SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
తరాలు మారినా తీరు మారని కాంగిరేసు
September 7th, 2009 by chittoor Murugeshan

గతంలో కేవలం వ్యక్తులను ఫోకస్ చేసి (నెహౄ , ఇందిరా ,రాజీవ్) అధికారాన్ని కైవశం చేసుకునే రోజుల్లో ఆదిష్ఠానం స్థానిక నేతల పై పెత్తనం చాలాయించేది. ఇక్కడి సి.ఎం.లను డిల్లీ నిర్ణయించడం వలనే దానిని తెలుగువారి ఆత్మ గౌరవం మీద దెబ్బగా అభివర్ణించి ఎన్.టి.ఆర్ కొత్త శకాన్ని ప్రారంభించారిక్కడ. అయినా ఆదిష్ఠానం బుద్ది తెచ్చుకోలేదు.
డా .వై.ఎస్. ఉన్నన్ని రోజులు ఆయన వ్యక్తిత్వం కారణంగా తోక ముడుచుకుని ఉన్న ఆధిష్ఠాన వర్గం తొత్తులు అటు ఆయన కనుమరుగు అవంగానే తమ నక్క జిత్తులు ప్రారంభించేసేరు.రాజీవ్ మరణ పూర్వం , రాజీవ్ బతికుండగానే మెజారిటికి నోచుకోని స్థితికి చేరుకున్న కాంగ్ పార్టి ధీన స్థితి అందరికి విదితమే. వీ.హెచ్ వంటి వారు కేవలం సోనియా భజనతోనే పబ్బం కడుక్కోవాలని ఇప్పటికి భావించడం హేయంగా ఉంది.
ఒక మహా మనిషి వై.ఎస్. గత ఎన్నికల్లో ఒంటి చేతితో పోరాటం చేసి ,అటు మహా కూటమిని , ఇటు ప్రజారాజ్యాన్ని ఎదుర్కొన్నారు. అప్పుడు ఈ భజణ పరులంతా ఎక్కడ చచ్చారో ఎవరికీ తెలీదు. వై.ఎస్. యువకుడు కాదు. 2009 ఎన్నికలప్పటికి 59 సం.ల వౄద్దుడు. నాడు ఎన్.టి.ఆర్ (తన స్వంత పార్టి ) ఏక చత్రాధిపత్యం చలాయించి తె.దే.పా.ను గెలిపించుకుంటూ వస్తే జాతీయ పార్టి అయినా కాంగ్రెస్ పార్టిని కేవలం వై.ఎస్. ఒంటరి పోరాటం చేసి గెలిపించారు.రాజకీయం అన్నది పెరేడ్ గ్రౌండులో నిర్వహించే పిరమిడ్ వంటిది. శిఖరాన ఉన్న వ్యక్తే ప్రేక్షకులకు కనబదుతాడు. కాని అట్టడుగున నిలిచిన వ్యక్తులు భలంగా నిలబడి, భారాన్ని మోస్తే గాని శిఖరాన ఉన్న వ్యక్తి నిలబడలేడు.
ఒకప్పుడు ఇందిరా మరణిస్తే వెనువెంటనే రాజీవును పి.ఎం.గా ప్రకటించటం ఏమి .. ఈ రోజు వై.ఎస్. మరణించాక ఆదిష్ఠానం నిర్ణయిస్తుందని నాంచడం ఏంది. రాజీవన్నా పైలట్ గా ఉన్న అతను. కాని జగన్ మీడియా కుట్రను తిప్పికొట్టడానికి సాక్షి పత్రిక & టివి నెలకొల్పాడు. ప్రత్యర్దుల ప్రచారాన్ని, మీడియా కుట్రను తిప్పి కొట్టాడు.

కడప ఎం.పి.గా భారి మెజారిటితో గెలిచాడు. ఇంకే అర్హత కావాలో సి.ఎం.పదవిని అదిష్ఠించటానికి. డి.ఎస్.వంటి వారు తమ స్వంత నియోజిక వర్గంలో నే గెలవలేని అసమర్థులు. వారు ఈ రోజు నంగ నాచి మాటలు చెప్పడం హాస్యాస్పదం. ఒకప్పటి ప్రత్యర్ది నేదురుమల్లి సైతం జగన్ అభ్యర్దిత్వాన్ని మెచ్చుకుంటుంటే కేవలం వై.ఎస్. పెద్దరికంతో కొనసాగిన డి.ఎస్. ఇలా నోరు జారడం సిగ్గు చేటు.

ఇప్పటికి మించి పోయిందేమి లేదుగత ఎన్నికల్లో కమ్యూనిస్టులను దూరం చేసుకుని , అమైకా భూట్సు నాకాలని నిర్ణయించి పార్టి పేద బడుగు వర్గాలకు దూరమైతే కేవలం వై.ఎస్. వ్యక్తిత్వం, వై.ఎస్. చెరిస్మా, విశ్వసనీయత, ఆయన గారి మానవతా దౄక్పథం పార్టిని గట్టెక్కించి 33 ఎం.పి.లను సాధించి పెట్టిన సంగతి సోనియ మరిచినట్టున్నారు.
ఇంచార్జి అంటూ ఒక వ్యక్తిని నియమించటం అతను గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ , తానొక గ్రూపు ఏర్పాటు చేసుకోవడమే హేయమైతే, ఆ ఇంచార్జి మాటలను సైతం భేఖాతరు చెయ్యడం మరో సిగ్గు చేటు.

ఇప్పటికి మించి పోయిందేమి లేదు అల నాడు ఇందిరా మరణానంతరం హడావుడిగా రాజీవుని ప్రధానిగా ప్రకటించినట్టే , ఇప్పుడు జగన్ బాబును సి.ఎం.గా ప్రకటిస్తే పెను ప్రమాదం తప్పుతుంది. లేకుంటే రాష్ఠ్రంలోని కాంగ్రెస్ శాఖ స్వతత్రించి కాంగ్రెస్ (వై.ఎస్.)గా కొత్త అవతారమెత్తే అవకాశం లేక పోలేదు

RTS Perm Link


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa