SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కుండలి చైతన్యం కావడంతో జరిగే అధ్భుతాలు
July 28th, 2009 by chittoor Murugeshan

ప్రతి వ్యక్తిలోను అఖండమైన యోగ శక్తి కుండలి రూపంలో గుదమునకు రెండంగుళాల పైన మూలాధార చక్రమున సర్పం వలే తన తోకను తనే కరచుకుని ఉందని యోగ శాస్త్రం చెబుత్తుంది. కుండలి జాగ్రుతమైతే తటస్థించే అధ్భుతాలను ఈ టపాలో ఉంచి మరో సరి కొత్త చర్చకు శ్రీకారం చుడుతున్నాను.

మనిషిలో అతని స్వాస సూర్య నాడి ,చంద్ర నాడిగా నడుస్తుంటుంది. (కుడి ఎడమ నాశికా ద్వారముల ద్వారా) ఏదైన అరుదైన తరుణంలో అది సూక్మ్ణా నాడి ద్వారా జరుగును. ( భగవత్ ద్యానంలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు/ఏదైన మోయలేని శోకం కలిగినప్పుడు, గురువులు దీక్ష ప్రసాదించినప్పుడు ) అది కొందరికి అభ్యాసం ద్వారా ,కొందరికి గత జన్మల్లో చేసిన అభ్యాసం ద్వారా జరుగును. అలా శ్వాస సూక్ష్మ్ణా ద్వారం గుండా జరిగినప్పుడు కుండలి జాగ్రుతమవుతుంది.

అది ఇందాక స్థితమై ఉన్న స్థానం మూలాధారం. అది భూతత్వం. అలా కుండలి మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నంత వరకు మనిషికి ఈ భూమి మీద ఉన్న వస్తువులపై ఎన లేని ఆకర్షణ ఉంటుంది. అది జాగ్రుతమై స్వాధిష్ఠానమునకు ప్రాకినప్పుడు (జననేంద్రియమును ఆనుకుని) ఇంద్రియ స్కలనం పై నియంత్రణ వస్తుంది. ఎనలేని స్రుజణాత్మకత, స్రుష్ఠికి ప్రతి స్రుష్టి చేసే సామర్థ్యం వస్తుంది , మరి మణిపూరక చక్రానికి (బొడ్డు) ప్రాకినప్పుడు చాంచల్యం చెలరేగి పోతుంది. (కొందరు సిద్ద పురుషులు రెస్ట్ లెస్ గా ఉండటం, తిరుగుతూ ఉండటం , ఎడా పెడా ఊళ్ళు మారడం ఇవి ఈ స్థితిలోనే జరుగుతాయి. ఆ పై కుండలి అనాహతమునకు ప్రాకినప్పుడు (హ్రుదయ స్థానం) తనా పరా భేదం నశించి నిష్కళంకమైన విశ్వ ప్రేమ వికసిస్తుంది. ఆపై కుండలి విశుద్దికి (కంఠము) చేరును. అప్పుడు తన మాత్రు బాషకాని భాషల్లో సైతం, తనకు ఏమాత్రం పట్టు లేని విషయాల పై సైతం అనర్కళంగా బాషించడం ,ముఖ్యంగా ఆశువుగా కవిత్వం చెప్పటం, వాక్ఫలితం ఏర్పడుతుంటుంది. అలాగే సాధకుని మాటలు ఆజ్ఞలుగా శిరసావహించ బడతాయి.
కుండలి ఆజ్ఞా చక్రంలో (భ్రూ మద్యమున) స్థితమైన యెడల కేవలం మాట గాని, సైగ గాని అవసరం లేక కంటి చూపుతో జన బాహుళ్యాన్ని ఆజ్ఞాపించి తలచిన కార్యం కను రెప్ప పాటిలో ఇతరులచే చెయ్యించుకునే శక్తి వస్తుంది.

సాధకుడు ఈ స్థితి వరకే ప్రపంచానికి, మానవ కళ్యానికి ఉపయోగ పడతాడు.కుండలి సహస్రారమునకు ప్రాకిన అహం భ్రహ్మస్మి అంటూ పరమాత్మలో లీనమై పోతాడు. అందుకే భగవంతుడు సాధకునికి కొన్ని మాయా పూరితమైన కోరికలు కల్పించి ప్రాపంచికంగా జన బాహుళ్యానికి ఉపకరించేలా చూస్తాడు. తాను తలచిన క్షణం ఆ మాయా తెరను తొలగించి తన దివ్య దర్శనం గావించి తనలో విలీనం చేసుకుని కైవల్యం ప్రసాధించును.

RTS Perm Link


4 Responses  
 • Venkata Ganesh. Veerubhotla writes:
  July 29th, 20099:09 amat

  Your post is so good. As there are 9 ways to attain mukthi(Nava Vidha Bhakti), what is your way? Also, as per your opinion what suits best?

 • swamy7867 writes:
  July 29th, 200912:42 pmat

  నాది కర్కాటక ల్గ్నం. లగ్నంలోనే గురు ఉచ్చుడై యున్నాడు. దీంతో అన్ని ఎలా జరిగాయో తెలియకనే జరిగి పోయాయి. 1984-1986 మద్యలో అతికామినై ఉన్న నేను సడెన్ గా బ్రహ్మచర్యం పట్ల ఆసక్తి పెరిగి శ్రీ హనుమాన్ భక్తుడనయ్యాను. రామ నామం ఎక్కడ జపించ బడితే అక్కడ హనుమాన్ ఉంటాడని తెలిసి రామ నామం జపించటం మొదలు పెట్టాను. రావనుడిలోని ఏ ఒక్క ప్లస్ లేని ఎదవన్నర ఎదవగా ఉన్న నేను రాముడంతటి వాడిని కాకపోయినా రామ నామం నన్ను నా తల్లికి దగ్గర చేసింది. ఎందుకంటే హరా (శివ)లో చివరి అక్షరం రా, ఉమా లో చివరి అక్షరం మా. రామ నామం జపించటంతో శివశక్తులు ఏకమై భువనేశ్వరి రూపంలో హ్రీంకార భీజాక్షర ఉపదేశం కానిచ్చారు.

  ఇంతకీ నా యత్నం ప్రయత్నమంతా కేవలం సాకులే ..జరుగ వలసినవి జరుగుతూనే ఉన్నాయి. నేనేమి చెయ్యక పోయినా

  మీకేమన్న అర్థమైతే ఒట్టు

 • Venkata Ganesh. Veerubhotla writes:
  July 29th, 20095:18 pmat

  Then you are a lucky person or there is god grace on you 🙂
  I wish you all the best in the spiritual path.
  Does the astrological positions of one also influence the spirituality?
  If by chance if you ever happen to come to Chennai, please let me know, we can meet over here.

 • swamy7867 writes:
  July 29th, 20098:23 pmat

  Thank you


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa