SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
ఉగ్రవాదం పై ఉక్కుపాదం
Apr 30th, 2009 by chittoor Murugeshan

1. కేంద్రంలో ఏ కూటమికి మెజారిటి వచ్చినప్పటికి అన్ని పార్టీలను కలుపుకుని జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి
2. ప్రతి పోలీసు స్టేషనుకు 3 సెట్స్ ఆఫ్ సిబ్బందినివ్వాలి. ఏ సెట్ ఆఫ్ సిబ్బందైనా సరే 8 గంటలకు మించి పని చేయకూడదు
3. ప్రతి పౌరుని వివరాలు సేకరించి మైక్రో చిప్లో పొందుపరచాలి. ఆ వివరాలను కంప్యూటరీకరణ చేసి, చిప్ కార్డులని పౌరులకు ఇవ్వాలి
4. ప్రభుత్వసంస్థ ఉద్యోగులను వైద్య, సైక్రియాట్రి పరీక్షలకు పంపి అనర్హులకు 6 నెలల సెలవు ఇచ్చి, చికిత్సకు ఏర్పాటు చెయ్యాలి.
5. అధ్యక్ష తరహా పాలన అమలుకు రాజ్యాంగ సవరణ చెయ్యాలి
6. పది కోట్లమంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి, నదుల అనుసంధాన భాధ్యతనివ్వాలి
7. కాశ్మీరును ఐ.రా.స కార్య కలాపాలకు డొనేట్ చేసెయ్యాలి. పాక్ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని కూడ అలాగే ఇవ్వాలని ఒత్తిడి తేవాలి
8. మత పరమైన బహిరంగ చర్యలకు నిషేదం విధించాలి. కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
9. స్విస్ తరహా బ్యాంకొకదానిని స్థాపించాలి. ఆ తరువాత ప్రస్తుత కరెన్సీ ని రద్దు చేసి కొత్త కరెన్సీ అమలు చెయ్యాలి. పాతవాటిని తగిన లెక్కలు చూపి ఎక్చేంజి చేసుకునే వీలు కల్పించాలి
10. జాతీయ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి సమిష్టి వ్యవసాయం సాగేలా చూడాలి

RTS Perm Link

వార్తా పత్రికలు తమ పంథా మార్చుకోవాలి
Apr 30th, 2009 by chittoor Murugeshan

అవునండి! వీరి పోకడ చూస్తుంటే కరపత్రాలే నయమనిపిస్తుంది. పత్రిక వారు ఏమన్నా చెప్పదలుస్తే ఎడిటోరియల్ లో చెప్పుకోవాలే కాని – ఏకంగా పతాక శీర్షికలే ప్రచురించేస్తున్నారు అసహ్యంగా. ఏది నిజమో ఏది అబద్దమో తెలియక పాఠకులు తికమక పడుతున్నారు.

పైగా వెట్టిచాకిరి గురించి చేంతాడంత వార్తలు వ్రాసే విలేకరులే నిజమైన వెట్టిచాకిరివారు. చాలా పత్రికల్లో స్టాఫర్లకు సైతం జీతాల్లేవు. ఇతర విలేకరులను స్టింగర్లంటారు. వారికి లైన్ అకవుంట్ పేరిట నూరు రెండువందలు ఇచ్చి సరిపెడుతున్నారు. దీంతో వారు అవినీతికి పైరవీలకు పాల్పడుతున్నారు. చెత్త వెధవలే ఈ వృత్తికి వస్తున్నారు.

విజువల్ మీడియా పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో ప్రింట్ మీడియా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పట్టుకుని వైవిద్యం చూపకపోతే మటాష్ అవ్వడం ఖాయం. ప్రతి రోజు చూస్తున్నాను రాత్రి పది గంటల టి.వి. వార్తల్లో వచ్చిన అంశాలే ప్రొద్దున వార్తా పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే పత్రిక అలవాటు మృగ్యం అయిపోతుంది. టీ షాపుల్లో చూస్తే కుర్రాళ్ళు కేవలం సినిమా, క్రికెట్ పేజీలకే పరిమితమవుతున్నారు. చాలా మంది హెడ్ లైన్స్ మాత్రమే చూస్తున్నారు.

తరువాతి జెనెరేషన్ ఫ్యామిలి బడ్జెట్లో వార్తా పత్రికలకు తావే ఉండదన్నది నా అంచనా. దేశంలోని రెజిస్టర్డ్ పత్రికల వివరాలను రెజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వెబ్సైటులో చూస్తే కళ్ళు తిరుగుతాయి. పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే ఈ పేపర్లు కేవలం కొన్ని ప్రాంతాలకు, జిల్లాలకు, ఊళ్ళకే పరిమితమై, ప్రకటన దారుల పై ఆధారపడి వెలువడుతున్నాయి.(నా పక్ష పత్రిక బతుకు సైతం ఇంతే)

ఈ దుస్థితి మారాలి. విజువల్ మీడియాతో పోటిపడే స్థాయికి వార్తా పత్రికలు తమ పంథా మార్చుకోవాలి.
మరీ ఇప్పట్లో వస్తున్న జిల్లా ఎడిషన్లు చూస్తే వాంతికొస్తుంది. ఏది వార్త, ఏది వార్త కాదు అని నిర్ధారించే తర్కం కూడ లేక ఎడా పెడా అచ్చుగుద్ది జనం మీదికి వదిలేస్తున్నారు. పైగా డివిజన్ల వారీగా విభజించి ప్రచురించటంతో ఆయా డివిజన్ వారు ఆయా డివిజన్ వార్తలు మాత్రమే చదువుతున్నారు.

కాస్త సూక్ష్మ బుద్దితో ఆలోచిస్తే పత్రికలు పాఠకులను కాక ప్రకటనదారులనే నమ్ముకుని నడుస్తుండటం అర్థమవుతుంది. కనీస విలువలు లేవు. తారతమ్యం లేదు. ఏది వార్త, ఏది స్పాన్సర్డ్ ఫీచర్, ఏది ప్రకటన అర్థం కావడం లేదు. బరువు తగ్గే ప్రకటనలు, క్యేన్సర్ నయం చేసే డాక్టర్ల ప్రకటనలు … షిట్.

ఏమై పోతూంది మన పత్రికలకు?

ప్రజా రాజ్యానికి 30 సీట్లే వస్తే చిరంజీవి చొక్కా చించుకుంటే అది ఆ నిమిషమే విజువల్ మీడియాలో రావచ్చు. కాని ప్రింట్ మీడియా తలుచుకుంటే చిరంజీవి గతంలో ఏ ఏ సందర్బాల్లో చొక్కా చించుకున్నారు? , ఇక ఏ ఏ రాజకీయ నాయకులు చొక్కా చించుకున్నారు వంటి డేటాతో ఫైల్ ఫోటోస్ తో పండించవచ్చు.

కాని పత్రికలు ఏంచేస్తున్నాయి? హెడింగ్, లీడ్ లో ఉన్న విషయాన్ని(అంశాన్ని) తిప్పించి మళ్ళించి వేరే వేరే బాషల్లో రిపీట్ చేస్తున్నాయే కాని ముందు, వెనుక సమాచారాలను వివరించటం లేదు.

ఏం చెయ్యొచ్చు?
యాక్సిడెంటే వార్త కాదు – అసలు యాక్సిడెంట్లు చెయ్యని డ్రైవర్ ,అతని కుటుంబ వివరాలు కూడ వార్తే .
ఆత్మహత్యే వార్త కాదు – ఆత్మహత్యను వారించే కన్సల్టెంట్లు, సేవా సంస్ధల వివరాలు కూడ వార్తే .
నేటివిటి ముఖ్యమే; అందుకని జిల్లా ప్రజా ప్రతినిధులకే పరిమితమైతే ఎలా? రాష్ఠ్రం మొత్తం మీద వైవిధ్యులైన ప్రజా ప్రతినిధుల విశేషాలు కూడ వార్తలే
ఏమో … వీరు మారరు …

RTS Perm Link

రండి రారండి నా బ్లాగులో వ్రాయండి !
Apr 30th, 2009 by chittoor Murugeshan

నా వ్రాతలు పిచ్చి పిచ్చిగా ఉన్నా, నేను వ్రాసే విషయాల పై మీకెంతటి వ్యతిరేకత ఉన్నా – మీ రచనలకు ఆహ్వానం పలుకుతున్నా. రండి రారండి నా బ్లాగులో వ్రాయండి !

నేను ప్రజాస్వామ్య వాదిని. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యమే గొప్ప విధానం. నా వ్రాతల పై వచ్చిన ప్రతి కామెంటును అప్రూవ్ చేస్తుంటాను. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించక పోవచ్చు – కాని మీ అభిప్రాయాన్ని మీరు తెలపటానికి ఉన్న హక్కును ఎవరన్నా కాలరాస్తే మీ హక్కును రక్షించటానికి నేనే ముందుంటా.

ఏం వ్రాయాలి:
ఏమన్నా వ్రాయండి జననం మొదలుకొని మరణం దాకా – ఆకాశం, భూమి నడుమ ఉన్న ఏ విషయం గురించన్నా వ్రాయండి. అయితే ఒక్క చిన్న విషయం గుర్తు పెట్టుకొండి – అందులో మీ అనుభవం ఉండాలి.

మనిషై పుట్టిన వాడు వ్యాపించాలి. దేశమంతటా, ప్రపంచమంతటా … అందుకు ఓ మార్గం భావాలను ప్రకటించటం.

మీ భావాలు వ్రాయండి

మీ రచనలను మెయిల్ చెయ్యండి:
swamy7867ఎట్gmailడాట్com

హామీ: మీ రచనలోని ఒక్క అక్షరం ముక్కను కూడ తొలగించను. మరీ బూతులుంటే మాత్రం తొలగించి (edit) గా ఉంచుతాను

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa