డబ్బు గురించిన మురుగేషన్ సరి కొత్త అద్యయనానికి ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి హర్షం

jain swamy duha naraచిత్తూరు (ఆగస్ట్ 16)
స్థానిక జెడ్.పి.మీటింగ్ హాలులోఆదివారం జరిగిన పాజిటివ్ థింకర్స్ క్లబ్ సెమినారులో ప్రముఖ రచయిత చిత్తూరు మురుగేషన్ డబ్బు గురించిన మర్మాల పై ప్రసంగించారు. తొలూత”ప్రవర్తనా లోపాలు సరి దిద్దుకునే మార్గాలు శీర్శిక పై ప్రసంగిచిన ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి తమ ఆరోగ్యం భాగా లెనప్పటికి చివరిదాక ఉండి మురుగేషన్ ప్రసంగాన్ని ఆలకించటంతో బాటు మురుగేషన్ సరికొత్త అద్యయనం పై హర్షం వ్యక్తం చేసారు. పాజిటివ్ థింకర్స్ క్లబ్ మరియు చిత్తూరు కృష్ణా జ్వెల్లర్స్ ఆద్వర్యంలో జరిగిన సెమినారులో ప్రముఖ మోటివేటర్ నరసింహారెడ్డి శిలవు నీవే శ్ల్పానివి నీవే అన్న శీర్షికపై ప్రసంగించారు. పాజిటివ్ థింకర్స్ కలబ్ రాష్ఠ్ర్ర కార్యదర్శి జితేంద్ర బాబు జెయిన్ సభ ప్రరంభంలో ప్రముఖులను సభికులకు పరిచయ చేసారు.

ధనాంథ్ర ప్రదేశా సాధిద్దాం : మురుగేషన్ పిలుపు:
సుధాకర్ రెడి ప్రసంగానంతరం మైకు చేత పట్టిన మురుగేషన్ డబ్బు గురించిన మర్మాలను చేధిద్దాం ! దాంథ్ర ప్రదేశ్ సాధిద్దాం ! అని పిలుపునిచ్చారు. మానవుడు ప్రవేశ పెట్టిన డబ్బు మానవుడ్ని ప్రభావించే స్థాయికి ఎలా చేరిందో ,తెలుసుకోవడానికి కారణాలు స్రుష్ఠి ఆదిలో ఉన్నాయని మురుగేషన్ అన్నారు. మహా విశ్ఫోటం తో మొదలైన సృష్ఠిలో మొట్ట మొదటగా ఏక కణ జీవియైన అమీబా ఏర్పడిందని, అది బలిసి రెండుగా విడిపడిందని ఒకే ప్రాణం,ఒకే శరీరంగా ఉన్న స్థితిలో చీకు చింతా,పోటి,అబద్రత,లక్ష్యం ,గమ్యం,ఏమి లేవని, మరో ప్రాణం వచ్చే సరికి ఇవన్నిమొదలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉన్న ఆ ఒక్క సెల్ తనను కాపి చేసుకునే ప్రక్రియలో పొరభాట్లు దొర్లాయని దీంతో కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయని మురుగేషన్ చెప్పారు. ఇలా ఈ ఎవాల్యూషన్ కోతిదాక వచ్చి కోతినుండి మానవుడు వచ్చాడని ఆయన వివరించారు. సఖల ప్రాణాలకు మూలం ఒక్క ప్రాణమేనాని సెల్ టు సెల్ కాపియింగ్ జరిగినప్పుడు ఒకే ప్రాణంగా, ఒకే శరీరంతో ఉన్నప్పటి స్మృతులు లో ఒకే ప్రాణం,ఒకే శరీరంగా ఉన్న స్థితిలో చీకు చింతా,పోటి,అబద్రత,లక్ష్యం ,గమ్యం,ఏమి లేక గడిపిన ఆ నిశ్చింత జీవితం గురించిన స్మ్రుతులు మానవుడి దాక వచ్చాయని మురుగేషన్ వివరించారు.

ఒకే ప్రాణంగా ఉన్న స్థితిని మళ్ళి పొందాలని మానవుడు లోలోన కోరుకుని అందుకు ఆడ్డం తమ శరీరమేనని అపార్ఠం చేసుకుని శరీరాలను వదిలించుకోవడం కోసమే చంపటం,చావటం చేస్తున్నాడని, అసలు మానవుడు ఏ చర్యకు పాల్పడినా ఆ చర్యల వెనుక ఉన్న కోరికలు చంపటం చావడం మాత్రమేనని ఈ విషయాన్ని సైకాలజిస్టులే అంగీకరిస్తున్నారని మురుగేషన్ కుండలు బద్దలు కొట్టారు, మాంసాహారం తినే వారు, భూ ఆక్రమణ చేసే వారి ఉద్దేశం వెనుక కూడ విడిపోయిన వాటిని మళ్ళి అనుసందించాలన్న తపనే ఉందని మురుగేషన్ ఎద్దేవా చేసారు. ఏకమై ఉన్నాం. విడిపోయాం. మళ్ళీ ఏకం కావాలని తపిస్తున్నాం. పునరేకీకరణకు ఈ శరీరం అడ్డమని భావించి చంపటము చావటానికే పరిమితమయ్యాం.

ఆఠవిక జీవితంలో స్థూలంగానే చంపుతూ చస్తూ సంతృప్తిగా జీవించిన మానవుడు సంచార జీవితం సాగించినంత వరకు స్త్ర్రీ పురుషుల నడుమ ఎటువంటి వ్యత్యాసం,తారతమ్యం లేక ఉండేవారు. సెక్స్ అన్నది ఏదో ఒక విశర్జనంగా ఉండేది కాని దానిని ఆస్వాదించే తీరిక మానవుడికి లేదని ఆయన విశ్లేషించారు. స్థిరవాసం మొదలైనాక తీర్చి దిద్దబడిన పొలం ఆస్తిగా మారిందని, అది తన వారసునికే చెందాలని పురుషుడు ఉవ్విళ్ళూరాడని మురుగేషన్ విశదీకరించారు.

స్ఠిరవాసంలో మరణ దర్శనం కాస్త మృగ్యం అయ్యింది. మానవునికి సెక్స్ పట్ల అద్యయనం చేసే తీరిక లభించిందని,వీర్య స్కలన సమయంలో కలిగే బ్లాక్ అవుట్ అనే కాలాతీత స్థితి ఒక బుల్లి మరణమై మానవునిలోని చచ్చే కోరికను సంతృప్తి పరచింది.కాని సెక్సులో స్త్ర్ర్రీ ఎంత బలవంతురాలో అతని అర్థమై వనికిపోయాడని ,ఆటు వారసుల సమస్య, ఇటు సెక్స్ పరంగా తన భలహీనతలతో మానవుడు స్త్ర్రీ యోణిని భంధించలేక ఆమెను బంధించి వేసాడు.

సహ యోధురాలిగా ఉన్న స్త్ర్రీని కేవలం భానిసగా చేసుకున్నాక పురుషునికి స్త్ర్ర్రీతో ఉన్న సఖ్యత దెబ్బ తింది. సెక్స్ ద్వారా తనకు లభించే బుల్లి మరణాన్ని ఆస్వాదించ లేక పోయాడు, అతనికి తన చంపే చచ్చే కోరికలను నెరవేర్చుకోవడానికి మరో ప్రత్యామ్నాయం ఏర్పడింది. అధనపు పంటతో ఉండమార్పిడి వచ్చింది. అందులో అనేక చిక్కులు ఎదురయ్యాయి .ఆ తరువాత భాంగారం వెలిసింది. అదే మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయ్యింది . చిన్న మొత్తాల లావాదేవిల్లొ చిక్కులు రావడంతో వెండి,ఆతరువాత రాగి,ఆతరువాత నోటితో ఊబితే ఎగిరిపోయే కాగితాలు కూడ వచ్చాయి. కాని దనం దనమే. మరణానికి ప్రత్యామ్నాయంగా మైథునం, మైథునానికి ప్రత్యామ్నాయంగా దనం వచ్చాయి. కాని ఉద్దేశం మాత్రం పునరేకీకరణ మాత్రమే. శరీరాలను వదిలించుకోవడం మాత్రమె అని మురుగేషన్ విశ్లేషించారు.

కాని మనమందరం ఇప్పటికే ఒకే ప్రాణంగా ఉన్నామని, ఒకే శరీరంగా ఉన్నామని మనం గుర్తించలేక పోతున్నందుకు కారణం మన అహంకారమే అని ఆయన ధ్రువీకరింఛారు. ఎవరి లోకం వారిదై, ఆ లోకానికి కేంద్ర భింధువులుగా మనమే అయ్యుండటంతో అసలైన లోకంతో అనుసంథానం మరుగున పడిందని మురుగేషన్ వివరించారు.

మనం ఇప్పటికే ఒకే ప్రాణంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ విలీనం కావల్సిన అవసరం లేదని ,విలీనానికి ఆటంకం శరీరాలు కానే కావని , మన అహంకారమే ఆటంకమని మురుగేషన్ చెపారు. అయితే ఇక్కడి స్త్ర్రీ పురుషులు ఏకాకులుగా ఉన్నారని, శారిరకంగా కలిసి జీవించినప్పటికి సైకలాజికల్ గా ఒంటరిగానె ఉన్నారని వారి మద్య కలయకకు అడ్డం వారి అహమేనని మురుగేషన్ తెలిపారు.

స్త్ర్రీని అర్థం చేసుకుని అలనాడు అఠవిక జీవితంలో ఆమె ఎలా సహ యోధురాలిగా ఉన్నదో ఆ హోదాను మళ్ళీ ఆమెకు కల్పిస్తే కాని అనుసంథానం అసంభవమని అభిప్రాయపడ్డారు. ప్రతి స్త్ర్రీలోను పురుషత్వం, ప్రతిప పురుషునిలోను స్త్ర్రీత్వం ఉందని పురుషునిలో వంద శాతం పురుషత్వం, స్త్ర్రీలో వంద శాతం స్త్ర్రీత్వం ఉండి ఉంటే ఈ సమస్యే రాదని, అయితే ప్రకృతి స్త్ర్రీలో 60 % స్త్ర్రీత్వం 40 శాతం పురుషత్వాన్ని, పురుషునిలో 60శాతం పురుషత్వం, 40 శాతం స్త్ర్రీత్వాన్ని ఉంచిందని. దీంతో ఒంటరిగా జీవింఛే స్త్ర్రీ పురుషులు అర కొర మనుషులుగా ఉండి పోతారని. అహంకార రాహిత వైవాహిక జీవితంతో ఈ లోట్లను పూడ్చుకొవచ్చని మురుగెషన్ సలహా ఇచ్చారు. కేవలం వివాహంతోనో, దాంపత్య జీవితంతోను ఈ లోటు పూడ్చ బడదని స్త్ర్రీ ,పురుషులు సమాన హక్కులతో అహంకార రాహిత్యంతో ఒకరినొకరు అర్థం చేసుకోవలసి ఉందని ఆయన అన్నారు.

ఇలా తన ప్రకృతిని, ప్రకృతికి ప్రతినిధి అయిన స్త్ర్రీని అర్థం చేసుకుని అహంకార రాహిత్య జీవితం గడిపిన యెడల ,ఆ రెండు శరీరాల్లో ఒకే ప్రాణాలు ఒక్క ప్రాణంగా కల కలిసి పోతాయని దీంతో పునరేకీకరణ తపన,చంపే,చచ్చే కోరికలు,మాంసాహారం పై ప్రీతి, దన వ్యామోహాలు అపోహలు తొలిగిపోతాయని మురుగేషన్ హితువు పలికేరు. సెక్స్ కోరికలను అనగ త్రొక్కడం వలనే హింస,అధికార వ్యామోహాలు జీవితాన్ని అతలా కుతలం చేస్తాయని మురుగేషన్ గుర్తు చేసారు.

ఇలా డబ్బు గురించిన మర్మాలను అర్థం చేసుకుని అది లక్ష్యం కాదని లక్ష్య సాధనకు ఒక పరికరమేనని అర్థం చేసుకుంటే, అది జీవితం కాదని జీవితాన్ని నడిపే ఇందనమని అర్థం చేసుకుంటే, అది మరణాన్ని ఆపే సంజీవని కాదని మరణముయొక్క సూచికలతో,నీడలతో మానవుడు చేసే యుద్దంలో ఒక ఆయుధమేనని అర్థం చేసుకుంటే డబ్బు గురించిన భ్రమలు వదిలిపోతాయని సంపాదన సజావుగా సాగుతుందని ఆయన అన్నారు.
సంపాదనకు అనువుగా తన శరీరం,మనస్సు,బుద్ది, కుటుంభం (భార్య,పిల్లలు) ,మిత్ర భ్రుంధాలను మలచుకో గలిగితే ఎవరన్నా ఎంతన్నా సంపాదించ వచ్చని మురుగేషన్ చెప్పారు

jain swamy duha nara

RTS Perm Link

10 comments to డబ్బు గురించిన మురుగేషన్ సరి కొత్త అద్యయనానికి ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి హర్షం

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.