రాశి ఫలాలు వెలుబడని పత్రికలను వెబ్సైటులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. నిజానికి ఈ రాశిఫలాల్లోని లొసుగులు ఏమిటో ఈ టపాలో చూద్దాం. రాశి చక్రంలోని గ్రహస్థితి తద్వారా కలిగే యోగాలు,అవయోగాలను కారుగా భావిస్తే , జాతక ప్రకారం జరిగే
దశా భుక్తులను రోడ్డుగా భావించవచ్చు. ఇక రాశిఫలాలంటారా ? ఆయిల్ అనొచ్చు. లేదా ముందుకు తోసే గాలి, లేదా ఎదురు గాలి అని చెప్పొచ్చు. అంతకు మించి రాశిఫలాలకు పెద్ద ప్రాధన్యత లేదు.
రాశిఫలాలను తాత్కాలిక గ్రహస్థితిని అనుసరించి గణిస్తారు. తాత్కాలికం అన్న పదాన్ని భాగా గమనించండి.గోచారంలో గ్రహస్థితి ఎంత తాత్కాలికమంటే చంద్రుడు ఒక రాశిలో రెండుంకాలు రోజులే ఉంటాడు .బుధ,శుక్ర,రవి గ్రహాలు నెలరోజులు, కుజ గ్రహం ఒకటిన్నర నెల మాత్రమే ఉంటారు. సరే రాశి ఫలాలు వ్రాసే వారు మేము ఈ గ్రహాలను ప్రక్కన పెట్టి సం.లు తరబడి ఒకే రాశిలో ఉండే గ్రహాలను పట్టే ఫలితాలు చెబుతామని వాదించవచ్చు. సరే ఆ గ్రహాల కథ ఇప్పుడు చూస్తాం.
గురు:
ఈ గ్రహం ఒక సం.పాటు ఒకే రాశిలో ఉంటుంది. ఇది స్థూల సత్యం. మరి కాస్త లోతుగా చూస్తే గురు ఒక రాశిలో తానుండే 12 నెలల కాలంలో మొదటి నాలుగు నెలలు,చివరి నాలుగు నెలలు గట్టి ఫలితాలను ఇవ్వడని శాస్త్రం చెబుతుంది. పోని ఇందులో (మద్య కాలంగా పేర్కొనే నాలుగు నెలల్లో )గురు వక్రి,గురు అస్తమనం వంటివి ఎంత కాలం ? ఆ కాలాన గురు ఆశించిన ఫలితాలను ఇవ్వడుగా ! ఇంకా ఒక రాశి అంటే 30 డిగిరీలు, 9పాదాలు. ఇందులో మూడు నక్షత్రాలుంటాయి. వాటిలో ఆ నక్షత్రాధిపతికి,గురువుకు పగ ఉంటే ? ఇలా ఎన్నో నిభందనలున్నాయి. అయినా గాని రాశి ఫలాల్లో గురువును బ్రహ్మాండంగా చూపిస్తారు. ఇక కొన్ని రాశులకు గురు పాపి అయ్యుంటాడు (ఉ.వ్రుషభమ్,మిథునం,కన్యా,తులా,మకరం,కుంభం ) వీరికి గురుగ్రహం తక్కినర ాశులకు ఇచ్చేట్లు ఒకే విదమైన ఫలితాలను ఇస్తాడా అన్నది ప్రశ్నార్థకమే !
అలాగే శని తన వితీయ భాగంలోనే( 1 1/4 +1 1/4) ఫలితాలిస్తాడు, మేషం,కర్కాటకం,సింహం,వ్రుశ్వికం,దనస్సు,మీన రాశులవారికి పాపి, ఈయన కూడ వక్రిస్తాడు,అస్తమిస్తాడు . నిజమిలా ఉంటె రాశిఫలాలు ఏ మెరకు ఫలిస్తాయో ఆలోచించండి రాహు కేతువులైతే ద్వితీయ భాగాన ( 9+9 నెలలు) మాత్రమే ఫలితాలిస్తారు. ఇంకో రూల్ కూడ ఉంది ఈ చాయా గ్రహాలకు ఒరిజినాలిటి ఉండదు. తమతో మరే గ్రహమన్నా కలుస్తేనే ఫలితమిస్తారు. (ఆ గ్రహం మీకు శుభప్రధమై ఊండాలి/ఆ గ్రహానికి ఆ స్థానం శుభ ప్రదమైయుండాలి/కలిసిన గ్రహం సదరు రాహు,కేతువుల కలయక వలన నిర్వీర్యం కాకూడదు)
కాబట్టే ఒక జ్యోతిష్కునిగా చెబుతున్నా రాశిఫలాలను అతిగా విశ్వసించకండి . వాటిని పట్టి ముఖ్య నిర్ణ్యాలు తీసుకోకండి. దెబ్బ తింటారు.