FireStats error : FireStats: Unknown commit strategy
గర్భస్ధ శిశువు ఆడా, మగా తెలుసుకునే పరీక్షలపై ఆంక్షలు ఎత్తి వేయాలి. ఆడ శిశువని తెలుస్తే నచ్చని వారు అబార్షను చేసుకునే వీలు కల్పించాలి (ఇలా చేస్టే స్త్రీ జనాబా విపరీతంగా తగ్గిపోయి వరకట్న సమస్య తనంతట తనే మటు మాయం అవుతుంది. పైగా ఎదురు కట్నమిచ్చే ఆనవాయితీ వస్తుంది. నేడు కట్నమివ్వలేక వృద్ధ కన్యలుగా ఉంటున్న స్త్రీల వలే అప్పుడు పురుషులు బాధ ఫడతారు. హస్త ప్రయోగం, హోమో సెక్సువల్స్ గా మారితే గాని మగ పురుగులకు జ్ఞానోదయం కలగదు. ఇది ఇప్పట్లో సాధ్యం కాక పోవచ్చు కాబట్టి కనంసం క్రింద తెలిపిన అంశాలనైనా ప్రభుత్వం అమలుచేస్తే మేలు.
1. ఒక స్త్రీ ఆడ శిశువుకు జన్మనిస్తే అది ప్రభుత్వ ఆసుపత్రైనా సరే, ప్రైవేటు ఆసుపత్రి అయినా సరే ప్రతి రూపాయి బిల్లు ప్రభుత్వమే చెల్లించాలి.(మొదటి రెండు సంతానాలకి)
2. స్త్రీ సంతానాన్ని కోరి పొందినవారికి ప్రభుత్వ రుణ, సంక్షేమ పథకాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
3. స్త్రీ సంతానం పొందిన పేరెంట్స్ కి ప్రత్యేక రేషన్ ఇవ్వాలి. ఆహారం అందివ్వడంలో స్త్రీ పురుష సంతానాల నడుమ పక్షపాతం చూపే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి.
4. ఆడ పిల్లలకు ప్రత్యేక విద్యా విధానాన్ని అమలు చెయ్యాలి. హై స్కూల్ స్టడీస్ లో లైంగిక విద్య పరిచయం చెయ్యాలి. స్కూల్ యజమాన్యమే ఆడపిల్లలకు మర్మాంగాల శుద్ది, బహిష్టు, సెక్స్, గర్భం, ప్రసవం ఇత్యాది విషయాల పై అవగాహన కల్పించాలి. ఉచిత నాప్కిన్స్, వాటర్ ఫెసిలిటి తో కూడిన బాత్ రూమ్స్ విద్యార్థునులకు సరిపడే సంఖ్యల్లో ఏర్పాటు చెయ్యాలి.
5. వివాహ విషయంలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు తప్పని సరి చెయ్యాలి. పైగా ఒక న్యాయమూర్తి వైద్య పరీక్షలు నిజాయితిగా జరిగినట్టు ధ్రువీకరించాలి.
6. అలాగే పెళ్లికొడుకు విషయంలోను ఇదే పద్దతి పాటించాలి.
7. ఇక స్త్రీకి ఎప్పుడు గర్భం దాల్చాలని నిర్ణయించే హక్కు ఉండాలి.(రిస్క్ ఆమెదే కాబట్టి)
8. అంతే కాక వివాహానంతరం భర్తయొక్క ఆస్తుల్లో, సంపాదనల్లో (స్వార్జితమైనా సరే, పిత్రార్జితమైనా సరే ) సమాన హక్కు కల్పించబడాలి. వైధవ్యం సంభవించినా సరే, విడాకులే పొందినా సరే ఈ హక్కు స్త్రీ తప్పకుండా సంక్రమించాలి.
9. అదే విధంగా కన్న కొడుకు, కూతురైన సరే, పెంచిన దత్తకొడుకు, పెంపుడు కూతురైనా సరే వారి ఆస్తులు, సంపాదనల్లోను సమాన హక్కు కల్పించాలి.
10. స్త్రీ న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినా, పోలీసు స్టేషన్ కు వెళ్ళీనా ఆమెకు ముందస్తు టి.ఎ., డి.ఎ, కనీస కూలి పరిహారంగా ఇవ్వాలి. ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదు.

Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Last 50 Posts
Back
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 