డా. వై.ఎస్.అర్ జాతక ఫలాలను ఇదివరకే ఒక సారి అనలైజ్ చేసి విజయం తద్యం. గతంలోకంటే 20 నుండి 30 సీట్లు తగ్గుతుందని వ్రాసాను. ఆ తరువాత ఆయన జాతకం కథ నేను మరిచి పోయాను. సాటి బ్లాగర్లూ మరిచి పోయారు. ఇంతకీ వై.ఎస్.ఆర్ మరణం వెనుక ఉన్న జ్యోతిషాంశాలను ఇప్పుడు చూద్దాం. ఆయన గారిది సింహ లగ్నం. చంద్రుడు వ్య్యాధిపతి. చంద్రుడికి సంబందించిన సంఖ్య 2 . ఇదిలా ఉంటే ఆయన పదవీ స్వీకారం చేసింది మేయ్ 20 న.
చిత్తూరు రచ్చ బండ కార్యక్రమానికి భయలు దేరింది సెప్టెంబరు 2 న. ఆరోజు శ్రావణ నక్షత్రం అంటే ఇందుకఢిపతి కూడ చంద్రుడే. పైగా ఆరోజు తేదీలోని సంఖ్యలన్నింటిని కూడితే 4 వస్తుంది. ఇందుకఢిపతి రాహువు. చంద్రుడు అంటే నీరు,వాన,రాహు అంటే అనిశ్చిత పరిస్థితి,సస్పెన్స్ ఇత్యాధిని సూచిస్తుంది.
ఇన్ని వ్యతిరేకాంశాలుండటంతో ఆ ప్రమాదం జరిగింది. కొందరు యమ కాలం పై నింద వేస్తున్నారు. పైగా కూడా వెళ్ళిన వారి పేర్లు పరిశీలిస్తే అందులో కుంభ రాశి అతను ఉన్నాడు. వారికి సెప్టెంబరు 26 నుండి అష్ఠమ శని. శని రాశి మారేందుకు 6 నెలలు పూర్వమే భాధిస్తాడు. ఈ లెక్కన రాజ శేఖర రెడ్డి గారి ఏల్నాటి శని ప్రారంభం. పైగా సిమ్హ శని నాయకులకు హాని చేస్తాడు. అగ్నికి వాయువు తోడైనట్టుగా
సిమ్హంలో రవి శని కలిసారు. రవి రాజ గ్రహం . పైగా వై.ఎస్.ఆర్ లగ్నాధిపతి అయిన అయినవాడు అతను శనితో కలవడం కొంప ముంచింది. ఇది కాక మరో రాజ్ గ్రహమైన గురువు మకరాన రాహుతో కలిసాడు. మేఘాలకు కారకుడైన గురువుతో జల కారకుడైన చంద్రుడు కలవడం,పైగా అయోమయ పరిస్థితిని ఏర్పరచే రాహు వారితో కలవడం ఈ మూడు గ్రహాలు సమ సప్తకంలోని వై.ఎస్.జన్మలగ్నమగు సిమ్హాన్ని వీక్షించటం ఇలా ఎన్నో అంశాలు ఆ మహా మనిషిని పొట్టన పెట్టుకున్నాయి.
ఇది కాక వారు భయలుదేరాలనుకున్న లగ్నం సరైందే కాని భయలు దేరిన లగ్నం కన్యా. ఇది రాశి చక్రంలో 6వది. ఇది శత్రు రోగ రుణాలను సూచిస్తుంది ఆరూడ . లగ్నాధిపతి అయిన బుధుడు అక్కడే ఉన్నప్పటికి ప్రమాదాన్ని వారించ లేక పోయాడు. కమ్యూనికేషన్సుకు కార్కుడైన బుధుడు స్వక్షేత్రంలో ఉన్నందువలన ఒక ఎస్.ఎం.ఎస్.ద్వారా హెలికాప్టరును గుర్తించకలిగారుఇలా ఒకటి కాదు నూరు చెప్పవచ్చు. అయినా ఏం లాభం ? ఆ మహనీయుడ్ని కాపాడుకోలేక పోయాం. అందుకే త్వరలో ఇటువంటి వ్యతిరేకాంశం గల గ్రహ సమ్మేళనాన్ని ముందు జాగ్రత చర్యలను తదుపరి టపాలో వివరిస్తాను. అందాక ఆగాలై మరి 