SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
కార్యకర్తలపై పార్టి అధినేతల ద్రుష్ఠి
Jun 28th, 2009 by chittoor Murugeshan

పార్టి అధినేతలకు కార్యకర్తల విలువ తెలియ రావడం మంచి సూచికే . కాని ఇది తూ తూ మంత్రంగా ఉండి పోక కార్యాచరణలో కార్యకర్తలను ఆదుకునే దాకా కొనసాగుతుందా వేచి చూడాల్సిందే. వై.ఎస్.మాట అటుంచితే చంద్రబాబు పరిస్థితి మరి ధారుణమైపోయింది. ఎన్నికల్లో ఓటమి, పార్టిలో అంతర్గత కొమ్ములాటలు ఆయనగారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికారం చేతిలో లేని సమయంలో కార్య కర్తలను ఎలా ఆదుకుంటారో వేచి చూడాల్సిందే.

ప్రజాస్వామ్యంలో కార్యకర్తల పాత్రే కీలకం:
అవును. నాయకులైతే ఏ రోడ్ షోలోనో,భహిరంగ సభలోనో ,ప్రెస్ మీట్లోనో డవులాగులు దంచి వెళ్ళిపోతారు మరి స్థానికంగా ఉన్న కార్యకర్తలేగా వారి మాటలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది. కార్యకర్తల భలమాయా పార్టీలకే కాక టోటల్ గా ప్రజా స్వామ్యానికే ఎంతో మేలు చేసే వీలుంది.

అర్హత:
అయితే నాయకుల్లో ఎన్నో కోవకు చెందినవారున్నట్టే  కార్యకర్తల్లో కూడ నానా రఖాలవారుంటారు. ఏదో చోటా నాయకుడి చుట్టు తిరగడం. ప్రభుత్వ పథకాల అమల్లో దళారులుగా వ్యవహరించటం అయిన కాడికి దండుకోవడం, అలాగే పార్టి అండ ఉందికదా అని క్రైంస్ కు పాల్పడటం వంటివి చేస్తుంటారు.

వడబోత:
ఇట్టి వారు రిగ్గింగులకు పనికొస్తారని, ప్రతిపక్ష పార్టి కార్యకర్తలను అనచటానికి పనికొస్తారని నాయకులు భావించటం షరా మామూలే. కాని వీరి ఆగడాల వలన లాభం కన్నా నష్ఠమే ఎక్కువ.

అంతర్గత ప్రజాస్వామ్యం:
పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తే సాధారణ కార్య కర్త సైతం ఏదో ఒక రోజు ఎం.ఎల్.ఏ.అభ్యర్ధి కావడమో లేక పార్టి అధినేతో కావడానికి అవకాశాన్ని ఏర్పరుస్తే విద్యావంతులు సైతం పార్టీల్లోకి వస్తారు

పార్టి సభ్యత్వం:
ఇప్పట్లో పార్టి సభ్యత్వ నమోదు ఎలా జరుగుతుందంటే ఎవరో చోటా నాయకుని చేతిలో సభ్యత్వ ఫారాలు పెట్టేస్తారు
అతను ఆ ఫారాలను ఫిల్ అప్ చెయ్యించి రాష్ఠ్ర కార్యాలయానికి పంపి వేస్తాదు . జరిగే కథ ఇది.
వెబ్సైట్స్:
ఇప్పట్లో ప్రతి పార్టికి వెబ్సైట్ ఉంది. ఆన్ లైన్లోనే ఒక చిన్న ఆబ్జెక్టివ్ పరీక్ష వంటిది పెట్టి కార్యకర్తలను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే వారు తమలో తాము కమ్యూనికేట్ చేసే వీలు కల్పించవచ్చు. ముఖ్యంగా రాజకీయ కక్షల కారణంగా దాడులను ఎదుర్కోవడానికి ఆత్మ రక్షణ విద్యలు నేర్పవచ్చ్చు. అలాగే కేసులను ఎదుర్కోవడానికి లీగల్ డిపార్ట్మెంట్ ఒకటి ఏర్పాటు చేసి న్యాయ సాయం అందించ వచ్చు.

ఆర్థికం:
అలాగే పాలక పక్షమైనా కాని ,ప్రతిపక్షమైనా కాని తమ కార్యకర్తలను ఆర్థికంగ్గ రాణింప చెయ్యడం కీలకం.
పాలకపక్షం:
పాలక పక్షమైతే ఏవో రెండు రేషన్ షాపులో చిన్నా చితకా కాంట్రాక్టులో ఇచ్చి పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించటం కన్నా వారి సాంకేతిక విద్యలో శిక్షణ ఇచ్చి, లీగల్ గానే బ్యాంకుల ద్వారా రుణ సాయమందించ వచ్చు. ప్రతి వ్యక్తిలోను ఏదో ఒక స్పార్క్ ఉంటుంది. అదేమిటో కనుగొని అతన్నిని అన్నివిదాల అభివ్రుద్ది చెయ్యొచ్చు.
ఇవన్ని ఏ పార్టి చేస్తే ఆ పార్టి పట్ల యువత ఆసక్తి చూపడం తధ్యం

RTS Perm Link

తనకు 58 ఏళ్ళైనా తల్లి మాట జవ దాటాలంటే ఎంతగానో మధన పడేవాడు.
Jun 28th, 2009 by chittoor Murugeshan

బియ్యం ధర 50 రూ కారణాలు
25 సం.లకు పూర్వం చూస్తే బియ్యం కొనేవారు చాలా తక్కువ. మరి సోన మసూరా వంటి హై క్వాలిటి కొనే వారు అరుదు. ఇప్పట్లో ప్రతి ఒక్కరు బియ్యమే కొంటున్నారు. మరి హై క్వాలిటియే కావాలట.
ఎవరి జన్మదినాన్ని ఇంజినీర్స్ డే గా సెలిబ్రేట్ చేస్తారో ఆ విశ్వేశ్వరయ్యా తన కాలంలోనే చెప్పాడు..భారత దేశంలో ఒక కుటుంభంలో ఒకరు సంపాదిస్తే కూర్చుని తినే వారు 10 మంది అని. ఆ సంస్క్రుతి ఇప్పుడు మరి పెరిగి పోతుంది. అప్పట్లో అమ్మాయికి 10 ,12 సం.లొస్తే పెళ్ళి చేసేసే వారు. ఇప్పట్లో ? మగ పిల్లలు ఆ టైంలో 10 , 12 వయస్సులోనే తండ్రికి వ్రుత్తి ,వ్యాపారాల్లో సాయ పడేవారు. ప్రయోజకులయ్యే వారు. ఇప్పుడేమో 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి పెటాకుల్లేక తల్లి,తండ్రి పై పడి బతుకుతున్నారు. కాని రుచులు, అభిరుచులు మాత్రం ఎవరెస్టును తాకుతాయి.

అదే కాక ఒక కుటుంభ పెద్ద ఆర్థికంగా రాణిస్తున్నప్పుడు హై క్వాలిటిలు మెయింటైన్ చేస్తే ఫర్వాలేదుగాని అప్పుల అప్పారావై, దివాళా తీసినా అప్పు చేసి పప్పు కూడు చందాన కుటుంభాలు తయారయ్యాయి.

ఎస్.పి బంగ్లాకి కానిస్టబుల్ అద్దె కొంపకి (కొందరైతే స్వంత ఇళ్ళే) తేడా కనబడదు. అలా తయారైంది సమాజం. అప్పటి పొదుపు, క్రమశిక్షణ ఇప్పట్లో కనుమరుగయ్యాయి. మా నాన్నైతే తనకు 58 ఏళ్ళైనా తల్లి మాట జవ దాటాలంటే ఎంతగానో మధన పడేవాడు.

మరి నేను ? పైగా మనుషులకు పైకి రావాలి, తరువాతి తరంవారు భాగుపడాలి,వంశం నిలబడాలి అన్న ఆలోచనలు ఇప్పట్లో లేనే లేవుబియ్యం ధర 50 రూ కారణాలు
25 సం.లకు పూర్వం చూస్తే బియ్యం కొనేవారు చాలా తక్కువ. మరి సోన మసూరా వంటి హై క్వాలిటి కొనే వారు అరుదు. ఇప్పట్లో ప్రతి ఒక్కరు బియ్యమే కొంటున్నారు. మరి హై క్వాలిటియే కావాలట.
ఎవరి జన్మదినాన్ని ఇంజినీర్స్ డే గా సెలిబ్రేట్ చేస్తారో ఆ విశ్వేశ్వరయ్యా తన కాలంలోనే చెప్పాడు..భారత దేశంలో ఒక కుటుంభంలో ఒకరు సంపాదిస్తే కూర్చుని తినే వారు 10 మంది అని. ఆ సంస్క్రుతి ఇప్పుడు మరి పెరిగి పోతుంది. అప్పట్లో అమ్మాయికి 10 ,12 సం.లొస్తే పెళ్ళి చేసేసే వారు. ఇప్పట్లో ? మగ పిల్లలు ఆ టైంలో 10 , 12 వయస్సులోనే తండ్రికి వ్రుత్తి ,వ్యాపారాల్లో సాయ పడేవారు. ప్రయోజకులయ్యే వారు. ఇప్పుడేమో 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి పెటాకుల్లేక తల్లి,తండ్రి పై పడి బతుకుతున్నారు. కాని రుచులు, అభిరుచులు మాత్రం ఎవరెస్టును తాకుతాయి.

అదే కాక ఒక కుటుంభ పెద్ద ఆర్థికంగా రాణిస్తున్నప్పుడు హై క్వాలిటిలు మెయింటైన్ చేస్తే ఫర్వాలేదుగాని అప్పుల అప్పారావై, దివాళా తీసినా అప్పు చేసి పప్పు కూడు చందాన కుటుంభాలు తయారయ్యాయి.

ఎస్.పి బంగ్లాకి కానిస్టబుల్ అద్దె కొంపకి (కొందరైతే స్వంత ఇళ్ళే) తేడా కనబడదు. అలా తయారైంది సమాజం. అప్పటి పొదుపు, క్రమశిక్షణ ఇప్పట్లో కనుమరుగయ్యాయి. మా నాన్నైతే తనకు 58 ఏళ్ళైనా తల్లి మాట జవ దాటాలంటే ఎంతగానో మధన పడేవాడు.

మరి నేను ? పైగా మనుషులకు పైకి రావాలి, తరువాతి తరంవారు భాగుపడాలి,వంశం నిలబడాలి అన్న ఆలోచనలు ఇప్పట్లో లేనే లేవు

పొదుపు తగ్గి పోయింది. పెగ్గి ఎక్కువైంది. పాప భీతి అసల్లేదు. స్వార్థం పెరిగి పోయింది. తామున్నంత వరకు పిల్లలు బంగారు పళ్ళెంలో తింటే చాలు తమ పాపాలు వారికి చుట్టుకుని వారి అడుక్కు తిన్నా ఫర్వాలేదన్న స్థితికొచ్చేసారు మానవులు.
ఇలాంటి సామాజిక స్థితిగతుల్లో హైక్వాలిటి భియ్యం దర పెరగటంలో వింటేముంది. అసలు ఇలా 365 రోజులు బియ్యం తినే పుట్టిన పిల్లాడికి సైతం షుగర్ వచ్చేస్తుంది. (బియ్యం కార్భోహైట్రేట్ అవుతుంది .అది గ్లూకోస్ గా మారుతుంది. అధనగా ఉన్న గ్లూకోస్ గ్లకోజన్ గా మార్చబడి శ్టాక్ ఉంచ బడుతుంది. అవసరమైనప్పుడు రిలీజ్ అవుతుంది. కాని ఇలా నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని శరీరం కోల్బోయినప్పుడు షుగర్ వస్తుంది)

అలా కాకుండా ఉన్నవాడు లేనివాడు అందరు వారానికి ఒక్కోదినం ఒక్కో దాన్యాన్ని తినడం మొదలు పెడితే హైక్వాలిటి బియ్యం దరేం ఖర్మ అన్ని ధరలు తగ్గు ముఖం పడతాయి. అసలు బియ్యంలో ఏముంది బొందా ? విటమిన్ బి ఉండేది. అది కూడ మెకనైజేషన్ అనంతరం ఊడి పోతుంది. అందుకే ఒక రోజు జొన్న, ఒక రోజు రాగులు, ఒక రోజు గోదుమలు ,ఒక రోజు బియ్యం, వండుకుని తిందాం. ఒక రోజు నిరాహార దీక్ష చేపడతాం. దరలు ఎందుకు తగ్గవో చూద్దాం.

ఇటు పొదుపుకు పొదుపూ ఆయె.. ఆరోగ్యానికి ఆరోగ్యమాయే

RTS Perm Link

వై.ఎస్.కొత్త పంథా ! బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు
Jun 27th, 2009 by chittoor Murugeshan

ఎన్నికలనంతరం వై.ఎస్.లో కొత్త పంథా దర్శనమిస్తుంది. గతంలో అధికారుల పట్ల , గీత దాటే స్వపక్షీయుల పట్ల మెతక వైఖరితో ఉన్న వై.ఎస్. ఇప్పుడు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇది చంద్రబాబు ఫార్ములా. అలాగే వలసలకు ప్రోత్సాహం ఇస్తుండటం కూడ కొత్తే. ఎన్నికలకు పూర్వం చిరంజీవి ఫార్ములా ఇది.
అయితే ఇవి ఎంతమెరకు లాభిస్తాయన్నదే ప్రశ్నార్థకం. కౄష్ణుడు గీతలో చెప్పాడు. “పరదర్మముకన్నా స్వదర్మమే మిన్నా” అని.
వై.ఎస్. ప్రత్యేకత జలయజ్ఞం మరియు సంక్షేమ పథకాలే. ఆయన ఈ రెంటి మీద ద్రుష్ఠి సారిస్తే సరిపోతుంది. పథకం అమలు పై నిఘా ఉంచటానికి వేగతరం చెయ్యడానికి వై.ఎస్. అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తే సరిపోదు. అవి కుంటి గుర్రాలు. కొరడా ఝుళిపిస్తే ఏ గుంతలో తోస్తాయో ఏమో ?

కాబట్టి వై.ఎస్. నిరుధ్యోగులతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారికి ఎంతో కొంత పారితోషికం అందించి వారి ద్వారా సమాచారాలు తెప్పించుకోవడమే మేలు

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa