SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
బిట్టు గారు.. మీ తిట్లతో మీ ఆవేశం అనిగి ఉంతుంది. ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ వాదన..
Jan 30th, 2009 by chittoor Murugeshan

ఇదివరకె ఉదహరించిన కథను మళ్ళి ఉదహరిస్తా..(గుర్తున్న వారు జంప్ అయి పొంది)

గౌతమ బుద్దుడు ఒక పల్లెకు వెళ్ళాడట. అక్కడ ఒకతను వచ్చి బుద్దుని మొఖాన మూంచినాడట. అప్పుడు బుద్దుడు ఇంకేంచెప్పాలో చెప్పు నాయనా అన్నాడుట.

మామూలు బాష అతని భావాన్ని తెలపటానికి సరిపోలేదు కాబట్టి ఉమ్ము బాషను ఎంచుకున్నాడు ఆ వ్యక్తి అన్నడు బుద్దుడు.

బిట్టు గారు.. మీ తిట్లతో మీ ఆవేశం అనిగి ఉంతుంది. ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ వాదన..

నా ప్లాను వెనుకున్న తియరిటికల్ సప్పోర్టు ఏమిటో ఇదివరకే ఒక టపాలో ఉంచాను. ఒక సారి చూడండి. మీరు నెత్తి మీద పెట్టుకునే బాబు గారు సైతం “తగిన రీతిలో వాడుకుంటామని ” తన సెక్రటర్య్చేత ఉత్తరం వ్రాయించాడు సుమా. (ఆ ఉత్తరం స్కేను పెట్టను చూడగలరు)

నేను వెదవైతే, నా ప్లాను వెదవదైతే, నా ప్లానును మొదట  కాపి కొట్టి,తదుపరి తగిన రీతిలో వాడుకుంటామని నాకు ఉత్తరం వ్రాయించిన బాబు కూడ వెదవనా మీ అభిప్రాయం.

మరో టపాలో నా ప్రెస్ అక్రెడిషన్ స్కాను పెడతాను ఫ్రేం ఏసి ఉంచుకుంటారో, మీ బాబుకు మెయిల్లో పెదతారో మీ ఇష్టం.

బిల్లులు పోస్ట్ ఆఫీసుల ద్వారా చెల్లించడం మరే దేశంలోనన్నా అమల్లో ఉండవచ్చు.. కాని మన దేశాన ,మన బాబు గారికి పంపింది నేనొకడినే గా. ఇది చట్టానికి సంబంధించిన విషయం కాదు. మోరల్ కు సంబందించిన విషయం.

అలాగే మరెవరో అమెరికాలో సబ్సిడి మాటే లేదని వ్రాసారు. వారికి నా మనవి.. షిర్ది దాటి మెరెక్కడికి వెళ్ళని ******** కుంటలోని చేపను నేను. ఎక్కడో చదివాను, దానినే ఉదహరించాను. ఒక వేళ ఈ సబ్సిడీలు వారి  పౌరులకే పరిమితమో ఏమో, లేదు ఇటీవల రద్దు చేసారో ఏమో థెలీదు.

ఈ ఒక్క విషయం మినహాయించినా ప్రపంచ దేశాల బతుకు చెడిపి తన పబ్బం కడుక్కోవాలని చూసే అమెరికా దేశాన్ని  ఏ దేవుడూ క్షమించడు. వారికి కౌంట్ డౌన్ మొదలై పోయింది.

RTS Perm Link

బిట్టుగారు !
Jan 29th, 2009 by chittoor Murugeshan

బిట్టుగారు,

మీ బాషా శైలి బలే ఉందందండి. నిజానికీ నేను సైతం వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు నానా భూతులు వాడుతుంటాను. కాని ఏంచేద్దాం సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి అనచుకోవలసి వస్తుంది. ంఇకున్నంత తెగింపు నాకు లేదులెండి.

ఎన్.టి.ఆర్ భవన్ నుండి బెదిరింపు కాల్ వచ్చిందని బహిరంగంగా ఆరోపించాను. ఉత్తములైతే నా మీద పరువు నష్ఠ దావా వెయ్యమని చెప్పండి.

 

మీ బాబుకు నేనంటే ఎంత వనుకంటే.. నా పథకం పై స్పందించకుంటే కుప్పమ్నుండి మీ పై పోటి చేస్తానని వ్రాసిందానికి జడిచి ఓటరు లిస్టులో నా పేరును గల్లంతు చెయ్యించాడు. (ఆధారాలన్ని జర భద్రం చేసుంచా..మీ ప్బోటివారు అడుగుతారనే..)

కేసు పెట్టేటంత పిరికివాడ్ని కాను నేను.. అజేయుడైన మా చిత్తూరు టైగర్ సి.కె.బాబునే చంప చూసిన వారు నన్ను చంపటానికి ఎంత సేపు పడుతుంది. దమ్ముంటే చంపమనండి.

బాబు కూడ మీలాగే ఆలోచించి (చేతగాక కంప్లెయింట్ ఇస్తానని) స్థానిక పోలీసులకు సూచన ఇచ్చాడు నేనే ఫిర్యాదిచ్చినా స్వీకరించ రాదని. తమాషా ఏమంటే నా రచ్చలు నేనే తేల్చుకుంటాను గాని పోలీసుల బూట్సు కాలు నాకను.

ఇతరుల విషయమై నేనిచ్చిన ఫిర్యాదును పోలీసులు భుట్ట దాఖలు చేస్తే హై కోర్టు చీఫ్ జస్టిసునుండి ఆర్డరు తెప్పించా. నా ఫిర్యాదు పై చర్య తీసుకునేలా చూసా..

నేనేదో భేకారుగా టపాలు వ్రాస్తున్నానని అనుకోకండి, ఇందులో నేను ప్రస్తావిస్తున్న ప్రతి విషయం ఒక లక్ష్యం-దేశం-కోట్లాది ప్రజల భవిష్యత్తు దాగుంది.

బాబు ఎంతటి నమ్మక ద్రోహి అంటే నా ప్లాన్లోని అంశాలను కాజేసి,తన స్వార్థం కోసం అమలు చేయ చూసుండు. కేవలం ఒక్క ఫ్యాక్స్ తో ఆపించాను.

ఉ. విద్యుత్ బిల్లులు పోస్టాఫీసుల్లో అని ప్రకటించుండు.ఇది నా సలహా. కాని బాబు స్వార్థం ఏమంటే..

“అప్పట్లో రెండు నెలలకొకసారి విద్యుత్ బిల్లు కట్టేవారం. విద్యుత్ చార్జీలను రెట్టింతలు చేసుండు. ఆ బరువు ప్రజలకు తెలియనీయ కూడదు.. అదే సమయంలో అప్పట్లో నెల నెల బిల్లు వసూలు చెయ్యించే యంతాంగం లేదు(ఇప్పుడైతే ఇ సేవ ఉంది). కాబట్టి నెల నెల పోస్ట్ ఆఫీసుల్లో కట్టించే ఏర్పాటు చేస్తామని ప్రకతించుండు.”

నా సలహయొక్క ముఖ్యోద్దేశం “ప్రభుత్వ శాఖల నిర్వహణా వ్యయాన్ని తగ్గించడం. మిగులు బాటు అయిన సొమ్మును నదుల అనుసందానానికి మళ్ళించటం”

 

బాబు ప్రకటన చూసి వళ్ళు మండి “కాపి రైట్ యాక్ట్ క్రింద కేసు పెడత”అనని నోటీసు జారి చేస్తే తోక ముడిచాదు.

 

 

ఇంకా చాలా భాగోతాలు ఉన్నాయి ..నా నోరు కెలికితే అన్ని భయిట పెడతా.. మళ్ళి ఈ బ్లాగు ఇంటర్నేష్నల్ సైటు అయ్యి కూర్చుంటుంది.

RTS Perm Link

ఎన్.టి.ఆర్.భవన్ నుండి బెదిరింపు కాల్
Jan 28th, 2009 by chittoor Murugeshan

 

 

 

 

 

 

 

 

నిజమేనండి

 

. ఎంత తలకాయ లేని వారు అక్కడ ఉన్నారంటే.. నా సెల్ నెంబరుకు తమ ఆఫీసు ల్యాండ్ లైను నుండి కాల్ చేసి మరి భెదిరించారు.

ఇంతకీ ఫ్లాష్ బ్యాక్ ఏమంటే

 

..

ఈ సైటులో నేను ప్రస్తావించే ఆపరేషన్ ఇండియా

 

2000 పథకాన్ని 1997 నుండి బాబు నివాసానికి,సచివాలయానికి,పార్టి కార్యాలయానికి పంపేవాడ్ని. 2002 లో వళ్ళు మండి 10 రూ. ఎం.ఓ పంపాను.

తిరుగు టపా ఖర్చులకు సైతం సొమ్ము లేని దివాళాకోరు ప్రభుత్వం మీదైతే ఈ పది రూ

 

.స్వీకరించి స్టాంపు కొని సమాదానం వ్రాయంది అని సూచించాను.

సిగ్గు లజ్జా లేక ఆ ఎం

 

.ఓ స్వీక్రించి మరి ఊరుకున్నారు. 2003 మే లో జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాను. దినపత్రికల్లో ఈ వార్త చదివి వెంటనే ంఇ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని ప్రత్యుత్తరం పంపి చేతులు దులుపుకునేరు. ఆ పై బాబు పదవీచ్యుతుడు కావడం అందరికీ విదితమే

నేను మళ్ళి విలేకరి అవతారం ఎత్తిన కొత్త

 

. చిత్తూరు పార్టి ఆఫీసులో బాబు ప్రస్ మీట్ ఉందని తెలిసి, ఆయన చేతికి ఒక ఉత్తరం ఇవ్వాలని ప్లాన్ చేశాను. కాని అక్కడ సంతలా అందరూ దూరడంతో వెనక్కు తగ్గి కొరియర్ ద్వార పంపాను

 

.

మీరు భకాసురునికి కజిన్ బ్రదరో ఏమో గాని మీరు ఎక్కడున్నా అక్కడి డస్ట్ బిన్లు నా ఉత్తరాలన్నింటిని తినేస్తాయి

 

. ప్రత్యుత్తరమైతే రాదు అని పేర్కొన్నాను. ఇది అమర్యాదని అతనెవరో ఫోన్లో చిందులు తొక్కాడు. నేను పదరా సీనాఅని ఫోను పెట్టేసాను

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa