10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

సాటి మానవుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి..హత్యలు, ఆత్మ హత్యలు, యాసిడ్ దాడులు,రోడ్డు ప్రమాదాలు ,రోగాలు. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలతో దేశం వల్లకాడుగా మారుతూంది. కేవలం వ్యభిచారానికి చట్ట బద్దత కల్పిస్తే చాలు ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా మానభంగాలు, లైంగిక వేదింపులు ,ఈవ్ టీజింగులు, యాసిడ్ దాడులు ,అక్రమ సంభంధాలు మటు మాయం అవుతాయి. ఈ మాటాంటే నేను విలన్. లైంగిక ఇచ్చలు నెరవేరితే (చట్ట బద్దంగా) ఎన్నో మానసిక రుగ్మతలు పోతాయి. ముఖ్యంగా అవివాహితులు, విధవలు, (Both male & female), డివీర్సీలు లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం 99.9 % తగ్గి పోతుంది. వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే పై సమస్యలే కాక ఎయిడ్స్ మరియు సుఖరోగాల నియంత్రణ ,జనాభా నియంత్రణ సుసాధ్యమవుతాయి. అంతే కాక నడిచే గాయాలుగాః హేయమైన జీవితాన్ని సాగిస్తున్న సెక్స్ వర్కర్స్ జీవితంలో కొంత వెలుగు వస్తూంది. వారిని రక్షించటంతో బాటు ,వారి సంపాదనను కొల్ల కొడుతూ బలిసి పోతున్న పోలీసులు, ఆకు రౌడీలు,పావలా లాయర్లు, మాఫియాల ఆట కట్టించే అవకాశం కలుగుతుంది.

వ్యక్తిగత వాహణాలు నిషేదించి (ముఖ్యంగా టూ వీలర్స్/కార్లు) పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ప్రోత్సహించి,వాటి నాణ్యత పై డేగ కన్ను వేస్తే డ్రై)వింగ్ లైసెన్స్ జారిలో నిభందనలు గట్టిగా అమలయ్యేలా చూస్తే ఎన్నో ప్రమాదాలను వారించ వచ్చు. మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యడాన్ని కఠినంగా శిక్షిస్తే పంచాయితి,మండల కేంద్రాల్లో అత్యవసర విభాగాలను ఆధునీకరిస్తే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోవు. కనీశం రక్షిత త్రాగునీటి పథకాలు ఖచ్చితంగా అమలైతే , వ్యక్తి గత మరుగుదొడ్ల పథకం పెద్ద ఎత్తున అమలైతే చాలు ఎన్నో రోగాలను అరికట్ట వచ్చు. ఇవన్ని నేను చెబితే ఎవరూ పట్టిచ్చుకోరు. నేను బ్లాగులో వ్రాసి ఊరుకోలేదు ఏకంగా హోం శాఖకు మెయిల్ చేసాను. వారు పరిశీలిస్తున్నామని ప్రత్యుత్త్రరం పంపారే గాని తదుపరి స్పందన లేదు.

ఇతరులను తప్పు పట్టడం చైల్డిష్ అని మీలో కొందరు చెప్పొచ్చు. కాని 1997 నుండి భారత దేశ సమస్యల పరిష్కారానికి నేను చేస్తున్న ప్రయత్నాలకు సహకరించిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. ఈ లోకానికి నకలే ఈ బ్లాగ్లోకం ! బ్లాగ్లోకంలోనే కాదు ఈ ప్రపంచంలోని ఎవడిని నేను లెక్క పెట్టను. నేను ఎవరినుండి ఏది ఆశించడం లేదు. ఇంకా చెప్పాలంటే నేనే అందరికి ఆఫర్ చేస్తున్నా సరి కొత్త సమాజం. సరి కొత్త జీవితం. అందుకే చెబుతున్నా ఎవడైతే నాకేంటి?

ఇదేదో సినిమా టైటిలనుకుంటా ! అయితేనేమి నా స్టైల్ కూడ ఇదే ! అడ్డమైన వాడి కాలు పట్టుకుని స్వర్గవాసం పొందడం కన్నా నా నరకంలో నేనుంటా ! ఎందుకంటే ఎవడో అడ్డమైన గడ్డి మేసి కట్టుకున్న స్వర్గంలో తల దాచుకుంటే వాడి ఖర్మల్లో నేను బాగం పంచుకోవాలి. పైగా నేను మరొకడి కాలు పట్టుకుంటే అది ఆ దేవునికే సిగ్గు చేటు. వీలైతే ఆయనకు గౌరవం తెచ్చి పెట్టాలే గాని సిగ్గుతో తల దించుకునేలా చెయ్యకూడదు.

నిజానికి నేను కొత్తగా చెయ్యవలసిందేమి లేదు. నా శక్తి, యుక్తులకు, వందింతలు శ్రమించాను. వాటి ఫలాలు అందాల్సి ఉంది. నాదో దుకానం ఇందులో సర్వ సమస్యలకు పరిష్కారాలు అమ్మకానికి పెట్టాను. వీటికి దరంటూ ఏమీ లేదు. ఈ పరిష్కారాలను ఎవడన్నా వాడుకుని భాగుపడితే ఆ విషయాన్ని నా దేవుడు తన బుక్స్ లో నమోదు చేసుకుంటాడంతే ! ఎవడూ వాడుకోపోయినా నష్ఠమేమి లేదు.ఈ రోజు కాక పోతే రేపు, రేపు కాకుంటే ఏదో ఒక రోజు నా పరిష్కారాలు మానవావనికి ఖచ్చితంగా ఉపకరిస్తాయి. నేను 1986 లో సహకార సమిషిఠి వ్యవసాయం అమలైతే జనాభాలో 70 మంది దరిద్రం వదిలి పోతుందని భావించాను. ఈ రోజు ప్రభుత్వం ఆ వైపు ఆలోచిస్తూంది.

వ్యభిచారానికి చట్ట బద్దత కల్పిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని భావించా. ఈ రోజు హై కోర్టు సైతం స్వలింగ సంపర్కం నేరం కాదని వ్యాఖ్యాణించే పరిస్థితి వచ్చింది. రేపో మాపో వ్యభిచారానికి చట్ట బద్దత కూడ అమలు కావచ్చు. అయినా కాకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. ఎలాగో ఇన్ని తరాలు సెక్స్ కోరికలను అనగ త్రొక్కి మానసిక రోగులుగా తయారయ్యేరు. కనీశం రేపటి తరమన్నా ఈ దుస్థితినుండి భయిటపడుతుంది.

ఆపరేషన్ ఇండియా అంటారా ? అది నా మానస పుత్రిక. సాధారణంగా సామాన్యులైనా సరే ప్రతి ఒక్కరి ఆలోచనలకు భలం ఉంటుంది. మరీ నా నిస్వార్థ ఆలోచనా తరంగాలు ఏదో నాడు కార్య రూపం దాల్చక తప్పదు. దానిని భాహ్య లోకాని చాటడానికి నేను చేసే ప్రయత్నాలన్ని ఉత్తుత్తివే !

నాకూ పొద్దు పోవాలిగా ! అస్తమానం రామ నామ సంకీర్తనం చేస్తుంటే బోరై పోదు.. మరి ఇటువంటి భాహ్య విషయాల్లో చురుగ్గా పాల్గొని అవి బెడిసి కొడితేనే నాకు రామునికి మద్య సఖ్యత మరింత పెరుగుతుంది.

జడివానై కురుస్తున్నా
మీలో ఇంత మానవత్వాన్ని మొలకెత్తించ లేక పోతున్నా !

RTS Perm Link

July 20th, 2009 at 8:25 pm | Comments & Trackbacks (0) | Permalink