SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
వై.ఎస్ .ఆర్ బతికే ఉన్నారు..
September 27th, 2009 by chittoor Murugeshan

డా. వై.ఎస్.అర్ జాతక ఫలాలను ఎన్నికలకు పూర్వం ఒక సారి బ్లాగు డాట్ కాం స్లేష్ స్వామి 7867 వెబ్సైట్ యందు అనలైజ్ చేసి విజయం తద్యం. గతంలోకంటే 20 నుండి 30 సీట్లు తగ్గుతుందని వ్రాసాను. ఆ తరువాత ఆయన జాతకం కథ నేను మరిచి పోయాను. సెప్టెంబరు 2 న వై.ఎస్.ప్రయాణించిన హెలికాప్టర్ మాయం కావడం , సెప్. 3 న పావురాల గుట్ట వద్ద వారి పార్థివ దేహాన్ని కనుగొనడం అందరికి విదితమే .
ఇంతకీ వై.ఎస్.ఆర్ మరణం వెనుక ఉన్న జ్యోతిషాంశాలను ఇప్పుడు చూద్దాం. ఆయన గారిది సింహ లగ్నం. తులా రాశి. చంద్రుడు వ్యయాధిపతి. చంద్రుడికి సంబందించిన సంఖ్య 2 . పదవీ స్వీకారం చేసింది మే నెల 20 న..చిత్తూరు రచ్చ బండ కార్యక్రమానికి వై.ఎస్. భయలు దేరింది సెప్టెంబరు 2 న. ఆరోజు శ్రావణ నక్షత్రం .శ్రావణానికి అధిపతి కూడ చంద్రుడే. పైగా ఆరోజు తేదీలోని సంఖ్యలన్నింటిని కూడితే (2/9/2009) 4 వస్తుంది. ఇందుకఢిపతి రాహువు. చంద్రుడు అంటే నీరు, వాన, రాహు అంటే అనిశ్చిత పరిస్థితి, సస్పెన్స్ ఇత్యాధి. పైగా వారు భయలు దేరాలనుకున్నది సింహ లగ్నాన. కాని భయలు దేరింది కన్యా లగ్నాన. ఇది రాశి చక్రంలో 6 వ రాశి. ఈ రాశి విశేషాలను కన్యా రాశి ఫలితాల్లో చూడగలరు. (కమ్యూనికేషన్సుకు కార్కుడైన బుధుడు స్వక్షేత్రంలో ఉన్నందువలన ఒక ఎస్.ఎం.ఎస్.ద్వారా హెలికాప్టరును గుర్తించకలిగారు.) ఇన్ని వ్యతిరేకాంశాలుండటంతో ఆ ప్రమాదం జరిగింది. కొందరు యమ కాలం పై నింద వేస్తున్నారు. వై.ఎస్.గారిది తులా రాశి. సెప్టేంబరు 26 న ఏల్నాటి శని ప్రారంభం. శని రాశి మారేందుకు 6 నెలలు పూర్వమే భాధిస్తాడన్నది శాస్త్రం.
ఈ లెక్కన రాజ శేఖర రెడ్డి గారికి దౄగ్గణితం ప్రకారం సెప్ట్. 9 న , వాక్యం ప్రకారం సెప్ట్.26 న మొదలు కావల్సిన ఏల్నాటి శని 7 రోజులు ముందుగా తన ప్రభావాన్ని చూపాడు. పైగా సింహంలో ఉన్న శని నాయకులకు హాని చేస్తాడని ప్రతీతి. . అగ్నికి వాయువు తోడైనట్టుగా పరస్పరం శతౄత్వం గల రవి శని సింహంలో కలిసారు. రవి రాజ గ్రహం . పైగా వై.ఎస్.ఆర్ లగ్నాధిపతి రవి. ఆయిన 6,7 కు అధిపథి అయిన శనితో కలవడం కొంప ముంచింది. ఇది కాక మరో రాజ గ్రహమైన గురువు మకరాన రాహుతో కలిసాడు. మేఘాలకు కారకుడైన గురువుతో జల కారకుడైన చంద్రుడు కలవడం, పైగా అయోమయ పరిస్థితిని ఏర్పరచే రాహు వారితో కలవడం ఈ మూడు గ్రహాలు సమ సప్తకంలోని వై.ఎస్.జన్మలగ్నమగు సింహాన్ని వీక్షించటం ఇలా ఎన్నో అంశాలు ఆ మహా మనిషిని పొట్టన పెట్టుకున్నాయి.
పుణ్య ఫలం ఏది ?
డా. వై.ఎస్. తాము బ్రతికున్నంత కాలం అన్ని వర్గాలవారికి మేలే చేస్తూ వచ్చాడు. అంతకు పూర్వం 9 సం.లుగా నరకం అనుభవించిన రాష్ఠ్ర ప్రజలకు ఎంతో ఊరటానిచ్చారు. వై.ఎస్. మానవీయ పథకాలతో ప్రతి కుటుంభంలో ఏ ఒకరోనన్న లబ్ధి పొందిన వారే . మరి ఇన్ని పుణ్యకార్యాలు చేసిన వై.ఎస్. ఇల ఎందుకు పరమపదించాలని కొందరు ప్రశ్నించవచ్చు. కాని ఒక జ్యోతిష్కునిగా ఏల్నాటి శని ప్రభావం ఏమిటో నాకు తెలుసు. పైగా శని మారకాన్ని ఇవ్వడు. అష్ఠకష్ఠాలు పెడతాడు. వై.ఎస్. చేసిన పుణ్య కార్యాలు సతరు ఏల్నాటి శనినుడి విముక్తి కల్గించాయనే చెప్పొచ్చును.
వై.ఎస్.తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన వెంట రాష్ఠ్రమే ఉంది. ఈ రోజు కాకుంటే రేపు ఆయన సి.ఎం.కావడం తధ్యం. అటువంటప్పుడు వై.ఎస్. ఉంటే ఏమైతే చేసేవారో వాటన్నింటిని జగన్ చేసి చూపిస్తారు. అటువంటప్పుడు వై.ఎస్. మరణించినట్టా ? జగన్ రూఫంలో , రాష్ఠ్ర ప్రజల ఆశలకు ప్రతిరూపంగా బ్రతికి ఉన్నట్టా ? మీరే ఆలోచించండి.

 

RTS Perm Link


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa