డబ్బు గురించిన మర్మాలు : సెమినర్ ప్రసంగ పాఠం ముసాయిదా

ఆగస్ట్ 16 న చిత్తూరు పట్టణం, బ్రాహ్మణ వీథిలోని గీతామందిరంలో డబ్బు గురించిన మర్మాలు అనే అంశం పై జరుగనున్న సెమినారుకు గాను ముస్తాబు చేస్తుకుంటున్నా రఫ్ గా ప్రసంగ పాథం కూడ తయారు చేసాను. దానిని బ్లాగ్లోకం ద్రుష్ఠికి పెడుతున్నా. ఆసక్తి గలవారు తమ అభిప్రాయం తెలియ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని మార్పు చేర్పులు చేసుకుంటాను..
సచ్చితానంద స్వరూపుని వారసులారా ! డబ్బు గురించిన మర్మాల పై తల పెట్టిన ఈ సెమినారుకు పెద్ద ఎత్తున హాజరై ఈ సత్యాన్ని రుజువు చేసేరు. ఎందుకంటే డబ్బుతో ఆనందం కలుగుతుంది. ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఏ మానవుడైనా ఆనందాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే ప్రతి మానవుడు ఆ సచ్చితానంద స్వరూపుని అసలు సిసలైన వారసుడై యుండటమే !

మీలో చిన్నవాళ్ళున్నారు,పెద్దవాళ్ళున్నారు,సంపాదనలో సక్సెస్ అయినవారున్నారు,కాని వారున్నారు. కాని ప్రతి ఒక్కరికి డబ్బు గురించిన మర్మాలను తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉంది. మనలో చాలా మందుజు డబ్బు అంటె ఏమిటో అర్థం కావడం లేదు .అదెప్పుడు వస్తుందో ,ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు రాదో ,ఎప్పుడు పోతుందో కూడ తెలియడం లేదు . ఇవేమి తెలియకున్నా ప్రతి ఒక్కరం డబ్బు సంపాదింఛాలనే ఉవ్విళ్ళూరుతుంటాం.
ఎందుకు ? డబ్బు అవసరం కాబట్టి అని మీరు చెప్ప వచ్చు. నిజమే డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి ఉంది , కాని అవస్రం మెరకే ,మనకు ఎంత అవసరమో అంతే సంపాదించుకోవచ్చుగా ?

అలా జరగడం లేదే ప్రతి ఒక్కరం అవసరం ఉన్నా లేకున్నా ఇంకా ఇంకా సంపాదించాలని తపిస్తున్నామే..ఎందుకు ? ఈ తపన వెనుకున్న ప్రేరణ ఏది ? ఇంతకీ మనలో ప్రతి ఒక్కరం కాస్తో కూస్తో, ఎప్పుడో ,ఎక్కడో,ఎలాగో సంపాదిస్తూనే ఉన్నాం. అయినా ఇంకా ఇంకా అన్న ఆరాటం ఎందుకు మనలో కలుగుతుంది ? ఈ ఆరాటం వెనుక ప్రేరణ ఏది ? సంపాదించాం ఖర్చులు పెట్టుకుంటాం అనే తత్వం దాదాపుగా ఎవరిలోను లేదే .ఎలాగన్నా దానిని దక్కించుకోవాలనుకుంటున్నాం . ఇంతకీ డబ్బు మరి అవసరానికి మించిన డబ్బు, ఖర్చు పెట్టడానికి ఇష్ఠం లేని డబ్బు ,బ్యాంకు ఖాతాలో,ఇనుప పెట్టెలో మరుగుతున్న డబ్బు మనకు ఏం ఇస్తుంది ? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుస్తే కాని డబ్బు గురించిన మర్మాలను మనం చేధించ లేము.

డబ్బు మానవ జీవన విధానంలో విడదీయలేని భాగమై చాలా కాలమే అయ్యింది. ఒక వస్తువు గురించిన మర్మాలను తెలుసుకోవాలంటే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. మద్యలోనుండి చదవడం మొదలు పెడితే పావలా తెలుగు నవలలు సైతం అర్థం కావు.
డబ్బును స్రు)ష్ఠించింది మానవుడే. మానవుడు డబ్బును స్రుష్ఠించిన నాటినుండి అది మానవావని మనస్సు,బుద్దితో పెనవేసుకుని ఉంది. విడ దీయలేని భాగమైంది. మానవుడు స్రుష్ఠించిన డబ్బు మానవుడిని శాసించే స్థాయికి వచ్చింది . ఇదెలా సంభవమైంది ? తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాదానం చరిత్రలో లేదు..మనో తత్వ శాస్త్రంలోను లేదు. మరెక్కడుంది ? స్రుష్ఠి ఆదిలో ఉంది.

కాబట్టి మనం మావవుని స్రుష్ఠి ఎలా జరిగిందన్న పాయింట్ నుండి ప్రారంభిస్తే కాని డబ్బు ఎలా పుట్టిందో, తనను స్రుష్ఠించిన మానవుడినే శాసించే స్థాయికెలా ఎదిగిందో అర్థం చేసుకోవడం కష్ఠ తరం అవుతుంది.
స్రు)ష్ఠి:
మహావిశ్ఫోటం-ఏక కణ జీవి – జెనటిక్ ఎరర్స్ తో కొత్త జీవాలు – కోతి -మానవుడు
ఏక కణ జీవిగా ఒకే ప్రాణంగా ఆవిర్భవించింది ఏదో అదే అసంఖ్యాక శరీరాల్లోను ప్రవేశించింది. ఒకటే శరీరం,ఒకటే ప్రాణంగా ఎటువంటి లక్ష్యం,గమ్యం,భయం బెంగ,కాలం గురించిన ద్యాస,పోటి,ఆత్మ రక్షణలకు అవసరం లేక నిశ్చింతగా ఉన్న ఆ స్మ్రు)తులు ప్రతి జీవిలోను దాని మస్తిష్కపు పొరల్లో దాగి ఉన్నాయి.ఉంటున్నాయి .ఉంటాయి.
విలీనం:
ఆ స్మ్రు)తులు ప్రతి జీవిని ప్రేరేపిస్తూనే ఉంది . ఈ స్రు)ష్ఠితో విలీనం కమ్మని. ఆవిలీనం ఎలా జరగాలి ? ఆ విలీనానికి అడ్డు ఏమిటి ? జంతువుల కథ వేరేగా సాగుతుంది. వాటికి స్రుష్ఠికి మద్య విలీనం చెదిరి పోలేదు.జంతువుకు జంతువుకు మద్య అనుసందానం చెడి పోలేదు. పెంపుడు జంతువులు సైతం వేరే వేరే యజామణుల చేత పెంచ బడినా వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. గ్రహణకాలంలో కాని భూకంపం జరుగనున్న వేళల్లో కాని వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. ఇందుకు కారణం ఏమంటే వాటిలో నేను అనే అహం లేనే లేదు. మానవునికి దగ్గరగా ఉన్న జంతువుల్లో మానవుని పుణ్యమా అంటూ కొంత వరకు ఈ ఈగో ఉన్నా తన జాతి అందించే సందేశాలను వాటి మస్త్రిష్కాలు ఇట్టే స్వీకరిస్తాయి.స్పందిస్తాయు.

శరీరం పై అలక:
మానవులు ఏ చర్యకు పాల్పడినా వాటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం చావడం లేదా చంపడమే అని మనోవైజ్నానికులు తేల్చారు. ఎందుకు చంపాలి ? ఎందుకు చావాలి ? ఈ స్రు)ష్ఠితో విలీనానికి అడ్దంగా ఉంది కాబట్టి శరీరాన్ని త్యజించాలి అన్న భ్రమ మానవునిలో నాటుకు పోయింది. మాంసాహారుల ద్యేయం కూడ ఇదే. మానవునికి నేను అనే ఈగో పెద్ద తలనొప్పిగా మారింది. ఆత్మకు నకలుగా మారింది. ఆత్మను కప్పివేసే తెరగా,పొరగా మారింది. కొంత కాలానికి ఆత్మంటూ ఏది లేదని వాదించే స్థితికి తెచ్చింది. తన అహం దెబ్బ తింటే తనె మరణించినంతగా క్రుంగి పోతాడు మానవుడు. ఈ స్రుష్ఠికి తనను కేంద్ర భింధువుగా ఊహించుకుని ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ అహం ఇచ్చే ప్రేరణ ఇది. మానవులు పరస్పరం విలీనం కావడానికి స్రుష్ఠితో మమేకం కావడానికి ఈ శరీరాలే అడ్డమన్నతప్పుడు సంకేతాన్ని,సందేశాన్ని ఇచ్చింది మన అహం.

అందుకేనేమో ప్రతి ఒక్కరం ఒకరి అహాన్ని మరొకరు తొలగించటానికి సర్వదా క్రుషి చేస్తుంటాము. అహం తొలిగితే అర్థమవుతుంది. తను ఈ స్రుష్ఠికి కేంద్ర భింధువు కాడని. తను ఇప్పటికే సమస్త స్రుష్థితో విలీనమై ఉన్నాడని.

మరణ భయం:
ఎప్పుడైతే మానవుడు తనను ఈ స్రుష్ఠికి కేంద్ర భిందువుగా భ్రమించడం మొదలు పెట్టాడో /ఎప్పుడైతే అతనిలో అహం పుట్టిందో అక్కడనుండి అతనిని మరణ భయం పట్టుకుంది. స్రుష్ఠి ఒడిలో నిశ్చింతగా ఉన్న మానవుడు కాల క్రమంలో అహం పెంచుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్లేగు వ్యాధి సోకినప్పుడు కూడ లక్షలాది మంది కుప్పలు తెప్పలుగా చని పోయారు ఎందుకంటే మనిషిలో సెల్ఫ్ అనేది చాలా పలుచగా ఉన్న రోజులవి.ఇప్పట్లో కూడ ఒక కోళ్ళ ఫారంలో ఒక కోడికి జబ్బు చేస్టే చాలు ఆఫారంలో ఉన్న వేలాది కోళ్ళు ఇట్టే వ్యాధి సోకి చచ్చి పోతాయి. ఎస్.టి.ల తాండాల్లో చూడండి వ్యాది సోకితే ప్రతి ఒక్కరికి ప్రవలి పోతుంది. ఎందుకంటె వారిలో వారి మద్య కంటికి కనబడని ఒక అనుసందానం ఉంది. వారు తమకు జరుగుతున్నవాటిని ఏమాత్రం ప్రశ్నించ లేనంతగా సెల్ఫ్ లెస్ గా ఉన్నారు. అంటు వ్యాధులు గ్రామాల్లో ప్రవలినట్టుగా నగరాల్లో ప్రవలడం లేదు. ఎందుకంటే మన మద్య అనుసందానం లేదు. ఆ లింక్ ఊడి పోయింది. ఊడ కొట్టింది మన అహం.

పునరభి జననం పునరభిమరణం :
స్ర్ష్ఠిలో మరణమన్నది సర్వ సాధారణమైన ఒక సంఘఠణ. పునరభి జననం పునరభిమరణం. కాని అహంతో నిండిన హ్రుదయం మరణాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకతతో మరణం చాలా భలీయమైంది. ఇలా విశ్వరూపం దాల్చిన చావు భయం ఒక వైపు తరుముతుంది. ఈ మరణ భయం నుండి విడిపడాలంటే ఉన్నది ఒకే మార్గం అది మరణించడం. మరణీంచిన వానికే చావు భయం ఉండదు.

ఒక వైపు మరణ భయం బెంబేలెత్తించినా , మరో వైపు స్రు)ష్ఠితో విలీనానికి అడ్డంగా తాను భావించే శరీరం మరణంతో రాలి పోతుందన్న స్ఫురణ మానవుడ్ని చావుకేసి నడపడం కూడ మొదలు పెట్తింది.
చీకటి మరణానికి ప్రతీక. ఏకాంతం మరణానికి ప్రతీక. ఇతరులతో కమ్యూనికేట్ కాక పోవడం
మరణానికి ప్రతీక .అందుకే మానవుడు అగ్నిని పూజించాడు,సూర్యుడ్ని పూజించాడు. చంద్రుడ్ని పూజించాడు. గుంపులుగనే బ్రతికాడు. అడవులు అతని అంత:కరణంలోని ఇచ్చలు నెరవేరడానికి వీలు కల్పించింది.
చావుతో చెలగాటం – ఏ క్షణమన్నా మరణం- గుంపులుగా జీవనం.

కాలమే కాలుడు: కాలాతీత స్థితియే స్వర్గం:

సెక్స్ లో వీర్య స్కలనం జరిగే వేళ తఠస్తించే కాలాతీత స్థితి మరణాన్ని పోలి ఉండడంతో దాని పై ఆసక్తి
స్త్రీ) 60 శాతమే స్త్రీ) , ఆమెలో 40 శాతం పుంశత్వం ఉంది. పురుషుడు 60 శాతమే పురుషుడు, అతనిలో 40 శాతం స్త్రీత్వం ఉంది. ఏ స్త్రీ) కూడ సంపూర్ణ స్త్రీ) కాదు. ఏ పురుషుడు కూడ సంపూర్ణ పురుషుడు కాడు. అర కొరే ! ఇది వరకే చెప్పినట్టుగా విలీనమే, విలీనంతో నిందుతనమే అంత:కరణంలోని ఇచ్చగా ఉన్నప్పుడు ఇలా అర కొరగా ,అనాధలుగా బ్రతకాటానికి మానవుడు ఎలా ఇష్ఠపడతాడు. అందుకే స్త్రీ) ,పురుషునితో కలిసింది , తనలో ఉన్న పుంశత్వ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేసింది. పురుష్డు స్త్రీ)తో కలిసాడు. తనలో ఉన్న స్త్రీ)త్వ లోటు పూడ్చుకునే ప్రయత్నం చేసాడు. ఇలా సభ్య సమాజం కేవలం శారిరక ఇచ్చలు అని కొట్టి పారేసే సంయోగం మానవునికి ఎన్నో విదాలుగా అతని ప్రాధమిక ఇచ్చను, స్రుష్ఠితో విలోనం కావాలన్న తపనకు ఊరట కల్గిస్తూ వచ్చింది.

సంచారం :
మానవుడు సంచార జీవిగా ఉన్నంత కాలం పెద్దగా సమస్యలు లేక మానవావణి మస్తిష్కపు పొరల్లోని ప్రాధమిక ఇచ్చ నెరవేరుతూ వచ్చింది

స్థిరవాసం:
కొన్ని వేల లక్షల సంవత్సరాలనంతరం స్థిరవాసం ఏర్పరుచుకున్నాడు. సాగుకు అర్హంగా మార్చిన పొలం ,అదనపు పంట వ్యక్తిగత ఆస్తులుగా మారాయి. ఇవి తన మరణానంతరం తన వారసునికే చెందాలన్న కక్రుత్తి మానవునిలో కలిగింది. ఇక స్త్రి) పై అనచి వేత మొదలైంది. కుటుంభ వ్యవస్థ మొదలైంది . సెక్స్ సెకండరిగా మారి వారసుడు ప్రాధమిక లక్ష్యమయ్యాడు. స్త్రీ) బంధీ అయ్యింది. పోరాటమయమైన ఆఠవిక జీవితంలో పురుషునికి సమానమైన భలం పొందియున్న స్త్రీ) ఇంటి పట్ల ఉండి శారిరకంగా బలహీనురాలైంది. భుద్దిపరంగా భలవంతురాలైంది.

ఏకాకి:
ఏకంగా స్రుష్ఠితోనే విలీనం కావాలని కోరుకున్న స్త్రీ) పురుషులు తమలో తామే మానసికంగా విడిఫోయేరు. మానవుడు మరింత సభ్యత సాధించే సరికి సెక్స్ దాదాపుగా నిషేదించ బడింది. సెక్స్ కు ప్రత్యామ్నాయం అవసరమైంది. వాడు చావాలి లేదా చంపాలి ,స్థి)రవాసంతో ఈ అవకాశాలు తగ్గి పోయాయి. యుద్దాలు వచ్చినప్పుడుకదా చంపడాలు,చావడాలు ! సెక్స్ సెకండరి అయ్యింది. ఈ రోజుల్లో లాగా కు.ని ఉండదు కాబట్టి ,యుద్దాలకు వీరులు అవసరం కాబట్టి,పొలాల్లో పని చెయ్యడానికి మానవ వనరులు అవసరం కాబట్టి, పుట్టిన పిల్లలు రోగాల భారిన పడి ఎప్పుడన్నా చచ్చి పోయే ప్రమాదం ఉంది కాబట్టి స్త్రీ) పిల్లలను కనిపెట్టే మెషిన్ గా తయారైంది.

ప్రత్యామ్నాయం:
స్థిరవాసంతో అదనపు పంట ,సాగుకు అర్హమైన పొలం ఏర్పడింది. ఉండ మార్పిడి మొదలైంది. మానవుడు తాను చావడానికి,చంపడానికి, ఈ స్రుష్ఠితో విలీనం కావడానికి మరణం,సెక్స్ లకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్న సమయంలో స్వర్ణం కనుగొన్నాడు. తక్కువ డెనామిషన్లోని లావాదేవికి స్వర్ణం ఉపకరించదు కాబట్టి నాణాలు వచ్చాయి.అదే డబ్బు.

అదనపు పంట ఎలా సాధ్యమైంది ? వాడు చచ్చి సున్నమైతే వచ్చింది. ఆ అదనపు పంటతో డబ్బు వచ్చింది. ఆ డబ్బు సెక్స్ కు ప్రత్యామ్నాయంగా ఉండడం అతని మనస్సుకు భాగా నచ్చింది.డబ్బుతో చావనూ వచ్చు. చంపనూ వచ్చు. అందుకె డబ్బు మీద పడ్డాడు మానవుడు. డబ్బు డబ్బును సంపాదించటం మొదలు పెట్టింది. అంటె పిల్లలు పెట్టింది. అతనిని సమాజంతో కమ్యూనికేట్ చేయగలిగేట్లు చేసింది. ఇంకేముంది డభ్భు మాయలో పడ్డాడు మానవుడు. అందుకు పూర్వం శారీరకంగా ఒక్కసారిగా చచ్చే, చంపే దమ్ము దైర్యం చాలని వాడు వాయిదాలలో చచ్చే వాడు. చంపే వాడు. డబ్బు సంపాదించటానికి ఆ దమ్ము,దైర్యం,అంగ భలం అవసరం లేదు కాబట్టి డబ్బు మానవుడ్ని బలే భాగ ఆ కట్టుకుంది. అది ఎందాక వెళ్ళిందంటే ..అతను ఏ సెక్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ డబ్బును ఎంపిక చేసుకున్నాడో ఆ సెక్స్ నే మరిచి పోయేంతగా ఆకట్టుకుంది.
మిత్రులారా !
ఒకే రోజున రెండు మూడు టపాలు పెడితే దానికి సైతం కొందరు నన్ను దోషిని చేస్తున్నారు . కావున ఈ ప్రసంగ పాఠం మొదటి భాగాన్ని మాత్రం బ్లాగులో పెట్టి తదుపరి రెండు భాగాలు బ్లాగ్ స్పాట్లోని నా బ్లాగ్లో పెట్టాను. క్రింది లింకును క్లిక్ చేశి వాటిని కూడ చదివి మీ అభిప్రాయాలు తెలియ చెయ్యాలని కోరుచున్నాను.
http://swamy7867.blogspot.com/2009/07/1.html

RTS Perm Link

2 comments to డబ్బు గురించిన మర్మాలు : సెమినర్ ప్రసంగ పాఠం ముసాయిదా

 • Venkata Ganesh. Veerubhotla

  I have read all the 3 posts. Below are my suggestions:
  * There is no proper conclusion.
  * All the matter is scattered.
  * It needs a lot more editing.
  * So many points are repeated.
  * You are trying link or map the spiritual, psychological aspects to materialistic thing money, but it doesn’t worked out well. The mapping should be more clear.

 • U r 100 % correct. It is just rough work. Any how I am vexed that just 50+ are reading my posts. So that I hadn’t edited. Actually these are my trails. I am to post original well edited after some time

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.