రాజన్న ! మమ్ములను ఆసు కవులు చేసావు


రాజన్న !
కవిగా నేనొక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకౄత్తి పడేవాడ్ని
కాని కదిలే కావ్యంగా నువ్వున్నంత కాలం
ఆ సాహసం చెయ్యలేక పోయాను.
నీ తెల్లని పంచ కట్టులో మా చీకటి బతుకులు సైతం
తెల్లవారుతాయని తేట తెల్లం చేసిన నీ తెల్లని
నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?
గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా
గ్యాసు కొడుతుంటే
నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నా
వాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ?

రాజన్నా !
నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోఆవని
కొందరు భ్రమ పడుతున్నారు
నువ్వు ఒక శతాబ్ద కాల అభివౄద్దిని
సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు.
అక్కడి దేవతల అమరుల స్థాయికి ఎదిగి పోయావు

నేడు బాహుటంగా బయిట పడింది
ప్రజాభిప్రాయాన్ని దిక్కరించి
తిక్క తిక్కగా కలుపు మొక్కలకు నీరు పోసే ఆదిష్ఠానం యొక్క తత్వం
నువెలా భరించావయ్యా ఈ తరహా యాతన
ఒక్కోసారి అక్కడి శిలువ దిగి గాని రాజదానికి చేరేవాడివి కాదేమో
ఆదిష్ఠానానికి దోచి పెట్టావని (పోని లే దాచుకున్నావన్లే) భూచి చూపిన వారి గుమ్మం ముందు చెయ్యి చాచిన వీరా మా రక్షకులు

అందుకే చెప్పేవాడివేమో ? మీరడగ కూడదు
నేను చెప్ప కూడదని

అడగ కూడనివి , చెప్ప కూడనివి సైతం దిగ మ్రింగి మా పళ్ళాలను అన్నంతో నింపవు ..విషం తాను మ్రింగి అమౄతం పంచిన రుదౄడిలా
అందుకే నీ ముక్తి స్థలి రుద్ర కొండ అయ్యిందేమో.
హే రాజన్నా !
మనిషిగా పుట్టిన నువ్వు
మహాత్మునిగా ఎలా ఎదిగావయ్య ?
నువ్వు నీ ఆత్మ కథ రచించి ఉంటే అది మరో సత్య శోధన అయ్యేదేమో?
కేవల భూ తర్పణాలకే పరిమితమైన కసాయి గుండెలకేం తెలుసు
ప్రజల గుండెలో ఇంత చోటు ఎంత విలువైందో ?

ప్రేమలో పడ్డాకే అత్త కూతురి కట్టు, బొట్టు తెలిసొచ్చినట్టుగా
2003 పాద యాత్రలోని నీ అడుగులు ప్రజల గుండెకేసే అన్న సత్యం
పసిగట్టాక గాని నీ గతం మాకు అవగతం కాక పోయే

నాయకుడు పుడతాడని కొందరు
కాదు కాదు తనే శిలై, తనే శిల్పి అయ్యి తీర్చి దిద్దుకుంటాడని మరి కొందరు
అంటుంటే తలపట్టుకుంటిని
ఆ ప్రశ్నకు జవాబు ఏ చరిత్రలోను దొరక్క
నీ జీవిత పుస్తకం తెరిచా సమాదానం చూసి మురిసా…
అన్నట్టు జీవిత పుస్తకం ఏంది సిల్లీగా .. అదో చరిత్ర..

నాయకుడు పుడతాడు రేగు చుక్కలా ?
ప్రజల జీవితాలను కారు చీకటి కమ్ముకున్న వేళ
వారి కళ్ళు తమ ఇల వేల్పు కొరకు ఆకాశానికేసి
చూస్తే అప్పుడు కనిపిస్తుంది ఆ రేగు చుక్క !
ఈ ముక్క నాకు తెలిపిన నీ జీవితం ధన్యం
ఆ చుక్క ఎప్పుడో పుట్టింది
ప్రజ కంట మరెప్పుడో పడింది

హే జన హౄదయ నేత !
మా నమ్మకాలను వొమ్ము చేసి
ప్రపంచ బ్యాంకుకు అమ్మ చూస్తే
ఆ అంబ అమ్ముల పొదిలోని ఆగ్నేయాస్త్రంలా అడుగు ముందుకేసావు
కరుణ అడుగంటిన అవకాశ వాదులను చెడుగుడు ఆదించావ్

శల్య సారథ్యాలు, స్వప్స్ఖ దాడులు, పద్మవ్యూహంలో అభిమణ్యువును తలపించావు
అందరు డాక్టర్లు తమ చేతి స్టెత్తు తో రోగి గుండె చప్పుడు వింటారు
కాని నువ్వు రాష్ఠ్ర గుండె చప్పుడు విన్నావు

నాటి హైటెక్ ఇంద్రజాలం పై వాస్తవికతపు మంత్ర జలం చల్లావు
కోడి పిల్ల గుంట నక్కై కనిపించింది.
ఆమ్మో నాటి రోజులు తలుస్తే గుండె లయం తప్పుతుంది
ఆ చీకటి రోజుల్లో రాష్ఠ్ర వ్యవసాయరంగం అహల్యలా బండై పోయుంటే శ్రీరామునివలే నీ పాదం మోపి , ప్రాణం పోసావు.
గుల్బర్గాలో నువ్వు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో
నీ అభిమాన కథానాయకుడు ఎన్.టి.ఆర్ .
ఎవరినన్నా ప్రభావితం చెయ్యగల నటుడని నువ్వే కొనియాడిన
అతను రాయల శీమ ప్రాజెక్టులను విశ్మరిస్తే అసెంబ్లీ ముందే నిల బెట్టి నిల దీసావు
ఇది మొన్నటి సత్యం

ఎన్.టి.ఆర్ పేదవానికి కూడు అందించటానికి మొదలు పెట్టిన ప్రయత్నాన్ని నువ్వు పూర్తి చేసావు.
ప్రత్యర్ది పథకం అమలు చేస్తే కీర్తి ఎక్కడ వారిని వరిస్తుందోనని కకౄత్తి
పడక పిల్లి ఏ రంగుదైనా సరే అది ఎలుకలను పట్టాలంతే అంటూ మాసేదుంగ్ లా అమలు చేసావు రెండు రూపాయలకే కిలో భియ్యం

స్వంత అల్లుడు తుంగలో తొక్కిన పథకానికి పునర్జీవం పోసావు
అసలైన వారసుడ్ని నేనని చెప్పక చెప్పావ్.

నాటి రాజులు సైతం తమ కోటల్లో నిల్వ చేసే వారు బియ్యం
కాని సామాన్యులను వెంటాడింది ఆకలి దెయ్యం
దీంతో భూత వైద్యుని అవతారమూ ఎత్తావు
భూతాన్ని భూస్థాపితం చేసావ్

అభిమానాన్ని రాజకీయాన్ని
స్నేహాన్ని వ్యవహారాన్ని
వేరు చేసి అభిమానం చాటావు
స్నేహాన్ని నిల బెట్టావు
ఆ విశాల హౄదయంలోని ఆత్మకు నేల మీదనుండి పైకి ప్రయాణించడం ఇరుకని
నింగికి దగ్గరగా ఉన్న కొండను ఎంచుకున్నావేమో నీ ప్రాణార్పణానికి

నాటి పాలకులు 2 శాతమే ఉన్న నెటిజన్ల కోసం ఇల్లు పీకి పందిరేస్తే
నువ్వేమో 70 శాతం ప్రజానీకాన్ని పోషించే
వ్యవసాయ రంగం పై దౄష్ఠి సారించావు
ఆకలితో ఉన్నవానికి చేపలివ్వకు చేపలు పట్టడం నేర్పు అన్నాడో మేధావి
ఆ పూటకు చేపలిచ్చి , చేపలు పట్టడం కూడ నేర్పాలన్నావ్..
అవును రైతుల విద్యుత్ భకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ అందించి ఆ పై
మొదలు పెట్టావు జలయజ్ఞం

ఎడ తెగని కరవుతో, వ్ద్యుత్ భకాయిల వసూలు నిమిత్తం జప్తులు, క్రిమినల్ కేసులతో
వేదించిన పాలనలో ,రైతు గుండెలు చెదిరి పోనున్న తరుణంలో
ఆ అధకారంలో అరుణ కిరణంలా మండుటెండల్లో పాదయాత్ర చేస్తే
భవిష్యత్తు కబ్జల నిమిత్తమే చేసావు సర్వే అని తూలలాడిన కుర్రకార్లు తూలి పడి పుడమి తల్లిను ముద్దాడినప్పుడే అర్థమైంది
సత్యం నిలిచింది నీ వెంటని
నువ్వు క్రైస్తవుడని అన్య మత ప్రచారాన్ని ప్రోత్సహించావని గొంతు చించుకున్నవారు
గుళ్ళో పూజారికి, దేవతకు సైతం కాసుల వర్షం కురిపించిన సంగతిని మాత్రం ఏంచక్కా దాచేరు
దాస్తే దాగేదా సత్యం
ప్రేమే లక్ష్యం సేవే మార్గమని ప్రకటించుకున్నవారు అందించి ఉండాలి ఆ నినాదాన్ని నిజమైన నివాళిగా
నీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిని సైతం క్షమించిన శాంతి పావురమా
అందుకే నీ ముక్తి స్థలి పావురాల గుట్టైందేమో?

హే ఆశ్రిత కల్ప వౄక్షమా !
ఇంకో శతాబ్ద కాలానికి నా బో(పోటి) కవులకు సైతం కల్ప వౄక్షమయావు నువ్వు
నిన్ను కీర్తించాలని దలచిన అదే క్షణం
సరస్వతి దేవి వారి నాలిక పై ఓంకారం దిద్దినంతగా
ఆసువుగా కవితలు దొరులుతాయి
అశేష ప్రజానీకం సంక్షేమమే సంకల్పంగా నువ్వు ఆశువు బాసినా
మమ్ములను ఆసు కవులు చేసావు

నువ్వూ ఓ తల్లి కడుపునే పుట్టావ్
మరి దేవుడివి ఎలా అయ్యావయ్యా ?
అమరలోకంలోని దన్వంత్రి ఆత్మ నీలో ప్రవేశించిందా ?
ఆరోగ్య శ్రీతో మమ్మాదుకున్నావు
అన్న దాతలకోశం, అన్నార్తుల కోశం నువ్వు చేపట్టిన పాద యాత్రతో ఆ అన్న పూర్ణేశ్వరి గుండె కరిగి పోయి
శివుని ఆకలి తీర్చిన గరటిని నీకిచ్చిందేమో ?

భిన్న రుచులు కలిగిన లోకులను మురిపించి వారి అహం మరిపించి ఎలా దగ్గరయ్యావయ్యా ఇన్ని కోట్ల మందికి ?
40 సం.ల వయస్సుకే తేజస్సు క్షీణించి అబధ్రతకు లోనయ్యే ఈ తరం యువతరం పుట్టుకతో వౄద్దులై బతికేస్తుంటే
60 సం.ల వయస్సుకి నువ్వు కలలు కన్న ఉషస్సు కొరకు
పరుగులు తీసి యెనలేని యశస్సును కూడ కట్టుకున్న
నిత్య యవ్వనం నీకెలా సంప్రాప్తించింది
నిస్వార్థమే నిన్ను అమౄతమై పరుగులు తీయించిందేమో ?

కాస్త పెద్ద పదవి వరించగానే పేదవాని జీవణ్మరణ సమస్య చీమకాన్న చిన్నదై కనబడే ఈ కలిలో
అంత పెద్ద పదవిలో ఉన్నా పీడిత ప్రజానీకం సమస్యలను ఎలా గుర్తుపెట్టుకో గలిగావు
సరస్వతి ఆకు తిన్నావా ? పండిన ఆకుల్లా వనికి పోతున్న వౄద్దుల ముఖాలు తలచావా ?

RTS Perm Link

1 comment to రాజన్న ! మమ్ములను ఆసు కవులు చేసావు

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.