సాధారణంగా మంత్రాలు చదివేవారు ప్రతిరోజూ చదువుతుంటారు. నేను మాత్రం అలా చెయ్యను. ఎప్పుడైతే నేను చాలా డల్ గా ఫీల్ అవుతానో,మనీ ఫ్లో తగ్గి పోతుందో అప్పుడు మాత్రమే చదువుతా. ఒక సారి చదివితే కొన్నిసార్లు నెలల తరబడి కూడ మంత్రాలు చదవవలసిన అవసరం రాదు. అలా అవసరాన్ని బట్టి నేను చదివే శ్లోకాలు,మంత్రాలను బ్లాగ్లోక మిత్రుల కొరకు బహిర్గతం చేస్తున్నాను. వీటిలో మరో ప్రత్యేకత కూడ ఉంది. ఏ గ్రహాన్ని మంచిగ చేసుకోవడానికి ఏ దేవుడ్ని పూజించాలని శాస్త్రం చెబుతుందో ఆ దేవుళ్లకు సంభంధించిన మంత్రాలను రవి,చంద్ర,కుజ ,రాహు,గురు,శని,బుధ ,శుక్ర అన్న వరుసక్రమంలో చెబుతుంటాను. కేతువుకు సంబందించిన దేవుడు గణపతి. ఆయనకు సంబంధించిన శ్లోకం 8 వ స్థానంలో రావాలి. కాని ఆయన ఆది దేవుడు కాబట్టి ప్రథమ స్థానం కల్పించి,తక్కిన గ్రహ దేవతల మంత్రాలను వరుసక్రమంలో పొందు పరచాను
ఆది దేవుడు:
ఓం శ్రీ విఝ్నేశ్వరాయ నమ:
ఓం గం గణపతే స్వాహా
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఝ్నోప శాంతయే
రవి:
గాయత్రి:
ఓం భూర్భువస్వ:తత్సవితుర్వరేణ్యం భర్గో దగోస్య ధీమహి ధియో యోన:ప్రచోదయాత్
సూర్య నారాయణ స్వామి:
ఓం నమో భగవతే సూర్యాయ
హ్రీం సహస్ర కిరణాయ
ఐం అతుల బల పరాక్రమాయ
నవగ్రహ దసదిగ్పాలకాయ
లక్ష్మి దేవతాయ
ధర్మ ఖర్మ సహితాయ
సర్వ జన నాథయనాదాయ మోహాయ మోహాయ
ఆకర్ష ఆకర్ష దాసానుదాసమ్ కురు కురు ఫట్ స్వాహా
చంద్రుడు:
భువనేశ్వరి:
హ్రీంకార భీజాక్షరి
హ్రీంమయి దేవి అభయవరద హస్తిని పాశాంకుశ ధారిణి
శ్రీ చక్ర వాసిని,బాల పీఠ అధిరోహిణి
మాతా మత్రు మయీ అమ్రుత మయి ఆనందమయి
అనంతమయీ మాతా కాల కరణి
మాతా దేహీ దేహీ తక్షణం త్రికాల జ్నానం
మాతా దేహీ తక్షణం అష్థ ఐశ్వర్యం
మాతా దేహీ తక్షణం యత్న కార్య సిద్ది
మాతా దేహీ దేహీ వరప్రసాదందేహి
కుజ:
సుబ్రహ్మణ్యస్వామి:
ఓమ్ సౌం శరహణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమ:
రాహు:
దుర్గ:
ఓం దుం దుర్గాయై స్వాహ
గురు:
జగద్గురువైన శివుడు:
ఓం నమ:శివాయ
శంభో శంకర శంభో మహాదేవ
నాకు గురువై వచ్చి శ్రీరామునికి చేరువ చేసిన హనుమన్న:
ఓం నమో భగవాతే ఆంజనేయాయ మహా బలాయ శ్రీ హనుమతే స్వాహ
ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ
శ్రీ షిర్డి సాయి:
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై
రాఝవేంద్ర స్వామి:
పూజ్యాయ రాఝవేంద్రాయ సత్య ధర్మ రథాయచ భజతాం కల్ప వృక్షాయ నమదాం కామధేనవే
సరస్వతి మాత:
ఓం ఐం క్లీం సౌహ వద వద వాగ్వాదిని స్వాహ
సరస్వతి నమస్తుభ్హ్యం వరదే కామరూపిణి విథ్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా
శ్రీ బ్రహ్మంగారు:
ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ:
ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:
శని:
వరాహ స్వామి:
ఓం నమో వరాహ స్వామినే నమ:
బుధ:
శ్రీ వేంకటేశుడు:
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో తిరుమలేశాయ
ఓం నమో భక్తవత్సలాయ
ఓం నమో దుష్ఠ శిక్షణాయ
ఓం నమో శిష్ఠ రక్షణాయ
ఓం నమో పక్షి వాహణాయ
శ్రీ క్రిష్ణ పరమాత్ములు:
హరే రామ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
ఓం క్లీం క్రిష్ణ క్లీం
శుక్ర:
లక్ష్మి:
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే శంక చక్ర గథా హస్తే మహా లక్ష్మి నమోస్తుతే
మన పూజా ఫలాలను అందించుటకు బహళాముఖీ:
ఓం హ్లీం బహళా ముఖే స్వాహా ఓం హ్లీం పరమంత్ర ప్రయోగేషూ సదా విధ్వంస కారిణే బహళా ముఖే స్వాహా
ఓం హ్లీం స్వమంత్ర ఫల ధాయికే బహళా ముఖే స్వాహా
ప్రపంచ శాంతి కోసం:
సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినా వదీతమస్తు మావిద్విషావహె ఓం శాంతి శాంతి శాంతిహి
తమిళలు నాస్తికులు కదా మీరు ఈ మంత్రాలు చదవటం ఏమిటి? దానిని మాళ్లీ బ్లొగ్ లో రాయటం ఏమిటి? కొంపతీసి మీరు అయ్యర్ బ్రహ్మణుల ఏమీటి?
లేదండి నేను ఇటీవల వై.ఎస్.చే బి.సిల్లో చేర్చబడిన తమిళ ముదలియార్ కులస్తుడను
మీరు జపించే మంత్రాలు చాలా బాగున్నాఇ. నేను కూడా పటించడాని కి ప్రింట్ చేసుకున్నాను. ధన్య వాదములు.
శివ కుమార్
Thank you Mr.Sivakumar.
i want lot of money which mantra shall i follow is it true
Om hreem sreem hreem namaha