1.వై.ఎస్.బెట్టర్ చాయ్స్ అంటే ఆడి పోసుకున్నారు. వై.ఎస్.కుటుంభ సభ్యులను సైతం దోషులు చేసి మాట్లాడేరు. కాని వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యేరు. వై.ఎస్.పై జగన్ పై నిందలు మోపిన బ్లాగర్లు ఇప్పుడు ఎక్కడకు వెళ్ళారు ? వారి మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ?
2.ప్రజారాజ్యం పప్పులు ఉడకదని 20 నుండి 30 సీట్లు వస్తే ఎక్కువంటే నానా భూతులు తిట్టేరు. ఈ రోజు తల చెడి ఒకే వేదిక పై “చంద్రబాబు మానసిక ఆరోగ్యం పై చింత వ్యక్తం చేస్తూ ,మరో నిమిషం ఒక్క త్రాటి పై ప్రతిపక్షాలను నడపాలని విజ్ఞప్తి చేసే స్థితిలో చిరు ఉన్నారు. ఆరోజు నన్ను భూతులు తిట్టిన ఆసాములు ఎక్కడకు వెళ్ళారు ? వారి మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారు
3.సోనియా త్యాగం గురించి వ్రాస్తే ఆమె త్యాగాన్ని సైతం ఎద్దేవా చేసారు. ఈ రోజు భారత దేశంలోనే అత్యంత శక్తిమంత స్త్రీగా సోనియా ఉంది. సోనియా పై బురద చల్లిన బ్లాగర్లు ఏమయ్యారు వారి మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ?
4.కలిసి ఉంటే కలదు సు:ఖమని తెలింగానా వాదం వ్యర్ధమని చెప్పాను. కె.సి.ఆర్ బాటిల్లీ భూతమని కుండలు బద్దలు కొట్టాను. ఎవరో ఆసామి కలిసుంటే కలదు సుఖమంటే ఇన్ని దేశాలెందుకు అన్ని దేశాలు అమెరికావాని చేతిలో అధికారం పెట్టి నిద్రపోతామని వితండవాదం చేసారు. హెచ్.జి.వెల్స్ వంటి మేధావులు ప్రపంచ సర్కారు గురించి ఇదివరకే ఆలోచించి ఉన్నారు.
5.ఇండియా బాగుపడాలంటే కో ఆపరేటివ్ ఫార్మింగ్ ఒక్కటే మార్గమని నా ఆపరేషన్ ఇండియా 2000 పథకంలో పేర్కొంటే బ్లాగ్లోకంలోని మేధావులెవ్వరు పట్టించుకోలేదు. కాని ఈ రోజు వై.ఎస్. రైతుల సమ్మతితో దానిని అమలు చేస్తానని ప్రకటించి ఉన్నారు.
6.వ్యభిచారానికి చట్టబద్దద గురించి ప్రతిపాదిస్తే నన్నేదో సెక్స్ మేనియాక్లా ఎస్టాబ్లిష్ చేసేరు. ఈ రోజు ఏకంగా హోమో సెక్సులస్ లైంగిక చర్య నేరం కాదని హై కోర్టు సైతం తీర్పించింది.
7.చిత్తూరులో సి.కె.బాబుకు ఎదురులేదని చెబితే సి.కె.పై నీలాపనిందలు వేసేరు. వ్యక్తిగత దూషణలకు సైతం పాల్పడేరు. ఈ రోజు అతని ప్రత్యర్ధి 2004 మొదలు ఖర్చుపెట్టిన 40 కోట్లను సైతం నిర్వీర్యం చేసి సి.కె.బాబు కేవలం ప్రజాభిమానంతో ఎం.ఎల్.ఏ గా గెలుపు పొందారు
ఇప్పటికైనా నా మీద ద్వేషం మాని ,నేను చెప్పేవి చేదనిపించినా అవి సత్యాలని,నేడో రేపో నిజమయ్యేవేనని భావించి చదవాలని ఆచి తూచి స్పందించాలని కోరుతున్నాను
1.వై.ఎస్.బెట్టర్ చాయ్స్ అంటే ఆడి పోసుకున్నారు. వై.ఎస్.కుటుంభ సభ్యులను సైతం దోషులు చేసి మాట్లాడేరు. కాని వై.ఎస్. ముఖ్యమంత్రి అయ్యేరు. వై.ఎస్.పై జగన్ పై నిందలు మోపిన బ్లాగర్లు ఇప్పుడు ఎక్కడకు వెళ్ళారు ? వారి మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ?
Q:అంటే గెలిస్తే తప్పు చెయని మనుషులనా మీ ఉద్దేశం ?గెలవటానికి,దోషి అవునో కాదో నిర్ణయించటానికి తేడా లేదా? సోది చెప్పకుండా సూటిగా సమాధానం చెప్పండి…
ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు. ప్రభుత్వం నడిచేది ప్రజా దనంతోనె. తప్పు జరిగిందని ప్రజలు భావించి ఉంటే శిక్షించేవారుకదా ? తె.దే.పా పరిపాలనకు వచ్చి ఉండేది కదా ? అందుకని నేను నేను వై.ఎస్.రామరాజ్యం నడిపారని వెనుకేసుకు రావడం లేదు. తప్పులు జరిగి ఉంటాయి. అయితే అవి ఈ వ్యవస్థలోని లోపాలవలన జరిగినవే కాని వై.ఎస్. గాని ఆయన కుటుంభ సభ్యులు గాని కావాలని చేసినవి కావు.
మొదట ఎన్నికల సంస్కరణలు జరగాలి. అభ్యర్దుల ఖర్చులను ప్రభుత్వమే భరించే విదానం రావాలి. అవినీతికి భీజం అక్కడే పడుతూంది. ఈ సంగతి ఎవరు మాట్లాడరేం (జె.పి. మాటలు నేను పట్టించుకోను ఎందుకంటే అతను ఈ కుళ్ళి పోయిన వ్యవస్థలో రాజి పడి దశాబ్దాలు తరబడి బ్యూరాక్రట్గా కొనసాగిన వ్యక్తి)