SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
మాయా…. మాయా (A Novel )
Feb 28th, 2009 by chittoor Murugeshan

నాకు ,ఆమెకు మద్య ఉన్న సంభందాన్ని ఏమనాలి?(ఈ 6 ముక్కలను చదవగానే మీరు మరో 2 పారాగ్రాఫ్లన్నాచదివి తీరుతారు.ప్రతి పురుషుడు స్త్రీతోను,ప్రతి స్త్రీ పురుషుడితోను ఒక ఆదర్శ ప్రాయమైన సాన్నిహిత్యాన్ని కోరుకుంటాం. ఇది సాధ్యాసాధ్యాలతో ముడిపడిన విషయం కాదు. డార్విన్ సిద్దాంతం ప్రకారాంగా కోతినుండి పుట్టిన మొదటి మానవుడుసైతం ఇదే కోరికలతో ఉండి ఉంటాడు. కోతుల్లో సైతం ,లింగ బేదం ఏర్పడినాక సూక్ష్మ జీవుల్లో సైతం ఈ ఆరాటం తప్పక ఉండి ఉండాలి. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్ట్లుగా ఏ సాహిత్యంలోనన్నా ఉన్నది స్త్రీ పురుష సంబంధాలే. ఇవే కనుక లేకుంటే అసలు సాహిత్యాలే పుట్టేవి కావు. ఒక వేళ ఏదన్నా సాహిత్యం ఈ అంశాన్ని వీడి గాని రచించబడి ఉంటే ఆ రచయిత తప్పకుండా ఒక లెస్బియన్/హోమో సెక్సువల్/ లేదా నపుంశకుడు అయ్యుండాలి)

నాకు ఆమెకు ఉన్న సంభందం అనిమొదలు పెట్టేసాను. మొదట ఆమె గురించి చెప్పాలి. మగవారితో పోల్చితే పొట్టి అనిపించవచ్చు గాని స్త్రీల్ మద్య పొడవైన ,తాష్థిక మైన శరీరమె. గుండ్రని ముఖం.చిన్న ముక్కు, చిన్న కళ్ళు,సన్న పెదాలు.

నేను..మీరు 40 సం.ల వయస్సు దాటినవారైతే కనుమరుగైన మీ యవ్వనాన్ని ఆ తుళ్ళింతలను గుర్తుకు తెచ్చి మిమ్మల్ని చికాకు పరిచే 20సం.ల సాదా సీదా మద్యతరగతి యువకుడ్ని. విప్లవాలు చెయ్యాలని,స్మగ్లింగ్ చేసి ఇంటర్వెల్ లోపు దనవంతుడై పోవాలని,బ్యాంకులను దోచి బీద వారికి పంచాలని ఎన్నోఆలోచనలు ఉన్నప్పటికి హై రోడ్డులో ట్రాఫిక్ కాన్స్టబుల్ లేకుంటేనే వన్ వే వెళ్ళే మనస్తత్వం.

అది 1987 అనుకుంటా ( సంవత్సరాలు చెప్పడం, మరీ అనుమానంగా చెప్పడం ముసలి లక్షణాల్లో ప్రప్రధమం.) అప్పట్లో నేను ఒక ప్రభుత్వ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ తరహా ఉద్యోగం ఒకటి చేస్తున్నాను. రాజ కీయాల్లోఉన్నకొడుకులు వయస్సు మళ్ళిన తమ తల్లులకు జాక్కెట్ మనిగా అందించే వ్రుద్యాప పించను విభాగం అది. ఆ తరహాలోనే ఎల్.ఏ.డబుల్యూ.పి. విభాగంలో ఆమె పని చేస్తుంది. ఇప్పట్లో ఆంటీ అని ఒక ముక్కలో అంటుంటారు.అప్పట్లో ఆ పద ప్రయోగాని నిజమైన అర్థం మాత్రమే ఉండేది. ఆమె నాకంటే పది సం.లు పెద్దావిడ. నేనా ఉద్యోగంలో చేరిన ౩ నెలల దాక మా మద్య ఎటువంటి ప్రత్యేక పరిచయం గాని,సంప్రదింపులు గాని లేవు.
చెప్పడం మరిచాను. ఆమె పేరే మాయా .

నేను డైరక్టుగా కాలేజినుండి ఊడి పడిన వాడ్ని. ఆ చేష్టలు, జీవితం యొక్క నిరర్థకత అర్థం కాని వయస్సు అది. నా ప్రవర్తనలు ఇక ఎలా ఉంటాయి . ఆమె డిగ్రి పూర్తి చేసి,దూర విద్యలో ఎమ్.ఏ, చిత్ర లేఖణంలో డిప్లమా కూడ అయ్యుండే.

ఒక రోజు ప్రాత:కాలాన అనుకోకుండ మా కార్యాలయ ప్రాంగణంలోనే కలిసాం. మా కార్యాలయం కలెక్టరేటు ప్రాంగణంలోనే ఉండేది. ప్రతి జిల్లాలోను కలెక్టరేట్ ఒకే విదంగా ఉంటుంది కాబట్టి, నేను జియాగ్రఫిలో వీక్ కాబట్టి స్థల పురాణాన్ని దాట వేసి విషయానికొస్తా.

కార్యాలయ పని వేళల్లో పని మీద వచ్చే అర్జిదారులను టాకిల్ చెయ్యడంలో నాకో సరదా ..దీనికి కాను ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు. అయినా నాకు కొత్త కొత్త ముఖాలను చూడాలంటే బలే ముచ్చట.కొత్త కొత్త మనుషులు,కొత్త కొత్త సమస్యలు..వాటిని పరిష్కరించే ప్రయత్నంలో నాకు కొంత త్రిల్ కలిగేది.(ఇది నేను పుట్టిన కర్కాటక లగ్నం యొక్క ప్రధాన గుణమని ఆ తరువాత తెలుసుకున్నా) ఇలా
కార్యాలయ పని వేళల్లో నాకు కేటాయించిన పనిచెయ్యక ఏ అర్థ రాత్రో ,ఏ ఉదయ పూర్వమో ఆఫీసుకెళ్ళి ఎమ్.ఓ లు వ్రాసి పడెయ్యడం నా స్టైయిల్. అలా ఆ రోజు కూడ ఉ.పూర్వం వెళ్ళాను. పోతూ పోతూ ఒక టీ షాపులో చాయి త్రాగి సిగరట్స్ తీసుకుని వెళ్ళి పోయా. ఎంత జులాయిగా తిరిగినా నేను పని రాక్షసుడ్ని. ఎమ్.ఓ.ల పై లబ్దిదారుల అడ్రస్ లు వ్రాయడం మొదలు పెట్టాను. ఎప్పుడు బాగా తెల్లవారిందో తెలీదు.

సెక్షన్ గుమ్మంకల్లా ఎవరో నిలబడినట్టు అనిపించి తలెత్తి..పైకి చూసాను. మాయ. నా చేతిలో సిగరట్..సెక్షనంతా పొగ మండలం. తొలూత కాస్త కంగుతిన్నా తేరుకొని (ఆఫీసు టైమ్ కాదు,మాయ నా సుపీరియర్ ఏమి కాదు) “హాయ్” అన్నాను.

అందాక మా మధ్య హాయి..హాయిలు కూడ ఉండేవి కావు. అయినప్పటికి ఆమె ఒక ఆసక్తి కర సంభాష్ణకు తెరదీసింది..

“నీ వయసెంతా..”
“జస్ట్ ట్వెంటి..మీకు సరిపోనులే..మీ భందువులమ్మాయి ఎవరన్నా ఉన్నా కులం సరి పోదనుకుంటా”
“షట్ అప్ ! నేనడిగింది..ఈ వయస్సుకి ఈ చేష్ఠ అవసరమా అని “
“ఏం చెయ్యమంటావు..నాకు అమ్మంటే ప్రాణం ..అది ఆమె బ్రతికున్నంత కాలం తెలీదు 1984 లో మా అమ్మ చచ్చింది. ఇలా తల్లీ మీద ప్రేమతో అలమటించటాన్ని నిప్పిల్ కాంప్లెక్స్ అంటారు..ఆ కారణంగానే నాకు ఈ దురలవాటు వచ్చింది”
” ఏం గొప్ప ఇంటెలెక్చువల్ అని బిల్డప్ ఇస్తున్నావా? నిప్పల్ కాంప్లెక్స్ ఉన్నవారు తాగుడుకు కూడ భానిసవుతారు..నువ్వు కూడ తాగుతావా”
“నో..నావద్ద ఉన్న ఏకై విలువైన అస్సెట్ నా బుర్ర ..నా తల చెడిపే ఏ పని చెయ్యను”
“ఐ సీ..మస్తిష్కంలో రక్తాన్ని నిలువ ఉంచుకునే ఏర్పొటు లేదు..కాబట్టి నిత్యం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. నువ్వు దర్జాగా పిలిచిన సిగరట్ పొగలీని నిక్కోటి ఆ మస్తిష్కాని రక్తం తీసుకెళ్ళే సన్నటి రక్త నాళాలను క్రుంగ తీస్తావని తెలుసా నీకు..”
“ఎందుకు తెలియదు ..ఆ నాళాలు క్రుంగుతాయి కాబట్టే రక్తం జోరుగా ప్రసరించిన ఫీలింగ్, దాంతో ఉత్సాహం కలుగుతుంటుంది”
“అబ్బ..గొప్ప మేధావే గాని..ఉదయపూర్వం ఓజోన్ పొర భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు గాలిలో కాలుష్యం శాతం కూడ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఆ సమయంలో ప్రాణయామం చేస్తారు. ఈ టైంలో నువ్వేమో నీ లంగ్స్ కి నికోటిన్ ఇస్తున్నావు మరి కాళి కడుపుతో సిగరట్ త్రాగితే అల్సర్ వస్తుంది తెలుసా నీకు .”
“ఎందుకు రాదు బేషూగ్గా వస్తుంది..పోనిలే టిఫన్ ఏమన్నా పెట్టించే ఉద్దేశముంటే తిని పెడతా..”
“ఏం టిఫన్ పెట్టు అంటే భయపడి పోతానంటావా? పద తిని పెడుతువు గాని”
“ఎక్కడికి నా రూం కే..మన కాంపవుండు బోరులో మంచినీళ్ళు వస్తుందని వచ్చాను. సెక్షన్ లో వెలుతురు చూసి వచ్చా..”

ఆ తరువాత నేను మాయ రూమ్ కి వెళ్ళడం ..ఆమె టిఫన్ చేసి పెట్టడం ..నేను తిని పెట్టడం..ఆమె తిడుతూ ఉంటే సిగరట్ వెలిగించుకుని దమ్ము కొట్టడం అన్ని జరిగి పోయాయి.

ఇంతకీ మాయా ఆ 1987 ప్రాంతంలోనే పట్టణం లోని ఆ కాలనిలో ఒంటరిగా రూమ్ తీసుకుని ఉండడం వెనుక చిన్న కథ ఉంది. ఆమెకు నలుగురు అక్కలు. అందరికి పెళ్ళీళ్ళు అయిపోయాయి. మాయకు పెళ్ళి కుదిర్చే ఓపిక లేక మాయ తండ్రి కొంత పొలం అమ్మి ఆమె పేర ఆ సొమ్ము ఎఫ్.డి.వేసి మరి మరణించాడు. ఇంటి అల్లుళ్ళు ఆ ఎఫ్.డి.పై కన్నేసేరు. మాయను రెండో పెళ్ళి చేసుకుంటే ఆ ఎఫ్.డి.తమకే దక్కుతుందని కక్రుత్తి పడేరు. వారి పిచ్చి పిచ్చి చేష్ఠలకు విసిగి మాయ పట్టణంలో ఇలా బ్యాచలర్ లైఫ్ (?)ను ఎన్నుకుంది.
ఇవన్ని మాయ తన మాటల్లో చెప్పినవే. నేను నా గురించి చెప్పుకొచ్చాను. ఏమైతేనేం నిన్నా మొన్న వరకు “హాయి హలో “కూడ లేని వారమైయ్యుండి ఒక్క రోజులో ఎంతో దగ్గరయ్యాం.

ఆ 20 సం.ల వయస్సుకు చూడటానికి కాస్త సుమారుగా ఉన్న ఏ ఆడదాన్నైనా ఆమె బెడ్ మీద ఎలా ఉంటుందో ఊహించుకునే నా మాయ విషయంలో తోకముడిచిందనే చెప్పాలి. ఆమె ఏదో గ్రూప్ లీడర్ లా ,పెద్ద అక్క లా,టీచర్ లా నన్ను కమాండ్ చెయ్యాలనుకునెది..నేను చిన్న తమ్ముడిలా,ఫ్రంట్ డెస్క్ స్టూడెంట్ లా ఆమెను అల్లరి పెట్టే వాడిని.

ఆఫీసులోని సాటి ఉద్యోగస్తులంతా మా దగ్గర తనాన్ని చూసి విస్తు పోయేవారు. అక్కడి యు.డి.సి. మా పై పెత్తనం చలాయించడమే తన పరమావదిగా ఉంటాడు కాని. ఇతర సెక్షన్స్ కి బొత్తిగా పనికిరానివారినే మా సెక్షన్ కు వేస్తారని మాకు తెలుసు. కాబట్టి నో ప్రోబ్లం. ఇదిలా ఉంటే లబ్ది దారులకు ఎం.ఓ వ్రాయడం ఒక ఎత్తైతే ,లెడ్జర్లల్లో ఎంట్రి వేసి ఎస్.టి.ఓ ల చేత సైన్ చెయ్యించడం ఒక ఎత్తు.

నేనైతే మాజి ఖజాణా అధికారి పుత్రరత్నం కాబట్టి ,నాకు సంబందించిన ఎస్.టి.ఓ మా నాన్న లాంటి వాడే కాబట్టి ఏ ఇబ్బంది లేదుగాని, ఇతరులకు అది పెద్ద తలనెప్పి. కోడి రామక్రుష్ణ సినిమాల్లోని డబుల్ మీనింగ్ డైలాగులు ,ట్రిబుల్ ఎక్స్ వీడియో ద్రుశ్యాల దాక చోటు చేసుకునేవి. ఒక ఎస్.టి.ఓ.ఇదే కోవలో మాయ వద్ద ప్రయత్నించి చెప్పు దెబ్బ కూడ తిన్నాడనుకొండి.

ఆఫీసు పరిస్థితి ఎలా ఉన్నా మాయ వ్యక్తిత్వం నన్ను, నాలోని జులాయితనం,తెలివి తేటలు,తుంటరి తనాలు మాయను ఆకట్టుకుని ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం. 10.30కు మొదలయ్యే ఆఫీసుకని 7 గంటలకంతా బయలు దేరే నేను 10.30 దాక మాయ రూమ్ లోనే గడిపేవాడ్ని. మళ్ళి సాయంత్రం ఓపికుంటే,అవకాశముంటే బయిట తిరిగే వాళ్ళం లేదా గదిలోనే గడిపేవారం. కలిసి వండే వారం. కలిసి తినే వారం. మా ఇంట్లోనైతే మా నాన్నమ్మైతే డిక్లరేషనే ఇచ్చేసింది”వీడు ఏదో ఒక ముండను ఉంచుకున్నాడ్రా బాబు” అని

నాలో అప్పట్లోనే అదోరకమైన వెతుకులాట ,రెస్ట్ లెస్ నెస్ ఉండేది. అనురాగం,ఆప్యాయతలను నా మనస్సు కోరుకునేది. కాని అవి అశాస్వతం అన్న యాధార్థాన్ని అప్పుడప్పుడు వెలిబుచ్చేవాడ్ని. తద్వారా గుర్తుకు తెచ్చుకునె వాడ్ని. సదా కొత్త దనాన్ని కోరుకునే నాకు అప్పటికే సెక్స్ పాతపడి పోయుండటం మాయతో నాకున్న రిలేషన్ ను మరింత మెరుగు పరిచిందనే చెప్పాలి.

ఆమెతొలూత నన్ను చాలా తేలికగా కొట్టి పారేసేది. నువ్వంతా తెలిసనట్టుగా,అలసినట్టుగా నటిస్తున్నావ్ అనేది. కాని క్రమేణా నా మనస్సును అర్థం చేసుకుంది. ఏ ఆడపిల్లా నాతో పంచుకోని భావాలను,సమస్యలను నాతో పంచుకునేది. ఆమె మంచం మీద నేను కూర్చుని మాట్లాడి,పడుకొని మాట్లాడి అలాగే నిద్ర పోయిన సందర్బాలున్నాయి. ఇద్దరం ఒకే మంచం మీద పడుకొని ఆమె ఎవ్వరు? నేనెవర్ని? మామద్య గల సంబందానికి పేరేది? దాని లోతుపాతులేదని ఆరా దీసేవారం. ఒక సారి నేను మా మద్య రిలేషన్ కు కారణం నాలోని ఈడిఫస్ కాంప్లెక్స్ అన్నాను అందుకు ఆమె “ఒరేయి..మగ పుట్టుక పుట్టినవాడు ఒక బిడ్డను కంటేనే తండ్రిగా మారతాడు. కాని ఆడపిల్లలో పుట్టగానే మాత్రుత్వం వెలుస్తుందిరా” అంది. కాని”నీలో వెలసిన మాత్రుత్వం మరే ఆడపిల్లలోను ఎందుకు నాకు తారాస పడలేదని”నిలదీసాను

మా మద్య జరిగిన సంభాష్ణలను ఏ తెలుగు సినిమాలోను అనుమతింఛరు. చివరికి సైలంట్ మూవిగానే విడుదల చెయ్యవలసి ఉండేదేమో?

అప్పట్లో ఒక్క సమయంలోనే పలువురు అమ్మాయలకు లైనేసేవాడ్ని. ఆ విశేషాలను శ్రద్దగా వినేది. “ఏయి..! ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు తెలుసుకొ అంటుండేది” నేను” ఆశ దోస అప్పడం వడ..నువ్వు 10సం.లకు ముందు కనబడుంటే నీకా చాన్సు దక్కేదని” ఎద్దేవా చేసేవాడ్ని

వేటూరి సుందర రామమూర్తి సిని గీతాల్లోని శ్రుంగార రసం గురించి రాత్రింబవళ్ళు రోజులు తరబడి మేము చర్చించిన సందర్బాలున్నాయి. స్త్రీల బహిష్టు,గర్బధారణ,మెనోఫస్ ల గురించి భావీద్రేకంతో నేను వివరిస్తూ ఉంటే ఆమె నా ఒడిలో ఒరిగింది.” ఒరేయి ! మన ఆఫీసులో వాళ్ళు రోజు చెఉబుతున్నట్టు నేను నీ అక్కని కానురా ని బిడ్దను..నువ్వే నా తల్లివి ” అంది ఒకసారి.

ఆమెకు పీరియడ్స్ వచ్చినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడేది.”నేను ..నువ్వు బాగ వెయిట్ ఉన్నావు గాని అంతా వేస్ట్! నీ వంట్లో అసలు రక్తముందా అని..”అంటూ చీవాట్లు పెడుతూ తినిపించే వాడ్ని. అప్పుడేమో నర్సరి పిల్లలా నన్ను ఆట్ అపట్తించేది.

ఒక రోజు నా గడ్డం చూసి..’చీ..చీ..ఏమిటిది ఈ గడ్డమ్ దు:ఖానికి ప్రతీక..ముందు పోయి షేవ్ చేసుకుని రా అని గద్దించింది.

మరో సారి ఒరేయి నీ గడ్డం బలే ఉందిరా కౌ బాయి హ్యాట్ ఒకటి కొనుక్కో..ఆ హ్యాట్ రంద్రాలనుండి రవి కిరణాలు నీ ముఖం పడుతూ ఉంటే చూడాలని ఉందిరా అంది. తప్పుతుందా తెచ్చుకున్నాను. పెట్టుకోమని ఎండలో నిల పెట్తింది. 2 నిమిషాలకే పెదవి విరిచి.. సర్లే తీసెయ్య్ఇ అంది.

ఊళ్ళో ఎగ్జిబిషన్ వచ్చింది. ఇద్దరం వెళ్ళాం. నాటి ఎన్.టి.రామారావుకన్నా లూజనిపించే తెల్ల షర్ట్ ఒక్కటి కొన్నది. “నీకేనా” అని జోకు వేసాను. అయినా పట్టించుకోలేదామె.

ఒక రోజు మామూలుగా మాయ గదికి వెళ్ళాను ఎగ్జిబిషన్ లో కొన్న షర్టు మీద ఫేబ్రిక్ పెయింటుతో ఏదో ఆర్ట్ చేస్తూ కనిపించింది. నా తో సరిగ్గా మాట్లాడడం కూడ మాని సీరియస్ గా ఆర్ట్ చేస్తుంది.

ఏమి మాట్లాడ లేక తిరిగొచ్చేసాను. ఒక రోజు సాయంత్రం సెక్షన్ కొచ్చి పిలిచింది. మాయ గదికి వెళ్ళాం .వెళ్ళగానే” రేయు..షటు తీ” అంది.”కొంప దీసి రేప్ చేస్తావా “అన్నాను.
“నీ మొఖానికదొకటి..తక్కువ” అంటూ నా షర్ట్ తీసేసింది.
అల్మారాలో తను దాచుంచిన ఎగ్జిబిషన్లో కొన్న షర్ట్ తెచ్చింది. దానిని చూసి ఒక క్షణం ఆగి పోయాను. వైట్ క్లాత్ ని,పులిచర్మంతో మిళితం చేసి కుట్టినట్టుగా ఉంది ఆ షర్టు..పులిచర్మమంటే అచ్చం పులిచర్మమే ..ఏ చిరంజీవికీ,మహేష్కో అయితే ఇంత రిస్క్ తీసుకుంటారా అన్నది అనుమానమే.. ఆమెకు ఎంత సమయం పట్తిందో ఆ ఎఫక్టును తేవడానికి. శిలలా నిలబడ్డాను. నా ముక్కు పట్టుకుని లాగి “ఏం చూస్తున్నావ్..వేసుకో ఈ షర్టు,ఎక్కడ ఆ కౌ బాయి హ్యాటు వేసుకుని కూర్చో..నిన్ను బొమ్మ గీస్తా అంది.

ఆ క్షణం నాలో చలరేగిన భావాలకు అక్షర రూపం ఇవ్వడం చేత కాక ఆ భావోద్రేకాన్ని కాస్త తగ్గించుకుని ,భయిట పడటం కోసం “కొంప తీసి పులిచర్మం కాదుకదా? మళ్ళి మేనకా గాంథి అలుగుతుంది” అన్నాను.

మాయ కిలకిలా నవ్వేసింది. అక్కడనుండి వారం రోజులు నేను మోడల్ ని ఆవిడ ఆర్టిస్ట్.. ఆ బొమ్మ ఎంత బాగా కుదిరిందంటేనా అందులోని నా మొఖం చూస్తే పావలా క్రైమ్ రిపోర్టరన్నా ఇట్టే చెప్పెయ్య గలడు ఏడేడు జన్మలు ఎవరికొరకు వేచానో ఆవిడ నా ఎదుట ఉందని . ఆవిడే ఆ బొమ్మ గీసిందని.

మా మద్య ఉన్న ఆ అనుబంధాన్ని ఎవరికి,ఎలా చెప్పాలో అర్థం కాక తికమక పడే వాడ్ని. కటిక దరిద్రుడు ఒక నిధిని కనుగొంటే ఆ విషయాన్ని చెప్పాలో వద్దో నిర్ణయించుకోక సతమతమైనట్టు ఉంది నా పరిస్థితి.

ఇదిలా ఉంటే ఒక రోజు మాయ ఆఫీసుకు శెలవు పెట్టింది. నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పట్లోలాగా అప్పట్లో ఈ సెల్ ఫోన్స్ గొడవ లేదుకాబట్టి, వస్తుందనే ఓపిక నశించి మాయ గదికి బయలుదేరాను.
తలుపులైతే తెరిచున్నాయి. లోపల ఎవ్వరు ఉన్నట్టు లేదు. ఎప్పటిలాగే లోనికి ప్రవేశించాను. బెడ్ మీద మాయ పడుకోనుంది. నోట తెల్లని నొరుగు. సన్నగా మొలుగుతూంది. ఇటువంటి ద్రుశ్యాలను నవలల్లో చదివాను కాని నిజంగా చూడడం అదే ఫర్స్త్ టైం.నాకు కాళ్ళు చేతులు వనుకుతున్నాయి. మాయను అలా చూడటం అదే మొదటిసారి.

ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా, ఇందో-పాక్ ఆర్మి కలిసి వచ్చినా ఎదురొనే ధీమాతో కనిపించే మాయను అలా నేలకొరిగిన ఆడ సింహంలా చూసేసరికి నాకే తెలియక నా కళ్ళు కరుగుతున్నాయి. కన్నీళ్ళు ఉప్పగా నాలికకు తగిలాయి. “ఎందుకొచ్చిన ఖర్మా ..నేనిక్కడికి రాలేదు..ఏమి చూడలేదు”అంటూ వెళ్ళి పోదామా అని ఎస్కేపిస్ట్ ఆలోచన కూడ కలిగింది. అయితే తల్లిని పోకొట్టుకున్న మూడేళ్ళకి మళ్ళి ఒక తల్లి దొరికినట్లుగా దొరికిన మాయను ఈ పరిస్థితిలో వదిలి పెట్టి వెళ్ళటానికి మనసొప్ప లేదు.

కమిట్ అయ్యాను. వెంటనే తలుపులను లాక్ చేసి రోడ్డుకొచ్చాను. ఆటో ఎక్కి ప్రకాశం హైరోడ్డుకెళ్ళాను. మనోజ్ నా ఫ్రెండు..డెంటల్ క్లినిక్ పెట్టున్నాడు. మనోజ్ దగ్గరకు వెళ్ళి “మనోజ్ ! అర్జంట్ పద పదంటూ హడావుడి చేసాను.” ఇంతకీ ఏమైందిరా” అన్నాడతను. నేను చూసింది చెప్పాను. “మై గాడ్ ! పాయిజనింగో,స్లీపింగ్ టాబ్లట్సో తెలీడం లేదు. ఇది పోలీస్ కేస్..After all dental Docterని నేనేం చేయగలను” అన్నాడు. గడ్డం పట్టుకుని ప్రతిమలాడాను. వచ్చాడు. తన భందువైన ఒక నర్స్ అమ్మాయిని పిలిపించుకున్నాడు. మళ్ళీ ఆటో ఎక్కాం. మాయ గదికి చేరాం.

వివరాలెందుకు..మరణపు అంచులదాక వెళ్ళిన మాయను కాపాడుకో గలిగాను. 2 రోజులు ఆఫీసుకు డుమ్మా కొట్టి మాయ పక్కనే ఉన్నాను. బాగా తిట్టాను.. ఆమె ముసి ముసిగా నవ్విందంతే..
రెండు రోజులు బెడ్ రెస్ట్ లో ఉండి కాస్త రెఫ్రెష్ అయ్యక అడిగాను..ఇంతకీ ఏంజరిగింది?

“నీకు ప్రేమంటే ఏమో తెలుసా?”
“ఎందుకు తెలీదు సెక్స్ కు ముస్తాబయ్యేందుకు ఆడ మగా చెప్పుకునే అందమైన అబద్దం”
“షిట్..బీ సీరియస్”
“పోనిలే ఇంకో మాట చెబుతా..చంటి పిల్లవాడు ఇతర స్త్రీలల్లో తన తల్లిని వెతుక్కోవడం, అలాగే చంటి పాప ఒకటి తన తండ్రిని ఇతర పురుషుల్లో వెతుక్కోవడం”
“మరీ తియరిటకల్ గా మాట్లాడకు..ప్రేమన్నది మాటలకు అందని అదో అనుభూతి”
“ఇదే ఇదె నాకు మండేది..ప్రేమించే వాడు సెక్స్ చేసుకోడా?”
“అబ్బా నువ్వెందుకిలా నెగటివ్ గా తయారయ్యావ్”
“దీనినే ఎజుకేటివ్ గా అని చెప్పవచ్చుగా”
“నీ తో మాట్లాడడం నాకు చేతకాదు కాని ..నేను ఒకతన్ని ప్రేమించాను”
“ఓ.కే. ఐ.పి.సి ప్రకారం అదేమి నేరం కాదుగా “
“అతను నన్ను దేవతలా ఉపాసించాడు”
“సెక్స్ సామర్థ్యంలో ఏదన్నా లోపమో పాడో”
“చీ..నిన్ను నరికి చంపాలనుంది నాకు”
“అంటే నీ సెక్స్ కోరికలు సరిగ్గా నెరవేరలేదన్న మాట అందుకే హింసకు దిగుతున్నావ్..ఆట్లైతే నా ప్రశ్న కరెక్టే..అతనిలో ఏదో లోపముండాలి..అందుకే పూజలు పునస్కారాలు”
“నన్ను నా మాటేదో చెప్పనిస్తావా?”
“చెప్పు”
“నేను మావూరతనొకడ్ని ప్రేమించాను. నాకు పెళ్ళి చెయ్యాలని మావాళ్ళు చూస్తున్నారు. పెళ్ళి వారికి
అతను తన ప్రేమ సంగతి చెపాడట..ఈ మాట పెళ్ళివారు మా అక్కా భావలకు చెప్పారు. వాళ్ళు అతన్ని పట్టుకుని ఎడా పెడా వాయించేరు.అతను తనకు జరిగిన అవమానమ్ చెబితే తట్టుకోలేక పోయాను”
“అందుకే నిద్ర మాత్రలు మ్రింగావా? సిల్లి..”
“ఇంకేంచెయ్యమంటావ్”
“ఏముంది..ప్రేమించనతనిని పెళ్ళి చేసుకో”
“అతనికి పెళ్ళి కాని చెల్లెలు ఒకామె ఉంది”
“దానిని నేను చేసుకోనా లైన్ క్లియర్ అవుతుంది”
“నీ కులం ?”
“హెల్ విత్ యువర్ కులమ్ గిలమ్..మీ ఇంటిపశువులకు ఇంపోర్టడ్ సెమన్ తో కడుపు చేస్తున్నారు..ఆరోగ్యమైన దూడ పుట్టాలని..మరి అమ్మయల విషయానికొచ్చినప్పుడు మాత్రం కులం గిలం”
“చూడు ..నిన్నేదో రోజు ప్రజలే కొట్టి చంపేస్తారు..అసలు నీకు సెంటిమెంట్ అంటూ కించిత్తన్నా లేదా”
“ఉంది..నా చుట్టు ఉన్న ప్రజానీకం కేవలం పేదరికం కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నారేమో? వీరి పేదరికం దూరమైతే ఇంకాస్త హూందాగా ప్రవర్తిస్తారేమోనన్న అనుమానం నాలో ఉంది లేదంటేనా..వీరి హిప్పాక్రసి,ఎస్కేపిజాలకు వళ్ళు మండి..”
“పెద్ద చెప్పొచ్చావు గాని నేను చేసింది కేవలం ఫూలిష్ అంటావా?”
“ఖచ్చితంగా”
“ఇప్పుడేం చెయ్యమంటావ్..?”
” అతనెవడో చెప్పు పట్టుకొచ్చి పెళ్ళి చేయిస్తా?”
“హయ్యో..తన చెల్లికి కానిదే అతను చేసుకోడు “
” ఇప్పటికే నీకు మెనోఫస్ వచ్చిందేమోనని నా అనుమానం “
” ఏయి..ఇడియట్ ఏం మాటలవి”
” అంతేలే నిజం మాట్లాడితే భరించలేరుగా”
” ఇప్పుడేంచెయ్యమంటావ్”
” అతనెవడో నాతో మాట్లాడిచ్చు..నిజానికి అతనికి ఉందా లేదా కనుక్కుని చెబుతా”
” ఏమిటది”
” అప్పుడే ఎందుకు ఆ పాడు ఆలోచన ? నేను చెప్పింది నిన్ను చేసుకోవాలని ఉందా లేదా అన్న మాట”
మొదట నిరాకరించినా చివరికి అతని అడ్రస్ ఇచ్చింది. ఒక ఆదివారం అతనిని వాళ్ళ ఊరులోనే కలిసాను.
రాముడు మంచి బాలుడు తరహాలో ఉన్నాడు. సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవడన్నా ఆకు రౌడి “డూయి” అంటే భార్యను సైతం వదిలి పరుగులు తీసే తరహా లో ఉన్నాడు. మొఖానికి సోడా బుడ్డి అద్దమొకటీ. స్త్రీలలో పురుషత్వం కనబడితే అది హూందాగా కనిపిస్తుంది(ఇప్పట్లో రేణుకా చౌదరిలా),కాని పురుషుల్లో ఫిమెలిష్ నెస్ కనిపిస్తే అది అసహ్యంగా ఉంటుంది..మాయా ప్రియుడు ఈ కోవకు చెందినవాడే.అతని పేరు పద్మనాభం. అందరు పద్దు అంటుంటారు.

నేను ముక్కు సూటిగా అడిగాను
“మాయను పెళ్ళి చేసుకోవడానికి అడ్డంగా ఉన్నది ఏది”
“నా చెల్లెలి పెళ్ళి”
“దానికేం బాధ చేసుకోనంటూందా?”
“అదేంకాదు..కట్నం డబ్బే సమస్య”
“పొలం గిలం ఉంటే అమ్మేసెయ్యవచ్చుగా?”
“పొలమేమో ఉంది గాని ..అందులో చ్యవహారం ఉంది”
“ఉంటే పరిష్కరించుకోవచ్చుగా”
“మా పెద్ద నాన్న ఇక్కడరాజకీయంగా బాగా ఉన్నవాడు”
“ఉంటే ఏం అతని ప్రత్యర్ధి వద్దకు పోవచ్చుగా”
“అతను మా పెద్దనాన్న కంటే చాలా చెడ్డవాడు”
“నీ చెల్లెలికి ఎవరినన్నా ప్రేమించమని సలహా ఇవ్వలేక పోయావా”
“హి! హి!”

ఆ రోజునుండి అతని పొలం తాలుకు వ్యవహారం కోసం పిచ్చగా తిరిగాను. పద్దు పెద్ద నాన్న ఎవరో కనుక్కుని ఆయన ప్రత్యర్ధిని కలిసాను . అతను పద్దు పేరు వినగానే ఆ ఆడంగి వెదవ తప్పుడు వెదవ వాడి మాటలు నమ్మి కయ్యానికి పోతే ఉన్న పరువు కాస్తా పోతుంది అనేసాడు”

“ఇదేమని” అడిగితే..పద్దు చెల్లెలకు వారి పెద్దనాన్న కొడుకుతోనే అక్రమ సంభందం ఉన్నట్టు చెప్పాడు. నాకుత్ల తిరిగిపోయింది. చివరికి దైర్యం చేసి పద్దు వారి పెద్ద నన్నను కలిసాను. నిల దీసాను. పద్దు చెప్పిన మాటలకు వారి పెద్ద నాన్న ప్రవర్తనకు పొంతనె లేదు. ఎంతో మంచిగా మాట్లాడారు. పద్దు తండ్రి ఎప్పుడో ఇరవైవేల రూపాయల సొమ్ము తీసుకుని ఉమ్మడి ఆస్తి పై హక్కు విడుదల పత్రం కూడ సంతకం చేసి ఇచ్చినట్టు చెప్పాడు.
“కేవలం ఆస్తి కోసం వావి వరుసలు మరిచి స్వంత చెల్లిలిని ,తన కొడుకు మీదికి ప్రయోగించాడని వాపోయాడు. ఎంత డబ్బన్నా తను ఇస్తానని మొదట ఆ అమ్మాయికి వేరే సంభందం చూడమని సలహా ఇచ్చాడు”
నాకు పిచ్చెక్కేట్లు అయ్యింది. ఈ వెదవ కోసం మాయా ఆత్మహత్యాయత్నం ఛేసిందన్న సంగతి గుర్తుకొచ్చేసరికి నన్ను నేను ఆపుకోలేక పోయాను.

పద్దు ఇంటి వద్దకు వచ్చి . ” ఇదేమిటని” అడిగితే..అప్పట్లో ఏ పాతిక వేలో ఇచ్చి వ్రాయించుకున్నాడు. ఇప్పట్లో మార్కెట్ వ్యాల్యూ ఎంత పెరిగిందో లెక్కెయ్యాలని కొత్త పంచాయితీ మొదలు పెట్టాడు. చెల్లెలి
రంకు గుర్ఇంచి అడిగితే అతను పెద్దమ్మ కొడుకు కాదని, పెద్దమ్మకు సవతి కొడుకని బుకాయించాడు. ఇక ఆవేశం అనచుకోలేక పోయాను.

ఈ లిటిగేషన్ వెదవను మాయ ప్రేమించడం ఏంది ? మాయకొచ్చే పెళ్ళిసంభందాలను వీడు చెడకొట్టడం ఏంది? ముక్కు మీద వ్రేలు పెట్టి సీరియస్ గా చెప్పాను ” సోడా బుడ్డి నా కొడకా ! ఈ రోజుతో నీ కథలకు శుభం కార్డు వేసుకో. మాయకు వేరేవాడితో పెళ్ళి జరుగుతుంది. నువ్వేదన్నా డ్రామాలాడావాంటే నీ పని చడుగుడే”

భాగా భయపడిపోయాడు. వళ్ళంతా చమటలు. నేను వెను తిరిగాను. ఇక మెయిన్ రోడ్డుకెళ్ళి పోతామనే సమయంలో ఎవరో నలుగురు నా షర్ట్ పైకెత్తి ముఖం మూసేసారు. ఇక చూసుకొండి.. ఎడా పెడా పిడి గుద్దులు, గూటం దెబ్బలు. ఎలాగో ఒకలాగా షర్టు చించేసుకుని మరి చూసాను ఒక గ్రూపే ఉంది పైగా ఒకరిద్దరి చేత మచ్చు కత్తులు.ఇది పద్దుగాడిచ్చిన పెట్టని తెలిసి,బతికుంటే బలుసాకు అమ్మి బతుక్కోవచ్చని నిర్ణయించి ఇక చేసేదేమి లేక పరుగు తీసాను.రెండు మూడు కి.మీ.పరుగులు దీసాక ఆగాను.

“అమ్మ పద్దుగా నీ లిటిగేషన్ బుర్ర ఉపయోగించి ఇలా పెట్టావా స్పాటు” అనుకుని ఏదో బస్సు పట్టి టౌను చేరుకున్నాను. వళ్లంతా నొప్పులు.కాళ్ళూ పీకేస్తున్నాయి. ఎప్పుడో మూన్నెల్లకోసారి వేసే మందేసుకుని ఇల్లు చేరాను.

మర్సటి దినం అద్దం లో ముఖం చూస్తే పద్దుగాడే కనిపించాడు. నా మొఖాన రెడ్ మార్క్ వెయ్యిస్తావా ఆడంగి వెదవా అని భూతులు తిట్టి స్నానం చేసి భయిటపడ్డాను. కాలేజి ఎలక్షన్స్ లో ఉపయోగించిన “ఔట్ సోర్స్ “వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాను. దెబ్బకు దెబ్బ!

నేనెవరినో పద్దుగాడికి తెలీదు. చెబితే మాయే చెప్పాలి. ఓ..నో ! వెంటనే మాయ గదికి వెళ్ళాను జరిగిందంతా చెప్పాను. “ఇంతటితో వదిలెయ్ ప్లీస్ “అంది. ” నో యార్..ఇట్ ఈజ్ య గేమ్”అని చెప్పి అనుకున్నది చేసేను. పద్దు గాడి మొఖం నెత్తురు ముద్ద చేసాను.

దెబ్బకు దెబ్బ తీసాకగాని నేను తిన్న దెబ్బలు,పడ్డ అవస్థలు గుర్తుకు రాలేదు. మాయకు క్లుప్తంగానే చెప్పాను. అయినా ఎంతో బాధ పడింది. నా మొఖం మీద గాట్లు చూసి ” మై గాడ్ !” అంటూ లేచి కొబ్బరి నూనె తెచ్చి రాసింది.

నేను “నీ యమ్మ కడుపు మాడ 3 కి.మీ.పి.టి.ఉషా రేంజిలో పరుగులు తీసాను కాళ్ళన్ని పీకేస్తున్నాయి..నువ్వేమో నూనె రాసి సరి పెడుతున్నావ్ “అన్నాను గమ్మత్తుగా.

“ఇప్పుడేంచెయ్యమంటావ్ ..పోని వేడి నీళ్ళూ పెట్టిస్తా స్నానం చెయ్య నొప్పి కాస్తా తగ్గుతుంది”అందామె.
అలాగె అన్నాను. గ్యాస్ మీద నీళ్ళూ పెట్టి వచ్చింది. “నీళ్ళు కాగడానికి ఎట్టన్నా అర గంట పడుతుంది అందాక ఏం చెయ్యాలభ్భా “అని సాలిలోక్వి చేసాను.

మాయ “దుడ్డా ..దుకానియా ఒక డ్రీమ్ సాంగ్ వేసుకో” అంది.
” హుం..నీకు పెళ్ళి చేసి నువ్వు కాపురం చేసి,నీకు కడుపొచ్చి ..నువ్వో ఆడ బిడ్డను కని..పొరభాటుగా ఆ బిడ్డకు నీ అంత అందము,నీ అంత మెచ్యూరిటి వచ్చి అది పెద్దదై అప్పట్లో నా వాలకం చూసి అంకుల్ అని పక్కన నెట్టక ప్రేమించాలి,పెళ్ళి చేసుకోవాలి..ఇదంతా అయ్యేదేనా ..ఎంత కలన్నా మరి అర గంట సరిపోదులే మాయా!” అని నిట్టూర్వాను నేను.

“ఏయి ! ఏమా మాటలు నేను నీ అక్కనా? నా కూతుర్ని నువ్వు చేసుకుంటావా..దానికి 18 ఏళ్ళు వచ్చేసరికి నీకున్న దురలవాట్లకి అంకుల్ ఏం కర్మా తాతే అయ్యుంటావ్”

RTS Perm Link

నా బ్లాగు పై వై.ఎస్.స్పందన
Feb 27th, 2009 by chittoor Murugeshan

నా తొట్టి బ్లాగు పై సి.ఎం స్పందించారంటే నెను సైతం నమ్మ లేక పోయాను. తీరా చూస్తే వై ఎస్సార్ డాట్ ఇన్ అనే వ్యక్తిగత వెబ్సైటు నుండి వై ఎస్సార్ @ వై ఎస్సార్ డాట్ ఇన్ అనె ఎ మెయిల్ ఐ.ది ద్వారా స్పంచారని నిర్ధారించుకుని ఈ టపా వ్రాస్తున్నాను.

ఇటువంటి స్భయత,జవాబుదారితనం ఎన్.టి.ఆర్ తరువాత వై.ఎస్.ఆర్ లోనే చూస్తున్నాను.
ఎన్.టి.ఆర్ మూడవ పర్యాయం సి.ఎం.అయినప్పుడు ఆయనగారికి నేనొక ఉత్తరం వ్రాసాను. చాలా రొటీన్ ఉత్తరం. దానిపై స్పందించాలసిన అవసరం కూడ లేదు. కాని వెంటనే స్పందన వచ్చింది. దానిని మాజి ఖజాణా అధికారి అయిన మా నాన్న గారికి చూపించి మురిసిపోయాను . అందుకాయన “పిచ్చివాడా ! అతను సినిమా వ్యక్తి నీవంటి పిచ్చి వాళ్ళ ఉత్తరాలపై స్పందించటానికే ఎంతో మందిని పురమాయించి ఉంటాడు. ఏది నీకో ఉధ్యోగం ఇవ్వమని వ్రాయరా..సమాదానం వస్తుందేమో చూస్తామన్నారు.

ఇదెక్కడి చిక్కప్ప అని నెల ఆలోచించి దైర్యం చేసి ఉత్తరం వ్రాసాను. నాది కులాంతర వివాహమని అందులో పేర్కొన్నాను.

అంతే వెంటనె అందుకు స్పందన వచ్చింది. కులాంతర వివాహం చేసుకున్న వారిలో బి.సి.కి విద్యార్హత లేకుంటే ఓ.సి.నే బి.సి గా ట్రీట్ చేసి రిజర్వేషన్ కల్పించాలని,కులాంతర వివాహితులకు రిజర్వేషన్లో ఉచిత ఇంటి స్థలమివ్వాలని పేర్కొన్న జి.ఓ ప్రతిని జత పరుస్తూ కలెక్టరుగారికి ఉత్తరం పంపి దాని ప్రతిని నాకు పంపారు.

అందుకే నాకు ఎన్.టి.ఆర్ అంటే ప్రాణం. సమాజమే నా దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళన్నది ఎన్.టి.ఆర్ సిద్దాంతం. ఆ సిద్దాంతమే నా ఆపరేషన్ ఇండియా 2000 ప్లాన్ కి ప్రేరణ అయ్యింది.

అటువంటిది 2 రూ.లకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి ఎన్.టి.ఆర్ ను తలపించిన వై.ఎస్. ఇప్పుడు నా బ్లాగు పై స్పందించి ఎన్.టి.ఆర్.ని మరిపించాడంటే అది అతిశోయక్తి కాదు.

1997 నవంబరు నుండి కొరియర్స్,ఆర్.పి.లు ఫాక్సులు పంపినా స్పందించని బాబు ఎక్కడ.. ఏదో తొట్టి సైట్ పెట్టుకుని ప్రభుత్వ విజయ గాథలను నాలుగు ముక్కల్లో చెప్పినంత మాత్రాన స్పందించే వై.ఎస్. ఎక్కడ.. ఎవరికి ప్రజల పై ఎంత అక్కర అన్నది దీనిని పట్టె తేట తెల్లం అవుతుంది.

RTS Perm Link

రమణా రెడ్డి గారు
Feb 27th, 2009 by chittoor Murugeshan

చిరంజీవి గురించిన మీ అభిప్రాయాలు వంద పాళ్ళు కరెక్టు. మీరు లోక్సత్తా విషయంలో కాస్త అమాయకంగా ఉన్నారనిపిస్తుంది. మన వ్యవస్థ ఎంత ఘోరమైందంటే ,ఈ వ్యవస్థలో ఒకతనౌ 5 సం.లు పని చేసినా అతను చేతగాని వాడు,రాజి పడ్డాడనే అర్థం అటువంటిది ఒక ఐ.ఎ.ఎస్ గా అన్ని సం.లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడొచ్చి మార్పు అంటున్న లోక్సత్తా జయప్రకాష్ గారిని ఎలా నమ్మడం.
మొదట ఆయన హయాంలో ఆయన అన్ని మేలే చేసాడని ఏమిటి గ్యారంటీ?
మాటలేమో బాగానే చెబుతున్నారు. ఆ మాటలు కార్య రూపం దాల్చాలంటే అధికారం అవసరం. ఆ పార్టి వాలకం చూస్తుంటే కేవలం లెట్టర్ ప్యేడ్ కే పరిమితమయ్యేలా ఉంది. ఆయనేమో టి.వి.చేనళ్ళ చర్చా వేదికలకే పరిమితమవుతున్నారు. పార్టి పెట్టి ఇన్ని సం.లయ్యాయికదా ఎంత మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారో చెప్పండి.

గొప్పలు చెప్పదం కాదు. యదార్థంలో ఏం సాధించారన్నదే గొప్ప.
నేను సైతం ప్ర.సైన్యం ఏర్పాటు చెయ్యాలి. ఆ సైన్యం చేత నదుల అనుసందానం చెయ్యాలని 1997 నుండి గొంతు చించుకున్నాను.

ఇది ఆదర్శ ప్రాయమే. కాని యాధార్థంలో చూసినప్పుడు వై.ఎస్.అమలు చేసే జలయజ్ఞనికి మద్దత్తు ఇవ్వడం  తక్షణ కర్తవ్యం. అందుకని నా సిద్దాంతాన్ని వదులుకోలేదు.

లోక్సత్తా అంటూ మడి కట్టుకుని కూర్చుంటె ఎంతో కొంత మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టికి అన్యాయం చేసినవారవుతారు.

జరుగనున్నది ట్రైయేంగిల్ ఫైట్. ఇందులో ప్రతి ఓటు కీలకం . బరిలో ఉన్న మహా,మెగా కూటములు చేదామంటున్న వాటికంటే ,కాంగ్రెస్ పార్టి చేసిందెక్కువ .కా బట్టి రేపు ఇస్తామంటున్న ఉచిత బియ్యం కంటే ,నేడు ఇస్తున్న 2రు.లకు కిలో బియ్యమే ఆమోదయోగ్యం,హర్షనీయం. ఆలోచించండి

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa