1. కేంద్రంలో ఏ కూటమికి మెజారిటి వచ్చినప్పటికి అన్ని పార్టీలను కలుపుకుని జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి
2. ప్రతి పోలీసు స్టేషనుకు 3 సెట్స్ ఆఫ్ సిబ్బందినివ్వాలి. ఏ సెట్ ఆఫ్ సిబ్బందైనా సరే 8 గంటలకు మించి పని చేయకూడదు
3. ప్రతి పౌరుని వివరాలు సేకరించి మైక్రో చిప్లో పొందుపరచాలి. ఆ వివరాలను కంప్యూటరీకరణ చేసి,చిప్ కార్డులని పౌరులకు ఇవ్వాలి
4. ప్రభుత్వసంస్థ ఉద్యోగులను వైద్య,సైక్రియాట్రి పరీక్షలకు పంపి అనర్హులకు 6 నెలల సెలవు ఇచ్చి,చికిత్సకు ఏర్పాటు చెయ్యాలి.
5. అధ్యక్ష తరహా పాలన అమలుకు రాజ్యాంగ సవరణ చెయ్యాలి
6. పది కోట్లమంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి,నదుల అనుసంధాన భాధ్యతనివ్వాలి
7. కాశ్మీరును ఐ.రా.స కార్య కలాపాలకు డొనేట్ చేసెయ్యాలి. పాక్ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని కూడ అలాగే ఇవ్వాలని ఒత్తిడి తేవాలి
8. మత పరమైన బహిరంగ చర్యలకు నిషేదం విధించాలి. కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
9. స్విస్ తరహా బ్యాంకొకదానిని స్థాపించాలి. ఆ తరువాత ప్రస్తుత కరెన్సీ ని రద్దు చేసి కొత్త కరెన్సీ అమలు చెయ్యాలి. పాతవాటిని తగిన లెక్కలు చూపి ఎక్చేంజి చేసుకునే వీలు కల్పించాలి
10. జాతీయ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి సమిష్టి వ్యవసాయం సాగేలా చూడాలి