునుండి పైసా ఎత్తి ఖర్చు పెట్తినట్టు ఎవరూ చెప్పరు. మరెలా వచ్చారు అంత మంది. మరెలా సాగుతూంది రాజకీయం? అదే సి.కె.అంటే .
ఇంత ఏల ..నేను ప్రజా నాయకులు సి.కె.గ్రంథం వ్రాసాను. పబ్లిష్ చేసాను. అందులో ఏముంది? ఏం రాసాను? ఒక సెకండన్నా చూడలేదు వేదిక మీద ఆవిష్కరించేసారు.రచనకు ముందు కాని వెనుక గాని నేను ఆయాన్ని కలవడమో,ఆయన నన్ను కలవడమో,పిలిపించడమో ఏమి లేదు.
ఇదే నేను మరో నాయకుడి జీవిత చరిత్రా వ్రాస్తానని చెప్పి ఉంటే ఏ.సి.కార్లల్లో తిప్పుతూ ఫ్లాష్ బ్యాకులు చెప్పి నా మెదడు తినేసుంటారు. అది సి.కె.అంటే