SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
నా వ్రాతల్లో బూతుందా ?
Dec 12th, 2009 by chittoor Murugeshan

అదేమి పెంటో తెలీదు కాని. .. కూడలి వారికి ఇదే బావతై పోయింది మీ వ్రాతల్లో బూతుంది బ్యేన్ చేస్తున్నామని మెయిల్ పంపడం. కొంత కాలానికి మళ్ళి పునరుద్దరించటం. ఇంతకీ మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే శవాలు చేస్తున్నా..
మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో తెలుస్తుంది. ఈ సంస్థ సృష్ఠికి మూలం సెక్స్. అసలు ఈ భూమి పై ఇంత అభివృద్ది జరగడానికి కారణం సెక్స్. రోడ్లెందుకేసారు ? ఇళ్ళెందుకు కట్టారు కూర్చుని భజనలు చేసుకునేందుకా .

ఈ భూ ప్రపంచం పై ఏ కార్యక్రమం జరిగినా దాని వెనుకున్న ప్రేరణలు రెండే ఒకటి చావడం రెండు చంపడం. ఈ రెండు పనులు సెక్సులో సుసాధ్యం. ఎవరికి ఏ హాని జరగ కుండా ఆ చంపే,చచ్చే కోరికలు అర గంటలో నెరవేరి పోతాయి. మానవుడు ఎటువంటి సైకో కాంప్లెక్స్లకు గురి కాకుండా రక్షించ పడతాడు. అసలు మనిషిలో ఉన్న పవర్ ఒకటే అది సెక్స్ పవర్. దానిని ప్రకృతి ఇచ్చింది సంతానాభివృద్ది కోసం. సంతానం పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి అందుకే క్యేండోం కనుగొన్నారుగా. రోగాలు రావు . గర్భ ధారణా జరగదు. ఇంకెందుకు ఈ గగ్గోలు.
ఇంకెన్నాళ్ళకీ హిప్పాక్రసి. అనగ త్రొక్కపడిన సెక్స్ కోరికలతో పదవులు,డబ్బు, భూముల వెనుక పరుగులు తీస్తూ హింసకు పాలపడుతూ.. షిట్. సినిమాలో హీరోయిన్ పైట జారితే సెన్సార్ అధికార్లు కట్ కట్ అనే వారు. ఈ రోజు ఇంటర్నెట్లో ఎటువంటి శ్రమా లేక పచ్చి భూతు ఫిలింస్ చూస్తున్నారు. ఎవరు ? 11 నుండి 60 సం.ల వయస్కులుదాక. అలాంటి చూడ కుండా చెయ్యగలరా? చూసాక వారు ఊరికే ఉంటారా ? వారిని చట్టం కనిపెడుతూనే ఉండడం సాధ్యమేనా ?

RTS Perm Link

తెలంగాణను వ్యతిరేకిస్తూ 96 ఎం.ఎల్.ఏ లు,3 ఎం.పిలు రాజినామా
Dec 10th, 2009 by chittoor Murugeshan

soniya కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని, వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.

ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ ఎన్నికల సందర్భాంగానే నా బ్లాగులో స్పష్ఠంగా చెప్పాను. కే.సి.ఆర్ భూతం కాడని, బాటిల్లో భూతమని. టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నాటినుండి ఎలక్షన్ టు ఎలక్షన్ తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చిన తి.ఆర్.ఎస్ లో కే.సి.ఆర్ అతని కుటుంభ సభ్యులు తప్ప మరెవ్వరూ లేని స్థితి వచ్చింది

మార్కెట్ పోగొట్టుకున్న హీరో ఏ.ఆర్ రహ్మాన్ కాల్షీట్ పట్టుకున్నట్టుగా కే.సి.ఆర్ దీక్ష చేపట్టాడు. నాల్రోజులు చెయ్యించి ఉంటే ఆయనగారికి ఆయనే నిమ్మరసం తాగి ఇంటికెళ్ళి క్వార్టర్ కొట్టి పనుకొనే వాడు. వై.ఎస్. ఉన్నంత కాలం చెప్పు క్రింద తేలులా ఉన్న కే.సి.ఆర్ రోశయ్య వాలకం చూసి తోక విప్పాడు నిప్పు పెట్టాడు. కాగితంలోని పులి బొమ్మ చూసి జడుచుకున్నట్టుగా సోన్మియా చిదంబరం చేత ప్రకటన చెయ్యించారు. ఆ ప్రకటన వెలుబడకున్నా కే.సి.ఆర్ దీక్ష విరమించే వాడే.

ఆ దిశగా నింస్ హాస్పిటల్ లో టి.ఆర్.ఎస్ పార్టి పొలిట్ బ్యూరో సమావేశం కూడ ఏర్పాటైంది. అసలు కాంగ్రెస్ పార్టి చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుసు అది ఉత్త ఉసిరికాయల బస్తా. ఆ బస్తా ముడి గట్టిదైతే గాని ఏ కాయ బస్తాలో ఉండదు. కాంగ్రెస్ అదిష్ఠానం తీరే ఇంత. అవసరానికి మించి నాంచడం. లేదా తొందర పాటు నిర్ణయం తీసుకోవడం. ప్రతిభగల వారికన్నా చంచా గాళ్ళను నమ్ముకోవడం. వై.ఎస్. అయితే ఇటు ప్రతిభావంతుడైనప్పటికి విధేయత ప్రదర్శిస్తూ వచ్చాడు.

రోశయ్యలాంటి వారు బాత్ రూం పోవాలన్నా అదిష్ఠానం అనుమతి కోరే వారు. ఇక్కడ తెలంగాణా కాలుతుంటే అంతా అదిష్ఠానం చూసుకుంటుందన్నాడు. విలేకర్లు ఎం.ఎల్.ఏ ల రాజినామా గురించి అడిగితే నాకు తెలియదన్న ఘనుడు ఈయన. లౌఖ్యం ఉండొచ్చుగాని అది మరీ మితి మీరితే ఇలానే ఏడుస్తుంది

అటు ఎన్.టి.ఆర్ గాని ఇటు వై.ఎస్. గాని సమైఖ్యాంద్ర ప్రదేశే దేయంగా ఉన్నవారు. తెలంగాణొస్తే ఏమౌతుంది ? కొత్తగా మరో సి.ఎం, మరో క్యేబినెట్, మరో శచివాలయం ప్రజాదనానికి బొక్క అంతేగా
అసలు కే.సి.ఆర్ది ఒక దీక్షేనా ? సెలైన్ అంటే ఏమి ? అది ఫుద్ కాదా. రోజుకి మూడు పూట్ల సెలైన్ ఎక్కించుకుని దీక్షంటూ కథ నడిపితే సోనియా మేడం విరేచణాలయ్యి చిదంబరం చేత ప్రకటణ చెయ్యించింది. అసలు కే.సి.ఆర్ మీద 420 సెక్షన్ క్రింద కేసు పెట్టించాల్సింది. దీక్షని ప్రజలను మోసగించినందుకు. అసలు మీదియావారిని అనాలి. అదో దీక్ష దానికీ కవరేజి

ఇక రాజినామా చేసిన ఇతర పార్టి ఎం.ఎల్.ఏల వివరాలిలా ఉన్నాయి.
తె.దే.పా: 29
పి.ఆర్.పి 11
ఈ క్లీష్ఠ పరిస్థితిలో సోనియా మేడం చెయ్యవలసింది రెండే ఒకటి తెలంగాణ కావాలో వద్దో తెలంగాణా ప్రాంత ప్రజల మద్య వోటింగ్ కు ఆదేశించటం, జగన్ ను సి.ఎం చెయ్యడం. జతిగిన దుష్పరిణామాలన్ని రోశయ్య చేతగాని తనంతోనే జరిగాయి. కనీశం భవిష్యత్త్లో జరుగనున్న నష్ఠాలను వారించటానికన్నా జగన్ ను సి.ఎం చేసి తీరాల్సిందే

గమనిక:
మా చిత్తూరు పురపాలక చేర్మన్ సహా అందరు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజినామా చేసేరు
Flash ! Flash !
CK.Babu , The chittoor Tiger had also resigned as MLA opposing Telengana

RTS Perm Link

జగన్ ! మేలుకో ..
Dec 8th, 2009 by chittoor Murugeshan

డా. వై.ఎస్.పై నాకున్న అభిమానంతో , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసిన హక్కుతో ఈ టపా వ్రాస్తున్నాను. జగన్ బాబు ! రాజకీయం అన్నది ఎన్నికల సమయంలో మాత్రం అందుకునే పాట కాదు. అది అను నిత్యం కొనసాగవలసిన బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రజా సమస్యలనే లిరిక్ ని అనగ త్రొక్కక కొన్సాగుతూనే ఉండాలి.

వై.ఎస్. దివంగతులయ్యారు. నా బోటి వారు నిన్నే సి.ఎం. చేస్తారని ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాశైంది. పోనీ తలచినదే జతిగినదా దైవం ఎందులకన్నట్టుగా దీనిని పాజిటివ్ గానే తీసుకుంటాం.
ఇప్పుడు దైనందిన సమస్యలన్నింటిని పక్క దోవ పట్టించి కే.సి.ఆర్ తన దుబాకోరు దీక్షతో తెలంగాణ సమస్యను తెరమీదికి తెచ్చారు. నాకు తెలిసి నాన్న గారు ఈ విషయమై ఏ మాట చెప్పి ఉన్నా ఆయన మనస్సులో మాత్రం సమైక్యాంద్ర ప్రదేశ్ కే చోటు.
రాష్ఠ్ర రాజకీయాల్లో ఇదొక కీలక జంగ్షన్ పాయింట్. ఇక్కట మనమేదో ఒకటి నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. ఇదో ఎత్తైతే మరో ప్రక్క అటు అదిష్ఠాణం కాని , ఇటు సీనియర్లు కాని , ప్రత్యర్దులు కాని సాకు దొరికినప్పుడల్లా నీ మీద దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారు త్రవ్విన గోతిలో వారే పడటం ఖాయం. సీనియర్లని విర్రవీగే వారికి కుక్కలకున్న జ్ఞానం కూడ లేదు. కుక్క బ్రతుకు బ్రతికినప్పుడు తమ యజమాణి మనోగతాన్ని పసిగట్టి నడుచుకోవాలి. కాని వీరు అధినేత్రి పైనే వత్తిడి తెచ్చే స్థాయికి వెళ్ళి పోయారు. జగన్ బాబు నీవు విధేయత ప్రకటించాలన్నా ఇదే అదను. తిరగబడాలన్నా ఇదే అదను.

అసలే ఇది కలి కాలం నిద్ర పోతునా కాళ్ళాడిస్తూనే ఉండాలి లేకుంటే చచ్చి పోయామని ప్రెస్ మీట్ పెట్టేసే కాలమిది. మరో విషయం ఏమంటే ఇదివరకే ప్రకటించినట్టుగా వై.ఎస్. మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంభాలను ప్రామర్శించటానికి బయలు దేరాలి. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకునే వారితో ఎంత మంచిగా
ఉన్నా అది చేతగానితనంగానే పరిగణించ పడుతుంది. జస్ట్ యు కం విత్ అన్ అజెండా . ప్లీస్ బి క్విక్

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa