SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
బాబు పై ఎందుకు ఇంత వైరం?
February 28th, 2009 by chittoor Murugeshan

అప్పట్లో కొత్త బిక్షగాడు పొద్దెరగడనన్నట్టుగా ఎన్.టి.ఆర్ పై చంద్రబాబు .వెన్నుపోటు అనంతరం జ్యోతిష్య రీత్యా లెక్కలు కట్టి ఫలానా తేది తరువాత శత్రువులే ఉండరని టెలిగ్రాం ఇచ్చాను.నా మాటలు నిజమయ్యాయి కాని అవి నిజమైన తీరే నాకు పిత్రు వియోగాన్ను ప్రసాదించింది. యుగపురుషుడిలా సిని రంగాన్ని,రాజకీయ రంగాన్ని ఎదురులేని మనిషిగా పేరొందిన ఎన్.టి.ఆర్ దివంగతులయ్యారు. ఆయనను అమాయకుడు చేసి వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు సైతం నీరాజణాలు అర్పించారు. రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ నాయకులు సైతం ఆకాశమంతగా పొగిడేరు.

ఇక్కడ పిత్రు వియోగమని పేర్కొన్నాను. జన్మనిచ్చే వాడే తండ్రి కాదు వ్యక్తిత్వాన్ని,ఆత్మ విశ్వాశాన్ని,ఆత్మ గౌరవాన్ని,హూందాతనాన్ని,ఒక లక్ష్యాన్ని ప్రసాదించే వాడు కూడ తండ్రే .అవును నేను ఎం.టి.ఆర్ మానస పుత్రుడ్ని. ఆయన కన్న బిడ్డలంతా ఆయన ఆస్తులకు వారసులైతే నేను ఎన్.టి.ఆర్.శత్రు శేషానికి వారసుడ్ని. ఎన్.టి.ఆర్ శత్రుశేషాన్ని నేను తీరుస్తాను. ఇది ఈ నాడు నా బ్లాగు పై ఎన్.టి.ఆర్.అసలు సిసలైన రాజకీయ వారసుడు వై.ఎస్.ఆర్ స్పందించారన్న అతివిశ్వాసంతో అనే మాటలు కావు. ఏనాడో గైకొన్న కర్తవ్యం .

ప్రపంచంలోకెల్లా ఎన్.టి.ఆరే బలవంతుడన్న భ్రమ ఉండేది నాలో. 27 సం.ల వయస్సొచ్చినా ఎన్.,టి.,ఆర్ వంటి ముక్కు సూటితనం,క్రుషి, పట్టుదల ,క్రమ శిక్షణ అలవరుచుకుంటే చాలు జీవితంలోని సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవచ్చు, ఎంతటి ఉన్నత స్థాయికన్న ఎదగవచ్చనే విశ్వాసం నాలో ఉండేది. కాని చంద్రబాబు అంతటి మహా వ్యక్తిని కేవలం విశ్వాస ఘాతుకంతో,వెన్నుఫోటుతో,నక్క జిత్తులతో ఆయన నమ్మిన భంటువులచేత చెప్పుతో కొట్టించిన వైనాన్ని జీర్ణించుకోలేక పోయాను.

నా జీవితంలో నేను ఎదుర్కొన్నా పెద్ద సంకర్షణ అది. ఆ జంక్షన్ పాయింటులో ఒకటి నేను బాబు లా నక్క జిత్తులు నేర్వాలి. లేదా ఎన్.టి.ఆర్ నేర్పిన వ్యక్తిత్వాన్ని,ఆత్మ విశ్వాశాన్ని,ఆత్మ గౌరవాన్ని,హూందాతనాన్ని,ఉపయోగించి బాబు బండారాన్ని భయిట పెట్తాలి. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రలో చోటు చేసుకున్న ఆ అమానుష మలుపుకు కారకులైన బాబును చరిత్ర హీనుడని రుజువు చెయ్యాలి.

నా కన్న తండ్రి రక్తంలోని నిజాయితి నక్క జిత్తులను అలవరుచుకోవడం కంటే మరణమే మిన్నా అంది. బాబుకు తగిన గుణ్పాఠం నేర్పాలని ఎన్.ట్.ఆర్. ఆత్మ ఘోషించింది.

వివేకానంద స్వామి చెప్పారు” ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధన కోసం శ్రమిస్టె కనీశం 14 సం.ల తరువాత ఆ లక్ష్యానికి మంత్ర శక్తి సంప్రాప్తిస్తుందని ” అలా ఒకే ద్యేయంతో,ఒకే లక్ష్యంతో 1994 నుండి శరమించాను. కేవలం బాబు మీది పగతో కాదు..అర్దాంతరంగా ముగిసిన ఎన్.టి.ఆర్ యుగానికి ఒక నిండుతనాన్ని సమకూర్చేందుకు పని చేసాను.”సమాజమే నా దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళన్న “ఎన్.టి.ఆర్ సూక్తియే ప్రేరణగా ,నదుల అనుసందానమె ముఖ్యోద్దేశంగా “ఆపరేషన్ ఇండియా2000″పథకాన్ని రూపొందించాను. అప్పట్లో కేంద్ర స్థాయిలో చక్రం తిప్పిన బాబుకు నివేదించాను.ఒకటి రెండు సార్లు కాదు 1997 నవంబరునుండి ఎడ తెరగని లేఖాస్త్రాలతో ఉక్కిరి బిక్కిరి చేసాను, రిమైండర్లతో ముంచెత్తాను.

నా పథకం పై స్పందించకుంటే కుప్పం నుండి మీ పై పోటి చేస్తానని ఉత్తరాముఖంగా తెలిపిన పాపానికి తను పాలించిన 9 సం.లు ఓటరు లిస్టులో నా పేరు లేకుండా చేసారు. జిల్లా యంత్రాంగానికి మౌలిక ఆదేశాలిచ్చి నా పేరును బ్లాక్ లిస్టులో పెట్తి నేనే అర్జి పేట్తుకున్నా దాని పై ఏ అధికారి స్పందించకుండా చేసారు. కేవలం ఒక రేషన్ కార్డు కొరకు జిల్లా జడ్జిని ఆశ్రయించ వలసివ్ఛ్ఛీంది.
6 సంవత్సరాలుగా స్పందించని సి.ఎం.పేషి స్పందన కొరకు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవలసి వచ్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు..ఎన్నో అవాంతరాలు,అవస్థలు. నా మీద పోలీస్ విచారణ జరిగింది.

ఇంత చేసి నా ప్లాన్ లోని ముఖ్యాంశాలను తనదైనట్టుగా ప్రకటించుకున్నాడు. కొన్ని అమలు కూడ చేసాడు. కాపిరైట్ యాక్ట్,ప్రకారం ఇది నేరమని తెలిసినా ఈ పని చేసాడు.

RTS Perm Link


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa