SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కన్యలో శని మేషాది రాశులవారిని ఏంచేస్తాడు ? ఒక స్కాన్ !
Oct 12th, 2009 by chittoor Murugeshan

రాశి ఫలాలు వెలుబడని పత్రికలను వెబ్సైటులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. నిజానికి ఈ రాశిఫలాల్లోని లొసుగులు ఏమిటో ఈ టపాలో చూద్దాం. రాశి చక్రంలోని గ్రహస్థితి తద్వారా కలిగే యోగాలు,అవయోగాలను కారుగా భావిస్తే , జాతక ప్రకారం జరిగే దశా భుక్తులను రోడ్డుగా భావించవచ్చు. ఇక రాశిఫలాలంటారా ? ఆయిల్ అనొచ్చు. లేదా ముందుకు తోసే గాలి, లేదా ఎదురు గాలి అని చెప్పొచ్చు. అంతకు మించి రాశిఫలాలకు పెద్ద ప్రాధన్యత లేదు.

రాశిఫలాలను తాత్కాలిక గ్రహస్థితిని అనుసరించి గణిస్తారు. తాత్కాలికం అన్న పదాన్ని భాగా గమనించండి.గోచారంలో గ్రహస్థితి ఎంత తాత్కాలికమంటే చంద్రుడు ఒక రాశిలో రెండుంకాలు రోజులే ఉంటాడు .బుధ,శుక్ర,రవి గ్రహాలు నెలరోజులు, కుజ గ్రహం ఒకటిన్నర నెల మాత్రమే ఉంటారు. సరే రాశి ఫలాలు వ్రాసే వారు మేము ఈ గ్రహాలను ప్రక్కన పెట్టి సం.లు తరబడి ఒకే రాశిలో ఉండే గ్రహాలను పట్టే ఫలితాలు చెబుతామని వాదించవచ్చు. సరే ఆ గ్రహాల కథ ఇప్పుడు చూస్తాం.

గురు:

ఈ గ్రహం ఒక సం.పాటు ఒకే రాశిలో ఉంటుంది. ఇది స్థూల సత్యం. మరి కాస్త లోతుగా చూస్తే గురు ఒక రాశిలో తానుండే 12 నెలల కాలంలో మొదటి నాలుగు నెలలు,చివరి నాలుగు నెలలు గట్టి ఫలితాలను ఇవ్వడని శాస్త్రం చెబుతుంది. పోని ఇందులో (మద్య కాలంగా పేర్కొనే నాలుగు నెలల్లో )గురు వక్రి,గురు అస్తమనం వంటివి ఎంత కాలం ? ఆ కాలాన గురు ఆశించిన ఫలితాలను ఇవ్వడుగా ! ఇంకా ఒక రాశి అంటే 30 డిగిరీలు, 9పాదాలు. ఇందులో మూడు నక్షత్రాలుంటాయి. వాటిలో ఆ నక్షత్రాధిపతికి,గురువుకు పగ ఉంటే ? ఇలా ఎన్నో నిభందనలున్నాయి. అయినా గాని రాశి ఫలాల్లో గురువును బ్రహ్మాండంగా చూపిస్తారు. ఇక కొన్ని రాశులకు గురు పాపి అయ్యుంటాడు (ఉ.వ్రుషభమ్,మిథునం,కన్యా,తులా,మకరం,కుంభం ) వీరికి గురుగ్రహం తక్కినర ాశులకు ఇచ్చేట్లు ఒకే విదమైన ఫలితాలను ఇస్తాడా అన్నది ప్రశ్నార్థకమే !

అలాగే శని తన ద్వితీయ భాగంలోనే( 1 1/4 +1 1/4) ఫలితాలిస్తాడు, మేషం,కర్కాటకం,సింహం,వ్రుశ్వికం,దనస్సు,మీన రాశులవారికి పాపి, ఈయన కూడ వక్రిస్తాడు,అస్తమిస్తాడు . నిజమిలా ఉంటె రాశిఫలాలు ఏ మెరకు ఫలిస్తాయో ఆలోచించండి రాహు కేతువులైతే ద్వితీయ భాగాన ( 9+9 నెలలు) మాత్రమే ఫలితాలిస్తారు. ఇంకో రూల్ కూడ ఉంది ఈ చాయా గ్రహాలకు ఒరిజినాలిటి ఉండదు. తమతో మరే గ్రహమన్నా కలుస్తేనే ఫలితమిస్తారు. (ఆ గ్రహం మీకు శుభప్రధమై ఊండాలి/ఆ గ్రహానికి ఆ స్థానం శుభ ప్రదమైయుండాలి/కలిసిన గ్రహం సదరు రాహు,కేతువుల కలయక వలన నిర్వీర్యం కాకూడదు). కాబట్టే ఒక జ్యోతిష్కునిగా చెబుతున్నా రాశిఫలాలను అతిగా విశ్వసించకండి . వాటిని పట్టి ముఖ్య నిర్ణ్ర్ణయాలు తీసుకోకండి. దెబ్బ తింటారు.

శని భలం యొక్క ఆవశ్యకత:

నదుల అనుసంథానం, జలయగ్నం వంటి బౄహత్తర పథకల పట్ల ఆసక్తి కనబరచాలన్నా , రూపొందించాలన్నా , అమలు చెయ్యాలన్నా శని భలం ఎంతో ముఖ్యం.ఓర్పు,ఓపిక,త్యాగం,నిస్వార్థాలతో పూనుకుంటే కాని నదుల అనుసంథానం, జలయగ్నం వంటి పథకాలు అమలు కావు. మీలో శని గురించి ఉన్న అపోహాలను తొలగించటం, మీల్ నదుల అనుసంథానం, జలయగ్నం పట్ల ఆసక్తి రేఖెంతించటమే నా ఉద్దేశం.

శని పట్టుకుంటే 7.5 సం.లు పీడిస్తాడని అదని ఇదని ఎన్నో అపోహలు మీలో ఉన్నాయి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది . మన దివంగత సి.ఎం. డా.వై.ఎస్. పుట్టిన తేది 8 . ఇది శనికి చెందిన సంఖ్య. పైగా డా.వై.ఎస్. పుట్టిన తేది, నెల ,సం.లను కూడితే 38 వస్తుంది. (8/7/1949) 3 గురువుకు చెందిన సంఖ్య, 8 శనికి ఎందిన సంఖ్య. వ్యవసాయరంగానికి అధిపతి శనియే. అంతే కాదు చాలా ఆలస్యంగా ఫలితం ఇవ్వగల ఏ వ్యాపారం,రంగం,పని, ప్రయత్నాలకు శనియే అధిపతి. శని భలం ఉన్నవారే లాంగ్ టెర్మ్ ప్రోజెక్టుల్లో దిగుతారు, సాధిస్తారు. ఇతర్లు ఏవో చిన్నా , చితకా విషయాలకు పరిమితం అయిపోతారు. ఈ నేపద్యం శని భలం కలవారే నదుల అనుసంథానం, జలయగ్నం వంటి వాతి పై ఆసక్తి చూపుతారు.

శని భలం ఎవరికి ఉంటుంది ?:

డా.వై.ఎస్.లా 8 వతేది ,లేదా 17,26 తేదీలో పుట్టిన వారికి, శనికి సంభంధించిన పుష్యమి,అనురాధా,ఉత్తరాభాధ్రా నక్షత్రాల్లో పుట్టిన వారికి ప్రాధమికంగా శని భలం ఉన్నట్టే. అలాగే పుట్టిన తేది,నెల,సం. సంఖ్యలను కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 8 వచ్చినా శని భలం ఉన్నట్టే

శని భలం ఉన్నవారి లక్షణాలు:

అందం,అలంకరణ, డబ్బు, డాబు,దుబారాల పై దౄష్ఠి పెట్టరు. చాలా పొదుపుగా ఉంటారు( శని భలం లేని వారు దుబారా చేసి , దివాళా తీసి ఆ తరువాత పీనాసులుగా తయారవుతారు.వ్యవసాయం, గ్రనైట్స్,పరిశ్రమలు వీరిని మరింత ఆకర్షిస్తాయి. వీరు వ్ధి వ్రాతను విశ్వసిస్తారు. హస్త సాముద్రికంలో శని రేఖకు ఫేట్ లైన్ /విధి రేఖా అని కూడ ఒక పేరుంది. వీరి తీర్పులు నిర్మొహమాటంగా ఉంటాయి. సాధారణ సైనికునిగా చేరి కమేండరుగా, హోటల్ సర్వరు గా జీవితం ప్రారంభించి, ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా ఎదిగిన వారి జాతకంలో ఖచ్చితంగ శని భలం ఉండి తీరుతుంది. వీరు పై పై తళుకులకు లొంగరు. పర్పస్ సెర్వ్ కావడమే వీరికి ముఖ్యం. శని భలం ఉన్న జాతకులకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వారి శరమ ఫలితం కేవలం వౄద్దాప్యంలోనె అందుతుంది.

శని పట్టడానికి ముందు:

తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.

జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.

శని వీడి పోవడానికి ముందు:

పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును

శని గురించిన పరిచయం

చదవడానికి అసహ్యంగా ఉన్నా నిజం ఇది. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి నరాల బలహీనత వరకు వస్తుంది.

శని ఎవరిని పీడిస్తాడు:

శని మీ రాశికి 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలే. ఇతర రాశుల్లో సంచరిస్తేనే పీడిస్తాడు . ఈ రూల్ ప్రకారం సెప్టెంబరు26న సింహమునుండి, కన్యా రాశికి మారనున్న శని మేషం,కర్కాటకం,దనసు,వ్రుశ్చిక రాశుల వారికి అనుకూలం. తక్కిన రాశి వారిని పీడించనున్నాడు. శని ప్రభావం రకరకాలుగా ఉంటుంది. తానున్న స్థానాన్ని పట్టి రాశి ని పట్టి , తాను పొందిన ఆధిపత్యాన్ని పట్టి జనులను పీడిస్తాడు.

పరిహారం:

శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి .ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.

జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.

శని వీడి పోవడానికి ముందు:

పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును

ద్వాదశ రాశి వారికి శని స్థాన బ్రంస ఫలితాలు

1.మెషం:

మేష రాశి మితౄలారా !

రాశి చక్రంలో అంగ బలం, మనోబలం,ఉత్సుకతలను సూచించే మేష రాశి మిత్రులారా !

ఈ లోకంలో చురుగ్గా పని చేసి మరి చెడ్డ పేరు తెచ్చుకునే వారు మీరొకరే ! ఇందుకు కారణం లేక పోలేదు. రాశి చక్రంలో మీది మొదటి రాశి అయినందున. నేనంటే నేనేనని ముందుకు దూకుతారు. ఈ లోకం చాలా తెలివైంది మిమ్మల్ని ఇట్టే వాడేసుకుని మూలన పడేస్తుంది. అదీకాక మీ రాశి నాథుడు కుజుడు అయినందున మీలో శక్తి ఉబుకుతూ ఉంటుంది. మీరు ఊరికే ఉండలేరు. జీవితంలో పనిచెయ్యడం ఎంత ముఖ్యమో కొన్ని సమ్యాల్లో ఏమి చెయ్యకుండా ఉండటం కూడ అంతే ముఖ్యం. “పోదాం పోదాం పై పైకి” అన్నట్టు ఇంకా ఇంకా అంటూ పరుగులు తీస్తారు. మీరు కేవలం ఒక సైనికులు మాత్రమే. కేవలం మీకు ఒక కమేండరో , సలహాదారుడే ఉంటే గాని విజయం సంభవం. పొరభాటుగా విజయం లభించినా దాని ఫలితం మీకు అందక పోతుంది.

పోనిలెండి గతంలో బుద్ది,పుత్ర,పూర్వ పుణ్యస్థానమ్యందున్న శని సెప్.26న శత్రు,రోగ రుణస్థానానికి రావడం మంచి మలుపే. దీంతో గత 3 సం.లుగా ఉన్న అశాంతి,అవమానాలు,తప్పుడు ఆలోచనలు దూరమవుతాయి. పిల్లలు మీకు ఆకర్షితులవుతారు. మీకు న్యాయంగా లభించ వలసిన గుర్తింపు లభిస్తుంది. అదౄష్ఠం వరిస్తుంది. అలాగే గతంలో మీ అశాంతి వలన చెడిన మీ ఆరోగ్యం కుదట పడుతుంది. గతంలో ఎవరైతే మీ కంట నీళ్ళు తెప్పించారో వారి కంట నెత్తురు కారుతుంది. చూసి తరించండి. రుణాలు తీరుతాయి. మీకు రావల్సినవి వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమవుతాయి. అయితే ఈ రెండున్నర సం.కాలంలో ” నేను అనుకున్నదే కరెక్ట్. ప్రతి ఒక్కరు నా మాటే వినాలి. ఎవరు నన్ను ప్రశ్నించ కూడదనే తత్వం మీలో పెరుగుతుంది. ఇతరులను నిర్లక్ష్యం చేసే గుణం కూడ వస్తుంది. దీంతో మీరు జన భాహుళ్యానికి దూరమయ్యే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్త.

శని మీకు 10, 11 స్థానాలకు అధిపతి కాబట్టి వౄత్తి,వ్యాపారాలు నిమిత్తం కొంత మెరకు అప్పు చెయ్యవలసి వస్తుంది. పోటి ఉంటుంది. పని వత్తిడి పెరుగ వచ్చు. అలాగే మీకు అక్క,అన్నలతో (ఎవరన్న ఉంటే) ఒక వ్యవహారం వస్తుంది. అయినా మీదే అంతిమ విజయం. పైగా మీ లాభం కొంత వివాదాలతోనే మీ గల్లా పెట్టెకు చేరుతుంది.

2.వ్రుషభ రాశి:

వ్రుషభ రాశి మిత్రులారా !

రాశి చక్రంలో దనం, వాక్కు,కుటుంభం నేత్ర స్థానాలను సూచించే సౄషభ రాశి మితౄలారా !

మీకు డబ్బంటే ఎంతో గౌరవం. మీ స్నేహాలకు, శతౄత్వాలకు డబ్బే కారణమై ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న తత్వం మీలో ఉంటుంది. దానిని పరుల వద్దనుండి కూడ ఎదురుచూడటంతో కొన్ని సమస్యలొస్తాయి. అలాగే పిచ్చా పాటి కబుర్లన్నా ఇష్టమే.వికట వినోద పరిహాస ప్రసంగ ప్రియులు. మీరు ఏమాత్రం ప్రయత్నించ కున్నా మంచి సర్కిల్ ఏర్పడుతుంది. మీకు కుటుంభ వ్యవస్థంటే ఎంతో ప్రీతి. అయితే విధి వ్రాత వక్రించినప్పుడు మీరు ప్రాణ సమానంగా భావించేవే దూరమై మిమ్మల్ని క్షోభ పెడ్తాయి. ఇక శని మహాత్ముని గురించి ఆలోచిస్తే ఈయన మీకు 9,10వ స్థానాలకు అధిపతి. అంటే మీకు ఆస్తి, పొదుపు,దూరప్రాయణాల ద్వారా లాభం కల్పించవలసింది శనియే. అలాగే మీకు వౄత్తి వ్యాపారాలు కల్పించవలసింది ఈయనే. అందుకేనేమో పై విష్యాల్లో కాస్త ఆలస్యం తప్పని సరి, ఇతరుల మనస్సులను నొప్పించి గాని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని దుస్థితి. ఇట్టి శని మీకు గతంలో 4 న ఉన్నాడు. తల్లి ,ఇల్లు,విద్యా వాహణాదుల విషయంలో క్షోభ పెట్టిన శని ఈ విడత 5కు రావడం ఒక విదంగా మేలే. 9 అంటే ఆస్తి, ఐదు అంటే అద్రుష్ఠం. పిల్లల విష్యంలో ఇది కొంత రివర్స్ గేర్ వేసినా ఆస్తి,ఆదాయం,అదౄష్ఠం విషయాల్లో మంచే చేస్తుంది. అలాగే చేసే వౄత్తి,వ్యాపారాల్లోను అదౄష్ఠం వరిస్తుంది. అయితే అవి చేతికి మట్టి,జిడ్డు పుయ్యించేవిగా ఉండవచ్చును. అలాగే దుర్వాసన, నలుపు రంగు గల వస్తువులు కూడ లాభిస్తాయి

3.మిథున రాశి

రాశి చక్రంలో సోదరులు,సాహసం,ప్రయాణాలను సూచించే మూడవ రాశియగు మిథున రాశి మితౄలారా !

మీ జీవితంలో పై తెలిపిన సోదరులు,సాహసం,ప్రయాణాలు సంగీతాలకు ముఖ్య స్థానం ఉంటుంది. అలాగే స్త్రీ పురుషులు కలిసి ఉన్న మీ రాశి సింబల్ చూడండి. మైథునం (సెక్స్) అన్న పదం నుండి రూపొందిన మిథునం అన్న మీ రాశి పేరు చూడండి. మీ జీవితంలో కొత్త మలుపులకు సెక్స్ పై ఆసక్తి లేదా విరక్తియే కారణమై ఉంటుంది. ఇక సెప్టంబరు 26 అందాక మూడున ఉన్న శని 4 కు రావడం వలన ఇంతకాలం (గత 3 సం.) మీకు లొంగి ఉన్న సోదర వర్గం మీ పై తిరుగుబాతు చేయ వచ్చు. మీలో దైర్యం తగ్గి భయం పుట్టొచ్చు. అలాగే ప్రయాణాల వలన కొంత ఇబ్బంది కలుగ వచ్చును. శని 4 నకు రావడం వలన తల్లి,ఇల్లు,వాహనం, తల్లి తరపు భంధువులు,విద్యా వైగైరాల్లో కష్ఠ నష్ఠాలు ఆశా భంగాలు తప్పక పోవచ్చు. మరి శని మహాత్మునికి అష్ఠమాధిపత్యం కూడ ఉండడం వలన తల్లికి గండం వంటిది కూడ కలుగ వచ్చును. విద్యా భంగం, స్థాన చలన, స్నేహితులతో శతౄత్వం కలుగ వచ్చును. అయితే శనికి నవమాధిపథ్యం కూడ ఉన్నందున పితురార్జితాన్ని వెచ్చించి గౄహ నిర్మాణం,ఇంతి మరమ్మత్తులు చేపట్ట వచ్చును. విద్యా భుద్దులతో అదౄష్ఠం కలిసొచ్చి దూర దేశాల్లో ఉధ్యోగం లభించే అవకాశం ఉంది. తల్లి తరపు భంధువుల సహకారం కూడ కాస్త లభించ వచ్చును

4.కర్కాటకం

జాతక చక్రంలో తల్లి ఇల్లు,వాహణం,హౄదయం విద్యలను సూచించే కర్కాటక రాశి, మితౄలారా !

మీకు తల్లి తో హేట్ అండ్ లవ్ రిలేషన్ ఉంటుంది. ఇల్లనేది సుదూర కలగా ఉంటుంది. వాహన విషయంలోను అసంతౄప్తి తప్పదు. మీరు మెదడుతో కన్న హౄదయంతోనే ఆలోచిస్తారు. చంద్రుడు,నది,సముద్రం,నీరు,దర్పణం(మిర్రర్) వీటికున్న ప్లస్ పాయింట్స్ తో పాటు , మైనస్ పాయింట్స్ కూడ మీలో మెండుగా ఉంటాయి. గతంలో మీకు దన,వాక్కు,కుటుంభ స్థానమగు రెండున ఉన్న శని అంగట్లో అన్నీ ఉంది,అల్లుడి నోట శని ఉంది అన్న చందాన వేదించింది. లావా దేవీల్లో జాప్యం, మీకే తెలియ కుండ మీ మాటలు నిష్ఠూరంగా రావడం, మాట నిలుపుకోలేక పోవడం,నిజం చెబితే అబద్దంగా, తమాషాకు చెబితే అది నిజంగా అవుతూ మిమ్మల్ని చిక్కులో పడేసింది. కుటుంబంతో సంబంధాలుకూడ అంతంత మాత్రమే. శని ధన భావం నుండి తొలగడం వలన పై తెలిపిన అశుభాలన్ని తొలుగుతాయి. మూడున రావడం వలన మనోధర్యం హెచ్చడం, సోదర సోదరీ మణుల స్సహకారం, ప్రయాణాలవలన మేలు జరుగుతాయి. శని మీ రాశికి 7,8 స్థానాలకు అధిపతియై ఉండి మూడున రావడం చేత తో భుట్టువుల్లో ఒకరికి తీరని నష్ఠం కలుగును. ప్రయణాల్లో చిన్న పాటి ప్రమాదాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామికి ప్రయాణాల వలన వత్తిడి కలుగ వచ్చును.

5.సింహ రాశి

రాశి చక్రంలో ఐదవ రాశి అయ్యి భుద్ది,పుత్రులు,పేరు ప్రఖ్యతలనుసూచించే సిమ్హ రాసి మితౄలారా !

తొలూత మీ తెలివి తేటలు ప్రక్కదోవ పట్టినా అనుభవంతో మీబుద్ది కుశలతలు వికశిస్తాయి. ఒకటి, రెండు సంతానాలకు మించి కలుగదు. తొలూత అవమానాలే ఎదురైనా పేరు ప్రఖ్యతలు తప్ప వరిస్తాయి,. మీలో స్త్రీలు వేరే విదంగా ఉండొచ్చు గాని పురుషులు మాత్రం సోమరులుగా,శుచి శుభ్రత లేని వారిగా ఉంటారు. పైగా గతంలో మీ రాశియందే సంచరించిన శని పై దురలవాట్లను మరింత పెంచి ఉంటాడు. అంతే కాక ముఖాన జిడ్డు కారడం,తల వెంట్రుకలువ్రలడం, తెల్ల వెంట్రుకలు రావడం ,మలబద్దకం వంటి సమస్యలు వచ్చి ఉంటాయి. నీచ స్త్రీ సహవాశం, జీవిత భాగస్వామితో పేచీలు సంభవమే. సెప్టెంబరు 26 న శని 2 కు రావడం ఖచ్చితంగా శుభ పరిమాణమే. పై తెలిపిన రుగ్మతలు క్రఏణా తొలుగుతాయి. అయితే వౄధా ఖర్చులునిష్ఠూరపు మాటలు, లావా దేవీల్లో ఆలశ్యం తలెత్తుతాయి. మాట నిలుపుకో లేక పోతారు. కుటుంభ సభ్యుల ప్రవర్తన మీకు, మీ ప్రవర్తన కుటుంభ సభ్యులకు చికాకు కలిగిస్తాయి. కొందరికి గొంతు,నోరు, నేత్రం సంభంధ రోగాలు రావచ్చు. తస్మాన్ జాగ్రత్త.

మీకు శని 6,7 స్థానాలకు అధిపతి కావున అప్పు చేయవలసి రావడం, లావా దేవీల ద్వార తగువలు సంభవం. వైద్య ఖర్చులు తప్పవేమో. అయితే భార్యా మూలక దనప్రాప్తికి అవకాశం ఉంది. అయితే అది ఒక మరణం ద్వారా, లేదా తగువ ద్వారా జరుగ వచ్చును .

6.కన్యా రాశి

రాశి చక్రంలో శతౄ,రోగం,రుణాలను సూచించే 6 వ రాశియగు కన్యా రాశి యందు జన్మించిన మిత్రులారా !

దీంతో మీరు పుట్టి పెరుగుతున్న కొద్ది మీ చుట్టు ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా,ఒకరు అప్పుల అప్పారావుగా, ఒకరు కోర్టు కేసులకు తిరిగే వారుగా తయారవుతారు. మీరు ఏ పనికి పూనుకున్నా అది తగరాళ్ళతో,వాయిదాలతోనే పూర్తి అగును. మీ రాశికి ఎంత మంచి యోగం పట్టినప్పటికి కొంత మెరకన్న శత్రు,రోగ ,రుణ బాధలను అనుభవిస్తూనే ఉంటారుఇందాక మీకు 12 వ రాశిన ఉండి పలు విదాలుగా నష్ఠాలు చే కూర్చిన శని మహాత్ముడు ఈ సెప్. 26 న మీ రాశికే వచ్చి తిష్ఠ వేసి మీ ఆరోగ్యం, బుద్ది కుశలతను సైతం దెబ్బ తీయనున్నాడు. గతంలో శని 12 న ఉండగా మీకు బుద్ది నాశం, అపఖ్యాతి,అవమానాలు వంటి అశుభ ఫలాలిచ్చినప్పటికి రుణాల వసూళ్ళు, అప్పులు తీర్చతం, శతౄవులు కనుమరుగవడం వంటి మంచి పనులు కూడ చేసాడు శని. కాని ప్రస్తుతం మీ జన్మ రాశిలోకి రానున్న శని అనారోగ్యం( నరాలు,పైల్స్,కాలు సంబంధ) మంద బుద్ది, అకాల భోజనం, అకాల నిద్ర, ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు రాలడం వంటి దుష్ఫలితాలను ఇవ్వనున్నాడు. అలాగే శని 7 వస్థానమును వీక్షించుట వలన ఇవే రుగ్మతలు మీ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను కూడ బాధించవచ్చు. వారితో తగువలు రావచ్చును.

7.తులా రాశి

రాశి చక్రంలో ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను సూచించే 7వ రాశియగు తులా రాశిలో జన్మించిన మితౄలారా !

పై త్లిపిన వారు మీ జీవితాన్ని అత్యధికంగా ప్రభావిస్తుంటారు. గతంలో 11 న ఉన్న శని తాను 4,5 స్థానాలకు అధిపతి కావున తల్లి,ఇల్లు,వాహణం, సాంకేతిక విద్య వగైరాల్లో మేలే చేసాడు. బుద్ది కుశలతతో, అదౄష్ఠంతో కొన్ని పనులను చేసుకో కలిగారు. ఈ నేపథ్యంలో అట్టి శని 12 కు చేరడం పై విషయాలకు ఆటంకమగును. తల్లికి అనారోగ్యం, ఆమెతో విభేదాలు, స్థాన చలనం, చిన్నపాటి వాహన ప్రమాదం, విద్యలో ఆటంకం వంటివి జరుగ వచ్చును.అలాగే దనార్జనలో మీ ఎత్తులు పారక పోవడం, అదౄష్ఠం కలిసి రాక పోవడం,పిల్లల అఋఓగ్య సమస్యలు,వారి స్వతంత్ర ప్రవౄత్తి మిమ్మల్ని అతిగా ఆలోచింప చేస్తాయి. మీ పిల్లలు విద్య,ఉధ్యోగం,వివాహం తదితర కారణాల వలన మీకు దూరమైతే పై చెడు ఫలితాలు తగ్గుతాయి.

8.వౄశ్చిక రాశి:

రాశి చక్రంలో ప్రమాదాలు, జైలు పాలు,మానసిక క్షోభలు, నిస్సహాయత,అపఖ్యాతిలను సూచించే 8 వ రాశియగు వౄశ్చిక రాశియందు జన్మించిన మిత్రులారా!

మీరు సదా అసంతౄప్తిలోనే ఉంటారు. ఇందులో వాస్తవికతకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రజాధరణకు నోచుకోని రాశి మీది. సాహసాలకు వెనుకాడరు. రక్తం,మంట సంబంధ రోగాలు వెంటాడుతాయి. విద్యుత్,అగ్ని వలన కూడ ప్రమాదం వాటిల్లును. మరి సెప్.26 దాక మీకు జీవన స్థానమగు సిమ్హమున ఉన్న శని 11కు (కన్యకు) రావడం మేలే. గతంలో 10 వ భావంలో ఉంటూ పనుల వాయిదా,సేవకులవలన నష్ఠాలు, వౄత్తి,వ్యాపారాల్లో మాంధ్యం వంటి దుష్ఫలితాలను ఇచ్చిన శని 11కు రావడం శుభ పరిణామమే ! శని మీకు 3,4 స్థానాలకు అధిపతి కావున సోదర లాభం, మనో ధైర్యం,ప్రయాణాల వలన మేలు, కార్య జయం, సంగీతాసక్తి, కల్పించనున్నాడు. అలాగే తల్లి,ఇల్లు,వాహణం,(సాంకేతిక) విద్య వగైరాల్లోను కాస్త ఆలశ్యంగానన్నా శుభఫలితమే ఎదురగును.

9.దనస్సు:

రాశి చక్రంలో తండ్రి,తండ్రి తరపు భంధువులు,గురువులు, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు, పొదుపు ,ఆస్తులను ,ఆస్తి వివాదాలను సూచించే దనస్సు రాశియందు జన్మించిన మితౄలారా !

పై త్లిపిన అంశాలు మీ జీవితాన్ని మరీ ఎక్కువగా ప్రభావిస్తాయి. గతంలో 2,3 భావాలకు అధిపతియై 9 న ఉన్న శని నిష్ఠూర వాక్కు,కుటుంభ కలహాలు,లావా దేవీల్లో చిక్కులు కలిగించాదు. అలాగే సోదరులు,ప్రయాణాలు, మనో భీతి/ధైర్యం వలన ఆస్తి వ్యవహారాల్లో కొంత ప్రతిష్ఠంభన కల్గించాడు. దాంతో మీ దనం డంప్ అయ్యి ఉంటుంది. అయితే శని సెప్.26 న 10 నకు రావడం మంచిదే. అయితే తగులుకు పోయిన పైకాలు వసూలైనట్టే వసూలై సేవకులు, నీచ కులస్తులు,వికలాంగుల కారణంగా నష్ఠమయ్యే అవకాశం కూడ లేక పోలేదు. ఇన్నాళ్ళు కాళిగా ఉన్నవారు కొత్త వౄత్తి వయాపారాలు ప్రారంభిస్తారు. ఇదివరకే వ్యాపారం చేస్తున్నవారు మరింత పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. ఇదివరకే ఉధ్యోగులై ఉన్నవారికి పని వత్తిడి పెరుగును.

10.మకరం:

రాశి చక్రంలో వౄత్తి వ్యాపారాలను సూచించే 10 వ రాశియందు పుట్టిన మకర రాసి మితౄలారా !

భగవద్గీతలో శృఈ కౄష్ణుడు చెప్పిన కర్మయోగం మీ రాశివారికి ఇట్టే సరిపోతుంది. మీ కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో కూడ ఆలోచించి,ఆరా దీసే తీరిక లేక పని పని పని అంటూ పనిలో నిమగ్నమై పోతారు.గతంలో 1,2 కు అధిపతి అయిన శని 8 న ఉంటూ మీ శరీరం, మనస్సు,బుద్ది,ఆత్మలను సైతం క్షోభిబింప చేసాడు. అయినవారికి సైతం కాని వారై అపనిందలు మోస్తూనే వచ్చారు. ఈ నేపద్యంలో శని 9 కి రావడం ఖచ్చితంగా మేలే. సముద్ర గర్భంలోకి మునిగి పోయేవాడ్ని ఒక కెరతం వచ్చి ఒడ్డున పడేసినట్టుంటుంది. అలా ఒడ్డునపడినవాడు వెంటనే పి.టి.ఉషాలా పరుగులు తీయలేడేమో గాని భయిట పడినట్లేగా ? గతంలో మీకు కాకుండా పోయినవి కనీశం మీ ఇంటి దారి పడ్తాయి.అపవాదులు తొలుగుతాయి. కాని నగదు,ఆస్తి డంప్ కావచ్చు. అలా డంప్ అయితే రెండున్నర సం.లకు చేతికి అందక పోవచ్చు. టేక్ కేర్ ! పడమర వైపుగా ఒక ప్రయాణం చేస్తారు. అది నరకమనిపించినా దాని ఫలితం ఖచ్చితంగా కాస్త ఆలస్యంగానన్నా మీకు అందుతుంది.

11.కుంభం:

రాశి చక్రంలో 11 వ రాశియై,లాభాన్ని,అన్నయ్య,అక్కయ్యలను సూచించే కుంభరాశియందు జన్మించిన మితౄలారా !

మీ జీవితం పై మీ అన్నయ్య,అక్కయ్యల ప్రభావం మెండు. ప్రతి విషయంలో నాకేంటి లాభమని ఆలోచించే లాభాపేక్షతో కార్యోన్ముఖులు కావడం మీ నైజం. అయితే లాభ నష్ఠాలు దైవాదీనాలు కదా !

గతంలో 7 న ఉంటూ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ విషయాల్లో బెడిసి కొట్టిన శని సెప్.26 న 8 కి రానున్నాడు. దీంతో ఆయన వారికి దూరమై ఏకాకి అయ్యి, అపనిందలు మోసే ప్రమాదం ఉంది. శని కారకత్వం వహించే విషయాల్లో నష్ఠాన్ని చవి చూడ వలసి వస్తుంది. పోలీసు స్టేషన్,కోర్టు,ఆసుపత్రి,వల్లకాటికి వెళ్ళవలసి రావచ్చు. శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి దర్శించడి. నలుపు రంగును వారించి బ్లూ కలర్ ఎక్కువగా వాడండి. ఏ విషయంలోను ముందు పడక నలుగురిలో నారాయణా అంటూ కాలం గడపండి. రిస్కైన పనులు మానండి

12.మీనం:

రాశి చక్రంలో ఖర్చులు,నిద్ర,రతి (సెక్స్)లను సూచించే పన్నెండవ రాశియగు మీన రాశియందు పుట్టిన మితౄలారా !

రాశి చక్రంలో కైవల్యాన్ని సూచించే మీన రాశిలో జన్మించిన మీకు తొలూత ప్రాపంచిక విషయల్లో ఎనలేని ఆసక్తి కలిగి ఉన్నప్పటికి క్రమేణా ఆథ్యాత్మిక జీవితం వైపుగా మళ్ళి పోతారు. 2007 ఆగస్ట్ 7 నుండి అంతకు పూర్వం మీ కంట కన్నీరు తెప్పించిన వారి కంట నెత్తురు తెప్పించే అవకాశం మీకొచ్చింది. సెప్టంబరు 26 దాటాక ఈ స్థితి మారనుంది. సెప్ట్.26 తరువాత మాత్రం 7 న వచ్చే శని శతౄ బాధ,రోగ బాధ, రుణ బాధలను పునరావౄతం చేసే అవకాశం ఉంది.అందుకు ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లలో ఒకరో ఇద్దరో కారకులు కావచ్చు. అలాగే 7న ఉన్న శని మీ జన్మ రాశిని చూడతం వలన కాలు, గుదము,నరాలు సంబంధ రోగాలు కలుగ వచ్చును శుచి,శుభ్రతలు కనుమరుగవుతాయి. జాద్యం, మంధత్వం, అకాల భోజనం,అకాల నిద్రా అభివ్రుద్దికి ఆటంకం కల్గించ వచ్చు

arcot sweets

RTS Perm Link

శని వీడి పోవడానికి ముందు:
Sep 23rd, 2009 by chittoor Murugeshan

శని పట్టడానికి ముందు:
తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును

RTS Perm Link

మేష రాశి మిత్రులారా !
Sep 15th, 2009 by chittoor Murugeshan

ఈ లోకంలో చురుగ్గా పని చేసి మరి చెడ్డ పేరు తెచ్చుకునే వారు మీరొకరే ! ఇందుకు కారణం లేక పోలేదు. రాశి చక్రంలో మీది మొదటి రాశి అయినందున. నేనంటే నేనేనని ముందుకు దూకుతారు. ఈ లోకం చాలా తెలివైంది మిమ్మల్ని ఇట్టే వాడేసుకుని మూలన పడేస్తుంది. అదీకాక మీ రాశి నాథుడు కుజుడు అయినందున మీలో శక్తి ఉబుకుతూ ఉంటుంది. మీరు ఊరికే ఉండలేరు. జీవితంలో పనిచెయ్యడం ఎంత ముఖ్యమో కొన్ని సమ్యాల్లో ఏమి చెయ్యకుండా ఉండటం కూడ అంతే ముఖ్యం. “పోదాం పోదాం పై పైకి” అన్నట్టు ఇంకా ఇంకా అంటూ పరుగులు తీస్తారు. మీరు కేవలం ఒక సైనికులు మాత్రమే. కేవలం మీకు ఒక కమేండరో , సలహాదారుడే ఉంటే గాని విజయం సంభవం. పొరభాటుగా విజయం లభించినా దాని ఫలితం మీకు అందక పోతుంది.

పోనిలెండి గతంలో బుద్ది,పుత్ర,పూర్వ పుణ్యస్థానమ్యందున్న శని సెప్.26న శత్రు,రోగ రుణస్థానానికి రావడం మంచి మలుపే. దీంతో గత 3 సం.లుగా ఉన్న అశాంతి,అవమానాలు,తప్పుడు ఆలోచనలు దూరమవుతాయి. పిల్లలు మీకు ఆకర్షితులవుతారు. మీకు న్యాయంగా లభించ వలసిన గుర్తింపు లభిస్తుంది. అదౄష్ఠం వరిస్తుంది. అలాగే గతంలో మీ అశాంతి వలన చెడిన మీ ఆరోగ్యం కుదట పడుతుంది. గతంలో ఎవరైతే మీ కంట నీళ్ళు తెప్పించారో వారి కంట నెత్తురు కారుతుంది. చూసి తరించండి. రుణాలు తీరుతాయి. మీకు రావల్సినవి వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమవుతాయి. అయితే ఈ రెండున్నర సం.కాలంలో ” నేను అనుకున్నదే కరెక్ట్. ప్రతి ఒక్కరు నా మాటే వినాలి. ఎవరు నన్ను ప్రశ్నించ కూడదనే తత్వం మీలో పెరుగుతుంది. ఇతరులను నిర్లక్ష్యం చేసే గుణం కూడ వస్తుంది. దీంతో మీరు జన భాహుళ్యానికి దూరమయ్యే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్త.

శని మీకు 10, 11 స్థానాలకు అధిపతి కాబట్టి వౄత్తి,వ్యాపారాలు నిమిత్తం కొంత మెరకు అప్పు చెయ్యవలసి వస్తుంది. పోటి ఉంటుంది. పని వత్తిడి పెరుగ వచ్చు. అలాగే మీకు అక్క,అన్నలతో (ఎవరన్న ఉంటే) ఒక వ్యవహారం వస్తుంది. అయినా మీదే అంతిమ విజయం. పైగా మీ లాభం కొంత వివాదాలతోనే మీ గల్లా పెట్టెకు చేరుతుంది.

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa