అవునండి! వీరి పోకడ చూస్తుంటే కరపత్రాలే నయమనిపిస్తుంది. పత్రిక వారు ఏమన్నా చెప్పదలుస్తే ఎడిటోరియల్ లో చెప్పుకోవాలే కాని –ఏకంగా పతాక శీర్షికలే ప్రచురించేస్తున్నారు అసహ్యంగా. ఏది నిజమో ఏది అబద్దమో తెలియక పాఠకులు తికమక పడుతున్నారు.
పైగా వెట్టిచాకిరి గురించి చేంతాడంత వార్తలు వ్రాసే విలేకరులే నిజమైన వెట్టిచాకిరివారు. చాలా పత్రికల్లో స్టాఫర్లకు సైతం జీతాల్లేవు. ఇతర విలేకరులను స్టింగర్లంటారు. వారికి లైన్ అకవుంట్ పేరిట నూరు రెండువందలు ఇచ్చి సరిపెడుతున్నారు. దీంతో వారు అవినీతికి పైరవీలకు పాల్పడుతున్నారు. చెత్త వెధవలే ఈ వృత్తికి వస్తున్నారు.
విజువల్ మీడియా పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో ప్రింట్ మీడియా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పట్టుకుని వైవిద్యం చూపకపోతే మటాష్ అవ్వడం ఖాయం. ప్రతి రోజు చూస్తున్నాను రాత్రి పది గంటల టి.వి. వార్తల్లో వచ్చిన అంశాలే ప్రొద్దున వార్తా పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే పత్రిక అలవాటు మృగ్యం అయిపోతుంది. టీ షాపుల్లో చూస్తే కుర్రాళ్ళు కేవలం సినిమా,క్రికెట్ పేజీలకే పరిమితమవుతున్నారు. చాలా మంది హెడ్ లైన్స్ మాత్రమే చూస్తున్నారు.
తరువాతి జెనెరేషన్ ఫ్యామిలి బడ్జెట్లో వార్తా పత్రికలకు తావే ఉండదన్నది నా అంచనా. దేశంలోని రెజిస్టర్డ్ పత్రికల వివరాలను రెజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వెబ్సైటులో చూస్తే కళ్ళు తిరుగుతాయి. పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే ఈ పేపర్లు కేవలం కొన్ని ప్రాంతాలకు,జిల్లాలకు,ఊళ్ళకే పరిమితమై,ప్రకటన దారుల పై ఆధారపడి వెలువడుతున్నాయి.(నా పక్ష పత్రిక బతుకు సైతం ఇంతే)
ఈ దుస్థితి మారాలి. విజువల్ మీడియాతో పోటిపడే స్థాయికి వార్తా పత్రికలు తమ పంథా మార్చుకోవాలి.
మరీ ఇప్పట్లో వస్తున్న జిల్లా ఎడిషన్లు చూస్తే వాంతికొస్తుంది. ఏది వార్త,ఏది వార్త కాదు అని నిర్ధారించే తర్కం కూడ లేక ఎడా పెడా అచ్చుగుద్ది జనం మీదికి వదిలేస్తున్నారు. పైగా డివిజన్ల వారీగా విభజించి ప్రచురించటంతో ఆయా డివిజన్ వారు ఆయా డివిజన్ వార్తలు మాత్రమే చదువుతున్నారు.
కాస్త సూక్ష్మ బుద్దితో ఆలోచిస్తే పత్రికలు పాఠకులను కాక ప్రకటనదారులనే నమ్ముకుని నడుస్తుండటం అర్థమవుతుంది. కనీస విలువలు లేవు. తారతమ్యం లేదు. ఏది వార్త,ఏది స్పాన్సర్డ్ ఫీచర్,ఏది ప్రకటన అర్థం కావడం లేదు. బరువు తగ్గే ప్రకటనలు,క్యేన్సర్ నయం చేసే డాక్టర్ల ప్రకటనలు …షిట్.
ఏమై పోతూంది మన పత్రికలకు?
ప్రజా రాజ్యానికి 30 సీట్లే వస్తే చిరంజీవి చొక్కా చించుకుంటే అది ఆ నిమిషమే విజువల్ మీడియాలో రావచ్చు. కాని ప్రింట్ మీడియా తలుచుకుంటే చిరంజీవి గతంలో ఏ ఏ సందర్బాల్లో చొక్కా చించుకున్నారు? ,ఇక ఏ ఏ రాజకీయ నాయకులు చొక్కా చించుకున్నారు వంటి డేటాతో ఫైల్ ఫోటోస్ తో పండించవచ్చు.
కాని పత్రికలు ఏంచేస్తున్నాయి? హెడింగ్,లీడ్ లో ఉన్న విషయాన్ని(అంశాన్ని) తిప్పించి మళ్ళించి వేరే వేరే బాషల్లో రిపీట్ చేస్తున్నాయే కాని ముందు,వెనుక సమాచారాలను వివరించటం లేదు.
ఏం చెయ్యొచ్చు?
యాక్సిడెంటే వార్త కాదు –అసలు యాక్సిడెంట్లు చెయ్యని డ్రైవర్ ,అతని కుటుంబ వివరాలు కూడ వార్తే .
ఆత్మహత్యే వార్త కాదు –ఆత్మహత్యను వారించే కన్సల్టెంట్లు,సేవా సంస్ధల వివరాలు కూడ వార్తే .
నేటివిటి ముఖ్యమే;అందుకని జిల్లా ప్రజా ప్రతినిధులకే పరిమితమైతే ఎలా? రాష్ఠ్రం మొత్తం మీద వైవిధ్యులైన ప్రజా ప్రతినిధుల విశేషాలు కూడ వార్తలే
ఏమో …వీరు మారరు …