SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
ఆథ్యాత్మికం కూడ ఒక సైన్సే
May 29th, 2009 by chittoor Murugeshan

జ్యోతిషానికి,ఆథ్యాత్మికానికి ఉన్న పోలిక ఏమంటే ఈ రెండూ కూడ మానవుడ్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాగే కొందరు ఈ రెంటిని అడ్డం పెట్టుకుని అంద్కుకు డబుల్ గా మోసగిస్తారు. జ్యోతిషం తెలిపేది బవిష్యత్. కాలజ్ఞానాన్ని. నిజానికి ఈ భూమి పై పుట్టే ప్రతి బిడ్డ కాలజ్ఞానంతోనే వస్తుంది. ఎప్పుడైతే అది తనను ఈ ప్రక్రుతిలో అంతర్భాగం కాదని భ్రమించటం మొదలు పెడుతుందో అక్కడికి భవిష్యత్తుకు సంబంధించిన సెల్స్ అన్ని మూగ పోతాయి.

కాని ఒకగానొక సందర్బంలో తాను కాలజ్ఞానాన్ని పొంది ఉన్న జ్ఞాపకం ఆ బిడ్డ మస్తిష్కపు పొరల్లో ఎక్కడో నమోదై ఉండటంతో మానవుడు భవిష్యత్ అంటే పడి చస్తాడు. బాధాకరమైన విషయమ ఏమంటే ఎవడికైతే భవిష్యత్తు మీద ఆసక్తి లేదో అతనికే భవిష్యత్ దర్శనమిస్తుంది.
ఇక ఆథ్యాత్మికానికి వస్తే ఆథ్యాత్మికమంటే ఏమి ? ఈ సమాజం క్రుత్రిమంగా చొప్పించిన అహాన్ని వదులుకోవడమే. చింతకాయలోని పండు ఎండితే పెంకులతో ఉన్న లింక్ కట్ అవుతుంది. తీరా అవసరమైనప్పుడు ఊడ పెరకొచ్చు. ఆత్మ కూడ అలాంటిదే. ఏ పరిస్తిథిలోను అది మానసిక ప్రకోపాలతో ప్రభావించ బడటం లేదు. కాని వచ్చిన చిక్కంతా ఏమంటే మానవుడు సమాజం స్రుష్ఠించిన మనస్సును ఆత్మని పొరబడటమే.

ఒక గానొకప్పుడు తను ఈ భవ భంధాలకు దూరంగా స్వేచ్చగా ఉన్న స్మ్రుతులు మానవుని మస్తిష్కపు పొరల్లో ఎక్కడో దాగి ఉంది. దానిని మళ్ళి పొందాలన్న ఆత్రుత కూడ ఉంది. అందుకే మానవుడు అతను ఎంత పెద్ద డాక్టరైనా, ఎంత పెద్ద మేధావి అయినా ఆథయత్మికం పేరుతో జరిగే మోసాలకు ఇట్టే భలై పోతాడు. భవిష్యత్తులాగే మోఖ్షం కూడ తనపై ఆసక్తి చూపనివారికే కవశం అవుతూంది.
జ్యోతిషానికి నిభందనలు లేనట్టే (ఉపాసన ,పుట్టుక, గోచి పాత వంటివి) ఆథ్యాత్మికానికి సైతం నిబంధనలు లేవు. కాని యేనుగును తడిమి చూసిన గుడ్డివారివలే ఒక్కో గురువు ఒక్కో నిబంధనను ప్రవేశ పెట్టారు. దానిని కొందరు ఫాలో అయిపోవడం మరి గురువులు చెప్పిన అద్భుతాలు తమ జీవితాల్లో జరగక పోవడంతో కంగు తింటారు.

ఇంతకీ ఆథ్యాత్మికత అంటే ఏమిటి. నేనీ శరీరాన్ని కాను, నేనీ మనస్సును కాను, నేనీ బుద్దిని కాను వీటన్నింటికి అతీతంగా ఏదైతే ఉందో అదే నేను. దానికి పరమాత్మునికి ఎట్టి బేధము లేదు అనే సంగతిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే .

మరి ఇది ఎలా సాధ్యం ? మాన్వునికి అతను పరిష్కరించుకోలేని సమస్య రావాలి. అతను అంగ బలంతో ,మనో భలంతో,బుద్ది బలంతో దానిని పరిష్కరించటానికి ప్రయత్నించి విఫలం కావాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఇది నా అనుభవం. ఇది మీకు జరగాలని రూలేమి లేదు.

మీలో చాలమంది సమసయలనుండి జారుకుంటారు, లేదా మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు, లేదా సమస్యలే లేదని భ్రమించి బ్రతికేస్తారు. ఇటువంటి హిప్పక్రట్స్ కి ఏడేడు పదునాలుగు జన్మలెత్తినా మోక్షం హుళక్కే. మొత్తానికి ఆథ్యాత్మికత లో బాల పాఠం ఏమంటే ..
(తదుపరి టపాలో)

RTS Perm Link


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa