శరీరాలను ఏకం చేసే ప్రయత్నం

నేనిదివరకే పలు మార్లు చెప్పి ఉన్నాను –మనమంతా ఒకే వస్తువు నుండి ఒక విస్ఫోటం వలన పుట్టాం. మళ్లీ కలవాలనే తపన ప్రతిఒక్కరిలోను ఉంటుంది. ఆ కలయికకు ఈ శరీరాలే అడ్డమన్న స్ఫురణ అంతరంగాల్లో ఉంటుంది. శరీరాన్ని త్యజించే ప్రయత్నంగా చావడం లేదా చంపడం అనే రెండు పనులను పలు ముసుగుల్లో చేస్తుంటాం. సెక్స్ లో వీర్య స్కలనం జరుగు సమయాన (స్త్రీకి శ్రోణిత స్కలనం) కాలం తెలియని బ్లాక్ అవుట్ ఏర్పడుతుంది. అది మరణాన్ని తలపిస్తుంది. మనిషికి సెక్స్ పై మక్కువ ఉండటానికి కారణం ఇదే. పైగా ప్రాణుల కలయికకు అడ్డమని భావించిన శరీరాలను ఏకం చేసే ప్రయత్నం కూడ సెక్స్ లో జరుగుతుంది. కాని మన కలయికకు అడ్డం శరీరాలు కావు మన అహమే. అహాన్ని తొలగించుకోవడం ఒక్క ధ్యానం ద్వారే సాధ్యం.

ఇప్పుడు క్లుప్తంగా చూడండి –సృష్టికి పూర్వం కలిసున్నాం . మళ్లీ కలవాలని తపిస్తున్నాం. ఆ కలయికకు అడ్డం శరీరాలని భావించి చంపటమో,చావటమో చేస్తున్నాం. (ఇది సెక్స్ లో అవలీలగా జరుగుతుంటుంది) లేదా శరీరాలను దగ్గర చెయ్యాలని శారీరికంగానన్నా కలవాలని తపిస్తాం. ఓకే.

మన సమాజంలో సెక్స్ దాదాపుగా నిషేదించపడింది. సెక్స్ పొందాలంటే పెళ్ళి కావాలి. పెళ్ళి కావాలంటే ఉద్యోగం వచ్చుండాలి. కాని చదువు,ఉద్యోగం,భార్య వచ్చేలోపే వయసొచ్చి ఉంటుంది. బుద్ధి మంచిది. వయస్సు చెడ్డది. సెక్స్ అనేది ప్రకృతి సిద్దమైనది. ప్రకృతి జీవుల నుండి ఎక్స్ పెక్ట్ చేసేవి రెండే పనులు –ఒకటి) జీవించి ఉండడం ;రెండు) వ్యాప్తి చెందటం –అందుకు కావలసిన శక్తిని 12/14 సం.ల వయస్సుకే ప్రకృతి మనిషికి ఇచ్చివేసింది.
మానవుడు నిజానికి జంతువు. శారీరికంగా చూస్తే నిజంగా జంతువే. సమాజం అతనిపై రుద్దిన కొన్ని విషయాలను కేవలం నలుగురికోసం పాటిస్తున్నాడు. పక్కన ఎవ్వరూ లేకుంటే ఎన్నికల కమిషనర్ సైతం తన సెక్రటరి పిరుదులు గిల్లుతాడు. జంతువుకు కావల్సింది రెండు –1. తిండి,2. సెక్స్. ఈ రెండింటిని మానవునికి అందుబాటులో తెచ్చేస్తే మానవునిలోని జంతువు ఎప్పటికీ బయటపడదు.

మనిషిలో ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. అది అధోముఖంగానన్నా పయనించాలి (సెక్స్) ;లేక ఊర్ధ్వ ముఖంగానన్నా పయనించాలి (యోగా). రెండు లేక అలమటిస్తే మాత్రం జంతువు బయటపడుతుంది. చంపటానికి చావడానికి వేరే మార్గాలు కనుగొంటాడు మనిషి. ఆ మార్గాలే డబ్బు,అధికారం (ఈ మద్యకాలంలో కీర్తి కాంక్ష).
నేను వ్యభిచారానికి చట్టబద్దత కోరడం మనిషిని మృగంగా మార్చటానికి కాదు. మనిషి మృగంగా మారిపోకుండా రక్షించటానికే. మానవునికి సెక్స్ అత్యవసరం. తిండి లేకున్నా ఉండి పోతాడేమో కాని,సెక్స్ లేకుంటే జంతువై పోతాడు. పేదల సంఖ్య పెరగడానికి కారణం కూడ ఇదే . ఉన్నవాడు ప్రాధమిక చర్యలగు చంపటం,చావటాన్ని –డబ్బు,అధికారాల ద్వారా చేసుకుంటాడు కాబట్టి అతనికి సెక్స్ పై ఎక్కువగా మక్కువ ఉండదు.

ఇదే పేదవాడు అయితే అతనికున్న ఏకైక మార్గం సెక్స్. అందుకే జనాభాలో పేదవర్గం మాత్రం ఎంతో వేగంగా వృద్ధి చెందుతుంది.
మనిషిలో ఉన్న ప్రాథమిక కోరికలైన చంపటం చావడం సెక్స్ ద్వారా నెరవేరిపోతే అతనిక ప్రత్యామ్నాయాలగు డబ్బు,అధికారం,కీర్తి పట్ల మొగ్గు చూపడు.

సెక్స్ వర్కర్స్ కి లైంగిక విద్య:
సెక్స్ వర్కర్స్ కి ఉత్తుత్తే లైసెన్సులు ఇచ్చి వేస్తే చాలదు. వారికి లైంగిక విద్యను సమకూర్చాలి,ఎయిడ్స్,బర్త్ కంట్రోల్ పై అవగాహన కల్పించాలి. అసాంఘిక శక్తులు,ఉగ్రవాదులు,నేరగాళ్ల సమాచారాలు సేకరించి ప్రభుత్వానికి అందచేసే శిక్షణ ఇవ్వాలి. కేవలం ఒక సెక్స్ వర్కర్ సాయంతో దేశ రహస్యాలను తరలించగా లేనిది,అదే సెక్స్ వర్కర్స్ ద్వారా మానవులను మానవులుగా కొనసాగనిచ్చి,సెక్స్ వర్కర్స్ ని దేశ బధ్రతకు,నేరాల,ఉగ్రవాదాల అదుపుకు వినియోగిస్తే తప్పేమిటంటా.

రహస్యం:
అవినీతి పెరగడానికి కారణం కూడ నెరవేరని సెక్స్ కోరికలే. సెక్స్ లో అసమర్థుడైన పురుషుడు ఆమె నుండి తప్పించుకోవడానికి సంపాదనకు ఉవ్విళ్ళూరుతాడు . భర్త సెక్స్ బలహీనత కలవాడైతే భార్య సేడిస్టిక్ గా మారిపోయి అతనిని అవినీతికి ప్రోత్సహిస్తుంది. యోనికి,నోటికి మద్యన ఒక నెర్వ్ ఉందట. మర్మాంగానికి ఆసన ద్వారానికి దూరం చాలా తక్కువ. సజావుగా సెక్స్ పొందలేని వారు అయిన చెత్తంతా తినడం,వాగడం,మల విసర్జన ద్వారా మర్మాంగ ప్రదేశానికి ప్రకంపణలు సృష్టించుకుని తరిస్తారట –షిట్.

RTS Perm Link

2 comments to శరీరాలను ఏకం చేసే ప్రయత్నం

  • mvsrao

    వ్యభిచారం కి చట్టబద్ధత ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయట .

    మరి అవి అభివృద్ధి చెందాయని అనుకుంటున్నారా ?

    శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కేరళ లో అయ్యప్ప స్వామి దీక్ష పేరిట లైంగిక

    సంపర్కానికి కొంతకాలం సెలవు తీసుకునే పద్ధతి మొదలైనది ఎందుకో కాస్త చెప్పండి

  • మీ ప్రశ్న:వ్యభిచారం కి చట్టబద్ధత ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయట . మరి అవి అభివృద్ధి చెందాయని అనుకుంటున్నారా ?
    నా సమాదానం:వ్యభిచారానికి చట్టబద్దత కల్పించి కూర్చుంటే ఏ దేశమైనా సరే అభివ్రుద్ది చెందిపోవు. ఈ కాన్సెప్ట్ వలన అభివ్రుద్దికి మనుషులు,మనస్సుల కారణంగా కలిగే ఆటంగాలు తొలిగిపోతాయంతే

    మీ ప్రశ్న:“శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కేరళ లో ”అని మొదలు పెట్టారు. ఎవరు చెప్పారీ మాట మీకు? అంటే మీ ఊళ్ళల్లో ఆడే బూతు సినిమా పోస్టర్లు చూసి ఊహించుకున్నారా? ఆ సినిమాలకి కేరళకు ఎట్టి సంబంధము ఉండదు సుమా !

    మీ ప్రశ్న:అయ్యప్ప స్వామి దీక్ష పేరిట లైంగిక
    సంపర్కానికి కొంతకాలం సెలవు తీసుకునే పద్ధతి మొదలైనది ఎందుకో కాస్త చెప్పండి?
    మీరు బ్రహ్మచర్యం పాటిస్తున్నారంటే సెక్స్ కు సిద్దమవుతున్నారని అర్థం. మీరు సెక్స్ లో పాల్గొంటున్నారంటే బ్రహ్మచర్యానికి సిద్దమయ్యారని అర్థం. (ఇది అర్థం కాదనుకుంటా)

Leave a Reply

  

  

  

You can use these HTML tags

<a href=""title=""><abbr title=""><acronym title=""><b><blockquote cite=""><cite><code><del datetime=""><em><i><q cite=""><strike><strong>

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna,tincidunt vitae molestie nec,molestie at mi. Nulla nulla lorem,suscipit in posuere in,interdum non magna.