SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
భార్యా భర్తలు /ప్రేమికుల నడుమ పేచీలెందుకొస్తాయి
May 31st, 2009 by chittoor Murugeshan

సు : స్వామి ! ఎలాగో మీరు చెప్పినట్టే 3 సం.లు గడిపేసాను. ఇక మీదటన్నా నా భర్త వలన సుఖం ఉంటుందా స్వామి.
స్వా: తల్లీ ! మన ఈ సంభాషణను అలాగే నా బ్లాగులో పెట్ట పోతున్నాను. నువ్వు సుఖం అనగానె వారు మరోలా అర్థం చేసుకుంటారు. చదువుకున్నవారి ఖర్మది. మాటలకు అర్థాలు జీవితాల్లో ఉంటాయి. కాని వారు నిఘంటువుల్లోను ఇంటార్నెట్ లోను వెతుక్కుంటారమ్మా . నువ్వు మాట్లాడుతున్నది జీవితంలోని సుఖం గురించి. కాని వారు పడక గదిలో సుఖమని అపార్థం చేసుకుంటారేమో ! కాబట్టి ఈ సుఖమన్నే పదాన్ని ఇంకోసారి వాడకు
సు: అలాగే స్వామి ! నా ప్రశ్నకు సమాదానం ?
స్వా: చెబుతానమ్మా ! ప్రేమ పెళ్ళి అన్నింటికి కారణం ఒక మహావిస్ఫోటంతో విడిపోయినవారు ఏకమయ్యే ప్రయత్నమే అమ్మా! నువ్వు నీ భర్తతో కొన్ని ట్రిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం ఆణువుతో అణువుగా కలిసి చాలా దగ్గరగా ఉండి ఉంటావు. ఆదగ్గరి తనం ప్రతుతం లేక పోవడానికి కారణం నీ శరీరమే ,నీ ఎత్తు పొడవులే అన్న అపోహ అతనిలో ఉంటుంది. నిన్ను క్రుంగ తీస్తే (కనీశం మానసికంగా) నువ్వు మరింత దగ్గ్రవుతావని అనుకుంటుంటాడేమో ?

సు: ఇదేం స్వామి పోయిన సారి వచ్చినప్పుడు నీది కుంభరాశి, సప్త్మాన శని ఉన్నాడు . అందుకె మీ భార్యా భర్తల మద్య పొత్తు కుదరడం లేదన్నారు.
స్వా: అది జ్యోతిష్యం ప్రకారమమ్మ .. ఇది శాస్వత సత్యం ప్రకారం
సు: ఇదేదో ఆసక్తిగా ఉంది స్వామి చెప్పండి వింటా
స్వా:నువ్వు ఇంటర్లో Bipic యేగా చదివావు
సు:అవును స్వామి !
స్వా:అయితె నీకర్థమవుతుందనుకుంటా. సెల్ యందు క్రమోటిన్ రెట్టికులం ఉంది కదా..అది ఎలా ఫార్మ్ అయ్యిందంటావు?
సు:చెప్పండి స్వామి ! ఈ సంసారంలో పడి అవన్ని ఎగిరిపోయాయి
స్వ: తండ్రినుండి 23 క్రోమోజోమ్స్ తల్లి నుండి 23 క్రోమోజోమ్స్ కలవడంతో మొదటి సెల్ లోని క్రమోటిన్ రెట్టికులం ఏర్పడింది. అంటే ప్రతి మనిషి ఆదిలోన ఏర్పడ్డ మొదటి సెల్ అన్నమాట. అందులో ఆడదాని వద్దనుండి(అమ్మ) పొందిన క్రోమోజోమ్స్ 23 , పురుషుడి(నాన్న) వద్దనుండి పొందిన క్రోమోజోమ్స్ 23 కలిసి ఉంటాయి. కాబట్టి ప్రతి స్త్రీ)లోను పుంసత్వం ఉంటుంది. ప్రతి పురుషునిలోను స్త్రీ)త్వం ఉంటుందన్నమాట .
సు: అలాగా ..అంటే కొజ్జాలై పోతారు కద స్వామి..
స్వా: నో ..నో.. ఆడ సంతానంలో పుంసత్వం కేవలం 40 శాతమే ఉంటుందన్నమాట.. అలాగే మగసంతానమైతే స్త్రీ)త్వం 40 శాతమే ఉంటుంది. ఈ రేషో అందరిలోను ఒకేలా ఉండక పోవచ్చు. కాని స్త్రీ)త్వ,పుంసత్వ కలయకను మాత్రం లేదనలేం.
సు: నేనడిగింది భార్యా భర్తలు…
స్వా: ఆ పాయింటుకె వస్తున్నా.. నీలో పుంసత్వం 40 శాతమే ఉంటుంది. తక్కిన 60 శాతం లోటును ఎలా పూడ్చుకోవాలి ? ఒక పురుషునితో కలవాలి. అలాగే అతనిలో స్త్రీ)త్వం 40 శాతమే ఉంటుంది. తక్కిన 60 శాతం లోటును ఎలా పూడ్చుకోవాలి ? అదే మీ ఇద్దరు కలిసారనుకో మీ ఇద్దరిలోను లోటులు పూడ్చబడతాయి. ఇదే ప్రేమ పెళ్ళీళ్ళ లక్ష్యం. మీ ఇద్దరు విడిగా ఉన్నంత వరకు మీలో ఎవ్వరూ సంపూర్ణమైన మగవాడు లేదు, సంపూర్ణమైన ఆదది లేదు. అదోరకమైన అభద్రతా భావం ఉంటుంది. శూన్యానికేసి గాలి తోలునట్టు ఆడ మగ ఒకరికేసి మరొకరు పరుగులు తీయడానికి కారణం ఇదే.
సు: మరి మాకు పెళ్ళైంది కద స్వామి. మీరు చెప్పినట్లుగా లోటు పూడ్చబడి ఉండాలిగా
స్వా; అందుకు మీరు సంపూర్ణంగా మమేకం అయ్యుండాలిగా
సు: చి..చి అవేం మాటలు స్వామి నాకిద్దరు కూతుళ్ళు.
స్వా:మమేకం కావడమంటే పిల్లలను కనడం కాదమ్మ ! మీ ఇద్దరి నడుమ ఈగో/అహంకారం అనేది లేకుండా మమీకం కావాలి.మీలో ఎవరు కూడ తక్కిన వారిని ఎదుటి వ్యక్తిగా చూడక తమలో ఓక అంతర్భాగంగా చూడాలి.అదే మమీకం కావడమంటే సు: అదెలా కుదురుతుంది స్వామి
స్వా: నీకో విషయం చెబుతా.. ఇది విని నువ్వే అర్థం చేశుకుంటావు. భార్యా భర్తలనే వారు రెండు శరీరాల్లో నివశించే ఒకే ప్రాణం అని..
సు:ప్రాణమా చింతకాయపచ్చడా ? రోజు కొట్టుకు చస్తుంటే..
స్వా: అది మీ అవివేకమమ్మా ! తెలియనితనము.. నేను చెబుతా విను. నీ జాతకంలోని 7 వ రాశిని లగ్నం చేసుకుని ఫలితాలు చెబితే నీ భర్త భవితవ్యాన్ని చెప్పొచ్చు. అలాగే నీ భర్త జాతకంలోని 7వ స్థానాన్ని లగ్నం చేసుకుని ఫలితాలు చెబితే నీ భవితవ్యాన్ని చెప్పొచ్చు. అంటే ఏమర్థం ? ఇద్దరి జాతకాల్లోని శుభ అశుభ ఫలితాలు ఇద్దరికి సమానంగా పంపిణీ అయ్యున్నాయన్న మాట . నీ భర్త ఇలా తయారుకావడానికి కారణం నీ జాతకమే ! నువ్విలా తయారైందానికి కారణం నీ భర్త జాతకమే. కాని మీరిద్దరు ఒకరినొకరు తప్పు పడుతూ ఉంటారు. అందుకే ఇన్ని పేచీలొస్తాయి.
సు: ఏమిటో స్వామి ! నమ్మ బుద్ది కావడం లేదు.
స్వా:ఓకె. నువ్వు నమ్మొద్దు. ఇంకో మాటా ! ఆడపిల్ల మొట్ట మొదటిసారిగా చూసే మగాడు ఎవరు?
సు:తన తండ్రి.
స్వా: మగ పిల్లవాడు మొట్ట మొదటిసారిగా చూసే మహిళ ఎవరు?
సు:తన తల్లి.
స్వా: First impression is the best impression కదా ..కబట్టి ప్రతి మగవడు తన తల్లిని కోరుకుంటాడు, ప్రతి ఆడ పిల్ల తన తండ్రిని పొందాలని కోరుకుంటుంది.
సు:చి..చి ఇదేం మాటలు
స్వా: మాటలు కాదమ్మా ! ఇది సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్పిన తియరి.అనుభవంలో చూసినా ఇది ఎంతో సరిగ్గ సరి పోతుంది. ఏ ఆడపిల్లా తన తల్లితో సఖ్యంగా ఉండదు. ఏ మగ పిల్లవాడు తన తండ్రితో సఖ్యంగా ఉండడు. ఆడపిల్లకు తండ్రితో,మగ పిల్లవానికి తల్లితోనే సఖ్యం కుదురుతుంది.
సు: మరి దీనికి భార్యా బర్తల సంభంధానికి ఏమిటి స్వామి సంబంధం ?
స్వా: ఆడపిల్ల కోరుకునేదేమో తండ్రిని.. ఆమెకు ఒక కుర్ర వెదవతో పెళ్ళి చేస్తారు. మగ పిల్లవానికి కావల్సింది ఒక తల్లి. అతనికి ఒక పిల్ల దెయ్యాన్ని తెచ్చి నీ భార్యా అంటారు. మరి పొత్తెలా కుదురుతుంది?
(తదుపరి టపాలో)

RTS Perm Link


2 Responses  
  • Anonymous writes:
    May 31st, 20099:11 pmat

    జ్యొతిష్యమా, ఫ్రాయిడా, విస్ఫోటనమా, పిచ్చా ?

  • swamy7867 writes:
    June 2nd, 20099:21 pmat

    ఏమీ నీ జాతకం ? నువ్వు కమెంటు చేసాక ..నా బ్లాగుకే శని చుట్టుకున్నట్టుందిరా బాబూ !


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa