ఆంథ్రప్రభలో విలేకరిగా నా నా దిక్కు మాలిన అనుభవాలు

నాటి ప్రభ విలేకరి ఆచారి నా క్లెయింట్. అతను అప్పుల అప్పారావు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. పీకల దాక త్రాగి పడుకోవడం తప్ప మరే పని చెయ్యడు. పైరవీలు చేస్తానని డబ్బులు కాజేసి తప్పించుకు తిరుగుతుంటాడు. స్వయాన కజిన్ సిస్టర్ డౌరి అట్రాసిటి కేసు నడపడానికి 1.5 లక్షలు గుంజాడంటే చూడండి. ఇటువంటి వివిద కారణాలవలన అతను నన్నాశ్రయించి “స్వామిగారు, ఆంథ్రప్రభ యజమాన్యంతో మీకు సంబందం లేదు. నేను మీకు నెలకింత అని ఇచ్చుకుంటా మీరు రోజు ఆఫీసుకొచ్చి కూర్చొండి” అని పిలిచాడు. నా జ్యోతిష్య పరిజ్ఞానంతో ఎంతో మంది జీవితాలను నిలబెట్టియున్నప్పటికి జ్యోతిష్యం మీద బ్రతకడం నాకు గిల్టియే. కాబట్టి ఓకె అన్నాను.

ఇక చూసుకొండి. యాక్టింగ్ స్టాఫ్ రిపోర్టర్గా మారాను. అయితే పావలా ఆదాయం ఉండదు మరి. ఉదయమే జ్యోతిష్యం చెప్పడం ఆ డబ్బులతో ఫీల్డుకొచ్చి తిరగడం వార్తలు వ్రాయడం డి.టి.పి చెయ్యించడం. మోడెం ద్వారా వార్తలు పంపడం .

కొన్నిరోజులకే అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రభ ఎం.డి. కాకినాడ కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ అని , 2004 ఎన్నికల దాక చురుగ్గా నడిపి చేతులెత్తేసాడని. ప్రస్తుతం మ్యేనేజర్లే నడుపుతున్నారని తెల్సింది. మొదట ఫోను బిల్లులు కట్టక మోడెం ద్వారా వార్తలు పంపడం ఆగింది. ఫ్లాపీల్లో వార్తలు పంపడం మొదలు పెట్టాము. గది బాడుగలు కూడ నిల్వ ఉండటంతో బిల్డింగ్ ఓనరుతో రంపులు, డి.టి.పి.ఆపరేటరుకు జీతాలు లేవు కాబట్టి ఆమె నిలిచిపోయింది.

ఇంత జరుగుతున్నా ఆచారి ఏది పట్టించుకోలేదు. వారం పదిరోజులకోసారి వచ్చేవాడు క్షేమ లాభాలు అడిగి వెళ్లిపోయేవాడు. తిరుపతిలో ప్రభకు మోహన్ అని మ్యేనేజరొకతనున్నారు. అడ్వర్టైజ్మెంట్ మ్యేనేజరు శర్మా. వారికి అర్థమై పోయింది ఆఫీసు నడుస్తుండటం, వార్తలు రావడం మురుగేషన్ వల్లే, ఆచారితో ప్రమేయం లేకే అన్ని జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆచారికి అల్టిమేటం జారీ చేసారు . అతను బేఖాతరన్నాడు. ఒక రోజువచ్చి పి.సి.సెంటరులోని సామగ్రిలన్నింటిని తిరుపతికి తరలించుకుపోయారు. వెంటనే ఆచారి ఏంచేసాడంటే తన టేబుల్ డ్రాయర్లో నెక్లెసు, సెల్ ఫోన్లు మేము కాజేసామని చిత్తూరు క్రైం పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు. అతనికిది అలవాటే . గతంలో ప్రకటనల బాకీ వసూలుకొచ్చిన హైదరాబాదు మ్యేనేజరు మీద “నా భార్య చెయ్యి లాగాడని” ఫిర్యాదు ఇచ్చిన ఘన చరిత్ర గలవాడు ఆచారి.

(సశేషం . మిగతా తదుపరి టపాలలో)

RTS Perm Link

3 comments to ఆంథ్రప్రభలో విలేకరిగా నా నా దిక్కు మాలిన అనుభవాలు

  • kurian

    నువ్వు ఎరు దాటి తెప్ప తగలబెట్టె వాడిలా వున్నావు. మరి నీకు Samuel Reddy ఎలా నచ్చాడు?

  • Malakpet Rowdy

    Andhra Prabha – hmmm – by aby chance do you know V. Vachaspati?

  • sorry ..I dont know . I know only the manager Mohan rao and ADVT Manager Sharma at TPT

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

  

  

  

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna, tincidunt vitae molestie nec, molestie at mi. Nulla nulla lorem, suscipit in posuere in, interdum non magna.