10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

మరణమా ! నీతో నేను కరచాలనం చేసే రోజును నిత్యం గుర్తుంచుకుని జీవించేవాడ్ని. అసలు నువ్వుంటే గాని జీవన గాదలకు రుచి పచి ఉండదని భావించేవాడ్ని. అయినా ..
హే మరణమా ఇప్పుడు కోరుకుంటున్నా ..
నీకో మరణం రావాలని
రాష్ఠ్రం, రాష్ఠ్ర ప్రజలు, పార్టి షిట్ గంగలో కొట్టుకు పోని
టోటల్ గా నా సైకాలజికల్ సెట్ అప్ ని కూల్చేసావ్
అవును నా ఇడియల్ హి ఎన్.టి.ఆర్ మరణాంతరం ఆయన స్థానంలో చూసి మురిసి పోతు ప్రేరణ పొందుతూ వచ్చిన నా అభినవ ఎన్.టి.ఆర్ డా వై.ఎస్.ఆర్ ను పొట్టన పెట్టుకున్నావ్
ఆయన పుట్టిన జిల్లా ,పెరిగిన వాతావరణానికి గత 6 సం.ల ఆయన జీవన విదానానికి ఏదైనా పొంతన ఉందా ? ఎటు వెళ్ళవలసిన వ్యక్తి ఎటో మారి అన్ని వర్గాలవారికి మేలు చేస్తూ కొత్త చరిత్ర సౄష్ఠిస్తుంటే ఇలా పొట్టన పెట్టుకున్నావ్
హే మరణమా ఇటువంటి నేతలను సైతం భలి కొంటావని ఊహించి ఉంటే నీకో మరణం సంభవించాలని కోరుకుని ఉంటాను ..

RTS Perm Link

September 4th, 2009 at 8:15 pm