SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
మని సీక్రెట్స్ ఫ్రీ డవున్ లోడ్
May 8th, 2010 by chittoor Murugeshan


డబ్బు గురించిన మర్మాలను చేధించ కోరి చిత్తూరు టైగర్ సైట్ కు విచ్చేసిన మీకు స్వాగత సుమాంజలులు !
ఈ పేజి చివర ఇచ్చిన కొన్ని లింకులను వన్ బై వన్ కాపి పేస్ట్ చేసి ఎంటర్ కొడితే చాలు మని సీక్రెట్స్ డి.వి.డిలోని మూడు భాగాలను  కొన్నినిమాషాల్లో  డవున్ లోడ్ చేసుకుని  ప్రశాంతంగా  తిలకించి ఆనందించ వచ్చు. డబ్బు గురించిన రహస్యాలను ఇట్టే తెలుసుకుని మీ భ్రమలను పోగొట్టుకుని సంపాదనకు పూనుకోవచ్చు. సంపన్నులుగా మారొచ్చు.

వెంటనే మీరు కంట్రోల్ ,ఎండ్ బటన్ నొక్కి ఈ పేజి చివరి భాగానికి వెళ్ళి పోయినా అది నేరమేమి కాదు సుమా! కాని ఈ డి.వి.డి నేపథ్యాన్ని కాసింత తెలుసుకుంటే ఇంకా భాగా అర్థమవుతుందేమో?

గత మార్చ్  24న  చిత్తూరు  టైగర్, ప్రజానాయకులు,చిత్తూరు  ఎమ్.ఎల్.ఏ శ్రీ  సి.కె. బాబు గారి జన్మ దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన “మని సీక్రెట్స్ ” గురించిన డి.వి.డిని ఇంటర్ నెట్ నుండి ఉచితంగా డవున్ లోడ్ చేసుకునే వీలు కల్పించటం వెనుక గొప్ప ఆశయమే ఉంది. అదే పేదరిక నిర్మూలనం.

పేదరిక నిర్మూలనే ద్యేయంగా పని చేసిన దివంగత రాష్ఠ్ర ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, డా..వై.ఎస్.రాజశేఖర రెడ్డిలే ఇందుకు స్ఫూర్తి. ఎన్.టి.ఆర్  వలే , వై.ఎస్.ఆర్ వలే  స్థానికంగా సి.కె.బాబు పేదల పక్షపాతిగా పేరొందిన వ్యక్తి కావడంతో  ఈ   మని సీక్రెట్స్ డి.వి.డిని సి.కె.పుట్టిన రోజున విడుదల చేసాం.
సతరు డి.వి.డి ప్రతిని సి.కె.గారికి చేర వేయగా వారి సతీమణి సి.కె.లావణ్య ఎటువంటి హిపాక్రసి లేక స్వయంగా  ఫోన్ ద్వారా మాట్లాడి  సంతోషం వ్యక్తం చేసి ప్రోత్స హించడం నిజంగా గర్వకారణం.

చిత్తూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ వారి సౌజన్యంతో పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు స్థానిక  జడ్పి మీటింగ్ హాలులో  నిర్వహించిన  సెమినార్లో నేను  చేసిన ప్రసంగం యొక్క సంపూర్ణ దృశ్యమాలికతో ఈ డి.వి.డి రూపుదిద్దుకున్నది.

డబ్బు లేని వారు ఉండొచ్చుగాని డబ్బు అవసరం లేని వారు ఎక్కడా లేరు. అయితే డబ్బు గురించిన సరైన అవగాహణ లెక  మానవులు  నానా తంటాలు పడుతున్నారు. ఇంతకీ డబ్బుయొక్క శక్తిని  మానవుడు అతిగా ఊహించుకోవడం, మరణం, మరణం యొక్క ఛాయలైన ఒంటరితనం,చీకటి,తిరస్కారం, ముసలితనం, ఓటమి, జబ్బులనుండి రక్షిస్తుందని సబ్ కాన్షియస్ గా  భావించడం వలనే డబ్బును సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాడు మానవుడు.

డబ్బు గురించిన అపోహలను తొలగించి,ప్రతివారిని సంపాదనకు పూనుకునేలా చెయ్యడమే ఈ డి.వి.డి లోని ప్రసంగం యొక్క ద్యేయం.

అందుకే సతరు డి.వి.డిని  ప్రతి ఒక్కరికి అందుభాటులో తేవాలని  చక్కగా కంప్రెస్ చేసి మొబైల్ ఫోన్లో సైతం డవున్లోడ్ చేసుకునే విదంగా ఆన్ లైన్ లో ఉంచాను.

ఇంకా ఆలస్యం ఎందుకు ?
క్రింది లింకులను కట్ పేస్ట్ చేసి డి.వి.డిని డవున్ లోడ్ చేసుకొండి !
Money secrets Part 1
http://www.archive.org/details/MoneySecretsByMurugeshan1
Money secrets Part 2
http://www.youtube.com/watch?v=MuZQSDV9HmE
Money secrets Part 3
http://www.archive.org/details/MoneySecretsPart3

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa