SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కన్య,తులా,వౄశ్చిక,దనస్సు,మకర,కుంభ,మీన రాశులవారి భవిష్యత్
Sep 26th, 2009 by chittoor Murugeshan

6.కన్యా రాశి
రాశి చక్రంలో శతౄ,రోగం,రుణాలను సూచించే 6 వ రాశియగు కన్యా రాశి యందు జన్మించిన మిత్రులారా ! దీంతో మీరు పుట్టి పెరుగుతున్న కొద్ది మీ చుట్టు ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా,ఒకరు అప్పుల అప్పారావుగా, ఒకరు కోర్టు కేసులకు తిరిగే వారుగా తయారవుతారు. మీరు ఏ పనికి పూనుకున్నా అది తగరాళ్ళతో,వాయిదాలతోనే పూర్తి అగును. మీ రాశికి ఎంత మంచి యోగం పట్టినప్పటికి కొంత మెరకన్న శత్రు,రోగ ,రుణ బాధలను అనుభవిస్తూనే ఉంటారుఇందాక మీకు 12 వ రాశిన ఉండి పలు విదాలుగా నష్ఠాలు చే కూర్చిన శని మహాత్ముడు ఈ సెప్. 26 న మీ రాశికే వచ్చి తిష్ఠ వేసి మీ ఆరోగ్యం, బుద్ది కుశలతను సైతం దెబ్బ తీయనున్నాడు. గతంలో శని 12 న ఉండగా మీకు బుద్ది నాశం, అపఖ్యాతి,అవమానాలు వంటి అశుభ ఫలాలిచ్చినప్పటికి రుణాల వసూళ్ళు, అప్పులు తీర్చతం, శతౄవులు కనుమరుగవడం వంటి మంచి పనులు కూడ చేసాడు శని. కాని ప్రస్తుతం మీ జన్మ రాశిలోకి రానున్న శని అనారోగ్యం( నరాలు,పైల్స్,కాలు సంబంధ) మంద బుద్ది, అకాల భోజనం, అకాల నిద్ర, ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు రాలడం వంటి దుష్ఫలితాలను ఇవ్వనున్నాడు. అలాగే శని 7 వస్థానమును వీక్షించుట వలన ఇవే రుగ్మతలు మీ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను కూడ బాధించవచ్చు. వారితో తగువలు రావచ్చును.

7.తులా రాశి
రాశి చక్రంలో ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను సూచించే 7వ రాశియగు తులా రాశిలో జన్మించిన మితౄలారా !
పై త్లిపిన వారు మీ జీవితాన్ని అత్యధికంగా ప్రభావిస్తుంటారు. గతంలో 11 న ఉన్న శని తాను 4,5 స్థానాలకు అధిపతి కావున తల్లి,ఇల్లు,వాహణం, సాంకేతిక విద్య వగైరాల్లో మేలే చేసాడు. బుద్ది కుశలతతో, అదౄష్ఠంతో కొన్ని పనులను చేసుకో కలిగారు. ఈ నేపథ్యంలో అట్టి శని 12 కు చేరడం పై విషయాలకు ఆటంకమగును. తల్లికి అనారోగ్యం, ఆమెతో విభేదాలు, స్థాన చలనం, చిన్నపాటి వాహన ప్రమాదం, విద్యలో ఆటంకం వంటివి జరుగ వచ్చును.అలాగే దనార్జనలో మీ ఎత్తులు పారక పోవడం, అదౄష్ఠం కలిసి రాక పోవడం,పిల్లల అఋఓగ్య సమస్యలు,వారి స్వతంత్ర ప్రవౄత్తి మిమ్మల్ని అతిగా ఆలోచింప చేస్తాయి. మీ పిల్లలు విద్య,ఉధ్యోగం,వివాహం తదితర కారణాల వలన మీకు దూరమైతే పై చెడు ఫలితాలు తగ్గుతాయి.

మీనం:
రాశి చక్రంలో ఖర్చులు,నిద్ర,రతి (సెక్స్)లను సూచించే పన్నెండవ రాశియగు మీన రాశియందు పుట్టిన మితౄలారా !

రాశి చక్రంలో కైవల్యాన్ని సూచించే మీన రాశిలో జన్మించిన మీకు తొలూత ప్రాపంచిక విషయల్లో ఎనలేని ఆసక్తి కలిగి ఉన్నప్పటికి క్రమేణా ఆథ్యాత్మిక జీవితం వైపుగా మళ్ళి పోతారు. 2007 ఆగస్ట్ 7 నుండి అంతకు పూర్వం మీ కంట కన్నీరు తెప్పించిన వారి కంట నెత్తురు తెప్పించే అవకాశం మీకొచ్చింది. సెప్టంబరు 26 దాటాక ఈ స్థితి మారనుంది. సెప్ట్.26 తరువాత మాత్రం 7 న వచ్చే శని శతౄ బాధ,రోగ బాధ, రుణ బాధలను పునరావౄతం చేసే అవకాశం ఉంది.అందుకు ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లలో ఒకరో ఇద్దరో కారకులు కావచ్చు. అలాగే 7న ఉన్న శని మీ జన్మ రాశిని చూడతం వలన కాలు, గుదము,నరాలు సంబంధ రోగాలు కలుగ వచ్చును శుచి,శుభ్రతలు కనుమరుగవుతాయి. జాద్యం, మంధత్వం, అకాల భోజనం,అకాల నిద్రా అభివ్రుద్దికి ఆటంకం కల్గించ వచ్చు

వౄశ్చిక రాశి:
రాశి చక్రంలో ప్రమాదాలు, జైలు పాలు,మానసిక క్షోభలు, నిస్సహాయత,అపఖ్యాతిలను సూచించే 8 వ రాశియగు వౄశ్చిక రాశియందు జన్మించిన మిత్రులారా!
మీరు సదా అసంతౄప్తిలోనే ఉంటారు. ఇందులో వాస్తవికతకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రజాధరణకు నోచుకోని రాశి మీది. సాహసాలకు వెనుకాడరు. రక్తం,మంట సంబంధ రోగాలు వెంటాడుతాయి. విద్యుత్,అగ్ని వలన కూడ ప్రమాదం వాటిల్లును. మరి సెప్.26 దాక మీకు జీవన స్థానమగు సిమ్హమున ఉన్న శని 11కు (కన్యకు) రావడం మేలే. గతంలో 10 వ భావంలో ఉంటూ పనుల వాయిదా,సేవకులవలన నష్ఠాలు, వౄత్తి,వ్యాపారాల్లో మాంధ్యం వంటి దుష్ఫలితాలను ఇచ్చిన శని 11కు రావడం శుభ పరిణామమే ! శని మీకు 3,4 స్థానాలకు అధిపతి కావున సోదర లాభం, మనో ధైర్యం,ప్రయాణాల వలన మేలు, కార్య జయం, సంగీతాసక్తి, కల్పించనున్నాడు. అలాగే తల్లి,ఇల్లు,వాహణం,(సాంకేతిక) విద్య వగైరాల్లోను కాస్త ఆలశ్యంగానన్నా శుభఫలితమే ఎదురగును.

దనస్సు:
రాశి చక్రంలో తండ్రి,తండ్రి తరపు భంధువులు,గురువులు, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు, పొదుపు ,ఆస్తులను ,ఆస్తి వివాదాలను సూచించే దనస్సు రాశియందు జన్మించిన మితౄలారా !
పై త్లిపిన అంశాలు మీ జీవితాన్ని మరీ ఎక్కువగా ప్రభావిస్తాయి. గతంలో 2,3 భావాలకు అధిపతియై 9 న ఉన్న శని నిష్ఠూర వాక్కు,కుటుంభ కలహాలు,లావా దేవీల్లో చిక్కులు కలిగించాదు. అలాగే సోదరులు,ప్రయాణాలు, మనో భీతి/ధైర్యం వలన ఆస్తి వ్యవహారాల్లో కొంత ప్రతిష్ఠంభన కల్గించాడు. దాంతో మీ దనం డంప్ అయ్యి ఉంటుంది. అయితే శని సెప్.26 న 10 నకు రావడం మంచిదే. అయితే తగులుకు పోయిన పైకాలు వసూలైనట్టే వసూలై సేవకులు, నీచ కులస్తులు,వికలాంగుల కారణంగా నష్ఠమయ్యే అవకాశం కూడ లేక పోలేదు. ఇన్నాళ్ళు కాళిగా ఉన్నవారు కొత్త వౄత్తి వయాపారాలు ప్రారంభిస్తారు. ఇదివరకే వ్యాపారం చేస్తున్నవారు మరింత పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. ఇదివరకే ఉధ్యోగులై ఉన్నవారికి పని వత్తిడి పెరుగును.

మకరం:
రాశి చక్రంలో వౄత్తి వ్యాపారాలను సూచించే 10 వ రాశియందు పుట్టిన మకర రాసి మితౄలారా ! భగవద్గీతలో శృఈ కౄష్ణుడు చెప్పిన కర్మయోగం మీ రాశివారికి ఇట్టే సరిపోతుంది. మీ కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో కూడ ఆలోచించి,ఆరా దీసే తీరిక లేక పని పని పని అంటూ పనిలో నిమగ్నమై పోతారు.గతంలో 1,2 కు అధిపతి అయిన శని 8 న ఉంటూ మీ శరీరం, మనస్సు,బుద్ది,ఆత్మలను సైతం క్షోభిబింప చేసాడు. అయినవారికి సైతం కాని వారై అపనిందలు మోస్తూనే వచ్చారు. ఈ నేపద్యంలో శని 9 కి రావడం ఖచ్చితంగా మేలే. సముద్ర గర్భంలోకి మునిగి పోయేవాడ్ని ఒక కెరతం వచ్చి ఒడ్డున పడేసినట్టుంటుంది. అలా ఒడ్డునపడినవాడు వెంటనే పి.టి.ఉషాలా పరుగులు తీయలేడేమో గాని భయిట పడినట్లేగా ? గతంలో మీకు కాకుండా పోయినవి కనీశం మీ ఇంటి దారి పడ్తాయి.అపవాదులు తొలుగుతాయి. కాని నగదు,ఆస్తి డంప్ కావచ్చు. అలా డంప్ అయితే రెండున్నర సం.లకు చేతికి అందక పోవచ్చు. టేక్ కేర్ ! పడమర వైపుగా ఒక ప్రయాణం చేస్తారు. అది నరకమనిపించినా దాని ఫలితం ఖచ్చితంగా కాస్త ఆలస్యంగానన్నా మీకు అందుతుంది.

11.కుంభం:
రాశి చక్రంలో 11 వ రాశియై,లాభాన్ని,అన్నయ్య,అక్కయ్యలను సూచించే కుంభరాశియందు జన్మించిన మితౄలారా !
మీ జీవితం పై మీ అన్నయ్య,అక్కయ్యల ప్రభావం మెండు. ప్రతి విషయంలో నాకేంటి లాభమని ఆలోచించే లాభాపేక్షతో కార్యోన్ముఖులు కావడం మీ నైజం. అయితే లాభ నష్ఠాలు దైవాదీనాలు కదా !
గతంలో 7 న ఉంటూ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ విషయాల్లో బెడిసి కొట్టిన శని సెప్.26 న 8 కి రానున్నాడు. దీంతో ఆయన వారికి దూరమై ఏకాకి అయ్యి, అపనిందలు మోసే ప్రమాదం ఉంది. శని కారకత్వం వహించే విషయాల్లో నష్ఠాన్ని చవి చూడ వలసి వస్తుంది. పోలీసు స్టేషన్,కోర్టు,ఆసుపత్రి,వల్లకాటికి వెళ్ళవలసి రావచ్చు. శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి దర్శించడి. నలుపు రంగును వారించి బ్లూ కలర్ ఎక్కువగా వాడండి. ఏ విషయంలోను ముందు పడక నలుగురిలో నారాయణా అంటూ కాలం గడపండి. రిస్కైన పనులు మానండి

RTS Perm Link

వ్రుషభ రాశి మిత్రులారా !
Sep 16th, 2009 by chittoor Murugeshan

వ్రుషభ రాశి మిత్రులారా !
రాశి చక్రంలో రెండవరాశి దనం, వాక్కు,కుటుంభం నేత్ర స్థానాలను సూచించే సౄషభ రాశి మీ జన్మ రాశి అయినందున మీకు డబ్బంటే ఎంతో గౌరవం. మీ స్నేహాలకు, శతౄత్వాలకు డబ్బే కారణమై ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న తత్వం మీలో ఉంటుంది. దానిని పరుల వద్దనుండి కూడ ఎదురుచూడటంతో కొన్ని సమస్యలొస్తాయి. అలాగే పిచ్చా పాటి కబుర్లన్నా ఇష్టమే.వికట వినోద పరిహాస ప్రసంగ ప్రియులు. మీరు ఏమాత్రం ప్రయత్నించ కున్నా మంచి సర్కిల్ ఏర్పడుతుంది. మీకు కుటుంభ వ్యవస్థంటే ఎంతో ప్రీతి. అయితే విధి వ్రాత వక్రించినప్పుడు మీరు ప్రాణ సమానంగా భావించేవే దూరమై మిమ్మల్ని క్షోభ పెడ్తాయి. ఇక శని మహాత్ముని గురించి ఆలోచిస్తే ఈయన మీకు 9,10వ స్థానాలకు అధిపతి. అంటే మీకు ఆస్తి, పొదుపు,దూరప్రాయణాల ద్వారా లాభం కల్పించవలసింది శనియే. అలాగే మీకు వౄత్తి వ్యాపారాలు కల్పించవలసింది ఈయనే. అందుకేనేమో పై విష్యాల్లో కాస్త ఆలస్యం తప్పని సరి, ఇతరుల మనస్సులను నొప్పించి గాని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని దుస్థితి. ఇట్టి శని మీకు గతంలో 4 న ఉన్నాడు. తల్లి ,ఇల్లు,విద్యా వాహణాదుల విషయంలో క్షోభ పెట్టిన శని ఈ విడత 5కు రావడం ఒక విదంగా మేలే. 9 అంటే ఆస్తి, ఐదు అంటే అద్రుష్ఠం. పిల్లల విష్యంలో ఇది కొంత రివర్స్ గేర్ వేసినా ఆస్తి,ఆదాయం,అదౄష్ఠం విషయాల్లో మంచే చేస్తుంది. అలాగే చేసే వౄత్తి,వ్యాపారాల్లోను అదౄష్ఠం వరిస్తుంది. అయితే అవి చేతికి మట్టి,జిడ్డు పుయ్యించేవిగా ఉండవచ్చును. అలాగే దుర్వాసన, నలుపు రంగు గల వస్తువులు కూడ లాభిస్తాయి

RTS Perm Link

జాతికి అంకితం ఆస్ట్రో,న్యూమో,నేమాలజి
May 23rd, 2009 by chittoor Murugeshan

brammangaaru

జ్యోతిష్యంలో ప్రవేశమున్నవారికి ఈ పేరు చూడగానే అర్థమై పోతుంది. జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం, నేమాలజిలను కలిపి రూపొందిన శాస్త్రం ఇదని. జ్యోతిష్కం చెప్పడమంటే మాటలు కాదు. జ్యోతిష్యంలోని అన్ని విభాగాలలో ప్రవేశం ఉండాలి. అనుభవం ఉండాలి. ముఖ్యంగా జ్యోతిష్యాన్ని కేవలం జీవనోపాయంగా భావించే కక్కుర్తి ఉండకూడదు. జ్యోతిష్కుని జాతకం కూడ ఇందుకు సహకరించే విదంగా ఉండాలి. ఇదివరకే పలుమార్లు చెప్పినట్టుగా లగ్నంలో గురు ఉచ్చమైనందునో ఏమో తెలియదు కాని దైవ సంకల్పం కారణంగా నాకు గూడ రహస్యాలు సైతం తటస్థిస్తుంటాయి. ఆ రహస్యాల్లో ఒకటే పైన తెలిపిన జాతికి అంకితం ఆస్ట్రో,న్యూమో,నేమాలజి . జ్యోతిష్యంలో ఒక్కో విభాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇవన్ని ఆయుధాలు వంటివి. ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడితేనే క్లెయింటుకు పూర్తి న్యాయం చెయ్యగలుగుతాం.

ఉదాహరణకు హస్త సాముద్రికం. దీని ప్రత్యేకత ఏమంటే జాతకంలోని గ్రహాల బలాబలాలను అంచనా వేసేందుకు సవా లక్షా రూల్స్ ఉన్నాయి. కాని హస్త సాముద్రికంలో ఆయా గ్రహ సంబంధ ప్రదేశాలను జాగరూకతో పరిశీలిస్తే చాలు ఆ గ్రహం బలం పొందిందా లేదా ఇట్టే చెప్పెయ్యవచ్చు. కుజదోషం కూడ అటువంటిదే . కుజదోషమున్నదా లేదా అంచనా వేసేందుకు ఎన్నో రూల్స్ ఉన్నప్పటికి దోష నిర్ణయంలో విభేదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కాని హస్త సాముద్రికంలో దోష నిర్ణయం ఎంతో సులువు.

గత టపాలో నేను చెప్పినట్టుగా పుట్టిన తేదిని పట్టి వచ్చే స్థూల సంఖ్య, ప్రాణ సంఖ్యలకు సంబంధించిన గ్రహాలు జాతకంలో బలంగా ఉంటే కేవలం ఆ రెండు అంకెలతో, నేమ్ నెంబరును బేరేజు చేసుకుంటూ క్లెయింటును అదర కొట్టొచ్చు. ఇది మరోలా ఉంటే గోవిందా..

ఇక నేను 2000 సం||లో రూపొందించి పరీక్షించి ఇప్పటికి వాడుతున్నా. ఆస్ట్రో,న్యూమో,నేమాలజి కథకొస్తే.. ఇక్కడ క్లెయింటు పేరులోని అక్షరాలనే భావాలుగా పరిగణిస్తాం. ఉదా|| నా పేరు S.MURUGAN ఈ పేర్లోని అక్షరాలను అంకెలుగా మారుస్తే ఇలా వస్తుంది. 3,4,6,2,6,3,1,5. వీటిని గ్రహాలుగా మారుస్తే గురు,రాహు,శుక్ర,చంద్ర,శుక్ర,రవి,బుధ. ఇప్పుడు రాశిచక్రం గీసుకొని లగ్నంలో గురువును, ధనబావంలో రాహును, సోదర బావంలో శుక్ర, మాత్రు భావంలో చంద్ర, బుద్ది భావంలో శుక్ర, రోగ బావంలో గురు, కళత్ర భావంలో రవి, అష్టమ భావంలో బుధ వేసుకొని ఫలితం చెప్పుకుంటూ పోవల్సిందే.

లగ్న గురు: బ్రాహ్మణ లక్షణం, జ్యోతిష్యం లో ప్రావీణ్యత, రాజకీయాల పై ఆసక్తి, చేరిటి, జ్ఞాపకశక్తి, పురాణ ఇతిహాసాల పై పట్టు
ద్వితీయ రాహు: బ్లాగ్లోకంలో నన్ను బూతులు తిట్టే వారికి ఒక శుభ వార్త. ఈ ద్వితీయ రాహు కారణంగా నేను ఆఫ్ ది రికార్డు మాట్లాడినప్పుడు వింటే చెవులు ఎరుపెక్కడం కాదు నెత్తురే కారుతుంది. అంతటి బూతులు మాట్లాడుతా. అందుకు కారణం కూడ ఈ ద్వితీయ రాహువే. అలాగే గుప్త జ్ఞానం, నృత్యంలో ప్రవేశం, ఎదుటివారి మనసుల్లో మాటలు పసికట్టడం. ఎదుటి వారిని తికమక పెట్టే వాగ్దాటి
త్రుతీయ శుక్ర: కామశాస్త్రానికి కారకుడు శుక్రుడు. నా సహపాటుల్లో చాలా మంది ధనవంతులు, రౌడీలు, … ఉన్నప్పటికి వారికి సెక్స్ పరమైన సమస్యలు వచ్చినప్పుడు నన్నే ఆశ్రయిస్తారు. ముఖ్యంగా నాకు మహిళలు ఎంతో బాసట కల్పిస్తుంటారు. ఇంతకీ నేను ఈ బ్లాగులో వ్రాస్తున్న విషయాలను సైతం వారికి ఉద్బోధిస్తుంటా

ఇలా చెప్పుకుంటూ పోవడమే. జ్యోతిశ్యంలో ప్రవేశం ఉన్నవారు పరిశీలించి మీ రిజల్ట్ చెప్పండి

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa