SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
శరీరాలను ఏకం చేసే ప్రయత్నం
Apr 29th, 2009 by chittoor Murugeshan

నేనిదివరకే పలు మార్లు చెప్పి ఉన్నాను – మనమంతా ఒకే వస్తువు నుండి ఒక విస్ఫోటం వలన పుట్టాం. మళ్లీ కలవాలనే తపన ప్రతిఒక్కరిలోను ఉంటుంది. ఆ కలయికకు ఈ శరీరాలే అడ్డమన్న స్ఫురణ అంతరంగాల్లో ఉంటుంది. శరీరాన్ని త్యజించే ప్రయత్నంగా చావడం లేదా చంపడం అనే రెండు పనులను పలు ముసుగుల్లో చేస్తుంటాం. సెక్స్ లో వీర్య స్కలనం జరుగు సమయాన (స్త్రీకి శ్రోణిత స్కలనం) కాలం తెలియని బ్లాక్ అవుట్ ఏర్పడుతుంది. అది మరణాన్ని తలపిస్తుంది. మనిషికి సెక్స్ పై మక్కువ ఉండటానికి కారణం ఇదే. పైగా ప్రాణుల కలయికకు అడ్డమని భావించిన శరీరాలను ఏకం చేసే ప్రయత్నం కూడ సెక్స్ లో జరుగుతుంది. కాని మన కలయికకు అడ్డం శరీరాలు కావు మన అహమే. అహాన్ని తొలగించుకోవడం ఒక్క ధ్యానం ద్వారే సాధ్యం.

ఇప్పుడు క్లుప్తంగా చూడండి – సృష్టికి పూర్వం కలిసున్నాం . మళ్లీ కలవాలని తపిస్తున్నాం. ఆ కలయికకు అడ్డం శరీరాలని భావించి చంపటమో, చావటమో చేస్తున్నాం. (ఇది సెక్స్ లో అవలీలగా జరుగుతుంటుంది) లేదా శరీరాలను దగ్గర చెయ్యాలని శారీరికంగానన్నా కలవాలని తపిస్తాం. ఓకే.

మన సమాజంలో సెక్స్ దాదాపుగా నిషేదించపడింది. సెక్స్ పొందాలంటే పెళ్ళి కావాలి. పెళ్ళి కావాలంటే ఉద్యోగం వచ్చుండాలి. కాని చదువు, ఉద్యోగం, భార్య వచ్చేలోపే వయసొచ్చి ఉంటుంది. బుద్ధి మంచిది. వయస్సు చెడ్డది. సెక్స్ అనేది ప్రకృతి సిద్దమైనది. ప్రకృతి జీవుల నుండి ఎక్స్ పెక్ట్ చేసేవి రెండే పనులు – ఒకటి) జీవించి ఉండడం ; రెండు) వ్యాప్తి చెందటం – అందుకు కావలసిన శక్తిని 12/14 సం.ల వయస్సుకే ప్రకృతి మనిషికి ఇచ్చివేసింది.
మానవుడు నిజానికి జంతువు. శారీరికంగా చూస్తే నిజంగా జంతువే. సమాజం అతనిపై రుద్దిన కొన్ని విషయాలను కేవలం నలుగురికోసం పాటిస్తున్నాడు. పక్కన ఎవ్వరూ లేకుంటే ఎన్నికల కమిషనర్ సైతం తన సెక్రటరి పిరుదులు గిల్లుతాడు. జంతువుకు కావల్సింది రెండు – 1. తిండి, 2. సెక్స్. ఈ రెండింటిని మానవునికి అందుబాటులో తెచ్చేస్తే మానవునిలోని జంతువు ఎప్పటికీ బయటపడదు.

మనిషిలో ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. అది అధోముఖంగానన్నా పయనించాలి (సెక్స్) ; లేక ఊర్ధ్వ ముఖంగానన్నా పయనించాలి (యోగా). రెండు లేక అలమటిస్తే మాత్రం జంతువు బయటపడుతుంది. చంపటానికి చావడానికి వేరే మార్గాలు కనుగొంటాడు మనిషి. ఆ మార్గాలే డబ్బు, అధికారం (ఈ మద్యకాలంలో కీర్తి కాంక్ష).
నేను వ్యభిచారానికి చట్టబద్దత కోరడం మనిషిని మృగంగా మార్చటానికి కాదు. మనిషి మృగంగా మారిపోకుండా రక్షించటానికే. మానవునికి సెక్స్ అత్యవసరం. తిండి లేకున్నా ఉండి పోతాడేమో కాని, సెక్స్ లేకుంటే జంతువై పోతాడు. పేదల సంఖ్య పెరగడానికి కారణం కూడ ఇదే . ఉన్నవాడు ప్రాధమిక చర్యలగు చంపటం, చావటాన్ని – డబ్బు, అధికారాల ద్వారా చేసుకుంటాడు కాబట్టి అతనికి సెక్స్ పై ఎక్కువగా మక్కువ ఉండదు.

ఇదే పేదవాడు అయితే అతనికున్న ఏకైక మార్గం సెక్స్. అందుకే జనాభాలో పేదవర్గం మాత్రం ఎంతో వేగంగా వృద్ధి చెందుతుంది.
మనిషిలో ఉన్న ప్రాథమిక కోరికలైన చంపటం చావడం సెక్స్ ద్వారా నెరవేరిపోతే అతనిక ప్రత్యామ్నాయాలగు డబ్బు, అధికారం, కీర్తి పట్ల మొగ్గు చూపడు.

సెక్స్ వర్కర్స్ కి లైంగిక విద్య :
సెక్స్ వర్కర్స్ కి ఉత్తుత్తే లైసెన్సులు ఇచ్చి వేస్తే చాలదు. వారికి లైంగిక విద్యను సమకూర్చాలి, ఎయిడ్స్, బర్త్ కంట్రోల్ పై అవగాహన కల్పించాలి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు, నేరగాళ్ల సమాచారాలు సేకరించి ప్రభుత్వానికి అందచేసే శిక్షణ ఇవ్వాలి. కేవలం ఒక సెక్స్ వర్కర్ సాయంతో దేశ రహస్యాలను తరలించగా లేనిది, అదే సెక్స్ వర్కర్స్ ద్వారా మానవులను మానవులుగా కొనసాగనిచ్చి, సెక్స్ వర్కర్స్ ని దేశ బధ్రతకు, నేరాల, ఉగ్రవాదాల అదుపుకు వినియోగిస్తే తప్పేమిటంటా.

రహస్యం:
అవినీతి పెరగడానికి కారణం కూడ నెరవేరని సెక్స్ కోరికలే. సెక్స్ లో అసమర్థుడైన పురుషుడు ఆమె నుండి తప్పించుకోవడానికి సంపాదనకు ఉవ్విళ్ళూరుతాడు . భర్త సెక్స్ బలహీనత కలవాడైతే భార్య సేడిస్టిక్ గా మారిపోయి అతనిని అవినీతికి ప్రోత్సహిస్తుంది. యోనికి, నోటికి మద్యన ఒక నెర్వ్ ఉందట. మర్మాంగానికి ఆసన ద్వారానికి దూరం చాలా తక్కువ. సజావుగా సెక్స్ పొందలేని వారు అయిన చెత్తంతా తినడం, వాగడం, మల విసర్జన ద్వారా మర్మాంగ ప్రదేశానికి ప్రకంపణలు సృష్టించుకుని తరిస్తారట – షిట్.

RTS Perm Link

బ్లాగ్లోకంలో నా రచనల పై చర్చ
Apr 29th, 2009 by chittoor Murugeshan

బ్లాగ్లోకంలో నా రచనల పై ఇంతగా చర్చలు జరిగిన విషయం ఈ రోజే నా దృష్టికొచ్చింది. నేను ఏప్రిల్ 7వ తేదినుండి 21వ తేది సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నాను. అంతే గాని మీ మాటలే ఆఖరి మాటలని భ్రమించకండి.

నా బ్లాగును జెల్లడ వారు డియాక్టివేట్ చెయ్యడం కూడ నాకు కేవలం 24 గంటల ముందు మాత్రమే తెలిసింది. నిన్నా మొన్నా దాక కూడ నా రచనల పై ముఖ్యంగా చంద్రబాబు పై నా విమర్శలు, వ్యభిచారానికి చట్టబద్దతకు సానుకూలంగా వ్రాసిన నా టపాలపై బండ బూతులు కామెంట్స్ రూపంలో వచ్చినా నేను ఏమాత్రం ఫీల్ కాలేదు. వాటిని నా రచనల్లో ఎంతో కొంత నిజముండటాన్ని ధ్రువీకరించే సర్టిఫికేట్లుగానే పరిగణించాను.

జెల్లడ వారు నా సైటును డియాక్టివేట్ చేసామని మెయిల్ చేసినప్పుడు మాత్రం కాస్త కంగు తిన్నా నాకు తెలిసిన రెండు తెలుగు కవితల్లో ఒకటైన “ఎందుకు రాస్తార్రా నిషేదించడానికి అర్హతలేని కవిత్వం” కవిత గుర్తుకొచ్చింది. ప్రాక్టికల్ గా చూసినా నాకు వచ్చిన నష్టమేమీ లేదు. రోజువారి హిట్స్ యధాప్రకారం 200 పైచిలుకే ఉంటూంది.

అయితే నా రచనల పై ఇతర బ్లాగుల్లో జరుగుతున్న చర్చల సంగతి మాత్రం కొంత బాధ కల్గించాయి. అదీ వారు నన్ను విమర్శించారని కాదు. వారి విమర్శలను ఏకపక్షంగా ఉంచుకున్నారే తప్ప కనీస విలువలను పాటించి నాకు ఆ కామెంట్ల తాలూకు లింకన్నా పంపి నా వివరణ కోరి ఉండవచ్చుకదా అన్నదే నా బాధకు కారణం. అంతటి విశాల దృక్పధం గల వారైతే, వ్యభిచారానికి చట్టబద్దతకు వారు సైతం సానుకూలంగా స్పందించే వారేమో !

ఇలాగే ఒక సారి మరో బ్లాగులో నేను స్త్రీలను మరుగుదొడ్లన్నానని ప్రచారం చేసుకుంటుంటే నా వివరణ ఏదో ఇచ్చాను. నేను స్త్రీలను ఏమన్నా అనరాని మాట అంటే వారు ఖండించాలి. వారు దండించాలే కాని – నేను అనుదినము కొలుచు ఆది శక్తికి ప్రతి రూపులైన స్త్రీలకు వకాల్తా పుచ్చుకొని ఈ మగపురుగులు నా గొంతు నొక్కెయ్యాలని చూడడం ఎందుకో నాకర్థం కావడం లేదు. వీరి ద్రుష్ఠిలో స్త్రీలకి ఆమాత్రం ఆలోచించే సత్తా కూడ ఉండదేమో? ప్రతిస్పందించే జ్ఞానం తెలివితేటలు ఉండవేమో? వారి తరపున వారే స్పందిస్తే అది కాస్తా స్త్రీల హక్కు అనిపించుకుంటుందేమో?

పచ్చ చీర కట్టుకుని ఒక స్త్రీ ఎదురుపడితే కామాక్షి అనుకుంటా.. ఎరుపు చీరకట్టుకుని ఒక స్త్రీ ఎదురు పడితే చండి అనుకుంటా, ఏ వయస్సు స్త్రీనైనా – శ్రీ అమ్మవారుగా భావించి పాదాభివందనం చేసే శాక్తేయుడను నేను.

నేను వ్యభిచారానికి చట్టబద్దత కోరడం దేశంలోని స్త్రీలందరిని సెక్స్ వర్కర్స్ గా చెయ్యమనికాదు. సెక్స్ వర్కర్ అంటే తక్కువా కాదు, గృహిణి అంటే ఎక్కువా కాదు. ( స్త్రీ శరీరం పై ఆధిపత్యం చలాయించే పురుషాహంకారులే – స్త్రీకి శీలం కట్టపెట్టి, ఆమె యోనికి కాపలా కాస్తారు. నా దృష్టిలో స్త్రీ ఒక మానవ పుట్టుక. ఆమె పై ఎటువంటి ఆంక్షలను విధించే హక్కు ఎవరికీ లేదు )

స్త్రీని గౌరవించటానికి శీలాన్ని ఒక కొలమానంగా పరిగణించను. అందుకని ఆమెకు ఇబ్బంది కల్గించేది మాటైనా, వ్రాతైనా, యాడ్ అయినా , పురాణం ఇతిహాసమైనా సరే మూకుమ్మడిగా ఎదురిస్తాను. స్త్రీ స్వేచ్చను కాల రాసేవాడు ఆమెకు తండ్రైనా, భర్త అయినా, బిడ్డయినా స్త్రీకి మద్దత్తుగా నిలబడతాను. చెప్పాలసిన అవసరం లేకపోయినా చెబుతున్నాను – నా కూతురు ఇతన్ని ప్రేమిస్తున్నానని ఒకతన్ని ఇంటికి తీసుకొస్తే అదే సెకండ్లో “నువ్వు ఏం చేసినా నీ వెంట ఈ డాడి ఉంటాడు డోంట్ వర్రీ” అని సంఘీభావం వ్యక్తం చేసాను.

వ్యభిచారం చట్ట వ్యతిరేకంగా ఉండటంతోనే చాలా మంది పురుషులు దీని పై ఆసక్తి చూపుతారంటే నమ్ముతారా? కాని ఇది తర్కం. సైకాలజికల్ ట్రూత్. మనుషులు పలు ముసుగులు ధరించి చేసేవి రెండే పనులు అవి: చంపటం లేదా చావడం.

ఏదైనా చట్టవ్యతిరేకమన్నప్పుడు దాని మీద మానవులకు ఆసక్తి పుడుతుంది. 20 సం.లకు పూర్వం బ్లూ ఫిలిమ్ అంటే ఎంత కాస్ట్లి, ఎంత గిరాకి ఉండేది. ఏకంగా కాఫి బార్లే వెలిసాయి. ప్రస్తుతం సి.డి.ప్లేయర్ లేని ఇల్లు లేదు, ప్లేయర్ లేకున్నా ఇంటర్ నెట్ పార్లర్స్ లో లక్షలాది xxxx సైట్స్ దర్శనమిస్తాయి. మరి పట్టించుకునేవాడెవడు? అందుకే చెబుతున్నాను వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే అది ఆరు నెలలకో , సంవత్సరానికో మామూలై పోతుంది.

పైగా వ్యభిచారం చట్ట వ్యతిరేకంగా ఉండటంతోనే ఆ వృత్తిలోని స్త్రీలు నిత్యం నరకం అనుభవిస్తూ మసాకిస్టులుగా తయారవుతున్నారు. కుర్రాళ్ళు వారి వద్దకు వెళ్తే శాడిస్టులుగా మారి , ఆ కుర్రాళ్ళను సైతం శాడిస్టులుగా మార్చేస్తున్నారు. బాధల్లో ఉన్నవారే బాధ పెడతారని ఇదివరకే చెప్పాను. సెక్స్ వర్కర్స్ బాధల్లో లేకుంటే వందలాది కుర్రాళ్ళు శాడిస్టులుగా మారడం, వారి శాడిజానికి వారి భార్యలు గురికావడం జరుగదు.

నిజంగానే స్త్రీ గౌరవింప బడాలి, సురక్షితంగా తిరగాలి అనుకున్న ఎవరైనా సరే వ్యభిచారానికి చట్టబద్దతకు అంగీకరిస్తారు. తాతల నాన్నల భావాలకు దాసులై , నేటి నిజం తెలుసుకోని కీటక సన్నాసులై , హిప్పాక్రసితో ఆలోచిస్త్రే ఇదేదో పెద్ద నేరంలాగా అనిపిస్తుంది. కాని చిన్న తర్కం చాలు. నా పాయింటును అంగీకరించటానికి.

పల్లెల్లో ఒడ్ల మూటలు నిల్వ ఉంచే చోట బొరుగులు వేసి ఉంచుతారు. ఎందుకో తెలుసా ఎలుకలు వచ్చి ఒడ్లను మెక్కెయ్య కూడదని.

కుక్కర్లో వెయిట్ ఎందుకు పెట్టారో తెలుసా వ్యేక్యూం ఎక్కువై , కుక్కర్ ప్రేలిపోయే స్థితి వస్తే లూజు చెయ్యడానికి.
తల నిండా కామాన్ని ఉంచుకొని సమాజంలో ఏమి ఎరుగనట్టుగా తిరిగే పురుషుడు మానవ బాంబుకన్నా ప్రమాదకరం.
మానవ బాంబును ప్రేల్చేది ఆ మానవ బాంబు చేతుల్లోనే ఉంటుంది. కాని కామం అనే బాంబును కలిగి ఉన్న పురుషుని విషయంలో ఈ అంశం కూడా లేదు. అదెప్పుడు ప్రేలుతుందో తెలీదు, ఎవరి మీద ప్రేలుతుందో తెలీదు.

నేచురోపతిలో (ప్రక్కృతి వైద్యం) మల విసర్జనకు ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. మల బద్దకమే అన్ని వ్యాధులకు మూలమంటారు. అంతకన్నా కీలకం వీర్య విసర్జణ . వారి వారి శారీరిక, మానసిక స్థితిగతులను బట్టి వయోపరిమితిని బట్టి అది నిర్ణీత వ్యవధుల్లో జరిగి తీరాలి. స్వప్న స్ఖలితం, హస్త ప్రయోగం వంటివి మనిషిని అపరాధబావంలోకి నెట్టుతాయి.

లేదా హోమో సెక్సువల్ గా మారుతాడు. స్త్రీ విషయానికొస్తే పాపం ఈ దేశంలోని పురుషుల్లో 99.9 శాతం మందికి ఆర్గాజం అంటే ఏమిటో తెలీదు. సెక్స్ అనగానే ఎన్ని సార్లు అంటారు. లేదా ఎంత సేపు అంటారు. పురుషునికి వీర్యస్కలనం జరిగిపోతుంది కాని స్త్రీకి లభించేది గుండు సున్నే . అయినా ఆమెను కుక్కను చేసి పతివ్రత, ఇంటికి దీపం వంటి బిరుదులను బిస్కట్లుగా వేసి మ్యేనేజ్ చేస్తున్నారు. నేనిదివరకే చెప్పినట్టు బాధల్లో ఉన్నవారు ఇతరులనుకూడ బాధ పెట్టడం మోదలు పెడతారు.

నేను చాలెంజ్ చేసి చెబుతాను వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రతి వ్యక్తి పని సామర్థ్యం కూడ పెరుగుతుంది. ప్రతి సెక్స్ వర్కర్ ఒక లైంగిక విద్యా భోధకురాలై పరోక్షంగా సమస్త స్త్రీలోకానికి చరిత్రలో మొట్త మొదటిసారిగా ఆర్గాజం అంటే ఏమిటో, అదెలా ఉంటుందో తెలియచేస్తుంది.

భూమి బల్లపరుపుగా లేదన్న గలీలియోను సైతం బూతులు తిట్టిన లోకం ఇది. సోక్రటీసుకు విషమిచ్చిన లోకమిది.
హెల్ విత్ యువర్ హిప్పాక్రసి. బ్లడి మేల్ సేవనిస్ట్ ఇడియట్స్ !

మనవి: నేను కాంగ్రెస్ పార్టీలో పావలా మెంబరుని కూడ కాను. కేవలం వై.ఎస్. జలయజ్ఞానికి మద్దత్తుగా టపాలు వ్రాసాను. ప్రచారం చేసానంతే. కాంగ్రెస్ వంటి కన్జర్వేటివ్ పార్టి వ్యభిచారానికి చట్టబద్దత వంటి అంశాలను గైకొనాలంటే ఇంకో దశాబ్దం పోవాలి.

RTS Perm Link

ఆంథ్రప్రభలో విలేకరిగా నా నా దిక్కు మాలిన అనుభవాలు
Apr 28th, 2009 by chittoor Murugeshan

నాటి ప్రభ విలేకరి ఆచారి నా క్లెయింట్. అతను అప్పుల అప్పారావు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. పీకల దాక త్రాగి పడుకోవడం తప్ప మరే పని చెయ్యడు. పైరవీలు చేస్తానని డబ్బులు కాజేసి తప్పించుకు తిరుగుతుంటాడు. స్వయాన కజిన్ సిస్టర్ డౌరి అట్రాసిటి కేసు నడపడానికి 1.5 లక్షలు గుంజాడంటే చూడండి. ఇటువంటి వివిద కారణాలవలన అతను నన్నాశ్రయించి “స్వామిగారు, ఆంథ్రప్రభ యజమాన్యంతో మీకు సంబందం లేదు. నేను మీకు నెలకింత అని ఇచ్చుకుంటా మీరు రోజు ఆఫీసుకొచ్చి కూర్చొండి” అని పిలిచాడు. నా జ్యోతిష్య పరిజ్ఞానంతో ఎంతో మంది జీవితాలను నిలబెట్టియున్నప్పటికి జ్యోతిష్యం మీద బ్రతకడం నాకు గిల్టియే. కాబట్టి ఓకె అన్నాను.

ఇక చూసుకొండి. యాక్టింగ్ స్టాఫ్ రిపోర్టర్గా మారాను. అయితే పావలా ఆదాయం ఉండదు మరి. ఉదయమే జ్యోతిష్యం చెప్పడం ఆ డబ్బులతో ఫీల్డుకొచ్చి తిరగడం వార్తలు వ్రాయడం డి.టి.పి చెయ్యించడం. మోడెం ద్వారా వార్తలు పంపడం .

కొన్నిరోజులకే అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రభ ఎం.డి. కాకినాడ కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ అని , 2004 ఎన్నికల దాక చురుగ్గా నడిపి చేతులెత్తేసాడని. ప్రస్తుతం మ్యేనేజర్లే నడుపుతున్నారని తెల్సింది. మొదట ఫోను బిల్లులు కట్టక మోడెం ద్వారా వార్తలు పంపడం ఆగింది. ఫ్లాపీల్లో వార్తలు పంపడం మొదలు పెట్టాము. గది బాడుగలు కూడ నిల్వ ఉండటంతో బిల్డింగ్ ఓనరుతో రంపులు, డి.టి.పి.ఆపరేటరుకు జీతాలు లేవు కాబట్టి ఆమె నిలిచిపోయింది.

ఇంత జరుగుతున్నా ఆచారి ఏది పట్టించుకోలేదు. వారం పదిరోజులకోసారి వచ్చేవాడు క్షేమ లాభాలు అడిగి వెళ్లిపోయేవాడు. తిరుపతిలో ప్రభకు మోహన్ అని మ్యేనేజరొకతనున్నారు. అడ్వర్టైజ్మెంట్ మ్యేనేజరు శర్మా. వారికి అర్థమై పోయింది ఆఫీసు నడుస్తుండటం, వార్తలు రావడం మురుగేషన్ వల్లే, ఆచారితో ప్రమేయం లేకే అన్ని జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆచారికి అల్టిమేటం జారీ చేసారు . అతను బేఖాతరన్నాడు. ఒక రోజువచ్చి పి.సి.సెంటరులోని సామగ్రిలన్నింటిని తిరుపతికి తరలించుకుపోయారు. వెంటనే ఆచారి ఏంచేసాడంటే తన టేబుల్ డ్రాయర్లో నెక్లెసు, సెల్ ఫోన్లు మేము కాజేసామని చిత్తూరు క్రైం పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు. అతనికిది అలవాటే . గతంలో ప్రకటనల బాకీ వసూలుకొచ్చిన హైదరాబాదు మ్యేనేజరు మీద “నా భార్య చెయ్యి లాగాడని” ఫిర్యాదు ఇచ్చిన ఘన చరిత్ర గలవాడు ఆచారి.

(సశేషం . మిగతా తదుపరి టపాలలో)

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa