అవును. స్వలింగ సంపర్కం పై చాందసవాదులు ఎంతగా విరుచుకుబదినా అది ప్రక్రుతి వైపరిత్యం దానిని ఆపు చెయ్యించటం మన తరం కాదు. అందుకని దానికి చట్ట బద్దత కల్పించి చేతులు దులుపుకోవడం నార్మల్స్ సైతం ఆ వ్యసనానికి అలవాటుపడే ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో స్త్రీ,పురుషుల సమతుల్యత దెబ్బ తింటుంది. మానవుల సెక్స్ లైఫే తలక్రిందులయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే స్త్రీ జనాభా పెరిగి పోయి (లింగ పరీక్షలు, స్త్రీ శిశు హత్యలు జరుగుతున్నప్పటికి మగ శిశువులకు ఇమ్మ్యూన్ పవర్ కొరబడటంతో ఇదిలా జరుగుతుంది) పురుషులకు డిమాండ్ పెరిగి అది వరకట్న సమస్యగా తయారైంది.
ఇలా స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పిస్తే పురుషుల కన్నా పురుషుల వేదింపులతో విసిగి పోయిన స్త్రీలు ఎక్కువగా స్వలింగ సంపర్కాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంది. కొందరు వారి జెనటిక్ లోపాల వలనో, ఎన్విరాన్మెంట్ వలనో హోమోలుగా మారితే అది సహజం. కేవలం స్వలింగ సంపర్కానికి మాత్రం చట్ట బద్దత కల్పించటం పరిస్థితిని తారుమారు చేస్తుంది. కాబట్టి ఎలాగో హిప్పక్రసిని ప్రక్కన పెట్టి ఈ సాహసం చేసిన ప్రభుత్వం వ్యభిచారానికి కూడ చట్టబద్దత కల్పిస్తే అటు సెక్స్ సమస్యలే కాక క్రైంస్ కూడ తగ్గుముఖం పడతాయి. వరకట్నం మొదల్గొని ఎన్నో సమస్యలు మెటాష్ అవుతాయి