డబ్బు గురించిన మర్మాలను చేధిద్దాం, దనాంథ్ర ప్రదేశ్ సాధిద్దామని చిత్తూరు మురుగేషన్ పిలుపిచ్చారు. ప్రతి మానవుడు సచ్చితానంద స్వరూపుని వారసుడని, అతనికి ఆనందంగా జీవించే హక్కుందని ఆయన ఉధ్ఘాటించారు. స్రుష్ఠి ఆదిలోన ఆవిర్భవించిన తొలి ఏక కణ జీవిలోని ఒక్క ప్రాణమే మన అందరి ప్రాణాలకు మూలమని. ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా పోటి, అభధ్రత,కాలం,లక్ష్యం,గమ్యం లేక గడిపిన ఆ నిశ్చింత జీవితం గురించిన తియ్యటి స్మ్రుతులు ఇంకా మన మస్తిష్కపు పొరల్లో దాగి ఉందని ఆయన వివరించారు. పోటి, అభధ్రత,కాలం,లక్ష్యం,గమ్యం ఇవన్ని మరో ప్రాణి ఉంటేనే సాధ్యమని అవి లేని ఆ నిశ్చింత జీవితం మనిషిని మళ్ళి ఆ స్థితిని పొందటానికి ప్రేరేపిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికే మనమందరం ఒకే ప్రాణంగా ఉన్నామని , మన మద్య భలమైన అనుసంథానం ఉందని అయితే దానిని మన అహం కారణంగా గుర్తించ లేక పూతున్నామని మురుగేషన్ చెప్పుకొచ్చారు. అయితే మానవుడు మళ్ళి ఒకే ప్రాణంగా మారడానికి ఈ శరీరాలే అడ్డమని లోలోన భావించి పెద్ద పొరభాటు చేసాడని ఆయన అన్నారు. సైక్రియాట్రిస్టులు మానవుని ప్రతి చర్య వెనుక చంపే/చచ్చే కోరికలు దాగి ఉందని చెబుతుండటం సబబేనని అయితే ఆ కోరికకు కారణం శరీరాలను వదిలించుకుని మళ్ళీ ఒకే ప్రాణంగా ఏకం కావడమేన ని మురుగేషన్ విశదీకరించారు.
మళ్ళీ ఏకమయ్యే ప్రయత్నంలో భాగమే రతి అన్నారాయన. స్థిరవాసం కారణంగా ఆస్తి ఏర్పడిందని, ఆస్తికి వారసుడు కావాలన్న తపనతో పురుషుడు స్త్రీ పై అనచివేత మొదలు పెట్టి ఏకాకి అయ్యాడని మురుగేషన్ గుర్తుచేసారు. స్త్రీ అనచి వేతతో ఆమె పై పూర్తి విశ్వాశం ఉంచ లేక పోయిన పురుషునికి రతి పెద్దగా రుచించక పోయిందని.. అందుకు ప్రత్యామ్నాయంగా డబ్బును ఎన్నుకున్నాడని మురుగేషన్ విపులీకరించారు. రతితో ఏవైతే సాధ్యమో అవన్ని డబ్బుతో కూడ సాధ్యమని, రతి కూడ సాధ్యమని మానవుడు సబ్ కాన్షియస్ గా భావించి డబ్బుకు ఎనలేని ప్రాధన్యత ఇస్తూ తాను ప్రవేశ పెట్టిన డబ్బుకు తనే దాసోహమయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు.
డబ్బును కేవలం డబ్బుగా చూస్టే ఎవరన్నా సంపాదించ గలరని. కాని డబ్బును సర్వ రోగ నివారణిగా ,సంజీవణిగా భావించి ఆత్రుతతో ప్రయత్నిచటం వలనే ఆ ప్రయత్నం బెడిసి కొడుతుందని ఆయన అన్నారు.
మానవుడు డబ్బును మరణం యొక్క ప్రతీకలతో తాను చేశే యుద్దానికి ఆయుధంగా భావిస్తాడని ఆయన ఎద్దేవా చేసారు. చీకటి,అవిద్య,ఒంటరితనం,కాలచక్ర కదలిక,ముసలితనం, నిరాకరణ, అవమానం ఇలా అన్నింటిని మరణంతో ముడి వేసి ఆలోచించి వీటిలోనుండి డబ్బు తనను రక్షిస్తుందని భావించే సంపాదనకు పరిమితమైటూ మచ్ ఈజ్ ఆల్వేస్ బ్యేడ్ అన్న చందాన ఆ సంపాదనలో సైతం ఓటమిని చవి చూస్తాడని అన్నారు. సంపాదనకు అనువుగా తన శరీరం,మనస్సు,బుద్ది,, కుటుంభం, మిత్ర భ్రుంధాలను మలచుకోగలిగితే సంపాదన అందరికి సాధ్యమేనని ఇంకా సంపాదనకున్న ఆటన్కాలను ఎలా అధిగమించాలీ అన్న విష్యాన్ని అన్ని కోణాల్లో నుండి స్థానిక చిత్తూరు – వేలూర్ రహదారిలోని జడ్.పి. మీటింగ్ హాలులో జరుగనున్న సెమినారులో వివరించనున్నానని మురుగేషన్ చెప్పారు. స్థల భావం కారణంగా వేదిక మారిందని ప్రతి ఒక్కరు సెమినారుకు హాజరై లభ్ది పొందాలని కోరారు.ఈ సెమినారు నిర్వహణను స్పాన్సర్ చేస్తున్న చిత్తూరు క్రుష్ణా జ్వెల్లర్స్ వారికి పాజిటివ్ తింకర్స్ క్లభ్ వారికి మురుగేషన్ క్రుతజ్ఞతలు తెలిపారు