SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
జ్యోతిషమ్యొక్క విశ్వసనీయతను నిరూపించేందుకు సహకరించండి
Jul 10th, 2009 by chittoor Murugeshan

మీ జాతకం పంపండి. (జాతకం లేకుంటే క్రింది సైట్స్లో డవున్లోడ్ చేసుకోవచ్చు. ) అందులోని గ్రహస్థితిని బట్టి ఐదు అంశాలను నేను తెలియ చేస్తాను. మీరు చెయ్యవలసిందంతా నేను గణించి తెలిపిన 5 అంశాల్లో ఏది ఎన్ని శాతం నిజానికి దగ్గరగా ఉందని చెప్పడమే
మీ జాతకాన్ని పంపవలసిన మెయిల్:
swamy7867@gmail.com
మీ జాతకాలను డవున్లోడ్ చేసుకునేందుకు ఉపకరించే సైట్స్:
www.scientificastrology.com
www.freehoro.com
www.astroloka.com

RTS Perm Link

మీ భవిష్యత్తు గురించిన ఒక ప్రశ్నకు సమాదానం ఉచితం
Jun 22nd, 2009 by chittoor Murugeshan

అవునండి. ఉత్తుత్తే జ్యోతిషం సైన్సు , నేను గొప్ప జ్యోతిష్కుడ్ని అని చెప్పుకోవడం కన్నా మీలో ఆసకతి గలారికి నా ప్రతిభను (ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పదనాన్ని) రుచి చూపాలనుకున్నాను. ఇందుకు మీరు చేయలవలసింది:

మీ జాతక చక్రం ఉంటే:
అందులోని గ్రహ స్థితిని, జన్మ దశలో నిల్వను తెలియ చెయ్యాలి
చక్రం లేకుంటే:
www.astroloka.com www.freehoro.com www.scientificastrology.com
వంటి సైట్స్ కెళ్ళి సైన్ అప్ చేసుకుని మీ జాతకం డవున్ లోడ్ చేసుకోవచ్చు

ఆ జాతకంలోని గ్రహస్థితి తో పాటు మీ ప్రశనను కమెంట్ రూపం లో పెట్టండి. 24 గంటల్లో మీ ఒక్క ప్రశ్నకు సమాదానం చెబుతాను

ఇక రెచ్చి పోండి !

RTS Perm Link

జ్యోతిష్యం నేర్చుకొండి – 2
May 27th, 2009 by chittoor Murugeshan


ప్రతిబిడ్డ ఈ భూమి మీదికి యూనివర్సల్ మైండ్ తో వస్తుంది. అంటే తనకు, తనవారికి, ఈ సమస్త సృష్టికి సంబంధించిన భూత, భవిష్యత్, వర్తమాన విశేషాలన్ని ఆబిడ్డ మస్తిష్కపు కణాల్లో దాగి ఉంటుంది. ఈ సృష్టి నుండి తనను వేరుగా చూడగలిగేంత వరకు ఈ యూనివర్సల్ మైండ్ కొనసాగుతుంది; ఎప్పుడైతే ఆ బిడ్డలోకి ఈగో ప్రవేశిస్తుందో ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ప్రవేశిస్తాయో అంతవరకు ఇది అలానే ఉంటుంది. కొన్ని సందర్బాల్లో కుటుంబ సభ్యులు ఊరెళ్లటానికి బయలు దేరినప్పుడు బిడ్డ మొండికేస్తాడు, రానంటాడు. సభ్యులు బలవంతంగా తీసుకెళ్తారు. జరగరానిదేదో జరుగుతుంది.

కొంత కాలము తరువాత అతను పెరిగి పెద్దవాడైన తరువాత ఈ కాలజ్ఞానం నశించి పోతుంది. ఏ చెట్టు క్రింది చిలక జ్యోతిష్కుడ్ని చూసినా తన భవిత తెలుసుకోవాలన్న కుత కుతలు మాత్రం పుడుతూ ఉంటుంది. ఇందుకు కారణం గతంలో తాను పొందియున్న కాలజ్ఞానం గురించిన స్మృతియే!

ముక్తి పొందటం అంటే మళ్లీ పసి పిల్లల్లా తయారు కావడమే .. అంటే ఈగోను పూర్తిగా త్యజించటమే. అప్పుడు కాలజ్ఞానం సంప్రాప్తిస్తుంది. అలా ఈగోను పూర్తిగా త్యజించి, ముక్తి పొందినవారే తాము పొందిన కాలజ్ఞానాన్ని ఇతరులు కూడ పొందాలనే నాటి రుషులు మహర్షులు జ్యోతిష్య శాస్త్రాన్ని సమకూర్చారు. నిజానికి భవిష్యత్తును తెలుసుకోవడానికి గ్రహస్థితిని, పంచాంగాలను ఆశ్రయించ వలసిన పని లేదు. అయితే స్వార్థం, అహంకారం, రాగద్వేషాలతో నిండిన బుర్రలకు భవిష్యత్ ఏ మాత్రం తటస్తించదు. అయినా మానవాళి సంక్షేమార్థం ఏదో కొంతగానన్నా కాలగతిని అంచనా వెయ్యడానికి గ్రహస్థితి ఉపకరిస్తుందన్న ఆలోచనతోనే జ్యోతిష్యగ్రంథాలు కూర్చబడినాయి. కాలజ్ఞానం అనేది లైవ్ టెలికాస్ట్ వంటిది; జ్యోతిష్యం అనేది ఎవరో ఒక విలేకరి తయారు చేసిన నోట్స్ వంటిది.

ఏది ఏమైనప్పటికి సాధారణ ప్రజానీకానికి (సాధన లేని వారికి) ఎంతో కొంత కాలజ్ఞానాన్ని అందించేది జ్యోతిష్యం ఒక్కటే. మన భారతదేశం వరకే చూద్దాం. నిమిషానికి నలుగురు బిడ్డలు పుడతారు. దాదాపుగా రెండుగంటలదాక ఒకే లగ్నం ఉంటుంది. అంటే ఒకటే జాతకమన్న మాట. రెండుగంటలకు 120 నిమిషాలు. నిమిషానికి నలుగురంటే 120 నిమిషాలకు 480 పిల్లలు ఒకే జాతకంలో పుడతారు. ఈ 480 పిల్లల భవిష్యత్తు ఒకేలా ఉంటుందా ? అలా ఉంటే మన దేశాన 480 మంది చిరంజీవిలు, 480 చంద్రబాబులు.. ఉండాలి. మరి వీరితో పాటే అదే జాతకంలో పుట్టిన 479 మంది ఇతరులు ఏమయ్యారు?

అంటే ఒకే జాతకంలో పుట్టినా గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో విదంగా ఫలితమిస్తాయా?

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa