SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
చిత్తూరుకు చిత్తూరు టైగర్ సి.కె. ఏంచేస్తే భావుంటుంది?
May 29th, 2009 by chittoor Murugeshan

*ముందుగా తమరిని గెలిపించిన ప్రజలను మళ్ళి ఒక సారి ఎన్నికల ప్రచార పంథాలోనే కలిసి క్రుతజ్నతలు తెలపాలి.

*ఎన్నికల భరిలో ఉన్న ప్రత్యర్దులకు నియోజికవర్గ అభివ్రు)ద్ది కి సహకరించమని పిలుపునివ్వాలి.

*నెలలో మొదటి ఆదివారం ఫోన్ లో, రెండవ ఆదివారం ఆన్ లైన్ లో అందుబాటులో ఉండాలి. మూడవ ఆదివారం ప్రజలు స్వయంగా కలవడానికి వీలు కల్పించాలి. ఈ అంశాలను స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తమరే ప్రకటించాలి.

*గతంలో మీరు ఇండిపెండెంట్ ఎమ్మెలేగా ,ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న 15 సం.ల్లో మీ మీద కసితో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.

*మన పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి తమరు ఈ విషయంలొ చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి

*మన ఊరికి ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. మన ఊరికి ప్రాధన్యత పెరుగుతుంది

*టౌన్ బ్యాంకు విషయంలో తమరు చూపిన చొరవ చేసిన క్రుషి అందరికి తెలుసు. టౌన్ బ్యాంక్ పునరుద్దరణ త్వరగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి

*చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ ప్రజలు తమ గోడును వినిపించుకోవడానికి వీలుగా అందరికి అందుబాటులో ఉండేట్లు కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలి. మొదటి సోమవారం గుడిపాల మండలం, రెండవ సోమవారం చిత్తూరు పట్టణం ,మూడవ సోమవారం చిత్తూరు రూరల్ మండల కారయాలయాలకు తమరే స్వయంగా హాజరు కావాలి. సదరు కార్యాలయాల్లో ఉదయం 9 గం.లోపు వినతి పత్రాలు స్వీకరించి మద్యాహ్నం 12 గంటలకెల్లా కలెక్టరును/జె.సి.లను స్వయంగా కలిసి ఆ వినతి పత్రాలను అంద చెయ్యాలి. వినతి పత్రాల జిరాక్స్ ప్రతులను బధ్రపరచి వాటి సారాన్ని కంప్యూటరీకరణ చేసి ఫాలో అప్ నిర్వహీంచాలి

*గుడిపాల మండల పరిదిలో బ్యాంకు మరియు ఏ.టి.ఎం కావాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక దీని పై కూడ సత్వరం స్పందించ వలసి ఉంది,

*చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే విదంగా మూడు పెద్ద ఫ్యేక్టరిలను నియోజక వర్గానికి తరలించేలా చూడాలి.

*ముందుగా నియోజక వర్గ పరిదిలోని నిరుధ్యోగ యువత బయోడేటాలను తెప్పించుకుని వారికి తగిన సాంకేతిక విథ్య,శిక్షణ లభించేలా చూడాలి. ఆ పై వారికి వ్రుత్తి,ఉధ్యోగ అవకాశాల కల్పనకు క్రుషి చెయ్యాలి.

*యువతలో అధిక సంఖ్యాకులు మద్యానికి భానిసలైయున్నారు. వారికి డి-ఆల్కహాలిక్ క్యేంపులు నిర్వహించాలి.

*నెలకో ప్రెస్ మీట్, మూడు నెలలకో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనాలి.

*మన నియోజిక వర్గ పరిదిలో జరుగుతున్న త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి క్రుషి చెయ్యాలి.

*పురపాలక పరిదిలో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది. సాధారణ పరిపాలన కూడ అంతంత మాత్రమే. పురపాలక ఉధ్యోగులు చాలా మందికి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆల్కహాలిక్స్ గా ఉన్నారు. ఈ అంశాలు వారి పని సామర్థయాన్ని భాగా దెబ్బ కొడుతున్నాయి. ఈ విషయాల పై తమరు చొరవ చూపి పురపాలక యంత్రాంగాన్ని ప్రక్షాళణ చెయ్యవలసి ఉంది. పురపాలక సిబ్బంది పని తీరును మెరుగు పరచాలి.
* వారికి వైద్య పరీక్షలు చెయ్యించి ఉచిత వైద్య సౌఖర్యం కల్పింఛాలి. ఆలాగే వారికి వారి కుటుంభ సభ్యులను ఉత్సాహ పరచి మోటివేట్ చేసేవిదంగా కౌన్సిలింగ్,గెట్ టు గెదర్ ప్రోగ్రాములు,టూర్స్ ఏర్పాటు చెయ్యాలి.ప్రైవేటు రుణ వత్తిళ్ళనుండి ఉపసమనం కల్పీంచాలి.

*ట్రాఫిక్ ను అస్త వ్యస్తం చేస్తున్న ఆక్రమణల తొలగింపు.

*పర్యావరణం పై ద్రుష్ఠి. పాలితీన్ సంచుల వాడకం పై ఉక్కుపాదం.

*రాములవారిగుడి ఉత్సవాల పునరుద్ద్రణ

* మీరు ప్రజల ముందు నిలబెట్టి గెలిపించిన కౌన్సిలర్లలో చాలా మంది పని తీరు సంత్రుప్తికరంగా లేదు. జవాబుదారి తనం కొరబడింది. వార్డుల్లో తమ ఆజ్నానుసారం ఏర్పాటైన కార్యాలయాలు ఆశించిన రీతిలో పని చెయ్యడం లేదు. వీటి పై ద్రుష్ఠి సారించాలి.
*పది వడ్ది వసూళ్ళపై ఆంక్షలు కఠిన చర్యలు.

*ఒకే సమయంలో వంద మంది బ్రౌజింగ్ చేసుకునేందుకు బ్రౌజింగ్ సెంటర్. రైస్ కార్డ్ హోల్డర్సుకు రెండు రూపాయల రాయితీ

*అదే ప్రాంగణంలొ ఉదయం 6 నుండి 8 దాక అర్హులచే రైస్ కార్డు హోల్డర్సుకు కంప్యూటర్ శిక్షణ సగం ఫీజుకే ఏర్పాటు చెయ్యొచ్చు.
*పాత బస్ స్టాండులో త్రాగు నీటి సౌఖర్యం ,ప్రయాణికులను ఎండావానలనుండి రక్షించే షెల్టర్ లు ఏర్పాటు చెయ్యాలి.
*పాత బస్ స్టాండులోని షికారులకు సినిమా సెటింగ్స్ తరహాలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చెయ్యాలి. కనీశం వారు బస్ స్టాండు ప్రాంగనంలో వారు,వారి పిల్లలు స్నానాలన్నా చెయ్యకుండా చూడాలి.

*కూర గాయల మారెకెట్ ను కూల దోసి కొత్తగా నిర్మాణం చెయ్యాలి. మూడంతస్తులుగా నిర్మించి మొదటి అంతస్తును పార్కింగ్ కు పరిమితం చెయ్యాలి. ఈ పని చెయ్యకుంటే ట్రాఫిక్ సమస్యల నెపంతో భవిష్యత్తులో ఎవరో కూరగాయల మారెకెట్టును దూరప్రాంతానికి తరలించటం తద్యం.

*నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం పూర్తికాగానే ప్రజలకు ద్రుడ శరీరం, గాలికంటే తేలికైన మనస్సు,పవిత్రమైన ఆత్మను ప్రసాదించగల స్రుజణాత్మక కార్యక్రమాలకు ఉచితంగా కేటాయించాలి

*గ్రంథాలయాలకున్న ప్రాముఖ్యత తమకు తెలిసిందే. కాని నేటి తరం పూర్తిగా పుస్తకాలకు దూరమై పోతూంది. ప్రస్తుతమున్న కేంద్రీయ గ్రంథాలయాన్ని పట్టణపు నడిబొడ్డుకు మార్చటానికి ప్రయత్నించాలి. లేదా కనీశం ఒక శాఖనన్నా పట్టణపు నడిబొడ్డున ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రస్తుతమున్న గ్రంథాలయంలో కనీశం 25,000 మంది యువత కొత్త్గగా సభ్యులయ్యేలా చూడాలి. అలాగే అక్కడ జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసి పావలాకే ఒక కాపి జిరాక్స్ తీసుకునే ఏర్పాటు చెయ్యాలి

*మీ పేరిట యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వాటి తరపున కనీశం 2 వాడులకు ఒకటి చొప్పున రీడింగ్ హాలు, జిమ్ము,యూత్ క్లబ్ ఏర్పాటు చెయ్యాలి.

*కసాయి మార్కెట్ లో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది.

*పాత బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లో త్రోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్యలే కాక ఈవ్ టీజింగ్ సమస్యలు కూడ వస్తున్నాయి. పాత బస్ స్టాండు పై సీలింగ్ ఏర్పాటు చేసి దాని పై వారికి నిరంతర షాపులు నిర్మించి ఇవ్వవచ్చును.

*పట్టణ ప్రాంతంలో పబ్లిక్ యూరినల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చెయ్యాలి. మూత్ర విసర్జణ ఉచితమని ప్రకటిస్తే మంచిది. ఇది మహిళలకు ఎంతో ఉపకరిస్తుంది.

*డ్వాక్రా గ్రూపులను ఉత్పత్తి రంగంలో ప్రోత్సహింఛాలి. యువజన సంఘాలను మార్కెటింగ్ కు వినియోగించుకోవచ్చు.

*ప్రస్తుతం కట్టమంచి చెరువులోని మురికి నీళ్ళను నీవానదిలో విడిచిపెట్టే ఏపాటు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. దీని కన్నా నిఫుణలతో ఆలోచించి కట్టమంచి చెరువును ఒక మెగా ఇంకుడు గుంతగా మార్చే ప్రయత్నం చెయ్యాలి.

*పురపాలక సంస్థ వంటివి తమ విద్యుత్ వినియోగార్థం సోలార్ పవర్ యూనిట్స్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి.

*ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరు ఉధ్యోగులకు గ్రూపు భీమా వసతి, కనీశ వేతనం, పిఎ.ఫ్ లు అమలయ్యేలా చూడాలి. ముఖ్యంగా మహిళా ఉధ్యోగుల అరిస్థితి ధారుణంగా ఉంది. బాత్రూమ్స్ లేవు, రెస్ట్ రూమ్స్ లేవు. కనీశం ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్ కలిసి ఈ ఏర్పాట్లు చేసి ఉమ్మడిగా తమ ఉధ్యోగులు లభ్ది పొందేలా చెయ్యొచ్చు.

*ఇందిరమ్మ ఇళ్ళకు సోలార్ పవర్ అందే ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే కొత్త కాలనీలు సాముహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చూడాలి.

*నీవా నది ప్రక్షాళనకు ప్రయత్నం. బ్రష్ఠుపట్టించిన వారినుండి పరిహారం రాబట్టే వీలుందా ఆరాదీయాలి.

*రాజీవ్ గుర్హ కల్ప ఏమైందో చూసి ఫాస్ట్ అప్ చెయ్యాలి.

*పురపాలక సంస్థకు వెబ్ సైట్ . ఆన్ లైన్ సేవలు.

RTS Perm Link


2 Responses  
 • Ali writes:
  May 29th, 20098:06 pmat

  చాలా మంచి అలొచన అండి మీది.మీ చిత్తురు మరియు మన రాష్ట్రంలొని ప్రతి నియొజకవర్గంలొ ఇలాంటి అభివృద్ది జరగాలని కోరుకుంట్టున్నాను.
  భగవంతుడా ! మా నాయకులకు సద్భుద్ది ప్రసాదించు.!

  -Ali

 • swamy7867 writes:
  May 29th, 20099:35 pmat

  ఇది కేవలం చిత్తూరుకు సంబందించిందో , ఒక్క సి.కె.బాబుకు సంబందించిందో కాదు ప్రతి ఎం.ఎల్.ఏ, ప్రతి ఎం.పి ఫాలో చెయ్య తగింది . కాబట్టే దీనిని బ్లాగులో పెట్టాను. దీని ప్రింట్ అవుట్ సి.కె.బాబుగారి పంపిస్తాను. చిత్తూరు వారు ఎవరన్న మరిన్ని సలహాలిస్తారేమో నని వేచియున్నా. మీ అభినందనకు త్యేంక్స్ . నేనూ భగవంతుడ్ని మీలాగే కోరుకుంటున్నా
  రఘుపతి రాఘవ రాజా రాం పతీత పావన సీతారాం
  ఈశ్వర అల్లా తేరే నాం” సబ్ కో సన్మతి దే భగవాన్”


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa