SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
నక్సలైట్స్ కూడ రాజకీయం చేస్తున్నారహో !
Oct 25th, 2009 by chittoor Murugeshan

అవును ఈ రోజు మద్యాహనం టి.వి. లో నక్సలైట్ నేత కిషన్ జి మాటలు విన్నాను. (అది మొబిలె ఇంటర్వ్యూ అని చేనల్ చెప్పినప్పటికి అది కేవలం రికార్డు చేసిన మాటలే అని నా ఊహ) పాపం ఆయన వై.ఎస్.ఆర్ ను, జగన్ ను నానా మాటలు అంటుంటే నాకు నవ్వొచ్చింది.
కిషన్ జి ఒక్కసారి ఊహించుకో !
నువ్వు కడపలో పుట్టావు. బాంబుల కడప ! నీ తండ్రి ఒక ఫేక్షనిస్టని ముద్రపడిన దురద్రుష్ఠవంతుడు. నువ్వు డాక్టరుకు చదివావ్. నీ తండ్రి ఆసుపత్రిలో దర్మవైద్యం చేస్తావా ? సరే పోని కావల్సినన్ని ఆస్తులున్నాయి. కాలేజిలో చదివినప్పుడే ట్యేక్సు కాట్టినవాడివనుకో. నీకు రాజకీయాలతో పనే లేదు. కాని వచ్చావు. అప్పట్లో రాజీవుకున్న ఆకర్షణ అటువంటిది. కాంగ్రెస్ వంటి హిప్పాక్రటిక్, అప్రజాస్వామిక, దళారుల, పార్టిలో కొన్సాగావు. 1949 లో పుట్టిన నువ్వు 2003 దాక కేవలం ఒక జిల్లాకే పరిమితమై ఉన్నావు. ఆ తరువాత పాద యాత్ర చేపడతావు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అంటే 2004 లో నీ 55 వ ఏట వేరే గత్యంతరంలేని పరిస్థితిలో ఆదిష్ఠానం నిన్ను సి.ఎం చేసింది.
అంతకు పూర్వం పరిపాలించిన వాడు అసలు ముఖ్యమంత్రే కాదు ప్రపంచ బ్యాంకు జీతగాడని పేరు తెచ్చుకున్న పెద్ద మనిషి. తనను సి.ఇ.ఓ గా చెప్పుకున్న వ్యక్తి. అతనెలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడంటే …………………………………………………………………………………………………………………………………………………………………………… (ఖాళీలను నీవే పూరించుకో) ఆ తరువాత సి.ఎం.కుర్చి ఎక్కిన వై.ఎస్. కేవలం చంద్రబాబు చేసిన తప్పిదాలను సరి దిద్దేసి పడకేసి నిద్ర పోయున్నా వై.ఎస్. దేవుడే అయ్యేవాడు. అంతగా రాష్ఠ్ర ప్రజలు బాబు పాలనతో విసిగి వేసారి పోయున్నారు. కాని ఆయన ఎంతగా శ్రమించారంటే ……………….దానిని మాటల్లో చెప్పలేను.

మీలా అడవుల్లో దాక్కుని, హోం గార్డులను, కానిస్టబుళ్ళను చంపుకుంటూ, డబ్బా చేనల్సుకు భీర వచనాలు పలుకుతు ఉండే పని కాదు వై.ఎస్.ది. అటు దిల్లి నవాబులు, ఇటు స్వంత పార్టిలోని శల్యులు , గుంట నక్కను మించిన బాబులాంటి ప్రతిపక్ష నేత. ఎప్పుడు ఎటు పోతారో తెలీని కమ్యూనిస్టులు. ( వారి దుంప తెగ శ్రీలంక తమిళులను ఊచకోత కోస్తుంటే వీరు నెత్తిన పెట్టుకుని ఊరేగే కమ్యూనిస్టు దేవుడు ఫెడరల్ కేస్ట్రో నేత్రుత్వం వహించే దేశం శ్రీలంక పై ఇతర దేశాలు తెచ్చిన ఖండన తీర్మాణాన్ని సైతం భలపరచలేదు. అట్టి కమ్యూనిస్టులు ఒక ప్రక్క ,డ్రగ్ అడిక్ట్ కన్నా మోసమైన మనస్థితిలోని కే.సి.ఆర్ , పరిపాలకుడు మారినా తమ తీరు మార్చుకోని అధికార గణం, వారిని దారిన పెట్టే కర్కశం లేక చూసి చూడనట్టు ఉపేక్షించిన వై.ఎస్.ఆర్ ములాజకు పోయి ముండ మోసాడు. దిక్కు లేని చావు చచ్చాడు.

మీరు అడవుల్లో దాక్కుని ఆయుధాలు పట్టి సాధించ లేని ఎన్నో విషయాలను వై.ఎస్.సాధించాడు. అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు. చంద్ర బాబు కూడ ఉన్నాడు. తిన్నాడు. ఏం లాభం ? కిషన్ జి వై.ఎస్. ఉన్నంత కాలం మీ తోకలు మీ ప్యేంటు జేబుల్లా ఉన్నాయి. ఇప్పుడేమో ర్యేక్ & రోల్ చేస్తున్నాయి.

ప్రజల కోసం ,ప్రజా పక్షమని రెచ్చిపోవడం కాదు . వాస్తవంగా ప్రజా పక్షం వహించే వారైతే జన హ్రుదయాన్ని అర్థం చేసుకున్న వారైతే వై.ఎస్. మానవీయ పథకాలు అమలు కావాలని నినదించండి. జన జీవణ శ్ర్వంతిలోకి రండి.

ప్రజలు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. విసిగి వేసారి పోయున్నారు. ఇప్పుడు జనాన్ని కదిలించే ఓంకారం కేవలం డా.వై.ఎస్.అనే అక్షరాలే. ఈ చిన్న సెంటిమెంటును అర్థం చేసుకోక వై.ఎస్.పై నిందలు మోపి ఇంకాస్తా ప్రజలకు దూరమయ్యారు . అడవుల్లో దాక్కుని ఫిసికల్ గా దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం సైకలాజికల్ గా కూడ దూరమవుతారు. ఆలోచించండి. ప్రజల స్రేయస్సే మీ ద్యేయమైతే వై.ఎస్. మానవీయ పథకాల అమలుకు వత్తిడి తెండి.
పథకం అమల్లో బ్యూరాక్రటిక్ తప్పిదాలుంటే ఎత్తి చూపండి. జనం మెచ్చుకుంటారుkishanji

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa