మాయా – 2వ భాగం

ఒక్క మాట:

నా బ్లాగుకు ప్రతి రోజు 200కు పైగా హిట్స్ వస్తున్న రోజుల్లో మాయా అంటూ ఒక నవల మొదలు పెట్టి బ్లాగుయొక్క టెంపో తగ్గి పోతుందేమోనని భయపది  సగంలో ఆపేసాను. ప్రస్త్తం ఎలాగో హిట్స్ భారిగా తగ్గి పోయాయి. నేను ఏమి వ్రాసినా భరించేవారు యాభ మందిదాక ఉన్నారు. వారు నా పాఠకులు. ఎలాగో జస్ట్ లైక్ దట్ చూసెళ్ళి పోయేవారు వెళ్ళి పోయారు. మిగిలిన నా పాథకుల నిమిత్తం అప్పట్లో ఆపేసిన నవలను మళ్ళి మొదలు పెట్టాలనుకుని ఇది వ్రాసాను. ఈ అద్యాయం చదివి కుతూహలం పుడితే గత భాగం చదువుతారో. లేదు మొదట మొదతి భాగం చదివి ఆ తరువాత ఈ చేప్టర్ చదువుతారో అది మీ ఇష్ఠం. మాయా -భాగం1 కి సంబందించిన లింకు దిగువ ఇచ్చాను. దానిని చదువ కోరువారు క్లిక్ చెయ్యండి !

http://blaagu.com/swamy7867/2009/02/28/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE-a-novel/

http://blaagu.com/swamy7867/2009/02/28/మాయా-మాయా-a-novelమాయా-మాయా-a-novel/

“మాయా  నేను చెప్పేది విను నీ మాట నీ పోకడ అన్ని కొత్తగా ఉన్నాయి. అది మాత్రం వద్దు మాయా ”
“ఏరా మన మద్య అన్ని జరిగాయి కదా.. ఇదీ జరిగి పోని తప్పెముంది.”
“నీ గురించిన స్మ్ర్రుతులను సమ్ తింగ్ స్పెషల్ గా నా మదిలో దాచుకోవాలనుకుంటున్నాను.మరి నిన్ను ఆ లిస్టులో పడెయ్య లేను”
“ఏం అంత పెద్ద లిస్టుందా ? ”
“అదేం గొప్ప కాదు మాయా ! దేవుడు శారీరకంగా నన్ను మగవానిగా పుట్టించాడు. కాని మానసికంగా స్త్ర్రీకంటే చాలా పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. మరీ నీ విషయంలో ఐ యాం వెరి పర్టికులర్ అబవుట్ ఇట్”
“నువ్వే చెబుతున్నావు సమ్ తింగ్ స్పెషలని.. శీలంతో ఉండి పోవాలని నీ గురించీ గొప్పగా చెప్పుకున్నావు. పోనీ నాతోనే ఉండి పో నా వానిగా ఉండి పో”
“అంటే నువ్వు నన్ను ఉంచుకుంటావన్న మాట”
“పోనీ.. నీకా దమ్ముంటే నన్ను నువ్వు ఉంచుకో”
“దమ్ము దైర్యాలకు సంబంధించింది కాదిది. ఒక ఆడా మగా మద్యలో గల సంబంధంలోని హూందాతనం సెక్స్ తరువాత కాస్తన్నా దెబ్బ తింటుంది. ఇది నా అనుభవం”
“అదేంటి..మదనకామరాజులా ఎన్నో కథలు చెబుతావు. ఇప్పుడేమో హూందాతనం అంటూ కోతలు కోస్తున్నావు. సంబంధం దెబ్బ తింటుందంటున్నావు”
“అయ్యో ! నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. నేను సెక్స్ ను చాలావరకు అవాయిడ్ చేస్తాను. ఎందుకో తెలుసా. స్త్ర్రీ పురుషుల సంబంధంలో అదే క్లైమేక్స్ అన్న తప్పుడు సమాచారం మానవ మస్తిష్కాల్లో ఇమిడి ఉంది. క్లైమేక్స్ కాస్తా అయిపోతే ఆ సంభంధం క్రమేనా క్షీణించి పోతుంది. ఐ కెనాట్ టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ ఫాల్ ఇన్ అవర్ రిలేషన్”
“ఒరేయి ఒరేయి ! నీకో రహస్యం చెప్పనా.. ఈ ముప్పై రెండు సం.ల వయస్సుకి నేనిప్పటికీ విర్జిన్. ఏవో పిచ్చి విశ్వాసాలతో ఎదురు చూపులతో ఇలా బ్రతికి పోయాను. నేను నన్ను నీకు అర్పించటం లేదురా. నన్ను ఏలుకోమని ప్రాధేయ పడటము లేదు. అదేదో ఒక సారి చూడాలని ఉంది. కమ్మాన్ ఐ సే !”
ఎప్పుడు నా పక్క చేరిందో నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను అమ్మా అని మొలిగాను. మాయ చటక్కున పై తొలిగింది. మాయా నన్ను కౌగిలించుకోవడం కొత్తేమి కాదు. మా అన్నయ్యకు అప్పుడే బట్టతల వచ్చిందని ఓ సార్  చెబితే నువ్వా చెట్టు కాయేగా నీకు మొదలైందేమో చూద్దామని నా తలను తన ఒడి అంచుకుని నా జుట్టు నిమురిందొక సారి.

ఇంకో రోజు కొత్త  మిక్సి తెచ్చి ప్లగ్ పెట్టగానే ప్లగ్ లో స్పార్క్ వచ్చి కాసింత ఫ్లేమ్ వస్తే ప్లగ్ పెరికి చెయ్యడానికి నేను అడుగు ముందుకేస్తే నన్ను గట్టిగా పట్ట్కుని వారించింది ఒక సారి

సరిగ్గ్గ్గా ఆసమయానికి కరెంట్ పోవడంతో ఆ కౌగిలి అర్దాంతరంగా ముగిసింది. కాని ఇప్పుడు మాయా కౌగిలిలోని వ్యత్యాసం ఆమె వేడి ఊపిరిలోని  భిన్నత్వం నాలో రెండు రఖాలైన ఆలోచనలను ప్రేరేపించింది. ఒక వైపు నాలోని మ్యెన్ ఈటర్ కొత్త ఫీస్ట్ హేవ్ ఇట్ అంది. మరో వైపు ఇలా అన్నింటా మినహాయింపుగా ఉన్న మాయను సైతం స్త్ర్రీని చేసి పోగొట్టుకుంటున్నానన్న దుఖం నన్ను ఆవురించింది

నా నోట పగిలిన అమ్మ అన్న మొలుగుతో చటుక్కున పక్కకు జరిగిన మాయ ” ఏయ్ ఏమైంది నీకు అంది” నా కంటి చివర నీటి బొట్టు చూసి “పిచ్చివాడా కేవలం సెక్స్ తో దెబ్బతినే హూందాతనం గల రిలేషన్ ఎప్పుడన్నా అది లేకున్నా దెబ్బ తింటుందిరా నీ మీద ఒట్టు .మనం ఎప్పటికి ఇలానే ఉంటాం. మన మద్య ఇది జరిగినా జరగక పోయినా” అంటూ నా కళ్ళ మీద తన పెదాలను పెట్టి కన్నీటి బొట్టును జుర్రింది.

నేను స్విచ్ బోర్డు మీద ఉంచిన సిగరట్ అందుకొని వెలిగించాను. ఆలోచించడం మొదలు పెట్టాను. మాయ కాఫితో వచ్చింది. కాఫి అందుకుంటూ “మాయా! నాకర్థం అయ్యింది. వీడు మనకోసం దెబ్బలు తిన్నాడు . ఈడికి ఏదో ఇవ్వాలనుకున్నావు అంతేగా” అన్నాను

నా ప్రక్కన వచ్చి కూర్చున్న మాయ నా ముంగురులు నిమురుతూ ఏయ్ రాక్షసుడా ! నీకున్నది బుర్రేనా exray నా ..” నేను చెప్పాను

” చూడు మాయా ! నీలో క్రుతజ్నతా భావం ఉప్పొంగితే మరో కప్ కాఫి ఇవ్వు. ఓపికుంటే చకోడీలు చేసి పెట్టు .నీకు సెక్స్ మీద ఉన్నది కేవలం క్యూరియాసిటి అయితే నెలాగు. మంచి అమ్కుల్ నైనా చూసి పెళ్ళి చేస్తా. లేదు నీకున్నది కేవలం అర్జ్ మాత్రమే అంటావా  సెక్సువల్ అర్జ్ అన్నది కేవలం ఒక ఇబ్బంది మాత్రమే . దానికొరకు మన రిలేషన్ ను చెరపకు”

మాయ ముఖం ఎర్రబడింది.”షిట్ ! ఎందుకొచ్చావురా నా జీవితంలోకి ? నాకు ఎందుకింతగా దగ్గరయ్యావు ? నువ్వు దగ్గ్రరయ్యాక మరే మగవాడ్ని చూసినా నాకు అతను మగ పురుగులా అనిపిస్తాడు. అసలు నీతో క్లోస్ అయ్యాక కేవలం వేరే స్త్ర్రీలతో కూడ నేను కలవలేక పోతున్నాను. అటువంటిది కేవలం నా క్యూరియాసిటి కారణంగా ఒక వేళ అది నా కామోద్రేకం యొక్క సూచిక గా కూడ ఉండనీ నేనెలా ఇంకో వ్యక్తిని సహిస్తాను. నా జీవితంలో అనుమతిస్తాను”

RTS Perm Link

2 comments to మాయా – 2వ భాగం

  • Is this a fictitious story or happened in your real life?
    What happened no frequent posts now a days?

  • ఈ మద్య నా తెలుగు రచనలకు స్పందన బాగా తగ్గింది. ఇటీవల నా తమిళా బ్లాగ్ పై ద్రుష్ఠి సారించి దానిని 29 వ ర్యేంకుకు తేగలిగాను. ప్రస్తుతం ఒక ఆడియో ఫైల్ పెడుతున్నాను వినండి. శీర్షిక డబ్బుగురించిన మర్మాలు

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.