SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
అద్రుష్టాన్ని తెచ్చి పెట్టే పేర్లు ?
August 5th, 2009 by chittoor Murugeshan

అద్రుష్టాన్ని తెచ్చి పెట్టే పేర్లను ఎలా కుదుర్చుకోవడం ? ఈ ముక్క భాగా అర్థం చేసుకొండి పేర్లను ఎలా మార్చుకోవడం అని చెప్పడము లేదు. ఎలా కుదుర్చుకోవాలనే చెబున్నాను.ఎందుకంటే పేర్లు మార్చుకోవడం వలన ఉపయోగం లేనే లేదని వాదించను. ఫలితం ఉంది .

కాని దాని పలితం ఎప్పుడు అందుతుందో చెప్పలేము. పైగా మార్చిన పేరుకు సంబంధించిన దుష్ఫలితాలు మాత్రం వెంటనే వచ్చేస్తాయి. శుభఫలం మాత్రం చాలా ఆలస్యంగా అందుతుంది. ఇది నా వ్యక్తిగత అనుబవం.

నా పేరు ఎస్.మురుగన్ . దానిని ప్రముఖ సిని దర్శకుదు కె.భాగ్యరాజ్ నడిపే భాగ్యా వార పత్రికలో నా మొదటి కథ ప్రచురణకు ఎంపికైంది. పొరభాటుగా నా పేరును చిత్తూర్ .ఎస్,మురుగేశన్ అని ముద్రించి వేసారు. అదే నా మొదటి కథ . మళ్ళీ మరో కథ ప్రచురణకు నోచుకుంటుందో లేదో తెలీదు, చెప్పులకు తగినట్లు కాలు కోసుకున్న చంద్దాన నా పేరు మార్చుకున్నాను. (ఇది జరిగింది 1987 నవంబరులో)

పాతపేరు:
నా పాతపేరు మురు”గన్”. నా మాటలు తూటాల్లా పేలేవి. ఎదుటి వారు నోరెత్తకుండా నోరు ముయ్యిస్తాయి. చిన్నా పెద్దా తనా పరా భేధాలేమి ఉండవు
మారిన పేరు:
చిత్తూరు.ఎస్.మురుగేశన్గా మారింది. ఒక్క భాగ్యా పత్రికలోనే కాదు నేను ముద్రించే లెట్టర్ హెడ్, విజిటింగ్ కార్డు,కవరు,కరపత్రాల మీద కూడ ఇదే పేరు వాడుతూ వచ్చాను. .గేశన్ అనేది నా పెరుతో కలిసి వచ్చింది. దీనిని గే స్ + సన్ గా విభజించి చూడవచ్చు. నాది కర్కాటక లగ్నం. అధిపతి చంద్రుడు. చంద్రుడు వాయు మూలకు అధిపతి. నాది సింహ రాశి అధిపతి సూర్యుడు. గేస్ అన్నది చంద్రుడ్ని సూచించినట్టే సన్ అన్నది రవిని సూచిస్తుంది.

గేస్ అనే పదానికనుగుణంగా నాలో ఎక్కడ లేని చాంచల్యం,నిలకడ లేని తనం వచ్చాయి. చంద్ర సంబంధ విషయాల్లో ఎన లేని ఆసక్తి కలిగింది. దీంతో సమాజంలో విశ్వసనీయతను పోగొట్ట్కున్నాను. అయితే రవి ఆత్మ కారకుడు కాబట్టి క్రమేనా నా మనస్సు ను దాటుకుని ఆత్మలో వినిపించే గుస గుసలను పసి కట్టడం మొదలు పెట్టాను. ఎక్కడ లేని వ్యక్తిత్వం,ఆత్మ విశ్వాసం ,దాన గుణం, జాఢ్యములోనున్న ప్రజలను జాగ్రుతి పరచడం వంటి గుణాలు నాలో కలిగాయి. 1987 నుండి ఇలా 20 సం.లు గడిచిపోయాక 2006 వ సం.లో ప్రకటనలకే (ఇవి రవి కారకత్వం గలవి) పరిమితమైన ఒక పక్ష పత్రిక ప్రారంభించాను ఏ పత్రికలో(పనిలో) ఉన్నా లేకున్నా స్థిర ఆదాయం వచ్చేలా చేసుకోగలిగాను.

గమనిక: ఇవన్ని మీకు చిత్ర విచిత్రంగా ఉండవచ్చు కాని నేమాలజి పేరిట ఇంతకన్నా పిచ్చి పిచ్చిగా కథలు చెప్పి మోసగించేవారున్నారు. నేనైతే కనీశం జ్యోతిష్య శాస్త్ర్ర సిద్దాంతాలనన్నా ఆపాదిస్తున్నాను. ఇతరులకు అదీ చేతగాదు. @ ది సేమ్ టైం మీ పేరు అన్నది మీరు పుట్టక మునుపే పుట్టింది. మీ పేర్ల్లో ఎందరో పుట్టి గతించి ఉంటారు. పేరు అంటే తమాషా కాదు. మీ పేరులోని ప్రతి అక్షరం దానికి సంబందించిన వైబ్రేషన్ మీ కణకణాల్లో పాతుకు పోయి ఉంటుంది. మిమ్మల్ని కదిల్చి వేసే శక్తి మీ పేరుకుంది. పేరు తనంతట తనె కుదరాలి. అదే శాస్వతం.దాని ఫలితాలే తప్పక నిజమవుతాయి. మనం మనం తలచుకున్నదే తడవుగా మార్చుకున్నంత మాత్రాన ఫలితాలు మారవు.

ఓకేనా. ఇక పుట్టిన పిల్లలకు నేను పేరు ఎలా ఎంపిక చేసి ఇస్తానో దాని మర్మాలు ఇక్కడ వివరిస్తా. మీలో ఎవ్వరు పేర్లు మార్చుకుని అవస్తలు పడకండి. మీకు తెలిసిన వారి ,భంధువుల పిల్లలకు కావాలంటే రెకమెండ్ చెయ్యండి.
ఒక ఉదాహరణతో ఈ విషయాన్ని మీకు వివరిస్తా..
మొదట పరిగణలోకి తీసుకోవల్సింది పుట్టిన తేది 4.3.2008 . ప్రాణ సంఖ్య నాలుగు. ఇది రాహు సంభందించింది. స్థూల సంఖ్య (4+3+2+0+0+8=17 , 1+7=8) 8 వచ్చింది. ఇది శని సంబంధించిన అంకె. రాహు,శని కలవడం వలన ఇబ్బందేమి లేదు.అయితే ఈ కలయకతో శని నిర్వీయమవుతాడు.

ఇక ఆ రోజు ఉదయం 5.05 గంటలకు పుట్టిన ఈ పాప జాతకం చూస్తే బిత్తర పోతారు. ఈమెది మకర లగ్నం . అధిపతి శని. ఈయన కేతువుతో కలిసి ఎనిమిదిన ఉన్నాడు. ఇప్పుడు ఈమెకు పేరు కుదర్చాలి. నాలుగుతో కుదిర్చినా రాహు దనభావంలో అష్థమాధిపతితో కలిసి ఎనిమిదో స్తానాన్నె చూస్తున్నాడు.

మీకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉంటే నిర్ఘాంతపోతారు. లగ్నాధిపతి ఎనిమిదిన ఉంటేనే మహా చెడ్డ. ఆయన శని కాబట్టి నరాల భలహీనత, పైల్స్ వంటి కంప్లెయింట్స్ వస్తాయి. అలాగె స్థిర అభిప్రాయం , వ్యక్తిత్వం లేకుండా ఎవరి చేతైతే వారిచేత ప్రభావించ బడుతూ ఉంటారు తోడుగా కేతు కూడ చేరాడు కాబట్టి ఆమె ఒకటి బెగ్గర్ అన్నా కావాలి లేదా మదర్ థెరీసా అన్నా కావాలి. లేకుంటే రోగిష్టిగా తయారవుతుంది

ఈ రుగ్మతలను కట్టిడి చేసే విదంగా ఈమెకు పేరు కుదర్చాలి. ఎలా ………?

మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. హమ్మయ ! మకర లగ్నానికి ఎంతో కొంతైనా మేలు చెయ్యవలసిన బుధ,శుక్రులు లగ్నంలోనే ఉన్నారు. అయితే సప్తమాధిపతి అయిన చంద్రుడుతో కలిసారు. ఏంచెయ్యాలబ్బా..? బుధ శుక్రులు ఇచ్చే యోగాల్లో స్థిరత్వం లేకుండా చేస్తాడు చంద్రుడు. ఇంతే కాదు 4,11 కు అధిపతి అయిన కుజుడు ఆరున ఉంటూ తల్లి,ఇల్లు,వాహణం , ఎల్డర్ బ్రదర్,సిస్టర్లకు కీడు చేస్తాడు. అలాగే పిత్రు కారకుడైన రవి అష్ఠమాధిపత్యం పొంది ఎనిమిదిని వీక్షించే రాహుతో వేరే కలిసి ఉన్నాడు.

ప్రాణ సంఖ్యా రాహు సంబందం. స్తూల సంఖ్యా శని సంబంధం జాతకంలోనా ఇద్దరు కలిసి ఎనిమిదిన ఉన్నారు. ఇక ఏంచెయ్యాలి ? శని కేతువుతో కలిసి నిర్వీర్యమయ్యాడు. కేతువును డామినేట్ చేసే ప్లేనెట్ ఏది లేదు. ఏమిటి ప్రత్యామ్నాయం ? శత్రువునే శరణం వేడటమే..

కాబట్టి ఈమెకు న్యూమరాలజి ప్రకారం 7 టోటల్ వచ్చేలా పేరు పెట్టాలి. ఇది సర్ప గ్రహం కాబట్టి సర్ప సంభంధ పేరు పెడితే మంచిది. ఈమెది ఉత్తరాషాడా నక్షత్రం మూడవ పాదం కాబట్టి ఆ పేరు “జా” తో మొదలు కావాలి. సర్పసంభంధ పేరు కుదర కుంటే చాయా/నిశి/యోగా/బహళా/నాగా/ వంటి పేర్లు కలిసొచ్చేలా పేరు కుదర్చాలి.

AIJQY – 1
BKR-2
CGLS-3
DMT-4
EHNX-5
UVW-6
OZ-7
FP -8

పరిహారాలు: తండ్రి సూర్య నమస్కారం, గాయత్రి మంత్ర పఠణం, ఆదిత్య హ్రుదయ శ్లోక శ్రవణం
తల్లి సుబ్రమన్యస్వామి మూల మంత్రం జపించాలి:
ఓం సౌం శరహణభవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమ:
కుటుంభ సమేతంగా దుర్గా గణపతి పూజా
పాము వంటి బిళ్ళ మెడలో వెయ్యడం అది ఇబ్బందైతే బెడ్ కవర్ మీద చైనీస్ డ్రాగన్ ఉండేలా చూడాలి

RTS Perm Link


11 Responses  
 • veerudu writes:
  February 17th, 20104:07 pmat

  my name is Veerudu
  D.O.B. : 25-02-1982
  Poorvabhadra – 4 Padam
  Meena Raasi (Pieces Sign)

 • swamy7867 writes:
  February 17th, 20108:40 pmat

  Hi,
  Thank you 4 your query . Call me at 9397036815 after 9 AM To 11

 • [Blocked by CFC] VENKATARAMARAO writes:
  October 30th, 201010:05 amat

  DOB: 10.08.1979, TIME : 11.06 AM, Now i want to change of my name

 • chittoor Murugeshan writes:
  December 7th, 20101:02 amat
 • bala lakshmikanth writes:
  October 25th, 201211:25 amat

  please what name is i will suit tell me

 • SRIKRUTH writes:
  November 20th, 20126:28 pmat

  MY NAME IS SRIKRUTH
  DOB 17-04-2012
  HASTHA-4 PADHAM
  KANYA RASI

 • tangellamudi chittibabu writes:
  November 30th, 20127:33 pmat

  please comment this name

 • shanti writes:
  May 18th, 20162:28 pmat

  na peru santha kumari . sir name jalasutram. aythe na perunu shanti jalasutram ani marchukunna. ekadakellina ide rasthuna.nenu o magzine ki subeditorni andulo kuda alage marcha d

 • shanti writes:
  May 18th, 20162:30 pmat

  aythe na peru ila naku nenuga marchukunna..idi naku suit ayye perena..manchida kaada SANDEHAM

 • chittoor Murugeshan writes:
  October 28th, 20161:08 amat

  అయ్యా /అమ్మా !
  ఉచిత సలహా కోరే వారు ఉత్తరాముఖంగానే సంప్రదించాలి. రిప్ళై కవరు జత పరచ వలసిన అవసరం లేదు. సమాదానం పంపవలసిన మెయిల్ ఐడి సూచిస్తే చాలు. నా చిరునామా:

  చిత్తూరు మురుగేశన్,
  17-201,కుమ్మర వీథి,
  చిత్తూరు ఆ.ప్ర
  517001

 • రవితేజ writes:
  June 5th, 20173:27 amat

  Could you please suggest me any changes are requir my name?


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa