SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
జగన్ కేవలం కడప ఎం.పి కాదు కాకూడదు
October 6th, 2009 by chittoor Murugeshan

అవును జగన్ కేవలం కడప ఎం.పి కాదు ఆయన సి.ఎం. అభ్యర్ది. నేటికి కాకున్నా రేపటికి ఆయనే సి.ఎం. అటువంటప్పుడు కర్నూల్,కృష్ణా,మెహబూబ్ నగర్ జిల్లాల్లో వరదలంటే రూ.20 లక్షలు విరాళాన్ని సి.ఎం.సహాయ నిధికి ఇవ్వడం. కడప జిల్లాలో వరదలంటే పుట్టిల్లో, ట్రాక్టర్లో పర్యటించటం ఆయనేదో కడప జిల్లాకే పరిమితమన్న తప్పుడు సంకేతాన్నిస్తుంది. ఝగన్ వెంటనే వరదలతో దెబ్బ తిన్న 5 జిలాలను పర్యటించాలి. జగన్ యువ సేన ఆద్వర్యంలో ప్రత్యక్ష సహాయక చర్యాలకు పూనుకోవాలి. సోనియా ఒక నిర్ణయానికి వచ్చేసారు. వరద భీభత్స తరుణంలో రోసయ్య పని తీరు భేష్ అన్నప్పుడే ఇది తేట తెల్లమైంది. టి.వి.లు చూసిన ఏ ఒక్కరైన చెబుతారు. ఈ వరదలు కేవలం రోసయ్య నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యమే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వారం రోజులనుండి వర్షాలు పడుతుంటె ఆ వరద తప్పక శ్రీ శైలం, నాగార్జున సాగర్ల ద్వారా ప్రకాశం బ్యేరేజుకే చేరుతాయని తెలిసినా ముందస్తుగా నిల్వ ఉన్న నీటిని విడిచి పెట్టి వరదను తట్టుకుని , వాయిదాల్లో విడిచి పెట్టే అవకాశమున్నా అందాక నిద్ర పోయిన రోసయ్య ప్రభుత్వ పనితీరు భేష అంటే ఇక ఏమనాలి. ముంపుకు గురైన ప్రజలకి 3 రోజుల దాక కనీశం త్రాగు నీటికైనా ఏర్పాటు చెయ్యని ప్రభుత్వం పని తీరు భేష్ అంటే సోనియా కంటి చూపుకి ఏదో లోపం వాటిల్లినట్టే.

జగన్ నల్లమల సంతాప సభలో సోనియా, కాంగ్రెస్ పేర్లెత్తకుండ మంచి చెక్ పెట్టారు. కాని సోనియా బొమ్మ ఉన్న దిజిటల్ బ్యేనర్ చించి వేతతో ఆందోళనకు గురై ప్రకటన చేసి చులకనయ్యేరు. కడప పార్టి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఇంకో తప్పిదం చేసేరు. వెను తిరిగి పరుగు తీసే కుక్కను చూస్తే తరుముకొచ్చే కుక్కలకు లోకువట. ఆ చందాన ఉంది జగన్ తీరు.

మిత్రమా ! నువ్వు కుక్కవు కాదు ఆంథ్రా పులి కన్న పులి బిడ్డవు. విధేయతను చేతగాని తనంగా పరిగనించే వారి పట్ల విధేయత చేతగానితనంగ్గానే పరిగనింప బదుతుంది.

ఇది మంచి తరుణం. ఇది మించి పోక మునుపే వై.ఎస్. పేరుకున్న పవరేమిటో చాటు. వరద బాధిత ప్రజల మద్య తిరుగు. వారికి చేతనైనన్ని చెయ్యి. చెయ్యించు. రోసయ్య సరి కదా సోనియా గుండెల్లో రైళ్ళు పరుగిడుతుంది. నేస్తం ! నువ్వేదో ఒంటరి వాడని వారిలాగే నువ్వూ ఆలోచిస్తున్నావు. నీ వెంట వై.ఎస్. ఆత్మ ఉంది. నాలా పార్టీలకు అతీతంగా వై.ఎస్.ను అభిమానించే అసంఖ్యాక మానవతా వాదులమున్నాం.

ఇక విధేయత వద్దు. ప్రకటనలొద్దు. ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే చలి కాంచుకున్నాడట మరెవడో. ఆ చందాన ఐదు జిల్లాల ప్రజలు వరదలకి కొంప,గోడు,ఇల్లు వాకిలి, గొడ్డు గోదా పోయి కట్టు భట్టలతో అలో లచ్చనా అంటుంటే సి బ్లాక్ లోకి ప్రవేశిస్తున్నాడా పెద్ద మనిషి. మరి రాణి వారు రాక సందర్భంగా.

అన్నయ్య ! చాలించు నీ మంచి తనం. ఇక మంచి లేదు, మమత లేదు ,మానవత్వం లేదు. పూరించు యుద్ద శంఖారావం. చేద్దాం సమరం.

RTS Perm Link


One Response  
  • pligg.com writes:
    October 6th, 20094:58 pmat

    ఇండియన్ పొలిటికల్ క్లోసప్ » Blog Archive » జగన్ కేవలం కడప ఎం.పి కాదు కాకూడదు…

    అవును జగన్ కేవలం కడప ఎం.పి కాదు ఆయన సి.ఎం. అభ్యర్ది. నేటికి కాకున్నా రేపటికి ఆయనే సి.ఎం. అటువంటప్పుడు కర్నూల్,కృష్ణా,మెహబూబ్ నగర్ జిల్లాల్లో వరదలంటే రూ.20 లక్షలు విరాళాన్ని సి.ఎం.సహాయ నిధికి ఇవ్వడం. కడప జిల్లాలో వరదలంటే పుట్టిల్లో, ట్రాక్టర్లో పర్యటించ…


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa