SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
దేవునితో పని లేకనే సుఖ శాంతులు
Apr 25th, 2009 by chittoor Murugeshan

భగవంతునితో పని లేకే యావన్మంది ప్రజానీకం సుఖ శాంతులు పొందవచ్చు. ఈ మాట అన్నానని నన్ను నాస్తికునిగా లెక్క కట్టెయ్యకండి. గత ఇరుపది సం.లుగా వేలాది జాతకాలు, ఆ జాతకుల జీవితాలను క్షుణ్నంగా పరిశోధించాకే ఈ మాట అంటున్నాను. మన జాతకాలు టూ-ఇన్-వన్ ఏటిఎం కార్డు వంటిది. దానినే క్రెడిట్ కార్డుగా కూడ వినియోగించుకోవచ్చు. అంటే జాతకంలోని గ్రహాలు ఇచ్చే సత్ఫలితాలతో పాటుగా కేవలం పట్టుదలతో జాతక ప్రకారంగా మనకు అందే ప్రసక్తి లేని ఫలితాలను సైతం పొందవచ్చన్నమాట. కాని క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడితే వడ్డి నడ్డి విరుస్తుంది. అలాగే గ్రహాలు కూడ తాము సతరు జాతకంలో ఉన్న స్థితికి పొంతన లేని ఫలితాలను సతరు జాతకుడు పొందితే ఆగ్రహం చెంది వడ్డికి వడ్డి వేసి తామిదివరకే ఇచ్చినటు వంటి సత్ఫలితాలను వెనక్కి తీసుకుంటాయి.

ఉదా|| గురుగ్రహం ఉన్నత విద్యకు, ప్రభుత్వ ఉద్యోగం, పెళ్ళి, మగసంతానాలకు, రాజకీయాలకు, రాజ్యాదికారానికి కారకుడు. ఎన్.టి.ఆర్ అప్పటికే ఉన్నత విద్య, పెళ్ళి, మగసంతానాలు పొందియున్నారు. ఏటిఎం లో బ్యాలెన్స్ అయిపోయింది. అయినప్పటికి ఆయన రాజకీయాల్లో దూకారు, నెగ్గారు. సి.ఎం. అయ్యారు. దీంతో ఆగ్రహం చెందిన గురుగ్రహం తను గుండెకు కారకుడు కనుక గుండె పోటు తెచ్చి, బైపాస్ సర్జరికి గురయ్యేలా చేసాడు. రెండో పర్యాయమైతే గురు కంకణ కారకుడు కనుక భార్య లక్ష్మి పార్వతి, పుత్రకారకుడు కనుక, అల్లుడు పుత్రసమానుడు కనుక వారి రూపంగానే పదవీచ్యుతుడుని చేసాడు.

ఇందుకు కారణం పూర్వీకుల పాపకృత్యాలే. గురుగ్రహం బ్రాహ్మణ కులానికి, ఉపాద్యాయులకు కారకుడు. మన పూర్వికులు బ్రాహ్మణులు, గురువులు, ఉపాద్యాయులకు ఏవన్నా హాని చేసుంటే ఈ జన్మలో గురుగ్రహం బాగాలేని జాతకాల్లో పుడ్తాం.

ఒక ప్రధానమంత్రి తన మంత్రిమండలి లోని శాఖలను మంత్రులకు విభజించి ఇచ్చినట్టే – భగవంతుడు భూమిపై ఉన్న వస్తువులు రంగాలను నవగ్రహాలకు విభజించి ఇచ్చాడు. మనకు ఏ మంత్రితో సత్సంబంధాలుంటే ఆ మంత్రిత్వ శాఖలో మన పనులు చక చకా అయిపోతుంటాయి. ఏ మంత్రితో మనకు వైరం ఉందో ఆ మంత్రిత్వ శాఖలో ఏ పనీ కాదు. పైగా ఇబ్బందులు కూడ వస్తాయి. అలాగే మన జాతకంలో ఏ గ్రహం బాగుంటే ఆ గ్రహం కారకత్వం వహించే విషయాల్లో సక్సెస్ అవుతాం. ఏ గ్రహం బాగా లేదో ఆ గ్రహం కారకత్వం వహించే విషయాల్లో ఫెయిల్ అవుతాం.

ఇప్పుడు జాతకాల్లోని గ్రహ స్ధితిలకు, పూర్వీకుల పాప కృత్యాలకు ఉన్న సంబంధాలను చూద్దాం. ఒక వంశంలో పలువురు పురుషులకు రెండేసి, మూడేసి పెళ్లిళ్లు అయ్యున్నాయనుకొండి . ఆతరువాత ఆ వంశంలో పుట్టే ఆడ మగ పిల్లలు కళత్రకారకుడైన శుక్రుడు (భార్యను తెచ్చి పెట్టే గ్రహం) వ్యతిరేక ఫలాలిచ్చే స్థితిలోని జాతకాల్లో పుడతారు. దీంతో వారికి పెళ్లిళ్లు కావు; ఒక వేళ ఇతర గ్రహాల బలంతో పెళ్లి జరిగినప్పటికి జీవిత భాగస్వామి మరో పెళ్లి చేసుకోవడం, లేదా విడాకులకు సిద్దం కావడం జరుగుతుంటాయి. చింతచెట్టుకు చింత కాయలే కాచినట్లుగా వంశ వృక్షాలు పరిశీలిస్తే ఒకే కోవకు చెందిన జాతకులే పుడుతుంటారు. లోతుగా పరిశీలిస్తే ఈ రహస్యం బయటపడుతుంది.

ఇటువంటి జాతకాల్లో పుట్టినవారు హేతువాదులైతే మరీ ఇబ్బంది పడతారు. తమ పూర్వికులు చేసిన పాపానికి తాము బాధపడటం ఏమిటని ఆక్రోశించవచ్చు. కాని నేటి జెనటిక్ ఇంజినీరింగ్ పూర్వికుల గుణగణాలు, శారీరిక లక్షణాలు పిల్లలకు తప్పకుండా వస్తాయని చెబుతుంటే నమ్ముతాం. పూర్వికుల గుణగణాలు, శారీరిక లక్షణాలు, తెలివితేటలు ఎలా మనకు లభించాయో అలాగే వారి పాపకృత్యాల ఫలాలు కూడ మనకు వస్తాయి.

ఇటువంటివారు ఏంచెయ్యాలనేది ఇప్పుడు చూద్దాం. ఒక ప్రధానమంత్రి తన మంత్రిమండలిలోని శాఖలను ఇతర మంత్రులకు విభజించి ఇచ్చినట్టే – భగవంతుడు భూమిపై ఉన్న వస్తువులు రంగాలను నవగ్రహాలకు విభజించి ఇచ్చాడు. ఏ వంశమైతే ఏ జన్మలోను ఎవరికి కీడు చెయ్యక బ్రతికిందో ఆ వంశంలో మంచి యోగ జాతకులు పుడతారు. పాపకృత్యాలకు పాల్పడిన వారి వంశంలో, వారి పాపాలకు కారకత్వం వహించే గ్రహాలు చెడి ఉన్న జాతకల్లోనే పిల్లలు పుడతారు.

ఉదా|| కుజగ్రహం. ఈయన భూమి కారకుడు. ఏ వంశీయులైతే భూఆక్రమణలకు పాల్పడతారో వారి వంశంలో కుజదోష జాతకులు అత్యధికంగా పుడుతుంటారు. అలాగే సారాయి, మద్యం వ్యాపారులకు సర్పదోష జాతకులు పుడ్తుంటారు. ఇలా చాలా చెప్పవచ్చును. (నా అనుభవంలో చూసాను కూడాను)

నా ఎల్డర్ ఫ్రెండ్ ఒకతని జీవన విదానాన్ని అతని జీవితంలో శుక్ర శాపం ఎలా పని చేసిందో చెబుతాను. అతని పేరు నిత్యా. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తండ్రికి ఇద్దరు భార్యలు. తమ్మునికి పెళ్లై పిల్లలు లేరు. చెల్లెళ్లు అందరు భర్తను పోగొట్టుకున్నవారే . జాతకునికి పెళ్ళి కాలేదు. ఇంతకీ అతను అప్రయోజకుడా అంటే కాదు. సమర్థుడే. జాతకునికి భార్యను కట్ట పెట్టి దాంపత్య సుఖాన్ని ఇవ్వవలసిన గ్రహం శుక్రుడు. అతను కారకత్వం వహించే లోహం వెండి . నిత్యా అసలు జ్వల్లెరి మెర్చెంట్. వారి వ్యాపారంలో ప్రధాన భాగం వెండి అమ్మకం, కొనుగోలులే. పైగా అతను లగ్జరీలకు పోయి తన షాపును లగ్జరిగా ఆల్టర్ చేసి షో రూమ్ చేసాడు. (లగ్జరికి కారకుడు శుక్రుడు). వ్యాపారం కూడా బాగానే పుంజుకుంది. బాగా సంపాదించాడు.

వన్ ఫైన్ మార్నింగ్ అతని తమ్ముడు ఏవో దొంగనగల అమ్మకంలో మద్వవర్తిత్వం వహించాడు. అసలు దొంగ సొమ్ముతో వెళ్లిపోయాడు. పోలీసులకు పట్టుపడ్డాడు. వచ్చి నిత్యా తమ్ముడ్ని చూపి ఇతనికే అమ్మానన్నాడు. తను ఎవరికి అమ్మింది చూపాడు నిత్యా సోదరుడు. పోలీసులు వారివద్దనుండి సొమ్ము రికవరి చేసుకుని వెళ్ళి పోయారు.

పోలీసులు వెళ్ళిపోయాక స్థానిక వ్యాపారులు నిత్యా మీద పడ్డారు. ఇంటి మీద దాడి చేసారు. నిత్యా ఊరొదలి వెళ్ళి పోయాడు. ఆష్ట కష్టాలు పడ్డాడు. 3 సం.లకు తిరిగొచ్చాడు. తిండికి టికానా లేని స్థితి. (ఫుడ్, క్లాతింగ్, షెల్టర్లకు కారకుడు శుక్రుడే) శుక్రుడు కారకత్వం వహించే విషయాలన్నీ దూరమయ్యాయి కాబట్టి ఒక ఎస్.సి. మహిళ నిత్యాకు దగ్గరయ్యింది. దాదాపుగా భార్యలాగే అన్ని ధర్మాలను నెరవేరుస్తూ వస్తుంది. కాని కాస్త ఆర్థికంగా పుంజుకున్నాడు కాబట్టి నిత్యా దృష్టి తిరిగి లగ్జరిల పైకి మళ్ళింది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడవలసిందే.

ఇంతకీ టైటిల్ లో చెప్పిన దేవునితో పని లేక నే సుఖశాంతులు కథకొస్తే గ్రహాల కారకత్వాలు తెలుసుకోవాలి. వాటిలో ఏవైతే అనివార్యమో వాటిని మాత్రం ఉంచుకొని తక్కినవాటికి దూరంగా బ్రతకాలి . లో వోల్టేజి ఉన్నప్పుడు అన్ని బల్బులు ఆర్పేస్తే ఒక బల్బు కాస్త ఎక్కువ వెలుతురునిచ్చినట్టు కాస్త మెరుగ్గా జీవనం సాగుతుంది. దీనినే పెద్దలు చాలా సింపుల్ గా చెప్పారు.

దురాశ దుఖంకి చేటు అని

RTS Perm Link

జ్యోతిష్యం ఆథ్యాత్మికతకు తొలి మెట్టు
Apr 6th, 2009 by chittoor Murugeshan

మేధావులు జ్యోతిష్యమన్నది ఎస్కేపిస్టుల బంకరని, పండితుల బ్రతుకు దీరు అని ,మూడ నమ్మకమని చెప్పవచ్చేమో. కాని నాకు మాత్రం జ్యోతిష్యమన్నది ఆథ్యాత్మికతకు తొలి మెట్టనిపిస్తుంది. పరమ అహంకారినైన నాకు జ్యోతిష్యం పై ఆసక్తి కలగడం నేను దాని పై పరిశోధనలు చెయ్యడం,అహంతో జీవించువాడు గ్రహాల చేతిలో కేవలం కీలు బొమ్మలని నాకు రుడీ కావడం నిజంగా నా పూర్వ జన్మ సుక్రుతమే. క్రింది విషయాల్లో చాలా వాటిని ఇప్పటికిప్పుడు నిరూపించ గలను.కొన్ని విషయాలను రుజువు చెయ్యలంటే మాత్రం కొంత వ్యవధి,కొన్ని ఏర్పాట్లు
అవసరం. ఇంతకీ ఈ విషయాలను నేనెలా తెలుసుకో గలిగానంటే చాలా విషయాలను చెప్పవలసి ఉంటుంది. వాటిలో కొన్నింటిని మాత్రం చెప్పి అసలు విషయానికొస్తాను.

సాధారణంగా ఇంటర్ నెట్ కంప్యూతర్స్ లో అడ్మినిస్టేటర్,యూజర్ అని రెండు డివిజన్లు ఉంటాయి. వచ్చిన వాడు ఎప్పటిలాగా యూజర్ ని ఎన్నుకుంటే ఇబ్బంది లేదు. ఒక వేళ పొరబాటున అడ్మినిస్టేటర్ అన్న డివిజన్ లోకి ప్రవేసింఛాడనుకొండి బిత్తర పోతాడు.

మానవ మస్తిష్కంలోని కణాలను ఇసకంత పెద్దవి చేస్తే రెండు మూడు లారీలకవుతాయట.కాని మనం ఏ మెరకు మన మస్తిష్కానికి పని కల్పిస్తామన్నది అందరికి విదితమే ! మెదడు రెండు భాగాలుగా ఉంది కదా ఒకటి మరొకదానికి జిరాక్సా? లేక బ్యాక్ అప్ ఫైలా? అదేమి కాదు.

మరో ఉదాహరణ మన చెవులు వినడానికే పనికొస్తాయని అందరు భావిస్తాం. కాని మనిషి తనను తాను బ్యాలెన్స్ చేసుకుని పడిపోకుండా నిలబడటానికి , నడవడానికి కూడ చెవులు పనికొస్తాయన్నది కొందరికే తెలుసు.

ఇటువంటివే నేను తెలుసుకున్న విషయాలు కూడాను. నేనొక తియరి చెబుతాను.పరిశీలించి చూడండి. ఈ సమస్త స్రుష్ఠి ఒక మహా విశ్ఫోటంలోనుండే వచ్చింది, అండంలో(ప్రపంచం) ఉన్నది పిండంలోను(మానవ శరీరం) ఉందిఅంటారు.ఇంకాస్తా డిటెయిల్డ్ గా చెప్పాలంటే మన శరీరంలో నీటి పదార్థ శాతమే ఎక్కువ(70%). మానవ శరీరంలోని ఈ నీటి పదార్థానికి,సముద్రపు నీటికి ఒకటే కెమికల్ కాంబినేషన్. పున్నమి చంద్రుడు సముద్రపు నీటిని ఆకర్షించి ఉద్రుతపరచగా లేనిది, అదే కెమికల్ కాంబినేషన్ తో మానవ శరీరంలోని ద్రవాన్ని ప్రభావించడా? గ్రహాలు మనలను ప్రభావించినట్టే మనం కూడ గ్రహాలను ప్రభావిస్తున్నామంటే అది తర్క సమ్మతమే కదా .
స్థూలంగా చూసినప్పుడు మీరు,నేను వేర్వేరుగా కనిపించినా మరేదో ఒక త్రాడు మిమ్మల్ని నన్ను కలుపుతుంది. మిమ్మల్ని నన్ను మరేదో త్రాడు ఈ సమస్థ విశ్వంతో అనుసంథానం చేస్తుంది.

పసిపాప ఈ భూమిమీద వచ్చి పడినప్పుడు అది యూనివర్సల్ మైండ్ తో వస్తుంది. తనకి,తన తల్లి తండ్రికి ఈ సమస్థ వ్యవస్థల గత,వర్థమాన ,భవిష్యత్త్లు ఆ యూనివర్సల్ మైండులో ఉంటుంది . తొలుత ఆ పసిపాప తనను ఈ స్రుష్ఠినుండి వేరుగా చూడలేక ఉంటుంది.క్రమేణా అందులో ఈగో చొప్పించబడుతుంది, అప్పుడు తనను ఈ స్రుష్థినుండి వేరుగా చూడకలుగుతింది. ఇక ఆ యూనివర్సల్ మైండ్ ఇండివ్యూజువల్ మైండ్ గా మారిపోతుంది. దీంతో అందులో ఉన్నఇమిడి ఉన్న త్రికాల జ్నానం కనుమరుగై పోతుంది.

మళ్ళి ఆ త్రికాల జ్నానం మన కైవశం కావాలంటే మనం మనలోని ఈగోను త్యజించాలి. పసిపాపలా మారాలి. ఈ స్రుష్ఠిని తల్లిగా,భగవంతుడ్ని తండ్రిగా భావించే స్థితికి రావాలి. ఆ స్స్థితికి నేనొచ్చానో లేదో తెలీదు కాని నా లగ్న ప్రభావముతోనో ,లేక ఆ లజ్నాన ఉచ్చస్థితిలో ఉన్న గురువు కారణంగానో,నా తల్లి, తండ్రి చేసిన పూజా ఫలం కారణంగానో ,లేక 2000 సం.లోనుండి నేటిదాక కొనసాగిస్తున్న మాయా భీజ ద్యానం వలనో నాకీ విషయాలు స్ఫురించాయి.

ఇక చదవండి:

స్థూలంగా చూసినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు లక్ష్యాలు ఉన్నప్పటికి మన అందరివి ఒకటే లక్ష్యం అది గత పాప కర్మలను అనుభవించి తీర్చడం. జన్మ రాహిత్యాన్ని పొందడం. ప్రతి ఒక్క జాతకుడు గత జన్మలో తను చేసిన పాప కర్మలను అనుభవించి జన్మ రాహిత్యం పొందటానికి అనువైన జాతకంలోనే పుడుతున్నాడు. ఇది నా అనుభవం.

స్వార్థంతోగాని,అహంతో గాని మనమేదైన పని మొదలు పెడితే మన జాతకాల్లోని గ్రహాలు ఇట్టే పని చేస్తాయి. కాని నిస్వార్థంతో,అహంకార రాహిత్యంతో ,జన్మరాహిత్యమే,ముక్తియే లక్ష్యంగా పని మొదలు పెడితే మాత్రం గ్రహాలన్ని ప్రక్కకు వెళ్ళిపోతాయి.(అవి పని చెయ్యవని కాదు.పని చేస్తాయి.కాని సతరు లక్ష్యాన్ని ఆటంక పరచక మరో విదంగా తమ ప్రతాపాన్ని చూపుతాయి.

గమనిక: ఇవన్ని నా పరిశోధనా ఫలితాలు. ముందుగా నన్ను చెప్పనివ్వండి. ఆతరువాత మీ ప్రశ్నలకు సమాదానం ఖచ్చితంగా చెబుతా.

సాధారణంగా కష్ఠాలొచ్చి పడినప్పుడు ఎవరైనా “దేవుడా ! నన్నెందుకు ఈ జాతకంలో పుట్టించావు “అని నొచ్చుకుంటారు. కాని మనం గత జన్మలో ఈ శరీరాన్ని పోగొట్టుకుని ఆత్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ జన్మలోని మన స్మ్రుతులను నెముర వేసుకుంటూ ఏ ఏ విషయాలు మన ఆథ్యాత్మికాభివ్రుద్దికి అవరోధాలుగా నిలిచాయో లిస్ట్ అవుట్ చేసుకున్నాం. భగవంతునికి మనకు నడుమ అవరోధంగా ఉన్న విషయాలను లెక్కించి ఆ అవరోధాలు కల్పించని జాతకంలో పుట్టాలని ఆ గ్రహ స్థితికోసం వేచి ఉన్నాం.పుట్టాం. ఇది మనమె కోరుకున్న జన్మ. మనం కోరుకున్నప్పుడు మన లక్ష్యం ముక్తి. ఇప్పుడు మన జాతకాల గురించి విసుగ్గుంటున్న ఈ క్షణం మన లక్ష్యం లోకాయత జీవితం. అందుకె మనం స్వేచ్చతో ఎన్నుకున్న ఈ జన్మను దేవుడు మనపై రుద్దినట్టుగా అపార్థం చేసుకుంటాం.

మన జాతకంలోని ప్రతి గ్రహం ఈ ప్రాపంచిక జీవితం శాస్వతం కాదని, మనిషి జీవితం కేవలం నీటి బుడగ వంటిదని
ఉపదేశించటానికే ప్రయత్నిస్తుంది. కాని ఆ గ్రహాల మాటలు మనం పట్టించుకోం. తమాషా ఏమంటే మనం ఆథ్యాత్మిక జీవితం పై ద్రుష్ఠి నిలిపితే ప్రాపంచిక జీవితంలోను సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాని ప్రాపంచిక జీవితాం పై మక్కువతో వ్యవహరిస్తే మాత్రం అటు ఆథ్యాత్మికంగాను దిగజారుతాం,ఇటు ప్రాపంచికంగాను నాశనం అవుతాం.

శని కర్మ కారకుడు. మన జాతకంలో శని ఏ స్థానం ఉంటే ఆ భావ సంబంధ విషయాల పైనే మన మనస్సు మొగ్గు చూపుతుంది. ఆ విషయాలలోనే మనం తరచూ నష్ఠ పోతూ ఉంటాం. శని ప్రస్తుతం ఏ భావంలో ఉన్నాడో అందుకు క్రిందటి భావసంబంధ విష్యాల ద్వారే గత జన్మలో మన జీవితం ముగిసి ఉంటుంది.

ఉదాహరణకు నా జాతకంలో శని 9 న ఉన్నాడు. అంటె ఈ జన్మంతా నేను తండ్రి,తండ్రి ఆస్తి,దూర దేశాలు ,గురు,గురు ఉపదేశాలకై అలమటించాలని అర్థం. కాని కర్కాటక లగ్నంలో గురు ఉచ్చుడై ఉన్నందునో ఏమో తెలియదుకాని 1967న పుట్టిన నాకు 1994 కెల్లా తండ్రి చని పోయాడు. 1999 మార్చ్ కెల్లా ఆయన ఆస్తిలో భాగంగా వచ్చిన సొమ్మొంతా పోయింది. ఆస్తి విష్యంలో నైతే మొదట కాస్త ఓవర్ యాక్షన్ చేసినప్పటికి నీళ్ళొదిలేసాను. ఆస్తిలో భాగం అవలీలగానే వచ్చింది. ఇక మిగిలింది గురు ,గురు ఉపదేశం. ఓషో పుస్తకాలు నాకు దొరకడం వరకు ఈ విష్యమై కొంత వెతుకులాట ఉన్న మాట వాస్తవమే ! ఆ తరువాత ఏ గురువుతోను నాకు పనిలేక పోయింది. మిగిలింది దూర దేశాలు తిరగడం. ఎలాగో ఈ సెప్టెంబరు 9 కి శని లగ్నాత్ ౩ న వస్తున్నాడు. ఈ కాలంలో విదేశీ టూర్ ఒకటి కొట్టి వస్తే ఆ కర్మ తీరిపోతుందని నా అంచనా.

ఇక గత జన్మ:
ఈ జన్మలో 9 న ఉన్న శని గత జన్మలో 8న ఉన్నట్టు లెక్క . ఆంటె ఆ జన్మలో జైలు పాలై,రాళ్ళ దెబ్బలు తిని,అపనిందలు మోసి ఆత్మ హత్యన్నా చేసుకుని ఉండాలి. లేదా నీచులచే చంపించ బడన్నా ఉండాలి.కాని ఈ జన్మలో ఆ ముగింపు ఉండదు కాక ఉండదు. అయితే గత జన్మ స్మ్రుతులను తలపించే కొన్ని ట్రెయిలర్స్ వంటి సంఘఠనలు జరుగవచ్చు.

RTS Perm Link

కన్యా లగ్నం రాశి వారి లక్షణాలు
Feb 24th, 2009 by chittoor Murugeshan

వీరిది రాశి చక్రంలో 6 వ రశి కావడం చేత వీరు పుట్టగానే వీరి చుట్టు ఉన్నవారిలో ఒకరు రోగిష్టిగా,ఒకరు అప్పుల అప్పారావుగా,ఒకరు కోర్టు కేసులంటూ తిరిగే వరుగా తయారవుతారు. ఇదెందుకిలా జరుగుతుందంటే రేపు సతరు కన్యా రాశి/లగ్న జాతకులు వీరిలాగే తయారవ్వడానికి కావల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చెయ్యడానికే.

నాకు 1992 లో కూతురు పుట్టింది. ఆమెది కన్యాలగ్నం . నేను అప్పుల అప్పారావుగా,కోర్టు కేసులకు తిరుగువనిగా(అయితే చంద్రబాబు పై కోర్టుకెక్కినాను కాభట్టి నో ప్రాబ్లం) తయారయ్యాను, నా భార్య రోగిష్ఠిగా తయారైంది. ఇవన్ని చెప్పటం దేనికంటే చిరంజీవి ,పవన్ ఇద్దరిది కన్యా రాశియే. వారితో చేరేవారందరు కలహించుకుని ఉండాలి లేదా కలహించి భయిటకు రావల్సిందే.

పైగా చిరంజీవిది తులా లగ్నం, ఆ లగ్నమందే శని ఉచ్చుడయ్యాడు. దీంతో ఆయనతో చేరేవారంతా షెడ్ అయిపోతారు.

ఆ పార్టిలోని చివరి అక్షరం యం ఇది యమునికి సంబందించిన భీజం. కాబట్టే ఆ పార్టిని మరణపు చాయ కమ్ముకుంటూ ఉంటుంది.

చిరుతో పాటు తొలి ప్రెస్ మీట్ లో కూర్చుని మాట్లాడవలసిన అతను మరణించాడు .వారు శనికి పరిహారంగా వికలాంగుల పట్ల ఎంత సఖ్యత చూపినప్పటికి అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలతో వికలాంగులు ఆగ్రహించిన మాట గుర్తుకు తెచ్చుకొండి.

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa