బ్లాగ్లోకమా !
నువ్వు ఈ లోకంలోని ఒక బుల్లి లోకానివి !
నా చుట్టూ ఉన్న మనుషుల్లాంటి మనుషులు మీరు
మీకు నేను దూరమైనప్పడే నా భగవంతుని దగ్గరవుతాను
ఎలాగో మీలో నుండి నన్ను దూరం చేసారు
నా భగవంతునికి దగ్గర చేసారు
మీరు నా భగవంతుని ప్రతిరూపాలు
ఆయన ఆజ్నానుసారమే చోటు చేసుకుంది మీ తిరస్కారం
పురస్కారాలకు పొంగి పోవడం
తరస్కారాలకు క్రుంగి పోవడం నాకు అలవాటు లేదు.
మీ ఆశల పల్లకిలో మీరు ఊరేగండి !
నా తల్లిని నేనూ ఊరేగిస్తా
ఆమె సముద్రంలోనుండి దోచుకున్న ఆమె ముత్యాలతో
ముస్తాబు చేసిన ముత్యాల పల్లకిలో కాదు
గణితములెరుగని, నా సునిత హ్రుదయ
జనిత ముద్దు ముద్దు పదాల పల్లకీలో ఊరేగిస్తా
మీ జీవితాలను ప్రక్షాళణ చెయ్యడానికి వచ్చిన ఎవరిని
గౌరవించారని ..
చాక్రటీసుకు విషం పెట్టేరు
గలిలీయోను రాళ్ళతో కొట్టేరు
నన్ను తిరస్కరించి వారంతటి వానిగా కనీశం భ్రమింప చేసేరు
ఎవరు కాదన్నా కురవక మానదు వాన
జడివానై కురుస్తా మీ లో కాసింత మానవత్వాన్ని చిగురింప చేస్తా
నా జ్నాన బండారాన్ని తెరిచి ఉంచడమే కాదు
అందులోని సంపదను మీకేసి విసురుతా
నా రాతల్లో రతనాలే రాలుతాయి
నా మాటల్లో ముత్యాలే దొరులుతాయి
*నువ్వీ భూమి మీదికి రాగలిగావంటే ఈ స్రుష్ఠి నిన్ను రెకగ్నైజ్ చేసిందనర్థం.
*నీ తల్లి తండ్రి పోరాడి ఓడిన అదే యుద్దాన్ని నువ్వూ చెయనున్నావు. వారి అనుభవాలను కూడ పరిగణలోకి తీసుకో
*నీ టీచరుకు పాఠాలు నేర్పటం కేవలం వ్ర్రుత్తి. నేర్చుకోవడం నీ అవసరం
*మాత్రు భాషకాని మరో భాష మీద పట్టు జీవన పోరాటంలో మరో ఆయుధం: కార్ల్ మార్క్స్
*చెడ్డవానికి చెడ్డ చేస్తే న్యూట్రల్ అయ్యేది భగవంతుడు. ఆ చెడ్డవానికి భగవంతుడ్ని చెడ్డవాడు చెయ్యాలంటే ఆ చెడ్డ వానికి నువ్వు మంచే చెయ్యి
*మనుషులు, పెంపుడు జంతువులకే కాదు వస్తువులకూ మనస్సుంది,అభిప్రాయం ఉంది.ముఖ్యంగా ఆత్మగౌరవం ఉంది.వస్తువులను గౌరవించు. అది నీకు ఉపకరిస్తుంది. గౌరవించడమంటే దుర్వినియోగం చెయ్యకుండటం
*డబ్బు నీడ వంటిది ఎవరైతే దానిని పట్టించుకోరో వారిని వెంట బడుతుంది
*విజయం సాధించిన ప్రతి పురుషుని వెనుక ఒక స్త్ర్రీ ఉంటుంది. ఎందుకంటే అతను ఆమెను దాటుకుని విజయపథంలో నడిచాడు కాబట్టి
*మనస్సున మాట నోటీతో చెప్పు. చెప్పిన మాట ఆచరణలో పెట్టు.తొలూత సాంఘికంగా కొన్ని సమస్యలు వచ్చినా నీ మానసిక సమస్యలు దూరమవుతాయి
*సత్యమే చెప్పు. అది నిన్ను ఈ సంఘం ద్ర్రుష్ఠిలో పిచ్చివాడ్ని చెయ్యొచ్చు. కాని ఈ జన్మకి నీకు పిచ్చెక్కే అవకాశమే ఉండదు
*మనమందరం పిచ్చివాళ్ళమే పెర్సంటేజిలోనే తేడా
*ఎవడూ వంద శాతం మంచోడు కాడు.ఎవడూ వంద శాతం చెడ్డవాడు కాడు. ఎవడూ 24 గంటలు మంచోడు కాడు ఎవడూ 24 గంటలు చేడ్డోడు కాడు
*ప్రతి వ్యక్తి ఒక లాటరి టిక్కెట్ వంటి వాడు. నువ్వు ఓ చిరునవ్వు ఓ హలో పెట్టుబడి పెడితే ఏదో రోజు లాభం చేకూరుస్తాడు
*ప్రతి వ్యక్తి ఒక పోస్టు కార్డువంటివాడు..అతని పై భగవంతుడు ఏ ఆడ్రస్ వ్రాసి ఉంటే ఆ అడ్రసుకే చేరుతాడు
*ప్రేమ స్నేహం అంటే ఎదుటివానిలోని అన్ని లోపాలతో అతనిని అంగీకరింఛడం
*జ్యోతిష్కుడు కేవలం ఫలితాలను చెబుతాడు. ఆ ఫలితాలను ఇచ్చేవాడు భగవంతుడు
*తప్పుడు మార్గంలో ఎంత దూరం వెళ్ళి పోయామన్నది ముఖ్యం కాదు ..కేవలం సంకల్పంతో మంచి మార్గంలో ఇట్టే ప్రవేశించొచ్చు
*దురలవాట్లు అతిథులుగా ఎంట్రి ఇస్తాయి. త్వరలోనే మీకు యజమానులై కూర్చుంటాయి.
*రక్తానికి తెలుసు తల్లి,తండ్రి,గురు,దైవం ! ఆ రక్తములో కలిసిన మద్యానికి తెలియదు పాపం
*వెయ్యి మంచి మాటలకన్నా ఒక్క సత్కార్యం ఎంతో ప్రభావితం చేస్తుంది
*జీవితమంటే ఒక దానిని పొందడం కొరకు మరొకదానిని పోగొట్టుకుంటూ దేనిని పొంద లేక పోవడమే
*మార్పు లేనిది మార్పు ఒక్కటే
*జీవితం బస్ స్టేషన్ వంటిది. ఎవరి బస్సు వస్టే వారు వెళ్ళి పోవల్సిందే
*నీ ఆస్తికి నువ్వు కేవలం కేర్ టేకర్ మాత్రమే !
*మార్పును అంగీకరించే మెచ్యూరిటి లేకుంటే మార్పు మరణ సమానంగా తయారవుతుంది
*మీ జీవితం స్వర్గమూ కాదు నరకమూ కాదు దానిని మీరెలా అర్థం చేసుకుంటే అలా మారుతుంది
*గుణాన్ని పట్టే వర్ణం. వర్ణాన్ని పట్టి రాదు గుణం
*డబ్బు కేవలం లక్ష్య సాథనకు ఒక పరికరం.అదే లక్ష్యం కాదు.కాకూడదు.
*లలిత కళలు మనిషిలోని అహాన్ని సన్నగిల్లేలా చేసి స్ర్రుష్ఠికి,భగవంతునికి దగ్గర చేస్తాయి
*రామునితో కలవడము చేత ఒక కోతికి సైతం ఆలయాలు వెలిసాయి. దుర్యోదనునితో కలిసి కర్ణుడు దిక్కు లేని చావు చచ్చాడు
*దైవం కేవలం బ్యాంకులోని క్యేషియర్ వంటి వాడు.నీ ఖాతాలో సొమ్ముంటే నువ్వు నమస్కరించక పోయినా నీ సొమ్ము నీ చేతికిస్తాడు
*స్వార్థం మనిషిని క్రుంగిపోయేలా చేస్తుంది. నిస్వార్థం అతనిలో కొత్త కొత్త శక్తులు ఉప్పొంగేలా చేస్తుంది
*ఈ విశ్వంలో శతాబ్దాలుగా జీవించిన ఆత్మల ఆత్మ ఘోషలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. లక్ష్యమంటూ లేని మస్తిష్కాలను ఇట్టే ప్రభావిస్తాయి.
*పది మంది పురుషులు కలిసి ఒక ఇల్లు నిర్మించగలరు. దానిని పొదరిల్లుగా మలచాలంటే ఒక స్త్ర్రీ కావాలి
*మగ పిల్లవాడు ఒక బిడ్డను కంటేనే తండ్రి అవుతాడు. కాని ఆడపిల్ల పుట్టడమే తల్లిగా పుడుతుంది
*శరీరం మనస్సు పరస్పరం ప్రభావుంచుకుంటాయి. ఏది బలంగా ఉంటే అది మరొకదానిని ప్రభావిస్తుంది.
*పొగ త్రాగేవాని ఇంటికి దొంగలు రారు అతను రాత్రంతా దగ్గుతూ ఉంటాడు కాబట్టి, కుక్కలు కొరకవు అతను చేత కర్ర పట్టుకుని తరగవలసి వస్తుంది కాబట్టి, అతనికి వ్రుద్దాప్యం రాదు యవ్వనంలోనే చనిపోతాడు కాబట్టి
*జీవితంలో దేనినైనా పొందాలంటే మరి దేనినో పోగొట్టుకోక తప్పదు. నేను దేనిని పోగొట్టుకోను అని కూర్చుంటే దేనిని పొందలేరు. అన్ని పోగొట్టుకోవడానికి సిద్దమైతే అన్నింటిని పొందవచ్చు
*మూర్ఖుని బుర్ర జెల్లడ వంటిది అందులో చెత్తలే నిలబడతాయి
*భగవంతుడు జీవితమనే మన పడవకు క్యేప్టెన్ అయ్యున్నాడు. పడవకు బొక్క పడి పడవలోకి నీళ్ళు వచ్చే సమయాన పడవలోని వస్తువులను సముద్రంలోకి పారేస్తాడు. ఆయన ఉద్దేశం పడవను కాపాడటమే. కాని అసలు విషయమ్ తెలియక మనం లభో దిబోమంటుంటాం
*సుఖాలు మన శరీరాన్ని బలహీన పరుస్తాయి. కష్ఠాలు శరీరానికి భలం చేకూరుస్తాయి
*లోకం ఒక్కటే కాని ఎవరి లోకం వారిదని ఉండటం చేత లోకాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాం
*షూ లేదని క్రుంగి పోకు కాలు లేని వాడ్ని చూసి ఓదార్పు పొందు
*ఆశలను నెరవేర్చి తద్వార ఆశలను తీర్చ కోరడం పెట్రోల్ పోసి నిప్పును చల్లార్చ చూసినట్లే
*భలహీనతే పాపాల గంగోద్రి
*నీ వారి ప్రాపంచికాభివ్రుద్ది కొరకు నీ ఆథ్యాత్మికాభివ్ర్రుద్దిని వాయిదా వేసుకోవడమే అసలు సిసలైన ఆథ్యాత్మికం
*హీరో అంటే జెర్కిన్ ధరించి ,లియో టాయి తుపాకులు మోసే వాడు కాదు. తన వారికోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టే వాడే హీరో
*అద్ర్రుష్ఠ వంతుడ్ని ఎవరూ చెడప లేరు. దురద్ర్రుష్ఠ వంతుడ్ని ఎవరూ భాగు చెయ్యలేరు
*తల్లి తండ్రులు బిడ్దలను కంటారు. వారి తలరాతలను కాదు
*కొలంలో తామర పువ్వుంటుంది. అందులో తేనె ఉందన్న సంగతి ఆ కొలంలోనే ఉన్నకప్పలు,చేపలకు తెలియదు. ఎక్కడో ఉన్న తేనెటీగలకు తెలిసి పోతుంది అలా మీ చుట్టూ ఉన్నవారిలోని ప్రతిభను మీరు గుర్తెరిగి గుర్తించకున్నా ఎవరో ఒకరు గుర్తిస్తారు
*ద్రాక్ష పండు రసమయమై,పుష్ఠిగా చూడ ముచ్చటగా ఉంటుంది. కాని ఎండు ద్రాక్షకే లైఫ్ ఎక్కువ. పాపికి,పుణ్యాత్మునికి తేడా ఇదే
*పది రూపాయల నోటు ఏ ఊరెళ్ళినా పదే పలుకుతుంది. ఎంతటి వాస్తున్న ఇంటిలో నివసించినా నష్ఠ జాతకుడు నష్ఠ జాతకుడే
*వడ్రంగి వాడు డబ్బా రేకులను నాలుగు దెబ్బలతో చాటలుగా మలుస్తాడు. కాని కంసలివాడు బంగారాన్ని కాల్చి కాల్చి మలుస్తాడు. కష్ఠాలు కూడ అంతే. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మీ ప్రతిభ కొద్ది కష్ఠాలు
*సాటి ప్రజలకన్నా దిగ జారితే సానుభూతి లభిస్తుంది. వారికంటే మీరు ఒక్క మి.మీ ఎదిగినా ఏకాకై పోతారు
*మీసం ఒక్కటే బొత్తింకకూ ఉంటుంది మీసం.
*పోలీసు స్టేషన్లో పులిలా ఉండే ఎస్.ఐ. కోర్టు ఆవరణలోకి వెళ్ళగానే టోపి తీసి చంకలో పెట్టుకుని నిలబడతాడు ఇదే స్థాన బలం అంటే