FireStats error : FireStats: Unknown commit strategy

 16 Jul 2009 @ 1:04 PM 

వినియోగదారుల పై వ్యాప్రారస్తుల దోపిడి నానాటికి పెరిగి పోతూనే ఉంది. కన్స్యూమర్ యాక్ట్ 1987 ప్రకారం వినియోగదారునికి కల్పించ బడిన హక్కులు హుళక్కేనా అనిపిస్తుంది. పావలా పెట్టి ఒక వస్తువు కొన్నా మీరు వినియోగదారులే ! మీరు కొన్న వస్తువులో నాణ్యత లోపిస్తే తద్వార మీరు నష్ఠపోతే మీకు సదరు వస్తువును విక్రయించిన వ్యాపరిని ప్రశ్నించే అధికారం మీకుంది. మీకు జరిగిన నష్ఠానికి తగు నష్ఠ పరిహారం పొందే హక్కు మీకుంది. ఈ హక్కు అధికారాలను పొందటానికి మీరు చెయ్యవలసిందెల్లా మీరు కొన్న వస్తువుకు తగిన రశీదు పొందడమే ! ఒక వేళ రశీదు ఇవ్వనని సదరు వ్యావారి చెబితే అతను మీకు విక్రయించనున్న వస్తువులో ఏదో లోపముందని అర్థం చేసుకొండి. కొందరు వ్యాపారస్తులు మిమ్మల్ని బుట్టలోవేసుకోవడానికి రశీదు ఇస్తే తాము ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఆ ట్యాక్స్ తాలూకు సొమ్మ్ మీరు చెల్లించవలసిన మొత్తంలో తగ్గించేస్తానని చెవిలొ పువ్వు పెడతారు. నమ్మకండి. మీకు వారిచ్చే పది శాతం తగ్గింపు ముఖ్యమో వినియొగ దారులుగా మీ హక్కు ముఖ్యమో మీరే తేల్చుకొండి.

ఉదాహరణకు మీరో టి.వి కొనబోతున్నారు. దాని దర రూ.2,600 అనుకొండి. అందుకు మీరు రశీదు తీసుకోకుంటే మీకు పది శాతం తగ్గిస్తానని ఆ వ్యాపారస్తుడు చెబుతాడనుకొండి . మీకు ఎంత ఆదా అవుతుంది రూ.260 మాత్రమే. భవిష్యత్తులో ఆ టి.వి.కాలి పోయిందనుకొండి. రశీదులేకుండా మీరేమి చెయ్యలేరు. మీకే మాత్రం ప్రశ్నించే అధికారం ఉండదు. న్యాయం కోసం వినియోగ దారుల ఫోరం తలుపులు తట్ట లేరు.

రశీదుకు కొటేషనుకు తేడా:
కొందరు వ్యాపారస్తులు తెలివిగా కొటేషన్ స్లిప్ మీద సరకు పేరు దర రాసి (గీకి) ఇచ్చి వేస్తారు. దీనిని అనుమతించకండి.అంగీకరించకండి. రశిదు మీద RECIEPT అని ముద్రించబది ఉంటుంది. పైగా సీరియల్ నెంబరు ఉంటుంది.
కాబట్టి తస్మాన్ జాగ్రత్త !

ఎవరు భాధ్యత:
మీరు ఒక కుక్కర్ కొన్నారనుకొండి.అందులో ఏదన్నా కంప్లెయింట్ వచ్చి మీరు షాపు వారిని ప్రశ్నిస్తే అదేమి లేదమ్మా మేము డీలరుకు వ్రాస్తాం, ఫ్యేక్టరికి పంపిస్తాం అంటారు. అలా అంటే అన్నారు కాని మిమ్మల్ని డీలరు వద్దకో, ఫ్యేక్టరికో వెళ్ళమంటే మాత్రం ససేమిరా ననండి ! మీరెక్కడ సొమ్ము చెల్లించారో వారిదే భాధ్యత సుమండి.

గ్యారంటి Vs వారంటి:
వారంటి అంటే మీరు కొన్న వస్తువులో ఏదన్నా లోపముంటె దానిని వెనక్కు తీసుకుని కొత్త వస్తువు ఇవ్వడం. గ్యారంటి అంటే లోపాన్ని సరిదిద్ది ఇవ్వడం.

నోటీసు:
మీరు కొన్న వస్తువులో నాణ్యత లోపించడం కాని, చెడిపోవడం కాని జరిగితే మీరు ముందుగా నేరుగా వెళ్ళి అమ్మకందారును కలవండి.సమస్య చెప్పండి. అతను తగిన చర్య తీసుకుంటే సరే సరే ! లేకుంటే అరవడం కరవడం చెయ్యకుండా ఇంటికి వచ్చేసి అతనికి నోటీసు పంపండి. (లాయరే పంపాలని రూల్ లేదు. మీరే పంపవచ్చు)
అందులో ఫ్రమ్ అడ్రస్, టు అడ్రసు వ్రాసి సబ్జెక్ట్ వ్యాయవలసిన చోట వినియోగదారుల చట్టం 1987 ప్రకారం నోటీసు అని పేర్కొనండి. ఇక మీ సోదేదో క్లుప్తంగా తెలిపి, నోటీసు అందిన పదిహేను రోజుల్లోపు జరిగిన పొరభాటును సరిదిద్దకుంటే రూ……….. (న్యాయసమ్మతమైన పైకం) నష్ఠ పరిహారం కోరి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగలను. సదరు కోర్టు ఖర్చులతోపాటు పై పరిహారం కూడ చెల్లించవలసి వస్తుందని పేర్కొనండి. దానిని కొరియర్ ద్వార అమ్మకందారుకు పంపండి. (మీరు వ్రాసిన ఉత్తరం ప్రతి (జిరాక్స్) ఉంచుకోవడం మరిచి పోకండి. అలాగే కొరియర్ సంస్థ వారివద్దనుండి మీ ఉత్తరం డెలివరి అయినందుకు రుజువు కలెక్ట్ చేసుకొండి (పి.ఓ.డి అంటారు)

వేచి చూడండి:
ఆవ గింజంత బుర్ర ఉన్నా సదరు వ్యాపారస్తుడు 15 రోజుల్లోపు స్పందిస్తాడు . మీకు న్యాయం చేస్తాడు. చేస్తే సంతోషమే. అలా చెయ్యకుంటె ? చాలా సింపుల్ గా కొండ మీది కోతి దిగి వచ్చేలా చెయ్యొచ్చు

(తదుపరి టపాలో.

RTS Perm Link

Posted By: chittoor Murugeshan
Last Edit: 16 Jul 2009 @ 01:04 PM

EmailPermalink
Tags
Tags:
Categories: politics


 

Responses to this post » (None)

 
Post a Comment

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Please note: Comment moderation is enabled and may delay your comment. There is no need to resubmit your comment.


 Last 50 Posts
 Back
Change Theme...
  • Users » 3443
  • Posts/Pages » 460
  • Comments » 765
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

ABOUT ME



    No Child Pages.