SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
ఆంథ్రజ్యోతిలో బరువు తగ్గించే ప్రకటన పై చర్యలు తీసుకోవాలి
May 24th, 2009 by chittoor Murugeshan

fatman-2ఈ రోజు ఆంథ్రజ్యోతి దినపత్రికలో వెలువడిన బరువు తగ్గించే ప్రకటన పై చర్యలు తీసుకోవాలి అని నేను వై.ఎస్. గారిని కోరితే మీలో చాలా మంది ఇతను వై.ఎస్. భజనపరుడు అందుకే ఇలా పిచ్చి కోరిక కోరుతున్నాడని అనుకోవచ్చు.

కాని చట్టం తెలిసిన వారు అలా ఆలోచించరు. నయం కానే కాని జబ్బులను (క్రానిక్ డిజీసెస్) నయం చేస్తామని ప్రకటన చెయ్యడం నేరం. ఆ ప్రకటనలను ప్రచురించటం కూడ నేరమే.

బరువు తగ్గే విషయానికొస్తే ఇది చాలా ప్రమాధకరం. ప్రకృతికి విరుద్దం. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చివరికి ప్రాణం కూడ పోవచ్చు. కేవలం డబ్బు కోసం ఇలా ప్రజల ఆరోగ్యాల మీద ఆడుకునే ఇటువంటి మంత్రగాళ్ళ ప్రకటనలను ప్రచురించటం మెడికల్ యాక్ట్ ప్రకారం నేరం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడ నేరమే.

ఎలక్ట్రానిక్ మీడియా తాకిడికి, ఒక పార్టికి వంతె పాడి విశ్వసనీయత పోగొట్టుకున్న కారణంగా అమ్మకం తగ్గిపోయి, తద్వారా రీడర్షిప్, తద్వారా ప్రకటనాదాయాలు తగ్గిపోయి ఇటువంటి నీచ స్థితికి ఆంథ్రజ్యోతి యజమాన్యం దిగజారడం విషాదకరం.

ఎక్కడో కలుషిత నీరుత్రాగి ప్రజలు మరణించారంటే పతాక శీర్షికలు దంచే పత్రికలు ఇటువంటి ప్రకటనలను ప్రచురించటం అమానుషం.

ఇంకా లక్కీ డిప్పులు నడపడం దుబాకోరు కంపెనీలు నడిపే పోటీలకు సంబంధించిన ప్రకటనలు ప్రచురించటం కూడ నేరమే. (ఎటు కూడినా ఒకే అంకె వచ్చేలా టేబుల్ గీసి పంపమంటారుగా) రెండేళ్ళకు ముందు తమిళనాడులోని వారపత్రికలు ఇలానే ఇష్టమొచ్చినట్టుగా పత్రిక కొంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అని, డిప్పులని, లాటరీలని ప్రకటనలు గుప్పిస్తే కోర్టు జోక్యం చేసుకుని నిషేదించింది.

ఈ టపాను సైతం హై కోర్టు న్యాయ మూర్తి సుమోటోగా పరిగణించి పత్రికా యజమాన్యానికి నోటీసు జారీ చెయ్యవచ్చు.

RTS Perm Link


8 Responses  
 • గీతాచార్య writes:
  May 24th, 20099:09 pmat

  Very well said. ఆ పత్రిక చివరికి ఇలా దిగజారిందా? ఇంతకుముందూ ఇలాగే ఏవో లాటరీలని పత్రికని కొనిపించే ప్రయత్నం పెట్టేది.

 • mvs9 writes:
  May 24th, 20099:24 pmat

  మీరు పత్రిక నిర్వహణలో ఉన్నా – ప్రకటనల విధానం గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు . మీరు పేర్కొన్నటువంటి ప్రకటనలు దాదాపుగా అన్ని పత్రికలలో వస్తూనే ఉంటాయి . అందులో దినపత్రికలలో ఎక్కువగానే ఉంటాయి ( అలాంటి క్లాసిఫైడ్సు అయితే దాదాపు ప్రతిరోజూ ఉంటాయి ) .

  మీరు బహుశా గమనించని విషయం ఏమిటంటే – ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలలో కాంగ్రెస్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఏవైనా ప్రత్యేక కధనాలు వస్తే వాటికి ప్రతిస్పందనగా ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటనలు వస్తాయి . ఇవి ఆ రెండు పత్రికలలోకూడా ప్రత్యేకంగా వస్తాయి .

  మరో మాట : కాంగ్రెసు ప్రభుత్వ ప్రకటనలలో ఈనాడు అని నేటిరోజులని ఉద్దేశించి తాటికాయ అక్షరాలతో శీర్షికలో పెట్టడం చూసారా ఎప్పుడైనా ? ఈనాడు అనేది ఒక బ్రాండెడ్ పేరు అయిన ఈ రోజులలో కావాలనే అలా శీర్షికలలో వాడ్తున్నారు !

 • swamy7867 writes:
  May 24th, 20099:38 pmat

  అందరు చేసినంత మాత్రాన నేరం నేరం కాక పోదు. నేను లాయర్ని కాకున్నా ఐ.పి.సి సైతం తిరగేసిన బ్రష్ఠుడను. నేను తక్కువగానే తెలుసుకుంటా కాని కరెక్టుగా తెలుసుకుంటా. డొంట్ వొర్రి. మరెవరన్నా కూడ ఇది నేరం కాదని వాదిస్తే అప్పుడు ఐ.పి.సి, మెడికల్ యాక్ట్ పేజీలనే స్కేన్ చేసి ఉంచితే పోలే !
  By the by thank you for your continued interest.

 • swamy7867 writes:
  May 24th, 20099:42 pmat

  ముందుగా వారి సిబ్బందికి చట్టబద్దమైన జీతాలిస్తున్నారా, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లకు సక్రమంగా డబ్బులిస్తున్నారా ల్యేండ్ లైన్ ఫోన్లకు బిల్లులు కడుతున్నారా చూడమనండి. అప్పుడప్పుడు కొత్త నెంబర్లు ప్రచురిస్తుంటారు. అంటే ఏమర్థం? పాత నెంబరు డిస్కనెక్ట్ అయ్యిందన్న మాట. అప్పుడప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కావలెను అని కోరుతారు అంటే ఏమర్థం వీరి హింస్ భరించనుకాక పాత వాడు జెండా ఎత్తేసి ఉంటాడు

 • హరి దోర్నాల writes:
  May 24th, 200911:54 pmat

  “ఎక్కడో కలుషిత నీరుత్రాగి ప్రజలు మరణించారంటే పతాక శీర్షికలు దంచే పత్రికలు…”

  ప్రకటనల విషయంలో మీ అభిప్రాయం సరయినదే కావచ్చు. కాని మీకు కలుషిత నీరు త్రాగి మరణించిన ప్రజల విషయం బరువు తగ్గించే ప్రకటనల కన్నా చిన్న విషయం గా ఎలా తోచిందో అర్థం కావటంలేదు.

 • swamy7867 writes:
  May 25th, 20091:28 pmat

  కలుషిత నీరు త్రాగి చనిపోవడాన్ని చిన్న విష్యంగా నేను పరిగణించ లేదు. ఎక్కడో అన్న పదానికి జ్యోగ్రఫికల్ అర్థం తియ్యండి. కలుషిత నీరు త్రాగి అమాయక ప్రజలు చనిపోవడ్మ్ మరెక్కడో జ్రిగిన సంగతి. దాని పై బ్రహ్మాండంగా స్పందించి వార్త వ్రాసిన ఆంథ్రజ్యోతి యజమాణ్యం మరి భరువు తగ్గే ప్రకటనను తన టేబుల్ మీదే ఉంచుకుని మరి దాని తీవ్రతను ఊహించ లేక పోవడాన్నే తప్పు పట్టాను.

  నదుల అనుసంథానం కొరకు 1997 నుండి పని చేస్తున్న నాకు త్రాగు,సాగు నీరు సమస్యలంటే చిన్న చూపు అనుకోవడం పొరభాటు.

  కలుషిత నీరు త్రాగి కొందరు మరణించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మేలుకొని తీవ్ర చర్యలు చేపడుతుంది. కాని బరువు తగ్గే ప్రకటన చూసి చాలా మంది తమ ఆరోగ్యానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటారు అన్నది నా వాదన.

 • mvs9 writes:
  May 25th, 20093:31 pmat

  పత్రికల వార్తల ధోరణిలో తేడాలున్నా వ్యాపార ప్రకటనల విషయంలో అన్నిటి
  పద్ధతి ఒకేలా ఉంటుంది . తమ పత్రిక కి పరువు నష్టం వాటిల్లదనిపిస్తే చాలు
  ఎలాంటి ప్రకటనని అయినా స్వీకరిస్తారు . డబ్బు మహిమ మరి ! ఆ డబ్బే
  లేకపోతే పత్రిక మనుగడనే ఉండదుగా .

  బరువు తగ్గించే ప్రకటనలు , కోరిన సంతానాన్ని లభింపచేస్తామనేవి ,
  దీర్ఘకాల వ్యాధులని సులభంగా తగ్గిస్తామనేవి … ఇలా రకరకాల
  వ్యాపార ప్రకటనలు అన్ని దినపత్రికల్లో కనిపిస్తాయి .

  మీరు వైయస్సార్ కి ఆంధ్రజ్యోతిపై చర్య తీసుకోమని కోరగలిగే వీలు
  ఉంటే – అలాగే సాక్షి పైనా చర్యలు తీసుకోమనండి ! సాక్షిలోనూ
  అన్ని రకాల వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి మరి ..
  ఇదిగో సాక్ష్యం : saakshi 24 May 2009

 • swamy7867 writes:
  May 25th, 20096:55 pmat

  నేను ఇంతకు పూర్వం వ్రాసిన ఈ టపాను చూడండి .. ఈనాడు ,ఆంథ్రజ్యోతిలపై ఏ ఏ విష్యలపై చర్య తీసుకోవచ్చో సూచిస్తూ ఈ చర్యతో సాక్షికి కూడ కొంత ఇబ్బంది కలుగుతుందని ముందే చెప్పి ఉన్న. తప్పు ఎవరు చేసినా తప్పే.

  http://blaagu.com/swamy7867/2009/05/17/dr-ysr-ఆంథ్రజ్యోతి-ఈ-నాడు-పత్రి


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa