రోసయ్య ! మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకున్నావో ఏమో ? నువ్వు చంద్ర గుప్తుడు కావాలనుకున్న చానక్యుడవు. చేతగాని చానక్యులు కోకొల్లలున్నారు. కాని చంద్ర గుప్తుడు ఒకడే .. ఆంథ్రా పులి కన్న పులి బిడ్డ జగన్ కదం తొక్కాడు . ఇక కాస్కో .
వై.ఎస్.బ్రతికున్నప్పుడే ఆయన చుట్టూ అదో వర్ణనాతీతమైన దివ్య తేజస్సు ఉండేది. తూలలాడిన జూనియర్ ఎన్.,టి.ఆర్ బతుకేమైందో మరిచి పోయావా తాతయ్య !
ఇప్పుడు వై.ఎస్. ఆత్మస్వరూపాన ఉండగా ఆ దివ్య తేజస్సు మరింత ప్రభవితంగా ఉంది. వై.ఎస్. మరణాన్ని కించ పరచిన కే.సి.ఆర్ హెలికాప్టర్ దారి తప్పడం,తూలి పడటమంతా దాని పనే . శంత స్వరూపుడుగా పేరొందిన నీకు అడుగడుగునా కోపం ముంచుకు రావడానికి కారణం కూడ ఇదే.
కాంగ్రెస్ వై.ఎస్. పేరిట వేరు కుంపటి తథ్యం. నువ్వు పదవీచ్యుడు కావడం తధ్యం. నేనిదివరకే పేర్కొన్నట్టు ఆంథ్రా రాజకీయ చరిత్రలో చారిత్రిక పురుషులు ఇద్దరు. ఒకరు ఎన్.టి.ఆర్,మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు తీరని అన్యాయమే జరిగింది.
ఇప్పుడు గాని తె.దే.పా లో ఎన్.టి.ఆర్ పై నిజమైన విశ్వాసం గల ఎం.ఎల్.ఏలు అలాగే కాంగ్రెస్ పార్టిలో వై.ఎస్.పై నిజమైన అభిమానం ఉన్న ఎం.ఎల్.ఏలు ఏకమైతే జగనే సి.ఎం. జూనియర్ ఎన్.టి.ఆర్ కోరుకుంటే అతనే డెప్యుటి సి.ఎం. ఎలా ఉంది దెబ్బ !