కన్య,తులా,వౄశ్చిక,దనస్సు,మకర,కుంభ,మీన రాశులవారి భవిష్యత్

6.కన్యా రాశి
రాశి చక్రంలో శతౄ,రోగం,రుణాలను సూచించే 6 వ రాశియగు కన్యా రాశి యందు జన్మించిన మిత్రులారా ! దీంతో మీరు పుట్టి పెరుగుతున్న కొద్ది మీ చుట్టు ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా,ఒకరు అప్పుల అప్పారావుగా, ఒకరు కోర్టు కేసులకు తిరిగే వారుగా తయారవుతారు. మీరు ఏ పనికి పూనుకున్నా అది తగరాళ్ళతో,వాయిదాలతోనే పూర్తి అగును. మీ రాశికి ఎంత మంచి యోగం పట్టినప్పటికి కొంత మెరకన్న శత్రు,రోగ ,రుణ బాధలను అనుభవిస్తూనే ఉంటారుఇందాక మీకు 12 వ రాశిన ఉండి పలు విదాలుగా నష్ఠాలు చే కూర్చిన శని మహాత్ముడు ఈ సెప్. 26 న మీ రాశికే వచ్చి తిష్ఠ వేసి మీ ఆరోగ్యం, బుద్ది కుశలతను సైతం దెబ్బ తీయనున్నాడు. గతంలో శని 12 న ఉండగా మీకు బుద్ది నాశం, అపఖ్యాతి,అవమానాలు వంటి అశుభ ఫలాలిచ్చినప్పటికి రుణాల వసూళ్ళు, అప్పులు తీర్చతం, శతౄవులు కనుమరుగవడం వంటి మంచి పనులు కూడ చేసాడు శని. కాని ప్రస్తుతం మీ జన్మ రాశిలోకి రానున్న శని అనారోగ్యం( నరాలు,పైల్స్,కాలు సంబంధ) మంద బుద్ది, అకాల భోజనం, అకాల నిద్ర, ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు రాలడం వంటి దుష్ఫలితాలను ఇవ్వనున్నాడు. అలాగే శని 7 వస్థానమును వీక్షించుట వలన ఇవే రుగ్మతలు మీ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను కూడ బాధించవచ్చు. వారితో తగువలు రావచ్చును.

7.తులా రాశి
రాశి చక్రంలో ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లను సూచించే 7వ రాశియగు తులా రాశిలో జన్మించిన మితౄలారా !
పై త్లిపిన వారు మీ జీవితాన్ని అత్యధికంగా ప్రభావిస్తుంటారు. గతంలో 11 న ఉన్న శని తాను 4,5 స్థానాలకు అధిపతి కావున తల్లి,ఇల్లు,వాహణం, సాంకేతిక విద్య వగైరాల్లో మేలే చేసాడు. బుద్ది కుశలతతో, అదౄష్ఠంతో కొన్ని పనులను చేసుకో కలిగారు. ఈ నేపథ్యంలో అట్టి శని 12 కు చేరడం పై విషయాలకు ఆటంకమగును. తల్లికి అనారోగ్యం, ఆమెతో విభేదాలు, స్థాన చలనం, చిన్నపాటి వాహన ప్రమాదం, విద్యలో ఆటంకం వంటివి జరుగ వచ్చును.అలాగే దనార్జనలో మీ ఎత్తులు పారక పోవడం, అదౄష్ఠం కలిసి రాక పోవడం,పిల్లల అఋఓగ్య సమస్యలు,వారి స్వతంత్ర ప్రవౄత్తి మిమ్మల్ని అతిగా ఆలోచింప చేస్తాయి. మీ పిల్లలు విద్య,ఉధ్యోగం,వివాహం తదితర కారణాల వలన మీకు దూరమైతే పై చెడు ఫలితాలు తగ్గుతాయి.

మీనం:
రాశి చక్రంలో ఖర్చులు,నిద్ర,రతి (సెక్స్)లను సూచించే పన్నెండవ రాశియగు మీన రాశియందు పుట్టిన మితౄలారా !

రాశి చక్రంలో కైవల్యాన్ని సూచించే మీన రాశిలో జన్మించిన మీకు తొలూత ప్రాపంచిక విషయల్లో ఎనలేని ఆసక్తి కలిగి ఉన్నప్పటికి క్రమేణా ఆథ్యాత్మిక జీవితం వైపుగా మళ్ళి పోతారు. 2007 ఆగస్ట్ 7 నుండి అంతకు పూర్వం మీ కంట కన్నీరు తెప్పించిన వారి కంట నెత్తురు తెప్పించే అవకాశం మీకొచ్చింది. సెప్టంబరు 26 దాటాక ఈ స్థితి మారనుంది. సెప్ట్.26 తరువాత మాత్రం 7 న వచ్చే శని శతౄ బాధ,రోగ బాధ, రుణ బాధలను పునరావౄతం చేసే అవకాశం ఉంది.అందుకు ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ లలో ఒకరో ఇద్దరో కారకులు కావచ్చు. అలాగే 7న ఉన్న శని మీ జన్మ రాశిని చూడతం వలన కాలు, గుదము,నరాలు సంబంధ రోగాలు కలుగ వచ్చును శుచి,శుభ్రతలు కనుమరుగవుతాయి. జాద్యం, మంధత్వం, అకాల భోజనం,అకాల నిద్రా అభివ్రుద్దికి ఆటంకం కల్గించ వచ్చు

వౄశ్చిక రాశి:
రాశి చక్రంలో ప్రమాదాలు, జైలు పాలు,మానసిక క్షోభలు, నిస్సహాయత,అపఖ్యాతిలను సూచించే 8 వ రాశియగు వౄశ్చిక రాశియందు జన్మించిన మిత్రులారా!
మీరు సదా అసంతౄప్తిలోనే ఉంటారు. ఇందులో వాస్తవికతకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రజాధరణకు నోచుకోని రాశి మీది. సాహసాలకు వెనుకాడరు. రక్తం,మంట సంబంధ రోగాలు వెంటాడుతాయి. విద్యుత్,అగ్ని వలన కూడ ప్రమాదం వాటిల్లును. మరి సెప్.26 దాక మీకు జీవన స్థానమగు సిమ్హమున ఉన్న శని 11కు (కన్యకు) రావడం మేలే. గతంలో 10 వ భావంలో ఉంటూ పనుల వాయిదా,సేవకులవలన నష్ఠాలు, వౄత్తి,వ్యాపారాల్లో మాంధ్యం వంటి దుష్ఫలితాలను ఇచ్చిన శని 11కు రావడం శుభ పరిణామమే ! శని మీకు 3,4 స్థానాలకు అధిపతి కావున సోదర లాభం, మనో ధైర్యం,ప్రయాణాల వలన మేలు, కార్య జయం, సంగీతాసక్తి, కల్పించనున్నాడు. అలాగే తల్లి,ఇల్లు,వాహణం,(సాంకేతిక) విద్య వగైరాల్లోను కాస్త ఆలశ్యంగానన్నా శుభఫలితమే ఎదురగును.

దనస్సు:
రాశి చక్రంలో తండ్రి,తండ్రి తరపు భంధువులు,గురువులు, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు, పొదుపు ,ఆస్తులను ,ఆస్తి వివాదాలను సూచించే దనస్సు రాశియందు జన్మించిన మితౄలారా !
పై త్లిపిన అంశాలు మీ జీవితాన్ని మరీ ఎక్కువగా ప్రభావిస్తాయి. గతంలో 2,3 భావాలకు అధిపతియై 9 న ఉన్న శని నిష్ఠూర వాక్కు,కుటుంభ కలహాలు,లావా దేవీల్లో చిక్కులు కలిగించాదు. అలాగే సోదరులు,ప్రయాణాలు, మనో భీతి/ధైర్యం వలన ఆస్తి వ్యవహారాల్లో కొంత ప్రతిష్ఠంభన కల్గించాడు. దాంతో మీ దనం డంప్ అయ్యి ఉంటుంది. అయితే శని సెప్.26 న 10 నకు రావడం మంచిదే. అయితే తగులుకు పోయిన పైకాలు వసూలైనట్టే వసూలై సేవకులు, నీచ కులస్తులు,వికలాంగుల కారణంగా నష్ఠమయ్యే అవకాశం కూడ లేక పోలేదు. ఇన్నాళ్ళు కాళిగా ఉన్నవారు కొత్త వౄత్తి వయాపారాలు ప్రారంభిస్తారు. ఇదివరకే వ్యాపారం చేస్తున్నవారు మరింత పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. ఇదివరకే ఉధ్యోగులై ఉన్నవారికి పని వత్తిడి పెరుగును.

మకరం:
రాశి చక్రంలో వౄత్తి వ్యాపారాలను సూచించే 10 వ రాశియందు పుట్టిన మకర రాసి మితౄలారా ! భగవద్గీతలో శృఈ కౄష్ణుడు చెప్పిన కర్మయోగం మీ రాశివారికి ఇట్టే సరిపోతుంది. మీ కర్మ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో కూడ ఆలోచించి,ఆరా దీసే తీరిక లేక పని పని పని అంటూ పనిలో నిమగ్నమై పోతారు.గతంలో 1,2 కు అధిపతి అయిన శని 8 న ఉంటూ మీ శరీరం, మనస్సు,బుద్ది,ఆత్మలను సైతం క్షోభిబింప చేసాడు. అయినవారికి సైతం కాని వారై అపనిందలు మోస్తూనే వచ్చారు. ఈ నేపద్యంలో శని 9 కి రావడం ఖచ్చితంగా మేలే. సముద్ర గర్భంలోకి మునిగి పోయేవాడ్ని ఒక కెరతం వచ్చి ఒడ్డున పడేసినట్టుంటుంది. అలా ఒడ్డునపడినవాడు వెంటనే పి.టి.ఉషాలా పరుగులు తీయలేడేమో గాని భయిట పడినట్లేగా ? గతంలో మీకు కాకుండా పోయినవి కనీశం మీ ఇంటి దారి పడ్తాయి.అపవాదులు తొలుగుతాయి. కాని నగదు,ఆస్తి డంప్ కావచ్చు. అలా డంప్ అయితే రెండున్నర సం.లకు చేతికి అందక పోవచ్చు. టేక్ కేర్ ! పడమర వైపుగా ఒక ప్రయాణం చేస్తారు. అది నరకమనిపించినా దాని ఫలితం ఖచ్చితంగా కాస్త ఆలస్యంగానన్నా మీకు అందుతుంది.

11.కుంభం:
రాశి చక్రంలో 11 వ రాశియై,లాభాన్ని,అన్నయ్య,అక్కయ్యలను సూచించే కుంభరాశియందు జన్మించిన మితౄలారా !
మీ జీవితం పై మీ అన్నయ్య,అక్కయ్యల ప్రభావం మెండు. ప్రతి విషయంలో నాకేంటి లాభమని ఆలోచించే లాభాపేక్షతో కార్యోన్ముఖులు కావడం మీ నైజం. అయితే లాభ నష్ఠాలు దైవాదీనాలు కదా !
గతంలో 7 న ఉంటూ ఫ్రెండ్,లవర్,పార్ట్నర్, వైఫ్ విషయాల్లో బెడిసి కొట్టిన శని సెప్.26 న 8 కి రానున్నాడు. దీంతో ఆయన వారికి దూరమై ఏకాకి అయ్యి, అపనిందలు మోసే ప్రమాదం ఉంది. శని కారకత్వం వహించే విషయాల్లో నష్ఠాన్ని చవి చూడ వలసి వస్తుంది. పోలీసు స్టేషన్,కోర్టు,ఆసుపత్రి,వల్లకాటికి వెళ్ళవలసి రావచ్చు. శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామి దర్శించడి. నలుపు రంగును వారించి బ్లూ కలర్ ఎక్కువగా వాడండి. ఏ విషయంలోను ముందు పడక నలుగురిలో నారాయణా అంటూ కాలం గడపండి. రిస్కైన పనులు మానండి

RTS Perm Link

2 comments to కన్య,తులా,వౄశ్చిక,దనస్సు,మకర,కుంభ,మీన రాశులవారి భవిష్యత్

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.