సత్సంతానం పొందటానికి మార్గాలు
ఒకే కులం,ఒకే తెగలోని పెళ్ళిళ్ళను నిషేదించాలి. ఒక అబ్బాయి కాని,అమ్మాయికాని 18సం.లు పూర్తయ్యేసరికి ఆర్థిక స్వేచ్చను పొందే విధంగా విద్యా విధానాన్ని మార్చాలి. అతను/ఆమె 18సం.లు పూర్తయ్యేసరికి తన శరీరం,మనస్సు,బుద్ది,ఆత్మ,తల్లి,తండ్రి,గురు,దైవం,కుటుంబం,గ్రామం,జిల్లా,నియోజకవర్గం,రాష్ట్రం,దేశం,ప్రపంచం గురించిన అవగాహాన పొంది ఉండాలి. ఆరోగ్యకర శరీరం,మనస్సు,బుద్ది పొంది ఉండాలి. ముఖ్యంగా లైంగిక విజ్ఞానం,పిల్లల పెంపకం గురించిన అవగాహన పొంది ఉండాలి.
జ్యోతిష్యం:
జ్యోతిష్యం పై నమ్మకం లేనప్పటికి స్త్రీ పురుషుల కలయకకు (సంతానార్థం) నిషేదించబడిన సమయాలను విడనాడి సంపర్కానికి పూనుకోవాలి. అలాగే పురుషుడు సంపర్కానికి 15 రోజుల పూర్వంనుండి బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీ బహిష్టు దినం ప్లస్ ఐదు దినాలు పూర్తి అయ్యిక వచ్చే మొదటి ఐదు దినములు ,బహిష్టుకు పూర్వం ఐదు దినములు మినహాయించి మద్యలో గల రోజుల్లో పగటి పూటను మినహాయించి సంపర్కం జరగాలి. (సంతానం వద్దనే వారు బహిష్టుకు ముందు ఐదు దినాలు,తదుపరి ఐదు దినాలు సంపర్కం చేసుకొనవలెను)
ఆడ,మగ సంతానాలు;
ముందుగా తమ జాతకాలను కుటుంబ జ్యోతిష్కునికి చూపించి ఐదవ స్థానం,ఐదవ స్థానాధిపతి,గురుగ్రహ స్థితి గతులను అంచనా వెయ్యమని కోరాలి. అలాగే మగ సంతానం కోరువారు సంపర్క సమయంలో తమ రాశి లగ్నములకు ఐదవ స్థానమున పురుష గ్రహం (గురువు మినహాయించి) ఉండేలా చూసుకుంటే మంచిది.
వాస్తు:
పడక గది నైరుతి దిక్కున ఉండాలి. అక్కడి ఫ్లోరింగ్ అన్ని గదులకన్నా కాస్త మిట్టగా ఉండాలి. ఆ గదికి నైరుతి భాగాన గుంత,పల్లం ఉండరాదు. పైగా ఇంటికి పడమర,దక్షిణ భాగాల్లో ఖాళి స్థలం కాని గుంత,పల్లం గాని లేకుండాలి. తూర్పు,ఉత్తర భాగాల్లో వీథి,లేదా ఖాళిస్థలం ఉండాలి. ఇట్టి ఇంటికి వెళ్ళి కనీసం ఆరు నెలలైనా అయ్యుండాలి
శాపాలు:
పూర్వుల పాపకృత్యాల కారణంగా మీకు సంతాన విషయంలో కొన్ని ఆటంకాలు కలుగవచ్చును. ముఖ్యంగా కుజ,సర్ప,శుక్ర దోషాలు కలిగి ఉండవచ్చును. జాతకాలు లేనప్పటికి మీ పూర్వికుల జీవన విదానాన్ని పట్టే ఇట్టి శాపాలు,దోషాలు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.
కుజదోషం:
మీ పూర్వీకులకు వారసులు లేని ఆస్తులు ఏమైనా కలిసి వచ్చినవా చూడండి. సోదర నష్టాలు,రక్తం,మంట సంబంధ రోగాలు వారికి ఉన్నవా ఆరా తీయండి. పోలీసు కేసులు,పెద్ద ఆపరేషన్లు,అగ్ని ప్రమాదాలు,రోడ్డు ప్రమాదాలు,ఫ్యాక్షన్ తగాదాలు ఏమైనా మీ పూర్వీకులను బాధించి ఉన్నాయా వాకబు చేసుకొండి. మీ పూర్వీకుల్లో ఎవరన్నా పెళ్ళికిముందే చని పోవడం,భార్యా భర్తలు విడిపోవడం,పిల్లలు కలుగకపోవడం వంటివి జరిగాయా అడిగి తెలుసుకొండి. అలా జరిగి ఉంటే ఎయిడ్స్ రోగులకు సాయపడే సేవా సంస్థలకు తోచిన సాయం ముందుగానే చెయ్యండి
సర్ప దోషం:
మీ పూర్వీకుల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొన్నారా? స్మగ్లింగ్ వంటివి చేసేవారా? పాము కాటుకు బలైనారా ? అజ్ఞాతంలోకి వెళ్లి పోయినవారా వాకబు చెయ్యాండి. అలాగే మీ పూర్వీకుల్లో ఎవరైనా సన్యాసుల్లో కలిసి పోయారా…భార్య భర్త ఎవరన్నా లేచి పోయారా కనుగొనండి. సంతానం లేక/మగ సంతానం లేక బాధ పడ్డారా –అవునంటే ఏదైన చర్చికి మీకు తోచిన విరాళం ఇవ్వండి.
శుక్ర దోషం:
మీ పూర్వీకుల్లో ఎవరికన్నా రెండు పెళ్ళిళ్ళు జరిగాయా? పెళ్ళి కాకుండానే చనిపోయారా? తెలుసుకోండి. అవునంటే మీ చుట్టుప్రక్కల ప్రాంతంలో ముత్తైదువలు అరుగురిని పిలిచి వారికి చీరా,జాకెట్ పీస్ ఇచ్చి వారి ఆశీస్సులు పొందండి.
అలాగే గర్బస్థ కాలంలో స్త్రీ తన శరీరానికి బలం,మనస్సుకు అహ్లాదం,బుద్దికి పదును కల్గించే ఆహారం తీసుకోవాలి . తగిన వ్యాయామం చేయాలి. పిల్లల పెంపకంలోను తగు జాగ్రత్తలు పాటించాలి.