SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
ముమ్మాటికి వై.ఎస్. సమైక్యవాది
Dec 17th, 2009 by chittoor Murugeshan

డా. వై.ఎస్. టి.ఆర్.ఎస్ తో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు గాక. చర్చల ద్వారా కామ ఒపీనియన్ ద్వార తెలంగాన ఇస్తామని ప్రకటించి ఉండవచ్చు గాక. అయినా ఆయన ముమ్మాటికి సమైక్యవాదియే. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ..టి.ఆర్.ఎస్. నేత కే సి ఆర్ తత్వం ఏదో వై.ఎస్.కి బాగా తెలుసు. కేవలం తె.దే.పా హయాంలో మంత్రి పదవి రాని ఏకైక కారణం తో టి.ఆర్.ఎస్ స్థాపించిన నీచ వ్యక్తిత్వం కే.ఎస్.ఆర్ ది.కే.సి.ఆర్ గారికి తెలంగానా తెచ్చుకోవాలన్న కాంక్ష నిజంగానే ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగానా ఇస్తుంది అని కామన్ ప్రోగ్రాం లోనైనా, ఎలక్షన్ మేనిఫెస్టోలనన్నా పెట్టించి ఉంటాడు లేకుంటే పొత్తు పొసగదని భయిటకొచ్చేవాడు. వై.ఎస్. ఆర్ పాలనలో ఆయన వ్యవహార శైలి చూస్తే మనకిట్టే అర్థమవుతుంది. ఆయన వేటినైతే మనస్పూర్తిగా చెప్పాడో వాటిని ఆరు నూరైనా నూరు ఆరైనా ఇచ్చాడు. అమలు చేసాడు. తెలంగాన వాదం తో పబ్బం కడుక్కో చూసిన కే.సి.ఆర్ ని ఎంతగా భలహీన పరచారంటే ఆ పార్టిలో చీలిక వచ్చింది. చీలిక వర్గం కాంగ్రెసుకు బాసటగా ఉంది.మరో పక్క తెలంగానా వాదాన్నే మరుగున పడ వేయడం కోసం జలయజ్ఞంలో తెలంగానకు సింహ భాగమిచ్చారాయన. తెలంగాన కావాలని నువ్వే అడ్డమని వారు గగ్గోలు పెడితే ” నేను నిలువు కాదు అడ్డము కాదని” సేటైర్ చేసారు. వై.ఎస్. మనస్తత్వం తెలిసినవారెవరన్నా దీనిని ఇట్టే విశ్లేషించుకోగలరు. వై.ఎస్. సమైక్య వాది కాబట్టే , తెలంగానా అభివృద్దిని ఆత్మ సాక్షిగా ఆకాంక్షించారు కాబట్టే తెలంగాన అభివృద్దికి నడుం కట్టారు. అందుకే తెలంగానా ప్రజలు తమ ప్రాంతములో కాంగ్రెసుకు పట్టం కట్టేరు. తండ్రి భాటలో వై.ఎస్. జగన్ సమైక్య వాదాన్ని భలపరుస్తూనే గోల్డన్ తెలంగానా అంటూ కొత్త వాదాన్ని తెర మీదికి తెచ్చేరు
అందుకే జై అమైక్యాంథ్ర ! జై వై.ఎస్.ఆర్ ! జై జగన్

RTS Perm Link

జగన్ ! మేలుకో ..
Dec 8th, 2009 by chittoor Murugeshan

డా. వై.ఎస్.పై నాకున్న అభిమానంతో , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసిన హక్కుతో ఈ టపా వ్రాస్తున్నాను. జగన్ బాబు ! రాజకీయం అన్నది ఎన్నికల సమయంలో మాత్రం అందుకునే పాట కాదు. అది అను నిత్యం కొనసాగవలసిన బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రజా సమస్యలనే లిరిక్ ని అనగ త్రొక్కక కొన్సాగుతూనే ఉండాలి.

వై.ఎస్. దివంగతులయ్యారు. నా బోటి వారు నిన్నే సి.ఎం. చేస్తారని ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాశైంది. పోనీ తలచినదే జతిగినదా దైవం ఎందులకన్నట్టుగా దీనిని పాజిటివ్ గానే తీసుకుంటాం.
ఇప్పుడు దైనందిన సమస్యలన్నింటిని పక్క దోవ పట్టించి కే.సి.ఆర్ తన దుబాకోరు దీక్షతో తెలంగాణ సమస్యను తెరమీదికి తెచ్చారు. నాకు తెలిసి నాన్న గారు ఈ విషయమై ఏ మాట చెప్పి ఉన్నా ఆయన మనస్సులో మాత్రం సమైక్యాంద్ర ప్రదేశ్ కే చోటు.
రాష్ఠ్ర రాజకీయాల్లో ఇదొక కీలక జంగ్షన్ పాయింట్. ఇక్కట మనమేదో ఒకటి నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. ఇదో ఎత్తైతే మరో ప్రక్క అటు అదిష్ఠాణం కాని , ఇటు సీనియర్లు కాని , ప్రత్యర్దులు కాని సాకు దొరికినప్పుడల్లా నీ మీద దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారు త్రవ్విన గోతిలో వారే పడటం ఖాయం. సీనియర్లని విర్రవీగే వారికి కుక్కలకున్న జ్ఞానం కూడ లేదు. కుక్క బ్రతుకు బ్రతికినప్పుడు తమ యజమాణి మనోగతాన్ని పసిగట్టి నడుచుకోవాలి. కాని వీరు అధినేత్రి పైనే వత్తిడి తెచ్చే స్థాయికి వెళ్ళి పోయారు. జగన్ బాబు నీవు విధేయత ప్రకటించాలన్నా ఇదే అదను. తిరగబడాలన్నా ఇదే అదను.

అసలే ఇది కలి కాలం నిద్ర పోతునా కాళ్ళాడిస్తూనే ఉండాలి లేకుంటే చచ్చి పోయామని ప్రెస్ మీట్ పెట్టేసే కాలమిది. మరో విషయం ఏమంటే ఇదివరకే ప్రకటించినట్టుగా వై.ఎస్. మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంభాలను ప్రామర్శించటానికి బయలు దేరాలి. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకునే వారితో ఎంత మంచిగా
ఉన్నా అది చేతగానితనంగానే పరిగణించ పడుతుంది. జస్ట్ యు కం విత్ అన్ అజెండా . ప్లీస్ బి క్విక్

RTS Perm Link

రోసయ్యా ఇక కాస్కో
Oct 14th, 2009 by chittoor Murugeshan

రోసయ్య ! మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకున్నావో ఏమో ? నువ్వు చంద్ర గుప్తుడు కావాలనుకున్న చానక్యుడవు. చేతగాని చానక్యులు కోకొల్లలున్నారు. కాని చంద్ర గుప్తుడు ఒకడే .. ఆంథ్రా పులి కన్న పులి బిడ్డ జగన్ కదం తొక్కాడు . ఇక కాస్కో .

వై.ఎస్.బ్రతికున్నప్పుడే ఆయన చుట్టూ అదో వర్ణనాతీతమైన దివ్య తేజస్సు ఉండేది. తూలలాడిన జూనియర్ ఎన్.,టి.ఆర్ బతుకేమైందో మరిచి పోయావా తాతయ్య !

ఇప్పుడు వై.ఎస్. ఆత్మస్వరూపాన ఉండగా ఆ దివ్య తేజస్సు మరింత ప్రభవితంగా ఉంది. వై.ఎస్. మరణాన్ని కించ పరచిన కే.సి.ఆర్ హెలికాప్టర్ దారి తప్పడం, తూలి పడటమంతా దాని పనే . శంత స్వరూపుడుగా పేరొందిన నీకు అడుగడుగునా కోపం ముంచుకు రావడానికి కారణం కూడ ఇదే.

కాంగ్రెస్ వై.ఎస్. పేరిట వేరు కుంపటి తథ్యం. నువ్వు పదవీచ్యుడు కావడం తధ్యం. నేనిదివరకే పేర్కొన్నట్టు ఆంథ్రా రాజకీయ చరిత్రలో చారిత్రిక పురుషులు ఇద్దరు. ఒకరు ఎన్.టి.ఆర్, మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు తీరని అన్యాయమే జరిగింది.

ఇప్పుడు గాని తె.దే.పా లో ఎన్.టి.ఆర్ పై నిజమైన విశ్వాసం గల ఎం.ఎల్.ఏలు అలాగే కాంగ్రెస్ పార్టిలో వై.ఎస్.పై నిజమైన అభిమానం ఉన్న ఎం.ఎల్.ఏలు ఏకమైతే జగనే సి.ఎం. జూనియర్ ఎన్.టి.ఆర్ కోరుకుంటే అతనే డెప్యుటి సి.ఎం. ఎలా ఉంది దెబ్బ !

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa