బ్లాగ్లోకంలో నా రచనల పై చర్చ

బ్లాగ్లోకంలో నా రచనల పై ఇంతగా చర్చలు జరిగిన విషయం ఈ రోజే నా దృష్టికొచ్చింది. నేను ఏప్రిల్ 7వ తేదినుండి 21వ తేది సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నాను. అంతే గాని మీ మాటలే ఆఖరి మాటలని భ్రమించకండి.

నా బ్లాగును జెల్లడ వారు డియాక్టివేట్ చెయ్యడం కూడ నాకు కేవలం 24 గంటల ముందు మాత్రమే తెలిసింది. నిన్నా మొన్నా దాక కూడ నా రచనల పై ముఖ్యంగా చంద్రబాబు పై నా విమర్శలు, వ్యభిచారానికి చట్టబద్దతకు సానుకూలంగా వ్రాసిన నా టపాలపై బండ బూతులు కామెంట్స్ రూపంలో వచ్చినా నేను ఏమాత్రం ఫీల్ కాలేదు. వాటిని నా రచనల్లో ఎంతో కొంత నిజముండటాన్ని ధ్రువీకరించే సర్టిఫికేట్లుగానే పరిగణించాను.

జెల్లడ వారు నా సైటును డియాక్టివేట్ చేసామని మెయిల్ చేసినప్పుడు మాత్రం కాస్త కంగు తిన్నా నాకు తెలిసిన రెండు తెలుగు కవితల్లో ఒకటైన “ఎందుకు రాస్తార్రా నిషేదించడానికి అర్హతలేని కవిత్వం” కవిత గుర్తుకొచ్చింది. ప్రాక్టికల్ గా చూసినా నాకు వచ్చిన నష్టమేమీ లేదు. రోజువారి హిట్స్ యధాప్రకారం 200 పైచిలుకే ఉంటూంది.

అయితే నా రచనల పై ఇతర బ్లాగుల్లో జరుగుతున్న చర్చల సంగతి మాత్రం కొంత బాధ కల్గించాయి. అదీ వారు నన్ను విమర్శించారని కాదు. వారి విమర్శలను ఏకపక్షంగా ఉంచుకున్నారే తప్ప కనీస విలువలను పాటించి నాకు ఆ కామెంట్ల తాలూకు లింకన్నా పంపి నా వివరణ కోరి ఉండవచ్చుకదా అన్నదే నా బాధకు కారణం. అంతటి విశాల దృక్పధం గల వారైతే, వ్యభిచారానికి చట్టబద్దతకు వారు సైతం సానుకూలంగా స్పందించే వారేమో !

ఇలాగే ఒక సారి మరో బ్లాగులో నేను స్త్రీలను మరుగుదొడ్లన్నానని ప్రచారం చేసుకుంటుంటే నా వివరణ ఏదో ఇచ్చాను. నేను స్త్రీలను ఏమన్నా అనరాని మాట అంటే వారు ఖండించాలి. వారు దండించాలే కాని – నేను అనుదినము కొలుచు ఆది శక్తికి ప్రతి రూపులైన స్త్రీలకు వకాల్తా పుచ్చుకొని ఈ మగపురుగులు నా గొంతు నొక్కెయ్యాలని చూడడం ఎందుకో నాకర్థం కావడం లేదు. వీరి ద్రుష్ఠిలో స్త్రీలకి ఆమాత్రం ఆలోచించే సత్తా కూడ ఉండదేమో? ప్రతిస్పందించే జ్ఞానం తెలివితేటలు ఉండవేమో? వారి తరపున వారే స్పందిస్తే అది కాస్తా స్త్రీల హక్కు అనిపించుకుంటుందేమో?

పచ్చ చీర కట్టుకుని ఒక స్త్రీ ఎదురుపడితే కామాక్షి అనుకుంటా.. ఎరుపు చీరకట్టుకుని ఒక స్త్రీ ఎదురు పడితే చండి అనుకుంటా, ఏ వయస్సు స్త్రీనైనా – శ్రీ అమ్మవారుగా భావించి పాదాభివందనం చేసే శాక్తేయుడను నేను.

నేను వ్యభిచారానికి చట్టబద్దత కోరడం దేశంలోని స్త్రీలందరిని సెక్స్ వర్కర్స్ గా చెయ్యమనికాదు. సెక్స్ వర్కర్ అంటే తక్కువా కాదు, గృహిణి అంటే ఎక్కువా కాదు. ( స్త్రీ శరీరం పై ఆధిపత్యం చలాయించే పురుషాహంకారులే – స్త్రీకి శీలం కట్టపెట్టి, ఆమె యోనికి కాపలా కాస్తారు. నా దృష్టిలో స్త్రీ ఒక మానవ పుట్టుక. ఆమె పై ఎటువంటి ఆంక్షలను విధించే హక్కు ఎవరికీ లేదు )

స్త్రీని గౌరవించటానికి శీలాన్ని ఒక కొలమానంగా పరిగణించను. అందుకని ఆమెకు ఇబ్బంది కల్గించేది మాటైనా, వ్రాతైనా, యాడ్ అయినా , పురాణం ఇతిహాసమైనా సరే మూకుమ్మడిగా ఎదురిస్తాను. స్త్రీ స్వేచ్చను కాల రాసేవాడు ఆమెకు తండ్రైనా, భర్త అయినా, బిడ్డయినా స్త్రీకి మద్దత్తుగా నిలబడతాను. చెప్పాలసిన అవసరం లేకపోయినా చెబుతున్నాను – నా కూతురు ఇతన్ని ప్రేమిస్తున్నానని ఒకతన్ని ఇంటికి తీసుకొస్తే అదే సెకండ్లో “నువ్వు ఏం చేసినా నీ వెంట ఈ డాడి ఉంటాడు డోంట్ వర్రీ” అని సంఘీభావం వ్యక్తం చేసాను.

వ్యభిచారం చట్ట వ్యతిరేకంగా ఉండటంతోనే చాలా మంది పురుషులు దీని పై ఆసక్తి చూపుతారంటే నమ్ముతారా? కాని ఇది తర్కం. సైకాలజికల్ ట్రూత్. మనుషులు పలు ముసుగులు ధరించి చేసేవి రెండే పనులు అవి: చంపటం లేదా చావడం.

ఏదైనా చట్టవ్యతిరేకమన్నప్పుడు దాని మీద మానవులకు ఆసక్తి పుడుతుంది. 20 సం.లకు పూర్వం బ్లూ ఫిలిమ్ అంటే ఎంత కాస్ట్లి, ఎంత గిరాకి ఉండేది. ఏకంగా కాఫి బార్లే వెలిసాయి. ప్రస్తుతం సి.డి.ప్లేయర్ లేని ఇల్లు లేదు, ప్లేయర్ లేకున్నా ఇంటర్ నెట్ పార్లర్స్ లో లక్షలాది xxxx సైట్స్ దర్శనమిస్తాయి. మరి పట్టించుకునేవాడెవడు? అందుకే చెబుతున్నాను వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే అది ఆరు నెలలకో , సంవత్సరానికో మామూలై పోతుంది.

పైగా వ్యభిచారం చట్ట వ్యతిరేకంగా ఉండటంతోనే ఆ వృత్తిలోని స్త్రీలు నిత్యం నరకం అనుభవిస్తూ మసాకిస్టులుగా తయారవుతున్నారు. కుర్రాళ్ళు వారి వద్దకు వెళ్తే శాడిస్టులుగా మారి , ఆ కుర్రాళ్ళను సైతం శాడిస్టులుగా మార్చేస్తున్నారు. బాధల్లో ఉన్నవారే బాధ పెడతారని ఇదివరకే చెప్పాను. సెక్స్ వర్కర్స్ బాధల్లో లేకుంటే వందలాది కుర్రాళ్ళు శాడిస్టులుగా మారడం, వారి శాడిజానికి వారి భార్యలు గురికావడం జరుగదు.

నిజంగానే స్త్రీ గౌరవింప బడాలి, సురక్షితంగా తిరగాలి అనుకున్న ఎవరైనా సరే వ్యభిచారానికి చట్టబద్దతకు అంగీకరిస్తారు. తాతల నాన్నల భావాలకు దాసులై , నేటి నిజం తెలుసుకోని కీటక సన్నాసులై , హిప్పాక్రసితో ఆలోచిస్త్రే ఇదేదో పెద్ద నేరంలాగా అనిపిస్తుంది. కాని చిన్న తర్కం చాలు. నా పాయింటును అంగీకరించటానికి.

పల్లెల్లో ఒడ్ల మూటలు నిల్వ ఉంచే చోట బొరుగులు వేసి ఉంచుతారు. ఎందుకో తెలుసా ఎలుకలు వచ్చి ఒడ్లను మెక్కెయ్య కూడదని.

కుక్కర్లో వెయిట్ ఎందుకు పెట్టారో తెలుసా వ్యేక్యూం ఎక్కువై , కుక్కర్ ప్రేలిపోయే స్థితి వస్తే లూజు చెయ్యడానికి.
తల నిండా కామాన్ని ఉంచుకొని సమాజంలో ఏమి ఎరుగనట్టుగా తిరిగే పురుషుడు మానవ బాంబుకన్నా ప్రమాదకరం.
మానవ బాంబును ప్రేల్చేది ఆ మానవ బాంబు చేతుల్లోనే ఉంటుంది. కాని కామం అనే బాంబును కలిగి ఉన్న పురుషుని విషయంలో ఈ అంశం కూడా లేదు. అదెప్పుడు ప్రేలుతుందో తెలీదు, ఎవరి మీద ప్రేలుతుందో తెలీదు.

నేచురోపతిలో (ప్రక్కృతి వైద్యం) మల విసర్జనకు ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. మల బద్దకమే అన్ని వ్యాధులకు మూలమంటారు. అంతకన్నా కీలకం వీర్య విసర్జణ . వారి వారి శారీరిక, మానసిక స్థితిగతులను బట్టి వయోపరిమితిని బట్టి అది నిర్ణీత వ్యవధుల్లో జరిగి తీరాలి. స్వప్న స్ఖలితం, హస్త ప్రయోగం వంటివి మనిషిని అపరాధబావంలోకి నెట్టుతాయి.

లేదా హోమో సెక్సువల్ గా మారుతాడు. స్త్రీ విషయానికొస్తే పాపం ఈ దేశంలోని పురుషుల్లో 99.9 శాతం మందికి ఆర్గాజం అంటే ఏమిటో తెలీదు. సెక్స్ అనగానే ఎన్ని సార్లు అంటారు. లేదా ఎంత సేపు అంటారు. పురుషునికి వీర్యస్కలనం జరిగిపోతుంది కాని స్త్రీకి లభించేది గుండు సున్నే . అయినా ఆమెను కుక్కను చేసి పతివ్రత, ఇంటికి దీపం వంటి బిరుదులను బిస్కట్లుగా వేసి మ్యేనేజ్ చేస్తున్నారు. నేనిదివరకే చెప్పినట్టు బాధల్లో ఉన్నవారు ఇతరులనుకూడ బాధ పెట్టడం మోదలు పెడతారు.

నేను చాలెంజ్ చేసి చెబుతాను వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రతి వ్యక్తి పని సామర్థ్యం కూడ పెరుగుతుంది. ప్రతి సెక్స్ వర్కర్ ఒక లైంగిక విద్యా భోధకురాలై పరోక్షంగా సమస్త స్త్రీలోకానికి చరిత్రలో మొట్త మొదటిసారిగా ఆర్గాజం అంటే ఏమిటో, అదెలా ఉంటుందో తెలియచేస్తుంది.

భూమి బల్లపరుపుగా లేదన్న గలీలియోను సైతం బూతులు తిట్టిన లోకం ఇది. సోక్రటీసుకు విషమిచ్చిన లోకమిది.
హెల్ విత్ యువర్ హిప్పాక్రసి. బ్లడి మేల్ సేవనిస్ట్ ఇడియట్స్ !

మనవి: నేను కాంగ్రెస్ పార్టీలో పావలా మెంబరుని కూడ కాను. కేవలం వై.ఎస్. జలయజ్ఞానికి మద్దత్తుగా టపాలు వ్రాసాను. ప్రచారం చేసానంతే. కాంగ్రెస్ వంటి కన్జర్వేటివ్ పార్టి వ్యభిచారానికి చట్టబద్దత వంటి అంశాలను గైకొనాలంటే ఇంకో దశాబ్దం పోవాలి.

RTS Perm Link

1 comment to బ్లాగ్లోకంలో నా రచనల పై చర్చ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.