SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కన్యా శని ప్రభావం
September 8th, 2009 by chittoor Murugeshan

సెప్టెంబరు 26 మొ. కన్యలో శని ద్వాదశ రాశులవారిపై ప్రభావం
గతంలో సింహ రాశియందుండి డా.వై.ఎస్. వంటి మహానేతలను సైతం పొట్టన పెట్టుకున్న శని మహాత్ముడు సెప్టెంబరు 26 న కన్యలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం మేషం మొ. మీనం దాక ఉన్న ద్వాదశ రాశుల వారిపై ఎలా ఉంటుందో వివరించనున్నాను. అంతకు పూర్వం శని మహాత్ముని గురించి కొన్ని విషయాలను తెలియ చేస్తున్నాను.. నేను తెలియ చేసేదేముంది గాని శని మహత్ముడే మీతో మాట్లాడుతారు. చూడండి సారి ! వినండి.
చదవడానికి అసహ్యంగా ఉన్నా నిజం ఇది. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి నరాల బలహీనత వరకు తీసుకెళ్తుంది.
భగవంతుడు ప్రధాన మంత్రి అయితే నవ గ్రహాలు మంత్రులు వంటివారు. ఒక ప్రధాన మంత్రి తన మంత్రి మండలి లోని మంత్రులకు శాఖలు విభజించి ఇచ్చినట్టే భగవంతుడు కూడ ఈ భువి పై ఉన్న వస్తువులు,రంగాలు, మనుష్యులను 9 భాగాలు చేసి ఒక్కో వర్గం పై ఒక్కో గ్రహానికి పెత్తనం కట్ట పెట్టాడు.

శని శాఖలు:
అలా శనికి క్రింది వాటిపై పెత్తనం చలాయించే శక్తి ఉంది. ఐరన్, ఆయిల్, బండ, గ్రానైట్స్,యంత్ర పరికరాలు, ఎస్.సి.లు , బి.సి.లు, కాళ్ళు, పడంటి దిక్కు, నలుపు రంగు వస్తువులు, దుర్గంధ భరిత వస్తువులు, సెకండ్ హ్యేండ్ వస్తువులు, ప్రజలను పిండి/భాద పెట్టి లాభార్జన గావించే వౄత్తులు (లాయర్, ఫైనాన్స్) పైల్స్, తెల్ల వెంట్రుకలు, మంకు పడటం, జిడ్డు కారటం, నిష్ఠూర మాటలు, మరణ దుఖం, జైలు పాలు కావటం, ఐ.పి.వెయ్యటం, మరణం, మరణ దుఖం, భార్యా ,పిల్లలకు దూరం కావడం, భానిశ వౄత్తి చేయవలసి రావడం (ముఖ్యంగా యూనిఫారం దరించే వౄత్తులు., అవహేళన, అవమానానికి గురి కావడం, మాట తప్పటం, స్థాన చలనం, దుమ్ము దూళి నిండిన ప్రదేశాన నివశించటం, పని చెయ్యడం, కన్న బిడ్డలు సైతం తిరుగుభాటు చెయ్యడం, జెరిమానా కట్ట వలసి రావడం, వౄద్ద మహిళ, నీచ స్త్రీ సాంగత్యం, కార్మికులు, సిబ్బంది చే మోసగించ పడటం, వౄధా ఖర్చులు, త్రిప్పుట అలసట ఇలా వీటన్నింటికి శనియే కారకుడు. కావున శని అనుకూలుడైతే వీటిలోని ఏ అసౌఖర్యము కలగదు. ఒక వేళ ప్రతికూలమైతే ఈ రుగ్మతలన్ని కాకపోయినా ముప్పావు జరిగి పోతాయి.
ఎవరికి అనుకూలం? :

మీ రాశికి శని 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలే. ఇతర రాశుల్లో సంచరిస్తే ఇబ్బందే. ఈ రూల్ ప్రకారం సెప్టెంబరు 26న మారనున్న శని మేషం,కర్కాటకం,దనసు,వ్రుశ్చిక రాశుల వారికి అనుకూలం. తక్కిన రాశి వారికి ప్రతికూలం. శని ప్రభావం రకరకాలుగా ఉంటుంది. తానున్న స్థానాన్ని పట్టి, ఆయా రాశి వారిని శని పట్టి పీడిస్తాడు.
పరిహారం:
శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది తరువాతి టపాలో చెబుతా

గమనిక: శని మారనున్నది సెప్. 9 కే అయినప్పటికి 6 నెలలు ముందుగా అంటే మార్చ్ 9 నుండే ఈ ఎఫెక్ట్ పని చేస్తుంది తస్మాన్ జాగ్రత

RTS Perm Link


2 Responses  
 • James writes:
  September 9th, 20097:01 pmat

  Thank you for the invitation to JoinHands. Unfortunately, the only language I know is english.

  I’m not sure if you are promoting a corruption-free society, but the feeling I get from your written structure seems to suggest this.

  Have you noticed that no political system has a formal ethical component in its political structure; no conscience? The following link takes you to my proposed change in all political structures to introduce a strong ethical component to all societies.

  http://eliminate-all-corruption.pbworks.com/

  Thank you again for the invitation.

  James

 • swamy7867 writes:
  September 10th, 200912:37 pmat

  sir,
  You can log in :
  http://www.sowmyasamaram.blogspot.com

  I had tried to put some stuff in it


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa