SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
పంచాయితీలంటేనే నాకు వళ్ళు మంటా..కాని విధిలేక
May 28th, 2009 by chittoor Murugeshan

పంచాయితీలంటేనే నాకు వళ్ళు మంటా..కాని విధిలేక మీ ముందుకు ఈ పంచాయిత్నీ తెస్తున్నా. నేనేమి దేవుడ్ని కాను. నేను చెప్పిన ప్రతి విషయం అందరు అంగీకరించాలని పట్టు పట్టను. క్రుష్ణుడు చెప్పాడని చలామనిలో ఉన్న భగవద్గీత పైనే ఎన్నో విమర్శలున్నాయి. అటువంటిది నేనెంతా.

అయితే విమర్శలన్నవి భహిరంగంగా ఉండాలి. నేను చంద్రబాబు గురించి ఒక టపా వ్రాస్తే తె.దె.పా. అడ్రసుకు ఆ లింకు పంపుతా. ప్రవీణ్స్ టాక్స్ లోని ఈ లింకును చూడండి
http://telugu-blog.pkmct.net/2009/05/blog-post_25.html
నా రచనలు గురించిన వారి అభిప్రాయాలను ఎక్కడో టీ కొట్లో మాట్లాడుకున్నట్టు తన బ్లాగులో పెట్టుకోవడం ఒక ఎత్తైతే పతివ్రత లా ఆ విమర్శను సంబందిత నా పోస్టుకే పంపడం ఒక ఎత్తు. నేను ఆనాడే ఆ విమర్శకు నా సమదానం ఏమో ఇచ్చాను. కనీసం ఆ సమాదానాన్ని తన పోస్టులో పెట్టకుండ ఆకాశ రామన్న కమెంటులకు తను తాలం కొట్టి అదో క్రూర త్రుప్తి చెందే ప్రయత్నం చేసున్నారు.
పెద్దలు మహిళలు నన్ను క్షమిస్తానంటే వారి స్థాయికి దిగ జారి ఒక ముక్క చెప్ప దలచాను.. కాని వారెక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుందేమోనని, ఆత్మహత్యకు ప్రేరేపించటం నేఋఅం కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యడం లేదు .

మీరే చూసారు కదా వారి కమెంట్స్ లో ఏదన్నా విషయం ఉందా ? వైవిద్యం ఉందా ? నేను 130 విషయాలగురించి నా భావాలను తెలియ చేస్తున్నా?

అసలు మన దేశ తల రాతనే మార్చి అన్నపూర్ణగా చెయ్యగల ఆపరేషన్ ఇండియా 2000 పథకం గురించి వ్రాసా.. దాని పై ఇంత విరివిగా స్పందించరు
నూట డెబ్బై సంస్కరణలను నేను ప్రతిపాదిస్తున్నాను. వాటి గురించి ఇలా మాట్లాడరు. ఎందుకు ? వారిలో నెరవేరని సెక్స్ కోరికలున్నాయి. అది హింసగా భయిట పడుతుంది. నాకు ఇప్పుడు 42 సం.ల వయస్సు. నేనేదో ఇప్పుడు మాత్రమే ఇంత సాఫిగా స్పందిస్తున్నానను కోకండి. మన రూటే వేరు.

మాటలు,రాతలు ఇవన్ని చేతగానివారి పనులు. ఒకింత వరకు నేను చేతగాని వాడ్నే .అందుకని నాలో ఉన్న సంస్థ వేకువం ను వీరిలా వెచ్చించెయ్యడం నాకిష్ఠం లేదు. అయ్యో పాపం..అనిపిస్తుంది. వ్యభిచారానికి చట్ట బద్దత తేవాలి. దాంతో ఇన్ని మేళ్ళు జరుగుతాయని కరా కంఠంగా వ్రాస్తున్నా.

వీరు దానిని వ్యతిరేకిస్తున్నారు కదా.. పోని వ్యభిచారాన్ని ఎందుకు చట్టబద్దం చేయకూడదో చెప్పమనండి. సెక్స్ కోరికలను ఇంకెలా తీర్చుకోవాలో చెప్పమనండి. ప్రతుతం ఉన్న సెక్స్ వర్కర్స్ హక్కుల రక్షణకు ఏంచెయ్యొచ్చో చెప్పమనండి. అంతే గాని ఇలా గౌప్యంగా రాసుకోవడం బాత్రూం గోడల్లో రాసుకోవడానికి సమానమని నా అభిప్రాయం

RTS Perm Link

జయ్ హో వై.ఎస్. ! జయ్ హో సి.కె.!జయ్ హో ఓటరు మహాశయా!
May 28th, 2009 by chittoor Murugeshan

40 కోట్లా ? సి.కె. అనె రెండక్షరాలా?
ధీటైన సమాదనం ఇచ్చిన ఓటరు ! దన ప్రవాహం భేఖాతరు !
చిత్తూరు(మే 31)
2009 శాసనసభ ఎన్నికల్లో తమ ముందుంచభడిన 40 కోట్లా ? సి.కె. అనె రెండక్షరాలా? అన్నప్రశ్నకు చిత్తూరు నియోజకవర్గ ఓటర్లు ధీటైన సమాదనమే ఇచ్చారు. ఇదివరకే హ్యేట్రిక్ సాధించిన సి.కె.బాబుకు పట్టం కట్టేరు.

సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఎవరో ఇద్దరుముగ్గురు అభ్యర్దులు పోటి చేస్తారు. ప్రజలు ఆ ఇద్దరు ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎన్నుకూంటారు, కాని 2009 అసెంబ్లి ఎన్నికల్లో 40కోట్లకు ప్రజానాయకులు సి.కె.గారి ప్రతిష్ఠకు నడుమ పోటి జరిగింది.
సి.కె.మొట్ట మొదటి సారిగా రాజకీయరంగ ప్రవేశం చేసిన 1989 ఎన్నికల్లో సి.కె.విజయాన్ని ఎవరైనా ఊహించి ఉండవచ్చేమో గాని 2009 ఎన్నికల్లో మాత్రం తల పండిన రాజకీయ కురువ్రుద్దులు సైతం నీళ్ళు నమిలే పరిశ్థితి.

ఈ పరిస్థితికి కారణం లేక పోలేదు. స్వపక్షంలో ఉంటూ వ్యక్తిగత ఓర్వలెనితనంతో వైరి పక్షాలతో గౌప్యంగా చేతులు కలిపిన వారు ఓ ప్రక్క, నిన్నా మొన్న దాక వైరి పక్షంలో ఉండి స్వక్షంలో చేరినప్పటికి, పదవి పొందినప్పటికి ఏ మాత్రం క్రుతజ్నత లేక పార్టి అభ్యర్ది అయిన సి.కె.కు వ్యతిరేకంగా పావులు కదిపిన పెద్ద మనుషులు ఒక ప్రక్క . ఒళ్ళో కూర్చుని రాజకీయ ఓనమాలు దిద్దిన రోజులను మరిచి గురువును మించిన శిష్యులనిపించుకోవాలన్న తహ తహతో కసాయివాని చెంత చేరిన దూడపిల్లల్లా కొందరు యువ నేతలు ఒక ప్రక్క, వైరి పక్షాల కుట్రలు ఓ ప్రక్క, ఇక్కడ సి.కె.గెలుస్తే అక్కడ ప్రభుత్వం రాదని మరో బోడి సెంటిమెంటు ఒక ప్రక్క.

సి.కె.తమ రాజకీయ ప్రస్తానంలోని తొలి అధ్యాయంలో ఏక గ్రీవంగా పురపాలక వైస్ చేర్మన్ గా ఎంపికైన రోజుల్లో సి.కె.చెంత చేరి అన్ని విదాల లభ్ది పొంది తుదకు సి.కె.పై పోటికి దిగిన వ్యాపార ఐసుకాంతాలు (అదెనండి బిసినెస్ మ్యేగ్నెట్ అంటారుగా) మరో ప్రక్క !

ఇదివరకే రెండు పర్యాయాలు(టి.వి.చేనళ్ళ బాషలో చెప్పాలంటే తాజాగా) సి.కె.పై హత్యా యత్నం జరిగి ఉండటం. అన్యాయంగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడం. అందరికీ విదితమే.ఈ నేపథ్యంలో విరివిగా ప్రచారం నిర్వహించే వీలు లేక జిల్లా అధికారుల ఆంక్షలు. ఏరులై పారిన దనం, మద్యం దెబ్బకి దశాబ్దాలుగా సి.కె.అంటే ప్రాణాలు అర్పించటానికన్నా సిద్దంగా ఉన్న కొందరు అనుచరులు సైతం గోడ దూకిన వైనం. చిత్తూరు రూరల్ , గుడిపాలా మండలాలు కొత్తగా నియోజక వర్గంలో విలీనమైయ్యుండటం. సి.కె.కంచుకోటగా ఉన్న తవణంపల్లె,యాదమరి మండలాలు తొలగించబడటం ఇలా ఒకటి కాదు రెండు కాదు. సి.కె. విజయం సాధిస్తే అదేదో ఒక అధ్భుతంలా జరిగి పోవాల్సిందే కాని అది దాదాపుగా అసంభవం అనే పరిస్థితి నెలకొంది.

కాని సి.కె.లో మాత్రం ఏ కోశాన కూడ అదైర్యమో,అసహనమో కానరాలేదు. ఎంతో ధీమాగా, ఆత్మ విశ్వాసంతో ప్రచారంలో దూసుకెళ్ళారు. రాజకీయ ప్రత్యర్దులు సీట్ల కోరకు రాజదానుల్లో మకాం వేసి ఉంటే సి.కె. మాత్రం ప్రజల మద్యే ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళారు. మమేకమయ్యేరు.

గతంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టి అభయర్థులంతా ఓడిపోగా ,జిల్లా కొకరుగా ఎంపికై వన్ మ్యేన్ ఆర్మిగా నిలబడి పార్టిని ,క్యేడరును ముందుకు నడిపిన నేపథ్యంలో ఇదివరకె తమకున్న సంబంధాలను మెరుగు పరచుకుని నిర్దిష్ఠ ప్రణాళికతో ప్రచారం చేపట్టారు సి.కె. అలుపెరుగని ప్రయాణాలు, పార్థుని గాండీవమునుండి బయలుదేరిన పాశుపతాస్త్ర)ము వంటి సూటైన నడక.

సి.కె.ప్రచారకార్యక్రమం ఖరారైతే చాలు ఆ ప్రాంత పార్టి వర్గాల్లో,కార్యకర్తల్లో,సి.కె.అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం. గజమాలలేమి, తవుజండ్ వాలా పటాసులేమి,పండుగ వాతావరణం నెలకొంటుంది. సి.కె.తమ ఆత్మీయులు,అభిమానులు వెంటరాగా,జన వాహిణి నడుమ చేతులు జోడించి నమస్కరిస్తూ వెళ్తుంటే కార్యకర్తలు కరపత్రాలను ప్రజలకు అంద చేస్తూ దూసుకు పోతుంటే సి.కె.ప్రచార సరళిని చూడటానికి రెండు కళ్ళు చాలవు. మొత్తానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేరు. సి.కె.రాకను తెలియచేస్తూ ముందుగా వెళ్ళే ప్రచార రథంలోని సి.కె.చిత్ర పటానికి సైతం నమస్కరించే వారెంత మంది? ముద్దాడిన వారెంత మంది? దాని మీది దుమ్ము,దూళిని చేతితో తుడిచిన వారెంత మంది? ఇవన్ని చూసినవారికి మాత్రమే సి.కె.పట్ల ప్రజల్లో ఉన్న క్రేజు మరే మెగా స్టారుకు లేదన్న సంగతి అర్థమయ్యుంటుంది.

కాని ఏ.సి.రూముల్లో కూర్చుని కట్టల కట్టలు కరెన్సి నోటులను పంపిణీ చేస్తూ విజయం తమదేనని కల కన్నారు కొందరు. కాని డా.వై.ఎస్.నేత్రుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభి)వ్రుద్ది సంక్షేమ పథకాలు ,సి.కె.విశిష్థ వ్యక్తిత్వం కారణంగా సత్యం గెలిచింది. ప్రజాబలం ముందు దనబలం నెగ్గడం కద్దు అన్న సంగతి మరో సారి రుజువైంది.

40 కోట్ల దనమా ? సి.కె.అన్న రెందు అక్షరాలా అన్న ప్రశ్నకు ధీటైన సమాదానమిచ్చిన ఓటరు మహాశయులకు ఇండియన్ పొలిటికల్ క్లోసప్ పక్ష పత్రిక పాదాభివందనాలు సమర్పిస్తూంది.

RTS Perm Link

జ్యోతిష్యం నేర్చుకొండి-౩
May 28th, 2009 by chittoor Murugeshan

రాశి చక్రాన్ని చూసే ఉంటారు. ఎందుకైనా మంచిదని ఈ టపాలో రాశి చక్రాన్ని పొందుపరచాను చూడండి. నిజానికిది కోడి గుడ్డు ఆకారంలో ఉండాలి.కారణం పాల వీదిలోని నక్షత్ర మండలాలను 12 గా విభజించి ఈ రాశిచక్రాన్ని కూర్చారు మనవారు.అయితే మన సౌఖర్యార్థం దీనిని చదరంగా వేసుకుంటాం.ఇందులో మొత్తం 12 గళ్ళున్నాయి కదా ఎడమ కార్నర్ లో ఉన్న రాశియే చిట్ట చివరి రాశి : మీనం. దాని ప్రక్కన ఉన్న రాశి మేషం. ఇది రాశి చక్రంలో మొదటిది. రాశుల పేర్లు :
మేషం
వ్రుషభం
మిథునం
కర్కాటకం
సింహం
కన్య
తుల
వ్రుశ్చికం
దనస్సు
మకరం
కుంభం
మీనం
రాశి చక్రము కాళిగా ఉన్నప్పటికి దానిని చూడగానే ఈ రాశుల పేర్లు వాటి స్థానాలు మీకు జ్నాపకం రావాలి. అలా ప్రాక్టీస్ చేసుకొండి.
ఒక్కో రాశికి అధిపతులు ఉంటారు. ఆ వివరాలు క్రింద చూడండి:

మేషం: కుజ
వ్రుషభం:శుక్ర
మిథునం :బుధ
కర్కాటకం:చం
సింహం:రవి
కన్య:బుధ
తుల:శుక్ర
వ్రుశ్చికం: కుజ
దనస్సు:గురు
మకరం: శని
కుంభం:శని
మీనం:గురు

ఆధిపతులంటే ఆయా గ్రహాలు కొన్ని రాశులలో సంచరించే వేళ అధికంగా ప్రభావితం చెయ్యగలరని అర్థం చేసుకోగలరు.

ఇది వరకే చెప్పినట్లుగా ఒక్కో రాశి

జ్యోతిష్యంలో మొత్తం 27 నక్షత్రాల గురించిన ప్రస్తావన వస్తుంది. (జన విజ్నాన వేదిక వారు లేవనెత్తడానికి ఇది ఒక మంచి పాయింటు .ఆకాశంలో ట్రిల్లియన్ల కొద్ది నక్షత్రాలుండగా కేవలం 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకోవడం అహేతుకం అనొచ్చు) నిజానికి ఇవి సింగిల్ నక్షత్రాలు కావు .నక్షత్రాల గుంపులు. ఉ.అశ్విని అంటే గుర్రపు ఆకారంలో ఉన్న లక్షల కొలది నక్షత్రాల గుంపును సూచిస్తుంది. దీనిని 4 భాగాలు చేస్తారు. (పాదాలు) .rasi

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa