చిత్తూరు ,తేనబండలో మురాద్ బాబా దర్గా ఉంది. అది దాటాక ఉన్నది మంగ సముద్రం. చిత్తూరు ఎం.పి.డి..కె ఆదికేశవులు తమ ఎం.పి.నిదుల్లోనుండి మంగ సముద్రం పంచాయితి ప్రజల దాహర్తి తీర్చడం కోసం ఒక బోరు వెయ్యిస్తానన్నారు.
ఆ హామి కార్య రూపం దాల్చే సరికి అది దర్గా కమిటికి పెద్ద తల నెప్పిగా మారింది. అదెలా జరిగిందంటే..
బోర్ పాయింట్ పెట్టేందుకు జియాలజిస్ట్ వచ్చాడు. పాయింటు దర్గా ప్రాంగణంలో పడింది. దర్గా కమిటి వారు తమ ప్రాంగణంలోపు బోరు వేసుకోవడానికి సమ్మతించారు. బోరు డ్రిల్లింగ్ పూర్తయింది. సదరు పంచాయితి సర్పంచ్ తెలుగు దేశానికి చెందినవారు. దర్గా కమిటివారు సి.కె.బాబుతో సాన్నిహిత సంభంధాలున్నవారన్నది గమనార్హం. బోరుకు మోటరు బిగిన్స్చారు. ఇక టెస్ట్ రన్ చెయ్యాలిగా.
దర్గా స్విచ్ బోర్డునుండి కనెక్షన్ తీసుకుని టెస్ట్ చేసారు. టెస్టింగ్ పూర్తయ్యాక పీకెయ్యాలిగా నో ..దర్గా వారికి ” రెండు రోజులదాక ఇలానే జరగనీ మళ్ళి సర్వీసు తీసుకుంటామన్నారు”
ఇక అంతే సంగతులు. ఒక పంచాయితికంతట నీరు సప్లై అయితే ఎంత కరెంటు ఖర్చవుతుందో ఊహించుకొండి. 2 రోజులన్నది , నెలాయె, 6 నెలలాయే, సం. ఆయె..ఇలా 3 సంవత్సరాలు లాగించేసారు. సదరు విధ్య్త్ చార్జీలు దర్గా మీద పడేది. దర్గా వారు నాన్నా తంటాలు పడి కట్టే వారు. కట్టకుంటే డిస్కనెక్ట్ అవుతుందిగా
ఈ సమస్య నాద్రుష్ఠికొచ్చింది . నేను 24 గంటల్లో పరిష్కరించాను. ఎలా.. ఎలాఆఆఆఆ
తదుపరి టపాలో